సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఓపికను పరీక్షించి - ఉద్యోగం ఇచ్చిన బాబా


ఒక అజ్ఞాత సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:                                   

సాయిబంధువులందరికీ సాయిరాం. బ్లాగులో పెడుతున్న సాయి లీలలన్నింటినీ నేను క్రమం తప్పకుండా చదువుతూ ఉంటాను. నేను అనుకున్న కోరిక నెరవేరితే నా అనుభవాన్ని బ్లాగు ద్వారా సాయిబంధువులందరితో పంచుకుంటానని బాబాకు మాట ఇచ్చాను. అందుకే బాబా కృపతో నా ఈ అనుభవాన్ని మీ అందరికీ తెలియజేస్తాను. ఇది నా మొదటి అనుభవం.

నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను. చాలా కంపెనీలలో ప్రయత్నం చేశాను కానీ, ఎక్కడా సెలెక్ట్ కాలేదు. కొన్ని కంపెనీలలో వాళ్ళిచ్చే ప్యాకేజ్(జీతం) నాకు నచ్చక నేను వదులుకున్నాను. ఇలా చాలా రోజులు గడిచాయి. ప్రతిరోజూ నేను నా ఉద్యోగం గురించి బాబాని అడుగుతూనే ఉన్నాను. బాబా స్మరణ కూడా ఆపకుండా చేస్తూనే ఉన్నాను. చాలా రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నందున ఇంకా ఉద్యోగం రావట్లేదన్న దిగులు మాత్రం నన్ను వెంటాడుతూనే ఉండేది. నా స్నేహితులు మాత్రం, "నీవు మంచి బాబా భక్తురాలివి కదా! అయినా కూడా బాబా ఇవ్వట్లేదంటే, ఆలస్యం అవుతుదంటే, అందులో ఏదో నిగూఢం ఉండి ఉంటుంది. కాబట్టి నువ్వేమీ దిగులుపడకు. బాబా మనకు శ్రేయస్కరమైనదే ఇస్తారు'" అని ఓదార్చారు. "బాబా మనకు ఏదైతే శ్రేయస్కరమో అదే ఇస్తారు"  అన్న మాట నన్ను చాలా సంతోషపరచింది.

కొన్ని రోజుల తర్వాత బాబా దయవలన ఒక MNC(మల్టీ నేషనల్ కంపెనీ)లో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాను. వాళ్ళు, "అన్ని వివరాలతో మీకు జాబ్ ఆఫర్ లెటర్ ఒకటి రెండు రోజులలో మెయిల్ చేస్తామ"ని చెప్పారు. నా కెరీర్ మొదలవుతుందని నేను చాలా సంతోషించాను. తరువాత నేను మెయిల్ కోసం ఎదురుచూసాను. కానీ రోజులు గడుస్తున్నా కంపెనీ నుండి నాకు మెయిల్ రాలేదు. ఇలా 25 రోజులు గడిచినా నేను ఎంతో సహనంతో ఎదురుచూసాను. వాళ్ళకి ఫోన్ చేసి మరీ ఇంకా నాకు మెయిల్ రాలేదని అడిగితే, వాళ్ళు వేచి ఉండమన్నారు. ఇలా ఇంకో నెలరోజులు గడిచిపోయాయి. ఇక నాకు ఉన్న నమ్మకం, ఓపిక నశించిపోయాయి.

బాబా దగ్గరకు వెళ్లి, "బాబా! నా కర్మలన్నీ తొలగించు, నేను తెలిసి అయినా, తెలియక అయినా ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించు. బాబా! నాకు నీవే దిక్కు, నేను నీ పాదాలను అస్సలు విడువను. "నా భక్తుల ఆధ్యాత్మిక, ప్రాపంచిక అవసరాలన్నీ నేనే చూసుకుంటాన"న్నావు కదా బాబా! మరి ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం కదా! నేను కోరుకున్న కోరిక సరైనదే కదా! కాబట్టి, బాబా! నాకు ఈ ఉద్యోగం ఇవ్వు" అని కన్నీళ్లతో వేడుకొని ఎంతో బాధతో ఇంటికి వచ్చాను. నేను ఇంటికి రాగానే నా స్నేహితురాలి దగ్గర నుండి కాల్ వచ్చింది. తను నేను ఉద్యోగం చేయాలనుకున్న ఆఫీసులోనే ఉద్యోగం  చేస్తుంది. తను, "HR కి నీ సమస్య గురించి స్పష్టంగా చెప్పాను. అది విని ఆ HR రేపే నీకు పంపవలసిన పూర్తి డాక్యుమెంట్ పార్టుని మెయిల్ చేయమని చెప్పారు" అని చెప్పింది. నా సంతోషానికి అవధుల్లేవు. బాబాకి నామీద ఎంత ప్రేమ! నేను ఇలా కోరుకోగానే నా కోరిక తీర్చేసారు చూడండి. మరుసటిరోజే నాకు 'ఫలానా తేదీన వచ్చి ఉద్యోగంలో జాయిన్ అవమ'ని మెయిల్ వచ్చింది. బాబాకి సదా ఋణపడి ఉంటాను. నా ఓపికను పరీక్షించి, నాకు శ్రేయస్కరమైన ఉద్యోగం ఇచ్చారు బాబా. థాంక్యూ బాబా! లవ్ యూ బాబా!

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo