సాయి వచనం:-
'నువ్వు నా దర్శనానికి వచ్చావా? నేను నీకు ఋణపడ్డాను. నేనే నీ వద్దకు రావాలి.'

'బాబా నీతోనే ఉన్నారు. అంతా శుభమే జరుగుతుంది' - శ్రీబాబూజీ.

"నువ్వు పిలవగానే నేను కనబడాలా?"


2018, ఆగస్టు 1. ఉదయాన ఒక సాయిబంధువుకు బాబా ఇచ్చిన అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు.

ఈరోజు ఉదయం బాబా అద్భుతమైన అనుభవాన్ని నాకిచ్చారు. నేను ఆఫీస్ బస్సులో ఆఫీసుకి వెళ్తున్నాను. బాబాని తలుచుకొని, “సచ్చి‌దానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!” అని అనుకొని బస్సు విండోలో నుంచి ఆయన కోసం చూసాను. ఆలా చేయడం నాకు అలవాటు, నేను చూసినప్పుడు చాలాసార్లు కనబడుతూ వుంటారు మన బాబా. కాబట్టి ఈరోజు కూడా నేను అదే ఆశతో చూసాను, కానీ బాబా కనపడలేదు. వెంటనే నేను "బాబా! మీరు కనిపించలేదేమిటి?" అని అడిగాను. మరుక్షణమే ఆశ్చర్యంగా "నువ్వు పిలవగానే నేను కనబడాలా?" అని ఒక వాయిస్ వినిపించింది. అప్పుడు నేను, "అవును, కనబడాలి కదా బాబా! ఎందుకంటే మేము ఎప్పుడూ మీరు వున్న చోటనే ఉండాలి" అని అన్నాను. నేను ఇలా చెప్పిన మరుక్షణంలో పువ్వులతో అలంకరించబడిన పెద్ద బాబా ఫోటో కన్పించింది. ఎంత ప్రేమ చూడండి ఆయనకి మన అందరిపైన!

"బాబా! మీ బిడ్డలందరిపై మీ చల్లని ఆశీస్సులు సదా కురిపించండి".

సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo