సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నా బిడ్డలపై బాబా అనుగ్రహం - "బాబా ఉన్నాడా?" అన్నందుకు 'ఉన్నాను' అని నిరూపణ ఇచ్చారు బాబా



హైదరాబాద్ నుండి అర్చనగారు అద్భుతమైన అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు.



ఓం సాయిరామ్.



ఈ రోజు మీకు మా బాబుకి బాబా ఇఛ్చిన చక్కటి అనుభవం గురించి వివరిస్తాను. మా బాబు 3వ తరగతి చదువుతున్నాడు. నేను ఎక్కువ బాబా బుక్స్ చదువుతూ, బాబాకి పూజలు చేస్తూ ఉండటం వల్ల తనకి బాబా గురించి అవగాహన ఉంది. స్కూలు నుంచి వచ్చాక ఎపుడైనా సంధ్య హారతి వింటూ ఉంటాడు. తను ఏ విషయాన్నైనా చెప్పగానే నమ్మడు. ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందాకే నమ్ముతాడు. తను ఎప్పుడు బాబా గురించి విన్నా, చివర్లో "బాబా ఉన్నాడని నేను ఎలా నమ్మాలి? బాబా నాకు కనపడాలి" అని అంటుండేవాడు. వాడికి ఎలా అర్ధం అయ్యేలా చెప్పాలో, బాబా ఉన్నారని ఎలా నిరూపణ చేయాలో నాకు తెలిసేది కాదు. మూడురోజుల క్రితం, "నేను ఇంక బాబాని నమ్మను, శివయ్యని పూజిస్తాను, ఆయన భోళాశంకరుడు. కోరగానే వరాలు ఇస్తాడ"ని కూర్చొని, "ఓం నమః శివాయ" అని జపం చేసాడు. వాడి మాటలకు నవ్వుకున్నాను. నిన్న ఆదివారం(29.07.2018) మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ మా పిల్లలకి దేవుడి గదిలో భోజనం పెడుతున్నాను. అక్కడ చిన్న బాబా పటం ఉంది. అకస్మాత్తుగా మా బాబు, "అమ్మా! బాబా నా వైపు చూసి కళ్ళు బ్లింక్ చేస్తున్నాడు. నేను బాబా ఉన్నాడని నాకు ఋజువు కావాలని అడిగాను కదమ్మా! అందుకే బాబా కళ్ళు బ్లింక్ చేసాడు" అని చెప్పాడు. నేను వాడు చెప్పేది నమ్మలేక, "నిజం చెప్పు, లేకపోతే బాబా పనిష్ చేస్తాడు" అంటే, "నిజమమ్మా, చెల్లి ప్రక్కనే ఉన్నా కానీ, బాబా నన్నే చుస్తూ కళ్ళు బ్లింక్ చేసాడు" అని చెప్పాడు. నాకు చాలా సంతోషం వేసింది. తన చిన్న భక్తుడు అడిగిన దానికి బాబా 'నేను ఉన్నాన'ని నిరూపించి చూపారు.



మా పాపకిప్పుడు 4 సంవత్సరాలు. తన మొదటి పుట్టినరోజు ఫంక్షన్ హల్లో పెట్టుకున్నాము. ఆరోజు బాబా గుడికి వెళ్ళటం కుదరలేదు. పుట్టినరోజునాడు బాబా గుడికి వెళ్లి బాబా ఆశీస్సులు తీసుకోలేకపోయినందుకు చాలా బాధపడ్డాను. కానీ నా బాధను కొద్దిసేపటికే బాబా తొలగించేసారు. ఎలా అంటే, మేము కారులో ఫంక్షన్ హాలుకి వెళ్లి కారు డిక్కీలో ఉన్న సామాన్లు తీస్తుండగా, బాబా ఫొటోలు, విభూతి, ప్రసాదం, కుంకుమ అక్కడ కనిపించాయి. అవి అక్కడికి ఎలా వచ్చాయో మాకు అర్థమే కాలేదు. ఒకవేళ ఎవరైనా వాటిని ఇచ్చినా కూడా డిక్కీలో పెట్టుకోము కదా!. అది బాబా చేసిన లీల.



అలాగే తన అక్షరాభ్యాసం చేయడానికి వరంగల్ అమ్మవారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు కూడా బాబా గుడికి వెళ్లలేకపోవడంతో బాధపడుతూ బాబాని తలచుకుంటుండగా, "నేను నీవెంటే ఉన్నాను" అన్నట్లు బస్సు వెనకాల చాలా బాబా ఫొటోలు కనిపించాయి. అలా తనని అనుగ్రహించారు బాబా. పై రెండు సందర్భాలలోనూ నేను ఆయన గుడికి వెళ్లలేకపోయినా ఆయన మాత్రం తన అనుగ్రహాన్ని మాపై కురిపించారు. అవధులు లేని అద్భుతమైన ప్రేమ ఆయనది.


1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo