సాయి వచనం:-
'నీ తల్లిదండ్రుల మాటలు విను! మీ అమ్మకు పనులలో సాయం చేస్తూ ఉండు! ఎప్పుడూ నిజం మాత్రమే చెప్పు!'

' 'జైసా దేశ్ – వైసా వేష్' అన్నారు శ్రీసాయిబాబా. ఏ కాలానికి అనుగుణమైన ధర్మాన్ని ఆ కాలంలో పాటించడం వివేకం. కాలధర్మం చెందిన ఆచారాలను పట్టుకుని వ్రేలాడడం అవివేకం' - శ్రీబాబూజీ.

ఒక సాయిబంధువు షిరిడీ పర్యటనకు సంబంధించిన వాట్సాప్ సత్సంగం


షిరిడీ వెళ్ళడానికి ముందు తేదీ. 2018, జులై 23:-

సాయిబంధువు: సాయిరామ్, మా షిరిడీ ప్రయాణం కన్ఫర్మ్ అయ్యిందండీ. మేము గురుపౌర్ణమికి గురువారంనాడు షిరిడీ వెళ్తున్నాము.

నేను : సంతోషం సాయి. బాబా పిలుపు వచ్చింది, ఆయన అనుగ్రహించారు. సంతోషంగా వెళ్ళిరండి సాయి.

సాయిబంధువు: నాక్కొంచెం అత్యాశ ఎక్కువ. దర్శనం బాగా అయిన తరువాత కానీ నేను బాబా అనుగ్రహించారని అనలేను.

నేను : భలేవారు సాయి, షిరిడీ వెళ్తున్నామంటే ఆయన పిలుపు వచ్చిందనే కదా! సో, అనుగ్రహించినట్లే కదా! ఇకపోతే దర్శనమంటారా.. అది కూడా ఇస్తారు, ఆయన తన బిడ్డల్ని నిరుత్సాహపరచరు సాయి.

సాయిబంధువు: నిజమేనండీ! ఎప్పుడు షిరిడీలో అడుగుపెడతామా అని చాలా ఆత్రంగా ఉంది. బాబాకు దగ్గర కాకముందు దాదాపు ప్రతి సంవత్సరం వెళ్లాలనుకుంటే చాలు షిరిడీ వెళ్లేవాళ్ళం. ఆయనకి దగ్గరయ్యాక రెండేళ్లుగా ఎంతగా వెళ్లాలని తపిస్తున్నా బాబా వెయిట్ చేయిస్తున్నారు.

నేను : ఎదురుచూపులో కూడా ఆనందం ఉంది, ఆ ఎదురుచూపులో బాబా పట్ల మనకు ప్రేమ అధికం అవుతుంది. అది కూడా ఆయన శిక్షణే.

సాయిబంధువు: నిజమేనండి, నాకైతే షిరిడీలో క్యూ లైన్స్, గుడి ఆవరణ, విండోలోంచి బాబాని చూడడం ఇవన్నీ గుర్తు వస్తూ ఎప్పుడెప్పుడు షిరిడీలో అడుగుపెడతానా అని ఆరాటంగా ఉంది.

నేను : అవును, నిజంగా అలానే ఉంటుంది. ఆ మధుర క్షణాల్ని ఎంజాయ్ చేయండి సాయి.

సాయిబంధువు : షిరిడీ నుండి మీకు ఏమి కావాలో చెప్పండి.

నేను : మీ మనస్సునిండా బాబా ప్రేమను, కళ్ళనిండా ఆయన రూపాన్ని నింపుకొని రండి. వీలైతే వచ్చిన తరువాత బాబా ఇచ్చిన ఆనందాన్ని పంచండి. అది నాకు చాలు. ఆ ఆనందం ముందు ఇంకేమీ కావాలని కూడా అనిపించదు సాయి.

సాయిబంధువు : వావ్!!! నిజమేనండి.

సాయిబంధువు : మీరు ఫ్రీ అయితే ఒక అనుభవాన్ని చెప్తాను.

నేను : చెప్పండి సాయి.

సాయిబంధువు : ఇది దాదాపు 10 ఏళ్ళ క్రితం జరిగింది. అప్పట్లో నాకు బాబా గురించి అంతగా ఏమీ తెలియదు, కానీ ఆయనను పూజిస్తూ ఉండేదాన్ని. మేము ఎప్పుడు షిరిడీ వెళ్లినా గురువారంనాడు కాకడ ఆరతి చూసుకొని సాయంత్రానికి రిటర్న్ అయిపోయేవాళ్ళం. ఎప్పుడూ అలానే ప్లాన్ చేసేవాళ్లు. కానీ ఒకసారి గురువారం రాత్రి అక్కడే ఉన్నాము. అప్పుడే మొదటిసారిగా చావడి ఉత్సవాన్ని చూసాను. గత సంవత్సరం వరకు చావడి ఉత్సవాన్ని పల్లకీ ఉత్సవం అని కూడా అంటారని నాకు తెలియదు. చాలా జనం ఉన్నారని మా కుటుంబమంతా రూమ్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. నేను, మా కజిన్ మాత్రం పల్లకీ ఉత్సవం చూద్దామని బయటకు వచ్చాము. విపరీతమైన జనం, ఒకరినొకరు తోసుకుంటున్నారు. ఆ తొక్కిసలాటలో అనుకోకుండా బాబా పల్లకీ దగ్గరకి మేము తోసివేయబడ్డాము. మేమెంత అదృష్టవంతులమో! తమ పవిత్ర పాదుకలు స్పృశించే అవకాశం బాబా మాకు ఇచ్చారు. అస్సలు ఇప్పటికీ నమ్మలేము, అంత జనంలో అంత మధ్యలోకి ఎలా వెళ్లిపోయామో! సెక్యూరిటీ వాళ్లు, లోకల్ పీపుల్ వుంటారు కదా! అయినా వాళ్ళందరినీ దాటి పల్లకి దగ్గరికి ఎలా చేరుకున్నామో? అంతా ఆయన దయ. అద్భుతమైన అనుభవమది.

నేను : అవును, బాబా అద్భుతమైన అనుభవం ఇచ్చారు మీకు.

నేను : 'షిరిడీలో ఎలా ఉండాలి?' అన్న గురువుగారి వీడియో షేర్ చేస్తాను, చూడండి. మంచి క్లారిటీ వస్తుంది సాయి.


షిరిడీ నుండి వచ్చిన తరువాత(తేదీ. 2018, జులై 29):-

నేను : దర్శనాలు బాగా జరిగాయా సాయి?

సాయిబంధువు : జరిగాయండి. నేను నా షిరిడీ అనుభవాలు చెప్తాను. మీరు నేను పెట్టే పెద్దపెద్ద మెసేజీలకు సిద్ధంగా ఉండండి.

నేను : నేనెప్పుడూ బాబా ప్రేమను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉంటాను సాయి.

సాయిబంధువు : నాకు తెలుసండీ.
ఉదయాన బస్సు కాస్త ఆలస్యం అవ్వడంతో మేము షిరిడీ చేరేసరికి 9:30 అయ్యింది. రూమ్ తీసుకొని స్నానాదులు ముగించేసరికి ఇంకాస్త ఆలస్యం అయింది. 11:30కి ద్వారకామాయికి వెళ్ళాము. తొందరగా దర్శనం చేసుకొని సమాధిమందిరానికి వెళ్లాలని మా ప్లాన్. కానీ అక్కడ క్యూ చాలా ఉంది, దాదాపు గేట్ నెంబర్ 4 వరకు. మేము మశీదు ఆవరణలోకి వెళ్ళేసరికి చిన్నగా వర్షం మొదలైంది. బాబా జస్ట్ అప్పుడే మా లైన్ రూఫ్ వున్న దగ్గరకు లాగేసారు. అందువలన మేము వర్షంలో తడవలేదు, అదీ ఆయన అనుగ్రహమే. ఇంకొంచెం ముందుకు వెళ్లేసరికి ఆరతి మొదలైంది. అద్భుతమండి అస్సలు ద్వారకామాయిలో ఆరతి! ఎక్కడైనా బాబా ఆరతి ఒకటే ఆనందాన్నిస్తుందనుకోండి. నాకైతే ఆరతి అవుతున్నంతసేపు కళ్ళలోంచి నీళ్లు ధారాపాతంగా వస్తూనే వున్నాయి. ఇంత అద్భుతంగా ఉంటుందా బాబా ఆరతి? ఎంత సంతోషం! ఎంత గొప్ప ఆనందం! నా భావాలని పూర్తిగా మాటలలో వివరించలేను కూడా. అంతా బాబా అనుగ్రహం. మా ఈ ట్రిప్ లో ద్వారకామాయిలో ఆరతికి హాజరవడం హైలైట్.

నేను: చాలా చక్కగా అనుగ్రహించారు బాబా.

సాయిబంధువు : తరువాత చావడికి వెళ్ళాము. అక్కడికి ఒక ముసలావిడ వచ్చారు. దాదాపు 80 సంవత్సరాల వయస్సు ఉంటుంది. నార్త్ ఇండియన్ లాగా ఉన్నారు. బాగా చదువుకున్న వ్యక్తిలా కూడా వున్నారు. అసలు సరిగా నడవలేని పరిస్థితి. కానీ చేతిలో చిన్న బాబా విగ్రహంతో చావడిలో బాబా దగ్గర పెట్టడం కోసం వచ్చారు. బాబా దగ్గరికి రాగానే సంతోషంతో ఎంత ఏడ్చేసారో చెప్పలేను. బాబాపట్ల ఆమెకున్న ప్రేమను చూసి నాకు కూడా కన్నీళ్లు వచ్చేసాయి. "బాబా! మీరు మా అందరినీ ఇంతలా ప్రేమిస్తూ, మా మనసులో కూడా మీపై ఇంత ప్రేమ కలిగేలాగా కరుణిస్తున్నారా?" అని అనుకున్నాను.

నేను: వెరీ నైస్ experience సాయి.

సాయిబంధువు : నిజంగా బాబా మనపై చూపే ప్రేమ అద్భుతం. ఆ ప్రేమలో తడిసి ముద్దైపోయాను. మీరు అన్నట్టు షిరిడీలో బాబా ప్రేమలో నిలువెల్లా తడిసిపోయి, ఆయన ప్రేమను మనసునిండా , ఆయన రూపాన్ని కళ్ళనిండా నింపుకున్నాము.

నేను: అద్భుతం సాయి, స్టార్టింగ్ లోనే బాబా అంతలా అనుగ్రహించేశారన్న మాట.

సాయిబంధువు: అంతేకాదు, తరువాత సమాధిమందిరంలో దర్శనానికి వెళ్ళాము. అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. మరీ అంత క్యూ ఉంటుందని, అంత టైం పడుతుందని నేను అనుకోలేదండి. చాలా టైం పట్టింది. మేము ఉచిత దర్శనానికి వెళ్ళాము. శరత్ బాబూజీ గారి వీడియోలో చెప్పినట్టుగా నేను 200 రూపాయలు చెల్లించి దర్శనానికి వెళ్లదలుచుకోలేదు. అందుకే నేనసలు ముందుగా ఏ ప్లాన్ చేయలేదండి. "బాబా! ఈ రెండు రోజులు మీ ఇష్టం" అని అనుకొని ఆయనకే వదిలేసాను.

నేను : గురుపూర్ణిమ కదా! రష్ ఉంటుంది సాయి. అందరితోపాటు అలా వెళ్లడమే మంచిది. మనమంతా బాబా ముందు సామాన్యులమే. మనమేమీ వి.ఐ.పి.లం కాదు అంటారు గురువుగారు(శరత్ బాబూజీ). గురువుగారంతటి ఆయన కూడా సామాన్యమైన ఫ్రీ లైన్ లోనే దర్శనానికి వెళ్లేవారట సాయి.

సాయిబంధువు: అదేనండి. శరత్ బాబూజీ గారి వీడియో మెసేజే గుర్తువచ్చింది. మీరు సరైన సమయంలో షేర్ చేసారండి. థాంక్యూ సో మచ్. తెలీకుండానే మేము ఆ వీడియో మెసేజ్ ని అనుసరించాము.

సమయం ఉంటే పారాయణం చేసుకోవచ్చని మేము మాతోపాటు సాయి సచ్చరిత్ర తీసుకొని వెళ్ళాం. కానీ అక్కడి జనం చూసేసరికి ఆ విషయం మరచిపోయాను. నిజానికి నేను దాదాపు 13 అధ్యాయాలు చదువవలసి ఉంది(మహాపారాయణ గ్రూప్ కోసం రెండు అధ్యాయాలు, సప్తాహ పారాయణ అధ్యాయాలు, మరియు 11 & 15 అధ్యాయాలు నేను రోజూ చదువుతాను). ఎలా పూర్తి చేయిస్తారో బాబా అని అనుకున్నాను, కానీ క్యూలోనే ప్రశాంతంగా చదివించేసారు బాబా. ఆ 13 అధ్యాయాలు కాకుండా ఇంకో రెండు అధ్యాయాలు కూడా చదివించారు బాబా. క్యూలో ఉంటూ అనవసరమైన మాటలు మాట్లాడకుండా షిరిడీ పవిత్రక్షేత్రంలో గురుపౌర్ణమి పర్వదినాన ప్రతిక్షణం ఆయన ధ్యాసలోనే నన్ను ఉంచి రక్షించారు బాబా. అంతటి అదృష్టాన్ని ప్రసాదించారు బాబా.

నేను: వావ్..! సూపర్ సాయి.  ప్రతి క్షణం బాబా ధ్యాసలో గడపగలడం కంటే భాగ్యమేముంది?!

సాయిబంధువు: సమాధిమందిరంలో బాబా చక్కటి దర్శనాన్ని ఇచ్చారు. దర్శనం అయిన తరువాత పూజారిగారు నాకు ఒక రోజా పువ్వు, దానితోపాటు ఇంకా కొన్ని వేరే పువ్వులు ఇచ్చారు. అలా బాబా ఆశీస్సులు లభించాయని నాకు చాలా ఆనందంగా అనిపించింది. తరువాత మరుసటిరోజు ఉదయాన కాకడ ఆరతికి మేము హాజరు కాలేకపోయినా బాబా ఆయనకు నివేదించిన వెన్న ప్రసాదం, ఆయనకు అభిషేకించిన జలం కూడా ప్రసాదంగా మాకు ఇచ్చారండి.

నేను: మొత్తానికి మీరు ఊహించిన దానికంటే బాబా సూపర్ గా అనుగ్రహించారు కదా సాయి. వెళ్లేటప్పుడు బాబా ఎలా అనుగ్రహిస్తారో అని ఫీల్ అయ్యారు, కాని బాబా తమ ప్రేమలో మిమ్మల్ని ముంచేశారు. మీ అనుభవాలు చదువుతూ ఉంటే చాలా చాలా సంతోషంగా ఉంది సాయి. మన బాబా అంతే, ఎవరినీ నిరుత్సాహపరచరు. ఒక్కొక్కరికి ఒక్కోరీతిలో అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ ప్రేమ చాలు మనకు.

సాయిబంధువు: మీరు చెప్పింది నిజమండి.

నేను : నిజంగా మనం చాలా అదృష్టవంతులం, బాబా ప్రేమను పొందుతున్నాము సాయి.

సాయిబంధువు : అవునండి. ఆయన ప్రేమను అర్థం చేసుకోగలుగుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇంతకుముందు షిరిడీ చాలాసార్లు వెళ్ళాము. కానీ ఇదే మొదటిసారి ఆయనని ఇంత దగ్గరగా ఫాలో అవ్వడం, ఇంతలా ఆయన ప్రేమను అనుభవించడం. ఈ ట్రిప్ చాలా ప్రత్యేకమైనది.

నేను : అవునా సాయి? మొత్తానికి ఈ ట్రిప్ ని మరిచిపోలేని మధురానుభూతిగా బాబా మలచారన్న మాట. Excellent సాయి.

సాయిబంధువు : మా బాబాయ్ ఖచ్చి‌తంగా ప్రతి సంవత్సరం మమ్మల్ని షిరిడీ తీసుకొని వెళ్లేవారు. దురదృష్టంకొద్దీ రెండేళ్ల క్రితం మేము అతనిని కోల్పోయాము. మాకు ఇష్టముంటే బాబాయితో వెళ్ళేవాళ్ళం, లేకుంటే లేదు. బాబాయి పోయాక రెండు సంవత్సరాలుగా ఎంతో ఆత్రంగా షిరిడీ వెళ్లడానికి ఎదురుచూస్తున్నాము. షిరిడీ వెళ్లడం అంత సులువు కాదని ఇప్పుడు చాలా బాగా అర్థమయ్యింది. "బాబా సులువుగా షిరిడీకి రప్పించుకుంటున్నప్పుడు ఆ విలువ తెలీలేదు, తెలిసాక చాలా కఠినంగా చేసేసారు" అని మా సిస్టర్, నేను నిన్న అనుకున్నాము. అయితే మీరన్నట్టు అది కూడా ఓ శిక్షణే. మనం ఎంత అదృష్టవంతులమో ఇప్పుడు కానీ అర్థం కాలేదు మాకు మరి☺. బాబాయే తనకి నచ్చినట్టుగా మనల్ని మలుచుకుంటున్నారు.

చివరిగా లెండీబాగ్ కి వెళ్ళాము. అక్కడ కాసేపు బాబా బిడ్డలందరినీ చూస్తుంటే, "అందరమూ బాబా పిచ్చుకలమే, కానీ వేర్వేరు స్థితులందు వున్నాము" అనిపించింది.

నేను : కరెక్ట్ సాయి.

సాయిబంధువు : పారాయణ హాల్ కి మొదటిసారి వెళ్లి, అక్కడ కాసేపు పారాయణ చేశానండి. చాలా ప్రశాంతంగా, హాయిగా అనిపించింది. అది చాలా అద్భుతమైన అనుభవం.

నేను: అవును, అక్కడ వాతావరణం చాలా pleasant  గా ఉంటుంది సాయి.

సాయిబంధువు: మీ విలువైన సమయాన్ని నాకు కేటాయించినందుకు థాంక్యూ సో మచ్ అండి.

నేను : థాంక్స్ ఎందుకు సాయి? నిజానికి నేనే మీకు థాంక్స్ చెప్పాలి, మీరు అనుభవించిన బాబా ప్రేమను నాకు కూడా షేర్ చేశారు కదా సాయి.

ఈ సాయి బంధువు మరికొన్ని అనుభవాలు కూడా బ్లాగు ద్వారా సాయి బంధువులతో పంచుకోవడానికి పంపించారు. వాటిని రేపు మీ ముందు ఉంచుతాను.

4 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  2. Om Sri Sai arogya kshemadayanamaha
    Om Sri Sai arogya kshemadayanamaha
    Om Sri Sai arogya kshemadayanamaha
    Om Sri Sai arogya kshemadayanamaha
    Om Sri Sai arogya kshemadayanamaha
    Om Sri Sai arogya kshemadayanamaha
    Om Sri Sai arogya kshemadayanamaha
    Om sri Sai arogya kshemadayanamaha
    Om Sri Sai arogya kshemadayanamaha
    Om Sri Sai arogya kshemadayanamaha
    Om Sri Sai arogya kshemadayanamaha
    Om Sri Sai arogya kshemadayanamaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Sai Tamudi arogyam bagu cheyi please please please🙏 tana Mathi ni gathini sari chesi Manchi sthithi ni ivvu .🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo