సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

అర్ధరాత్రి క్షేమముగా నన్ను ఇంటికి చేర్చారు బాబా


ఓం శ్రీ సాయి రామ్! నా పేరు రాఘవ. నిన్న రాత్రి(07.08.2018) జరిగిన నా అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

నిన్న రాత్రి నేను ఢిల్లీ నుండి చెన్నైకి ప్రయాణిస్తున్నాను. చెన్నైలో దిగిన తరువాత ఇంటికి వెళ్ళడానికి ఏదైనా రవాణా సౌకర్యం లభిస్తుందా? లేదా? అని ఆందోళన చెందాను ఎందుకంటే కరుణానిధి మరణం కారణంగా చెన్నైలో బస్సులు, ఆటోలు మరియు ఇతర ఏ వాహనాలు తిరగడం లేదని విన్నాను. నాతోపాటు ఇతర ప్రయాణీకులు కూడా ఆందోళన పడ్డారు కానీ, వాళ్ళు ఢిల్లీ విమానాశ్రయం నుండే ఫాస్ట్ ట్రాక్ వాహనాలను బుక్ చేసుకున్నారు. నన్ను కూడా అలా చేసుకోమని వాళ్ళు సలహా ఇచ్చారు, కానీ నేను చేసుకోలేదు. పరిస్థితి ఏమిటో అర్ధంకాక నేను బాబాను ప్రార్ధించాను. "బాబా నాకు సహాయం చేయండి" అంటూ ప్రయాణం చేస్తున్నంత సేపు "ఓం శ్రీ సాయిరామ్" అని బాబాను స్మరిస్తూనే ఉన్నాను. చెన్నైలో అడుగుపెట్టగానే నేను uber వాహనాన్ని బుక్ చేసుకున్నాను. అదంతా బాబా కృప మాత్రమే ఎందుకంటే నేను బుక్ చేసుకున్న ఆ uber ఒక్కటే అక్కడ అందుబాటులో ఉంది. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎక్కడో ఒక కారు మాత్రమే కనిపిస్తున్నాయి దారంతా. బాబా దయవలన నేను క్షేమముగా రాత్రి 12.30కి ఇంటికి చేరుకున్నాను. పిలిస్తే పలికే దైవం ఆయనొక్కడే. రాత్రిపగలు తేడా లేకుండా తన భక్తులు పిలిచినా వెంటనే పలికి తక్షణ సహాయాన్ని అందిస్తారు మన బాబా. 

ప్రియమైన బాబా మీకు నా ధన్యవాదాలు!

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo