సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నిరుపమ గారి షిర్డీ పర్యటనలోని అనుభవాలు


సాయి బంధువు నిరుపమ గారు 2018, జులై 21న షిర్డీ వెళ్లినప్పటి తన అనుభవాలు ఇలా తెలియజేస్తున్నారు.


ప్రియమైన సాయిబంధువులతో ఇటీవలి నా షిరిడీ పర్యటనకు సంబంధించిన అనుభవాన్ని పంచుకోవాలని ఆశిస్తున్నాను. 



నా స్నేహితురాలు ఒకామె తనతోపాటు షిర్డీ రమ్మని గట్టిగా అడిగింది. కానీ వివిధ కారణాలవల్ల నేను సరిగ్గా స్పందించలేదు. అయినా ఆమె మళ్ళీ మళ్ళీ నన్ను అడుగుతూనే ఉంది. ఒకరోజు "బాబా ఇంతలా నన్ను షిర్డీకి పిలుస్తుంటే నేను ఎందుకు అహంభావంతో ఉన్నాను?" అని అనిపించి, ఆమెతో కలిసి షిరిడీ వెళ్ళాలని నిర్ణయించుకొని ఆమెకు నా అంగీకారం తెలిపాను. తరువాత షిరిడీ యాత్రకి ప్లాన్ చేసుకున్నాము. ఎప్పటిలాగానే మేము చాలా తక్కువ సమయం కోసం ప్లాన్ చేసుకున్నాము. నేను దర్శనానికి ఆన్లైన్ లో బుక్ చేయడానికి ప్రయత్నించాను. ఒకసారి దర్శనానికి చేయగలిగాను కానీ, రెండోది చేద్దామంటే ఏ కారణంచేతనో సిస్టం సహకరించలేదు. సాటి సాయి భక్తుల నుండి బాబా కోసం అనేక ప్రార్థనలు, నైవేద్యములు సమర్పించమని అభ్యర్థనలను అందుకున్నాను, అందువలన వాటినన్నింటినీ ఒక్క దర్శనంలో బాబాకు సమర్పించగలనా? అని నాకు చాలా కంగారుగా అనిపించింది. మరొక దర్శనాన్ని sai.org వెబ్సైటు ద్వారా బుక్ చేయమని నా ఫ్రెండ్ కి చెప్పాను. కానీ తను పనిలో బిజీగా ఉండి ఆరోజు చేయలేకపోయింది. ఏమి చేయాలో నాకు అర్థంకాలేదు. మరుక్షణం ఒక బాబా గ్రూపులో నేను ఈ దిగువ సందేశాన్ని చూశాను.



I will make all the arrangements for you to come shirdi. You will be surprised("నువ్వు షిర్డీ రావడానికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. నువ్వు ఆశ్చర్యపోతావు") - సాయిబాబా



నాకు చాలా సంతోషంగా అనిపించి, అంతా బాబాకు వదిలేసాను. బాబా దయవలన మరుసటిరోజు నా ఫ్రెండ్ మరో దర్శనానికి బుక్ చేసింది. కాకడ ఆరతికి కూడా టిక్కెట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించాము కానీ, అవి అందుబాటులో లేవు.



మేము 2018, జులై 21వ తేదీన విమానంలో వెళ్లి, తిరుగుప్రయాణం 22న ఉండేలా ప్లాన్ చేసుకున్నాము. 20వ తేదీ ఉదయాన నాకు స్వప్నంలో బాబా దర్శనం ఇచ్చారు. కలలో నేను కొంతమంది స్నేహితులతో మాట్లాడుతున్నాను. హఠాత్తుగా బాబాను చూశాను. బాబా ఏదో తీసుకొని నా వైపుకు వస్తున్నారు. బాబా నా దగ్గరకు వచ్చి, నా చేతిలో పెరుగన్నం పెట్టి, “గాంధీ ప్రశ్నను గుర్తుపెట్టుకో” అని నాకు చెప్పారు. నేను నా తలవంచి మిశ్రమ భావోద్వేగాలతో కన్నీరు కార్చాను. నిద్రలేవగానే బాబా నాకు కలలో దర్శనమిచ్చారని గ్రహించాను. "బాబా నన్ను ఎందుకు ఆ ప్రశ్నను గుర్తు పెట్టుకోమన్నారు? అసలు ఆ ప్రశ్న ఏమిటో కూడా తెలియదు" అని అనిపించింది. కానీ బాబా దర్శనం ఇచ్చారు, తన చేతి ద్వారా పెరుగన్నం స్వీకరించానని చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను.



