శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
బెంగళూరు నుండి పబ్లిష్ అయ్యే సాయిపాదానంద పత్రికని నేను క్రమం తప్పకుండా చదువుతూ ఉంటాను. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన నా మదిలో చెరగని ముద్ర వేసింది. ఆ సంఘటన ద్వారా సాయిబాబా ఇప్పటికీ సజీవంగా ఉంటూ, తన భక్తులు ఎంత కష్టాలలో, బాధలలో ఉన్నా వారు తలచుకోగానే వాళ్ళ ముందు ప్రత్యక్షమై, వాళ్ళకు ఉపశమనం కలిగిస్తారు అని తెలిసింది. ఇప్పుడు నేను చెప్పబోయే సాయి లీల మా నాన్నగారు శ్రీ కాసాయి శ్రీనివాసశెట్టి గారిని బాబా స్వయంగా హాస్పిటల్ కి వెళ్లి ఆయనని అనారోగ్యం నుండి ఎలా కాపాడారో తెలియజేస్తుంది.
మా నాన్నగారు బెంగళూరులో ఉండగా ఒకరోజు సాయంత్రం బ్లడ్ వామిటింగ్ చేసుకున్నారు. మా బావగారు శ్రీ సూర్యప్రసాద్ గారు(బెంగళూరు యూనివర్సిటీలో రిజిస్ట్రార్ గా పని చేస్తారు) హై గ్రౌండ్ లో ఉన్న డాక్టర్ నారాయణ్ హాస్పిటల్ లో మా నాన్నగారిని అడ్మిట్ చేసారు. డాక్టర్ లివర్ హేమరేజ్ అయిందని నిర్ధారించి, మరుసటి రోజే ఆపరేషన్ చేయాలని చెప్పారు.
తరువాత మా నాన్నగారు హాస్పిటల్ గదిలో మంచం పైన పడుకుని ఉన్నారు. ఆయన ఒక్కసారిగా కళ్ళు తెరిచేసరికి ఎదురుగా సజీవంగా సాయిబాబా ప్రత్యక్షమై, "నీకు ఎక్కడ నొప్పిగా ఉంది?" అని అడిగారు. మా నాన్నగారు తన పొట్టపై ఒక భాగం చూపించగా, బాబా మంచంపై కూర్చొని నాన్న పొట్టని తన చేతులతో స్పృశించి, “అల్లా అచ్ఛా కరేగా” అని అదృశ్యమైపోయారు. డాక్టర్ నారాయణ్ గారు ఆ రాత్రి నాన్నగారు ఉండే వార్డ్ కి రౌండ్స్ కి వచ్చినప్పుడు, ఆయన సంతోషంగా జరిగినదంతా డాక్టర్ కి వివరించారు. డాక్టర్ మళ్ళీ నాన్నకి పరీక్షించి, ఆపరేషన్ అత్యవసరంగా చేయవలసిన అవసరం లేదు, ఇప్పుడు సమస్య ఏమీ లేదు, అంతా బాగుందని చెప్పారు. అపరేషన్ లేకుండా మా నాన్నగారి ప్రాణాలు కాపాడినందుకు మేము సదా సాయికి కృతజ్ఞులై ఉంటాము.
ఓం సాయిరాం!!!

🕉 sai Ram
ReplyDelete