సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1456వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయతో ఎలాంటి పరిస్థితులనుండైనా బయటపడటం నిశ్చయం
2. ఆరోగ్యం బాగుచేసి త్వరగా డిశ్చార్జ్ అయ్యేలా అనుగ్రహించిన బాబా

బాబా దయతో ఎలాంటి పరిస్థితులనుండైనా బయటపడటం నిశ్చయం


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

సద్గురు శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!!!


ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయిబంధువులకు, మీ నిస్వార్థమైన సేవకు మా నమస్సుమాంజలి. నా పేరు రాంబాబు. మాది విజయనగరం. బాబా నాకు ప్రసాదించిన మరో అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సాయి ఆశీస్సులతో మా కుటుంబ పరిస్థితులు, ఆరోగ్యం సమతుల్యంగా ఉంటాయి కాబట్టి, దాదాపు నా అనుభవాలన్నీ నా వృత్తికి సంబంధించినవై ఉంటాయి. ఇప్పుడు పంచుకోబోయే అనుభవం కూడా అలాంటిదే. నేను పనిచేస్తున్న కంపెనీలో మా బ్లాకులో తయారయ్యే ప్రొడక్ట్ అవుట్‍పుట్ తక్కువ వస్తున్నా మేనేజ్‌మెంట్‌కి చెప్పకపోవడం వల్ల స్టాక్ నెగెటివ్‍లోకి వెళ్ళిపోతుండేది. అదే సమయంలో ప్రొడక్ట్ ఫెయిల్యూర్స్ కూడా అవడం మొదలైంది. వరుసగా 4 బ్యాచ్‌లు ఫెయిల్ అయ్యాయి. గోరుచుట్టుపై రోకలిపోటులా ప్యూరిఫికేషన్ ప్రాసెస్‌లో మరింత అవుట్‍పుట్ తగ్గిపోసాగి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాంతో నేను నిద్రలేని రాత్రులు గడిపాను. ఆ కష్ట సమయంలో చెప్పుకోడానికి నాకు బాబా తప్ప మరి ఎవరూ లేరు. అందుచేత, "బాబా! ఈ సమస్య నుంచి బయటపడితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను. ఇంకా ఈ సమస్య తీరేవరకు నాకు ఇష్టమైన ఒక అలవాటు మానుకుంటాను" అని ఆర్తిగా బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఒక నెలలో పరిస్థితి అంతా అదుపులోకి వచ్చింది. ఆయన దయవుంటే ఎలాంటి కష్టం/పరిస్థితులనుండైనా మనం బయటపడటం నిశ్చయం. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఈ జన్మలో సాయి కృపకు పాత్రుడనైనాను. అందుకు నేను ఆయనకి సదా కృతజ్ఞుడిని. ఆ సాయినాథునికి నా శతకోటి నమస్కారాలు.


2022, డిసెంబరులో మా కంపెనీకి సర్ప్రైజ్ స్టాక్ చెకింగ్‌కి కార్పొరేట్ నుంచి ఒక టీమ్ వచ్చింది. ఆ సమయంలో నా పరిధిలో వున్న ఒక స్పెంట్ స్టాక్ చాలా ఎక్కువ మొత్తంలో చేరుకుంది. కానీ యదార్థంగా అంత స్టాక్ లేదు. (సింపుల్‌గా చెప్పాలంటే, స్టాక్ భౌతికంగా లేదు, కానీ డాక్యుమెంట్‌లో ఉన్నట్లు ఉంది.) దానిని నేను కొద్దిరోజుల ముందే గమనించాను. కానీ ఆ విషయంలో ఏమి చెయ్యాలో, ఎలా ముందుకు వెళ్ళాలో తెలియక అలానే ఉంచేశాను. అలాంటి పరిష్టితిలో సడెన్‌గా సర్ప్రైజ్ స్టాక్ చెకింగ్ టీమ్ రావడం నన్ను చాలా తీవ్రస్థాయిలో ఆందోళనకు గురిచేసింది. "ఎలాగైనా ఈ సమస్య నుంచి బయటపడేలా చేయండి బాబా. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని ఎంతో ఆర్తిగా బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల పరిస్థితి నా పరిధిలో ఉన్న ఆ స్టాక్‌ని గమనించే స్థాయికి వెళ్ళకుండానే ఆ టీమ్ స్టాక్ చెకింగ్ పూర్తిచేసి వెళ్లిపోయింది. "ఈ నా సమస్య నుంచి బయటపడేసినందుకు చాలా కృతజ్ఞుడిని బాబా. మీకు శతకోటి నమస్కారాలు. ఇక ఆ స్టాక్ సమస్య కూడా త్వరలో క్లియర్ అయ్యేలా అనుగ్రహించండి బాబా".


శ్రీసాయినాథాయ నమః!!!

సర్వేజనాః సుఖినోభవంతు!!!


ఆరోగ్యం బాగుచేసి త్వరగా డిశ్చార్జ్ అయ్యేలా అనుగ్రహించిన బాబా


సాయిబంధువులందరికీ, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నేను సాయిభక్తుడిని. నా పేరు నందకుమార్. మాది గుంటూరు. నేను కొన్ని సంవత్సరాలుగా ఈ బ్లాగులోని సాయిబంధువులందరి అనుభవాలు చదువుతూ బాబా ప్రేమ మాధుర్యానికి సంతోషిస్తున్నాను. కొన్నిరోజుల క్రితం ఒక అనుభవాన్ని చూసి నేను కూడా నా అనుభవాన్ని పంచుకోవాలని అనుకున్నాను. ఇక ఇప్పుడు మొదటిసారిగా నా అనుభవాన్ని సాయిబంధువులతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈమధ్య మా అమ్మగారి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి, తనకి ఆయాసంగా ఉంటుండేది. దాంతో అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. కొన్ని రిపోర్టులు సంతృప్తికరంగా వచ్చినప్పటికీ, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఇబ్బందికరంగా ఉండేది. నేను హాస్పిటల్లో కూర్చుని బాబాని తలచుకుని ఈ బ్లాగులోని కొన్ని అనుభవాలు చదివి, "బాబా! మా అమ్మ ఆరోగ్యం బాగుచేసి, త్వరగా ఆమెను డిశ్చార్జ్ చేయించండి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాని వేడుకొని, బాబా నామస్మరణ చేశాను. బాబా ఎంతో దయతో అమ్మను కోలుకునేలా చేసి ఇంటికి పంపించారు. "ధన్యవాదాలు బాబా. కానీ అమ్మకి నీరసంగా ఉంటోంది. అది తగ్గి అమ్మ తన పనులు తాను చేసుకునే విధంగా ఆరోగ్యాన్ని చేకూర్చు తండ్రీ. మీ దయవల్ల అన్నీ సవ్యంగా జరిగితే మరలా నా అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా సాయిబంధువులందరితో పంచుకుంటాను. మీ దయ ఎల్లప్పుడూ మాపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను బాబా".


4 comments:

  1. బాబా సాయి పిలిస్తే పలుకుతావు కదా పలుకు సాయి మీ బ్లాక్ లో పంచుకుంటాము అని ఎవరి కోరుకున్న పెద్ద పెద్ద సమస్యలు కూడా తీరిపోతున్నాయి సాయి ఒక్కసారి అవమానాలు ఏమీ లేకుండా నా భర్తని నన్ను కలుపు సాయి నా కాపురాని నిలబెట్టు సాయి నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను సాయి నిన్న పద్ధతి దూరంగా ఉండలేను సాయి చాలా అంటే చాలా అవమానాలు పడుతున్నాను సాయి తను అర్థం చేసుకునేలా చూడు సాయి నన్ను కాపురానికి తీసుకెళ్లిన చూడు సాయి నాకు మీరు తప్ప ఎవ్వరు లేరు సాయి మనస్పూర్తిగా అడుగుతున్నాను బావ ప్రేమతో బాబా అని పిలిస్తే పలుకుతావు కదా పలుకు బాబా సాయి

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. ఈ రోజున నా భర్త ని కష్టపెట్టే ను . క్షమించు తండ్రి.ఆయనకి, పిల్లల కి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం యియవలెను.నా కోరిక తీర్చండి తండ్రి.ఓం సాయి రామ్

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo