సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

మీ భారం నాపైన పడవేయండి, నేను మోసెదను


నా పేరు వి.వి.యస్.సుబ్రహ్మణ్యం. నేను రాజమండ్రి నివాసిని. సాయిబంధువులందరికీ, గురుబంధువులందరికీ బాబా మరియు గురువుగారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా  కోరుకుంటున్నాను. నాకు జరిగిన ఒక అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను.

నేను బజాజ్ ఫైనాన్స్ PSC ఎండోమెంట్ ఎంప్లాయ్ ని. అప్పట్లో జీతాలు చాలా తక్కువగా వచ్చేవి. మా అబ్బాయి పెళ్లి నిశ్చయం అయింది. అయితే అమ్మాయి తరఫు వాళ్ళు కూడా మధ్యతరగతి వాళ్ళు. మేము కూడా మధ్యతరగతి వాళ్ళమే. అయితే అమ్మాయి తరఫు వాళ్లతో, "వివాహానికి అయ్యే ఖర్చు నేనే భరిస్తాను, మీరు దిగులుపడకండ"ని చెప్పాను. ఇంకేముంది? ఉభయ ఖర్చులు నాపై పడ్డాయి. నా ఆలోచన ఏమిటంటే బజాజ్ వాళ్ళు ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళు కదా! ఫైనాన్షియల్ గా సహాయం చేస్తామన్నారు. ఆ భరోసాతో ఉభయ ఖర్చులు పెట్టుకోవడానికి సిద్ధపడ్డాను. కానీ అనుకోకుండా వాళ్ళు డబ్బు ఇవ్వము అన్నారు. నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. ఏకాదశ సూత్రాలలో, "మీ భారములు నాపై పడవేయుడు, నేను మోసెదను" అని బాబా అన్న వాక్కులు గుర్తు వచ్చి‌, ఫైనాన్స్ ఆఫీసుకు వెళ్లేముందు చిలకలూరు బాబా మందిరానికి వెళ్లి, "పెళ్లి సమయం దగ్గర పడుతుంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు బాబా. మీరే ఏదో ఒకటి చేయాలి బాబా" అని మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థిస్తూ నా భారం ఆయనపై వేసాను. అంతే! గుడి నుండి బయటకు రాగానే నా రెండవ కుమారుడు ఫోన్ చేసి, "నాన్నా! మా స్నేహితుడు  నీకేమైనా డబ్బు సహాయం కావాలా అని అడుగుతున్నాడు. తన దగ్గర రెండు లక్షలు ఉన్నాయట. అవసరమయితే ఇప్పుడు తీసుకొచ్చి ఇస్తానని, లేదంటే బ్యాంకులో వేస్తానని చెప్తున్నాడు" అని చెప్పాడు. పైగా అది కూడా వడ్డీ లేకుండా. బాబాకి విన్నవించుకుని బయటకు రాగానే, నా సమస్యకు పరిష్కారం చూపించారు బాబా. నా ఆనందానికి అవధులు లేవు, బాబా చూపిన ప్రేమలో తడిసిపోయాననుకోండి. బాబా కనుక ఆ డబ్బు సమయానికి అందించకపోయి ఉంటే రెండువైపులా నా మాట పోయేది. బాబాకు ఋణపడిపోయి ఉన్నాననుకోండి. అంతేకాదు, మా పిల్లల చదువు విషయంలో కూడా బాబా చాలా సహాయం చేసారు. మా గురువుగారు శరత్ బాబూజీ గారు, "బాబా అనుగ్రహం ఎల్లప్పుడూ కుండపోతగా పడుతూనే ఉంటుంది, కానీ మనము అజ్ఞానం అనే గొడుగును తొలగించాల"ని చెపుతూ ఉంటారు. ఇప్పటివరకు నాకు జరిగిన ప్రతి సంఘటనలో బాబా నా పక్కనే ఉన్నారనేది నిజం. నాకు తోడుగా, నీడగా ఉండి నడిపిస్తున్న బాబాకు మరియు మా గురువుగారికి కృతఙ్ఞతలు.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo