సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఊదీ మహిమలు 3


సౌత్ ఆఫ్రికా నుండి సాయిబంధువు అమర్ ప్రీత్ బ్రార్ తన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు.

సాయిబంధువులందరికీ సాయిరాం. ఒక శనివారంనాడు మేము మా ఇంటిలో దోమలు, కీటకాలు రాకుండా స్ప్రే చేయిస్తున్నాము. పనివాళ్ళు మొదట బయట స్ప్రే చేస్తుండగా నేను ఇంట్లో అందుకోసం కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నాను. నా రెండు పెంపుడు కుక్కలు రాకీ, బ్రూనో ఇంట్లోనే ఉన్నాయి. బయట పని పూర్తి కావడంతో పనివాళ్ళు ఇంట్లో మందులు స్ప్రే చేయాలని, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ ఉండకూడదని చెప్పారు. నేను వాళ్ళని నా రాకీ, బ్రూనోలని బయట ఉంచవచ్చా అని అడిగితే వాళ్ళు సరేనన్నారు. మొత్తం పని పూర్తి కావడానికి ఎంత సమయం పట్టవచ్చని అడిగితే, 5 నుండి 6 గంటల వరకు పడుతుందని చెప్పారు. బయట చాలా వేడిగా ఉండటంతో రాకీ, బ్రూనోలని ఇంటి బయట ఉన్న చిన్న గుడిసెలో కట్టేసాను. 6 గంటల సమయం బయటే గడపాలి కాబట్టి నేను, మా బాబు ఇద్దరం మందిరానికి వెళ్లి అక్కడ కాసేపు ఉన్నాం. తరువాత సరుకులు, ఇతర ఇంటి సామాన్లు తీసుకొనేసరికి వారు చెప్పిన 5-6 గంటల సమయం అయింది. అప్పుడు ఇంటికి బయల్దేరాము. మేము ఇంటికి దగ్గరగా వచ్చేసరికి మా సెక్యూరిటీ అతను వచ్చి, "బ్రూనో వాంతులు చేసుకుంటుంది" అని చెప్పాడు. నా గుండె జారినంత పనైంది. వెంటనే ఇంటిలోకి పరిగెత్తుకెళ్ళి, లోపలంతా శుభ్రం చేసి బాగుచేశాను.

బ్రూనో బయట లాన్ లో ఉన్న పచ్చిగడ్డి తినడం వలన దానికి ఇన్ఫెక్షన్ అయ్యి వాంతులు చేసుకుంటుంది. అది వారాంతం కావడంతో డాక్టర్స్ ఎవరూ అందుబాటులో లేరు. నా అదృష్టం కొద్దీ బాబా దయవలన ఒక వెటర్నరీ డాక్టర్ కి కాల్ చేస్తే, ఆయన కొన్ని సూచనలు ఇచ్చి, బ్రూనోకి చార్ కోల్ టాబ్లెట్స్ వెయ్యమని చెప్పారు. నేను అలానే చేశాను. తరువాత నేను నా బ్రూనో క్షేమం కోసం బాబాని ప్రార్థించి, ఒంటికాలిపై నిలబడి 11వ అధ్యాయం 11 సార్లు పారాయణ చేశాను.

పరిస్థితి కొంతవరకు మెరుగుపడినా, ఇంకా బ్రూనో శరీరంలో ఇన్ఫెక్షన్ ఉండడం చేత ఆపకుండా దగ్గుతూనే ఉంది. నేను రాత్రంతా దాని ప్రక్కనే కూర్చొని, "సాయి, సాయి" అని జపం చేస్తూనే ఉన్నాను. రాత్రి 1.30 సమయంలో బాబా ఊదీ నీళ్లలో కలిపి ఆ మిశ్రమాన్ని బ్రూనో చేత త్రాగించాను. ఆశ్చర్యం! సాయి మహిమ చూపారు. 5 నిమిషాలలో దగ్గు ఆగిపోయి బ్రూనో ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. నా ఆనందానికి అవధులు లేవు. అది మన సాయి ప్రేమ. ఆయనకి మూగజీవులపై కూడా ఎంత ఆదరమో! సాయి ప్రేమ వెలకట్టలేనిది. దయామయుడు అయిన నా సాయి తలచిన వెంటనే చాలా తక్కువ వ్యవధిలో బ్రూనోకి నయం చేసి ఆరోగ్యాన్ని చేకూర్చారు. మమ్మల్ని ఎల్లపుడూ ఇలానే ఆశీర్వదించండి బాబా! లవ్ యు బాబా!

బాబా మన ప్రార్థన చిన్నదయినా, పెద్దదయినా దానికి ఖచ్చితంగా సమాధానం ఇస్తారు. సాయిపై నమ్మకం ఉంచండి, అంతా ఆయనే చూసుకుంటారు.

ఓం సాయిరాం!!!

4 comments:

  1. ఓం సాయిరాం...🌹🙏🌹

    ReplyDelete
  2. ఓం సాయిరాం...🌹🙏🌹

    ReplyDelete
  3. First miru Bruno visayam lo tisukunna care keka andi ... 11 times chadavadam adi andaru cheyyaru ga ...miru kuda baga shraddha chuparu bruno visayam lo ade danni kapadindi ... I would like to Thank to you first and then Baba ....

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo