శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
ఒక సాయి బంధువు తనకు బాబా ఇచ్చిన అద్భుతమైన అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు.
నాకు బాబా అంటే చాలా ఇష్టం. నాకు ఏ బాధ కలిగినా నేను బాబాకే చెప్పుకుంటాను. ప్రతి విషయాన్నీ ఆయనతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ సాయిబాబానే. నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉండి నా చదువును కొనసాగిస్తున్నాను. బాబా చేసిన ఒక నమ్మశక్యం కాని మిరకిల్ ను "సాయి మహరాజ్ సన్నిధి బ్లాగు" ద్వారా సాయిబంధువులతో పంచుకోవాలని నా ఆశ.
మనం బాబా ప్రేమను పొందడానికి ఇళ్ళు వదిలి అరణ్యాలలోకి వెళ్లి ముక్కు మూసుకొని తపస్సులు చేయవలిసిన అవసరం అస్సలు లేదు. బాబా మీద నమ్మకము, ఆయన మాటల యందు శ్రద్ధ, ఎల్లప్పుడూ ఆయనను స్మరించుకుంటూ ఉంటే చాలు, అంతా ఆయనే చూసుకుంటారు.
ఇక బాబా చేసిన అద్భుతమైన లీలను చదవండి. నేనొక విద్యార్థినిని. నా ఖర్చుల నిమిత్తం నా తల్లిదండ్రులు నెలనెలా డబ్బులు పంపుతూ ఉంటారు. ఆ డబ్బులతో నా రూమ్ రెంట్, తిండి, ఇతర ఖర్చులు పోను, కొంచెం డబ్బు మాత్రమే మిగులుతుంది. నా దగ్గర ఉంటే ఖర్చయిపోతుందని ఆ డబ్బుని నా మనీ బ్యాంకులో వేసుకుంటాను. అవసరమైనపుడల్లా ATM నుండి తీసుకుంటాను. చదువు మీద నాకున్న ఆసక్తి వలన బాగా చదువుతాను. కానీ సరిపడా డబ్బులు ఎప్పుడూ అందుబాటులో ఉండవు. ఒకసారి హఠాత్తుగా పరీక్ష ఫీజు కట్టాలని మా ప్రిన్సిపాల్ చెప్పారు. అది కూడా 1,20,000 రూపాయలు. ఒక్కసారిగా ప్రిన్సిపాల్ అంత మొత్తం కట్టాలనేసరికి నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. మన తల్లిదండ్రులు కష్టపడి మనల్ని చదివిస్తూ ఉన్నారని మనకి తెలుసు కాబట్టి వాళ్ళని అడగాలంటే కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది. తెలిసీతెలిసి వాళ్ళని డబ్బులు అడగలేము, అలాగని చదవకుండా ఊరుకోలేము. ఫీజు ఎలా కట్టాలని నా మనసు మాత్రం పరిపరి విధాలుగా ఆలోచిస్తూనే ఉంది.
చెప్పాను కదా! నాకు ఎలాంటి బాధ కలిగినా బాబాకే చెప్పుకుంటానని. అందువలన ఇప్పుడు కూడా, "బాబా! రూమ్ రెంట్ కట్టడానికి సరిపడినంత డబ్బులు మాత్రమే నా ఎటిఎం లో ఉన్నాయి, ఫీజు ఎలా కట్టాలో అర్ధం కావడం లేద"ని బాబాకు చెప్పుకున్నాను. నేను బాధపడుతున్న ప్రతిసారీ బాబా నుండి నాకు "నీవు ఎందుకు భయపడుతున్నావు? నేను ఉన్నాను కదా!" అని సమాధానం వస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా బాబా నుండి అదే సమాధానం వచ్చింది. ఆ మాటలు నాకు కాస్త ఓదార్పునిచ్చాయి. బాబా ఎలా నన్ను కాపాడుతారో చూద్దామనుకొని ఆయన మీద నమ్మకంతో ఉన్నాను.
రూమ్ రెంట్ కట్టాల్సిన తేదీ రావడంతో ఎటిఎం కు వెళ్లి వెయ్యి రూపాయలు డ్రా చేశాను. బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే ఆశ్చర్యం! నా అకౌంట్లో ఒక లక్షా ఇరవైవేలు ఉన్నట్లు చూపిస్తుంది. ఏమిటి ఇలా చూపిస్తుంది, ఇదెలా సాధ్యం? మెషిన్ లో ఏదైనా సమస్య ఉందేమోననునుకొని బయటకు వచ్చాను. కానీ నా మనస్సు దాని గురించే ఇంకా ఆలోచిస్తోంది. మెషిన్ ఎందుకు తప్పుగా చూపిస్తుంది? కానీ నాకు బాగా గుర్తు ఉంది. వెయ్యి రూపాయలు తీసేస్తే ఉంటే ఇంకా 500 రూపాయలు ఉండొచ్చు. మరి అంత డబ్బు ఎలా వస్తుంది? సరే, ఇంకొక ఎటిఎం కు వెళ్లి చెక్ చేసి చూద్దామని వెళ్ళాను. అక్కడ కూడా లక్షా ఇరవై వేల రూపాయలే చూపిస్తుంది. నా కళ్ళను నేనే నమ్మలేక కళ్ళు నలుపుకొని మళ్ళీ చూసాను. మరల అంతే అమౌంట్ చూపిస్తుంది. అయినా నాకు నమ్మకం కలగడం లేదు. సరే కొంత అమౌంట్ డ్రా చేద్దామని డ్రా చేస్తే అమౌంట్ బయటకు వచ్చింది. ఆశ్చర్యం! అద్భుతం! బాబా లీల ఇంత మహత్తరంగా ఉంటుందా? నా కళ్ళ నుండి ఆనందభాష్పాలు రాలుతున్నాయి. డబ్బులు పట్టుకొని రూంకి వెళ్ళిపోయాను. రెండు రోజులు నాకు అసలు నిద్ర పట్టలేదు. బాబా నా కాలేజీ ఫీజుకు ఎంత కావాలో అంతే ఇచ్చారు. నా ఫీజు ఎంత అనేది నా తల్లిదండ్రులకి కూడా తెలియదు. నా తండ్రి స్థానంలో నా సాయిబాబా ఉండి నా ఫీజు కట్టారు. నా సమస్యని ఎంతో బాధ్యతగా ఆయన నెరవేర్చారు. "థాంక్యూ బాబా! లవ్ యూ! నన్ను వదలకు బాబా! నా వెంటనే ఎప్పుడూ ఉండండి బాబా! నాకు నీ స్నేహం, ప్రేమ కావాలి బాబా! నీవు లేని నా జీవితాన్ని నేను ఊహించుకోలేను".

🕉 sai Ram
ReplyDelete