మేము ముగ్గురం జులై 21 మధ్యాహ్నం బయలుదేరి, సాయంత్రం 6గంటలకి పూణే చేరుకున్నాము. అక్కడినుండి మేము ముందుగా బుక్ చేసుకున్న క్యాబ్ లో షిర్డీకి బయలుదేరాము. నా స్నేహితుల్లో ఒకరు ఇదే మొదటిసారిగా షిరిడీకి రావడం, అందువలన తను కాకడ ఆరతికి వెళ్లాలని ఆశ పడుతోంది. మేము రాత్రి 10.30 గంటలకు షిరిడీ చేరుకోవచ్చు, కాబట్టి అప్పుడు బయోమెట్రిక్ టిక్కెట్స్ తీసుకోని కాకడ ఆరతికి వెళదామని అనుకున్నాము. దారిలో మేము ఒక రెస్టారెంట్ వద్ద ఆగాము. అక్కడ ఏదో ఒక పురుగు నా చేతి బొటనవేలును కుట్టింది. దానితో నాకు రక్తస్రావం అవుతూ వుంది. తరువాత మేము మా ప్రయాణాన్ని కొనసాగించాము. క్యాబ్ డ్రైవర్ గూగుల్ మ్యాప్ ను అనుసరిస్తూ నిర్మానుష్యంగా ఉన్న ఒక మార్గంలో మమ్మల్ని తీసుకువెళ్తూ ఉన్నాడు. మార్గం అంతా లోన్లీగా ఉన్నందున మేము ముగ్గురం ఆడవాళ్ళం కావడంతో చాలా భయపడిపోయాము. ఇటువంటి పరిస్థితులలో మేము సమయానికి షిరిడీ చేరుకుంటామా, లేదా? కాకడ ఆరతికి వెళ్ళగలమా, లేదా? అని ఆందోళనపడ్డాము. బాబా దయ, మేము 10.30కి సురక్షితంగా షిరిడీ చేరుకున్నాము. మేము హోటల్ గదిలో మా సామాను ఉంచి బయోమెట్రిక్ టిక్కెట్స్  తీసుకోవడానికి వెళ్ళిపోయాము. టిక్కెట్లు తీసుకొని బాబా పవిత్ర సన్నిధిలో రాత్రంతా గడిపాము. ఉదయాన కాకడ ఆరతి సమయంలో అద్భుతమైన దర్శనాన్ని బాబా ఇచ్చారు. తరువాత మా రెండు దర్శనాలలో భక్తులు నాకిచ్చిన విన్నపాలను, నైవేద్యాలను పూజారికి ఇస్తే అతను వాటిని బాబా దివ్యచరణాల వద్ద సమర్పించారు. చాలామంది భక్తులు ఊదీ తీసుకొని రమ్మని చెప్పారు. వాళ్లందరికీ సరిపడా ఊదీ ప్యాకెట్లు లభించకపోవడంతో ఊదీ గురించి చింతించటం మొదలుపెట్టాను. అందువలన రెండు డొనేషన్ కార్యాలయాలలో డొనేషన్ కడితే సరిపడా ఊదీ ప్యాకెట్లు లభిస్తాయని నేను అనుకున్నాను. కానీ నేను మొదటి కౌంటర్లో డొనేషన్ ఇచ్చినప్పుడు చాలా తక్కువ ఊదీ ప్యాకెట్లను ఇచ్చారు. దానితో నేను ఆందోళనపడి, "బాబా! నాకు తగినన్ని ఊదీ ప్యాకెట్లు దొరికేలా సహాయం చేయండ"ని ప్రార్థించి ఇంకొక కార్యాలయానికి వెళ్ళాను. అక్కడ కూడా చాలా తక్కువగానే ఊదీ ప్యాకెట్లను పొందాను. నా ఫ్రెండ్ ఒకరు 500 రూపాయలు విరాళం ఇవ్వమని చెప్పింది. అప్పుడు నేను, "500 రూపాయలు కడితే ఎన్ని ఊదీ ప్యాకెట్లను ఇస్తారు?" అని అడిగాను. అతను, 'రెండే ఇస్తాము' అన్నాడు, కానీ అకస్మాత్తుగా 6 ఊదీ ప్యాకెట్లను ఇచ్చాడు. బాబా ఆశీర్వదించారు, తగినన్ని ఊదీ ప్యాకెట్లు దొరికాయని నేను చాలా సంతోషించాను. మేము సంతోషంగా షిరిడీ నుండి బయలుదేరి బెంగుళూరు సురక్షితంగా చేరుకున్నాము. ఊదీ అడిగిన భక్తులకు ఊదీ ప్యాకెట్లను పంపించడమే కాకుండా, బాబాకు తమ విన్నపాలు సమర్పించమన్న వారికి కూడా కొంత ఊదీ పంపిణీ చేసి, మరికొంత భాగాన్ని టెంపుల్ లో భక్తులకు కూడా పంచగలిగాను.



ఇంకో విషయం, మేము మొదట ప్లాన్ చేసుకున్నప్పుడు రెండువైపులా విమాన ఛార్జీలు ఏడెనిమిది వేల రూపాయలు దాకా అయ్యేలా ఉన్నాయి. కేవలం విమాన టికెట్ల కోసం అంత ఖర్చు చేయడం నాకు నచ్చలేదు. కానీ మొత్తం పర్యటన ఖర్చు 7వేల రూపాయలలో అయిపోయేలా బాబా చేసారు. బాబా లీలలు అద్భుతమైనవి.



గత కొన్నిరోజుల నుండి మనసులో ఏదో ఆందోళన చెందుతున్నాను. ఈరోజు(01.08.2018) ఉదయం, షిరిడీ వెళ్ళకముందు బాబా కలలో చెప్పిన దానిని జ్ఞాపకం చేసుకున్నాను. నాకు ఏమీ అర్థంకాక, దాని గురించి 'ప్రశ్నావళి'లో బాబాను అడిగాను. సమాధానం క్రింది విధంగా వచ్చింది.



"త్వరలో నీవు ఇద్దరు వ్యక్తులను కలుసుకుంటావు, వాళ్ళ ద్వారా ఆ ప్రశ్నకు సమాధానం పొందుతావు. తద్వారా పని పూర్తి అవుతుంది. కృష్ణుని స్మరించు, గుజరాతీ మనిషి పని పూర్తి చేస్తాడు"



అలాగే బాబా నాకు వేపాకు మీద దర్శనం ఇచ్చారు. నేను దానిని ఎల్లప్పుడూ సాయి సచ్చరిత్రలో ఉంచుకుంటాను. బాబా నాకు మనశ్శాంతినిస్తారని ఆశిస్తున్నాను.


1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo