సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1431వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి నుండి ఏదీ దాచలేము
2. జీవితంలో మర్చిపోలేని అద్భుత వరాన్ని ప్రసాదించిన బాబా
3. బాబా కృపతో తీరిన ఆరోగ్య సమస్యలు

సాయి నుండి ఏదీ దాచలేము


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! నేను ఒక సాయి భక్తురాలిని. మరోసారి నా అనుభవాలను మీతో పంచుకునే అవకాశమిచ్చిన శ్రీసాయినాథునికి శతకోటి ధన్యవాదాలు. "సాయీ! మీ ఆశీస్సులు నాతోపాటు అందరికీ ఉండేలా చూడండి". ఇంకా నా అనుభవాల విషయానికి వస్తే.. నాకు పెళ్ళై 11 సంవత్సరాలు అయింది. ఈ కాలంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నేను సర్డుకుపోతూ, దేవుడున్నాడనే నమ్మకంతో ముందుకు సాగాను. నాకు భయం వేసిన ప్రతిసారీ బాబా ఏదో ఒక రూపంలో లేదా ఏదో ఒక సందేశంతో నాకు చెప్పలేనంత ధైర్యాన్నిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. కానీ గత రెండు సంవత్సరాలుగా చెప్పుకోలేని కుటుంబ సమస్యలు ఒక పెద్ద అగాధాన్ని సృష్టించాయి. ఎంతగా అంటే స్వంత కుటుంబంలో వాళ్ళే నేను, నా భర్త వేరుగా ఉంటే పైశాచిక ఆనందం పొందే అంతగా... నా భర్తకి నేనేంటో తెలిసి కూడా నా వ్యక్తిత్వాన్ని తప్పుపట్టేంతగా వాళ్ళు ఆయనను మార్చేశారు. సంత్సరకాలంగా నేను మా అమ్మానాన్నల వద్ద ఉంటున్నాను. అయినా శ్రీసాయి మీద నమ్మకంతో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మళ్లీ మునపటిలా మేము కలిసుంటామని అనుకుంటూ ఉన్నాను. ఆయన దయతో దివ్యపూజ చేసే అవకాశం నాకు కల్పించారు. ఇలా ఉండగా ఈమధ్య మా బంధువుల్లో ఒకరి పెళ్లికి తప్పకుండా రమ్మని నా భర్తకి ఫోన్ చేసి చెప్పారు. ఆయన పెళ్లికి రాలేదు కానీ, 2022, డిసెంబర్ 16, శుక్రవారం జరిగిన రిసెప్షన్‍కి వచ్చారు. విచిత్రమేమిటంటే, ఇంటికి వెళ్లి, పెళ్లి పత్రికలిచ్చి, ఫోన్ చేసి చెప్పినా మర్యాదలని, పట్టింపులని ఎదో ఒక తప్పు వెతికి మరీ ఆ శుభకార్యానికి వెళ్లకుండా ఉండే మా అత్తమామలు కూడా కేవలం నా భర్తకి మాత్రమే ఫోన్ చేసి పిలిస్తే వచ్చారు. నేను వాళ్ళను కనీసం చూడడానికి కూడా ప్రయత్నించకుండా అక్కడున్నంతసేపు సాయి నామం జపిస్తూ ఉన్నాను. కాని ఇంటికి వచ్చాక నాకు ఏదో వెలితిగా అనిపించి సాయిని తల్చుకుంటూ ప్రశ్న అడిగాను. "తప్పు చిన్నదైనా క్షమాపణ చెప్పాలి. సాయికి కొబ్బరికాయ సమర్పించు, సమస్యలు తొలిగిపోతాయి" అని వచ్చింది. అప్పుడు నేను, 'నా భర్తని చూడకుండా తప్పు చేసానేమో! ఆ విషయం గురించే సాయి ఇలా చెప్పార'ని అనిపించింది. కానీ నా అనుభవం అప్పుడు నాతో ఆ పని చేయించలేదు. అందువల్ల మనసులో శ్రీసాయికి క్షమాపణ చెప్పాను. కాని కొబ్బరికాయ ఎలా సమర్పించాలో నాకు తెలియలేదు. ఎందుకంటే, ఈమధ్య నా ఆరోగ్యం బాగుండట్లేదు. రోజూ ఆ కొబ్బరికాయ గురించే ఆలోచించుకుంటూ ఉండేదాన్ని. 2022, డిసెంబర్ 22, ఉదయం కూడా నేను నా మనసులో, "సాయీ! నేను నీ దగ్గరకు రాలేకపోతున్నాను" అని బాధపడ్డాను. ఆరోజు నాన్న పని మీద బయటికి వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చారు. ఆయన నాకు కొబ్బరికాయ ప్రసాదిమిచ్చి నవ్వుతూ నా ముందు నిల్చున్నారు. నేను, "ఎక్కడికి వెళ్ళావు నాన్న?" అని అడిగాను. నాన్న, "బాబా గుడికి వెళ్ళొచ్చాను" అని చెప్పారు. వెంటనే నేను, "నాకు కూడా కొబ్బరికాయ మ్రొక్కు ఒకటి ఉంది నాన్న. మీరు చెప్పుంటే మీ ద్వారా నా మొక్కు తీర్చుకునేదాన్ని" అని అన్నాను. అప్పుడు నాన్న, "నేను ఆల్రెడీ ఒక కొబ్బరికాయ ధునిలో వేసాను" అని అన్నారు. "అదెలా?" అని అడిగితే, "ఏమో తెలియదు రా. ఇంటికి వస్తుంటే బాబా గుడికి వెళ్ళాలనిపించి, వెళ్ళాను. ధునిలో ఒక కొబ్బరికాయ వేసి, మరొకటి సాయి దగ్గర కొట్టి ప్రసాదం తెచ్చాను" అన్నారు. ఇది సాయి మహిమ కాక మరేంటి? మనం సాయి నుండి ఏది దాచలేము. నా ఆనందానికి అవధులు లేవు. "నా మీద మీకు ఎంత దయ తండ్రి? నేను మీ దగ్గరకు రాలేని పరిస్థితుల్లో ఉన్నానని నాన్న ద్వారా నా మొక్కు తీర్చుకునేలా చేశావు. నా మనసు ఆందోళన చెందిన ప్రతిసారీ శ్రద్ధ, సబూరీ అని మీరు చెప్తున్నారు. కానీ ఒక్కోసారి పరిస్థితుల వల్ల నాకు చాలా భాద, ఆవేశం వస్తున్నాయి. వాటిని నియంత్రించుకునే శక్తిని, ధైర్యాన్ని నాకు ఇవ్వండి సాయి. మీరు చేసే ఆలస్యం వెనుక అద్భుతాలు ఉంటాయని అనుభవపూర్వకంగా నేను నమ్ముతున్నాను సాయి. తప్పులుంటే మన్నించండి సాయి".


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!


జీవితంలో మర్చిపోలేని అద్భుత వరాన్ని ప్రసాదించిన బాబా


ఓం శ్రీసాయినాథా!!

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


ముందుగా సాయి భక్తులకు, బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నా పేరు తిలోత్తమ. ఈ బ్లాగు గురించి చెప్పిన మా పెద్దమ్మకి, పారాయణ గ్రూపులో నన్ను చేర్చిన మా అక్కకి ధన్యవాదాలు. ప్రతిరోజూ బ్లాగులో ప్రచురితమయ్యే అనుభవాలను చదవడం వల్ల బాబాపట్ల భక్తి, విశ్వాసాలు వృద్ధి చెందుతున్నాయి. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలు పంచుకుంటున్నాను. మా నాన్నగారు వాస్తుశాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు. ఆయన పడమర వైపుకు ఉన్న ద్వారాలు తూర్పుకు మార్చాలని అంటుండేవారు. మేము ఎంత చెప్పినా మా మాట వినేవారు కాదు. నాకు, మా అమ్మకి ఇక ఆయనకి చెప్పటం ఇష్టం లేక ఊరుకున్నాము. నేను, "బాబా! మీరే మా నాన్న మనసు మారేలా చేయాలి. అలా జరిగితే నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. తరువాత నాన్న, "చిన్నచిన్న ఇంటి మరమత్తులు చేయిద్దాం. ద్వారబంధాలు బాగానే ఉన్నాయి, వాటిని అలాగే ఉంచుదాం" అని అన్నారు. అంతవరకు ఎవరు చెప్పినా వినని నాన్న మనసు బ్లాగులో పంచుకుంటాననుకున్న తర్వాతే మారింది. కాదు, కాదు బాబానే మా నాన్న మనస్సు మారేలా చేశారు. "ధన్యవాదాలు బాబా".


ఇప్పుడు నా జీవితంలో బాబా ప్రసాదించిన అద్భుతమైన వరం గురించి పంచుకోబోతున్నాను. మాకు వివాహమై కొన్ని సంవత్సరాలవుతున్నా సంతానం లేదు. ఎన్నో హాస్పిటళ్ళకి, గుడులకు తిరిగాము. అయినా ఫలితం కనిపించలేదు. నేను చాలా బాధపడుతూ ఉండేదాన్ని. "బాబా! మాకు వివాహమై ఇన్ని సంవత్సరాలవుతున్నా సంతానం లేదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం బాబా. మీ దయతో మాకు త్వరగా సంతానం కలిగితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను బాబా" అని బాబాను ప్రార్థిస్తుండేదాన్ని. ఇలా ఉండగా మందులు ఎక్కువగా వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. అందువల్ల మందులు వాడటం ఆపేశాను. తరువాత ఒకరోజు మా అమ్మ, "తొమ్మిది ఐదు రూపాయల నాణాలు ముడుపుకట్టి బాబా పాదాల వద్ద ఉంచి, తొమ్మిది వారాల తర్వాత గుడిలో సమర్పించమ"ని చెప్పింది. సరిగ్గా తొమ్మిది వారాలు పూర్తయ్యాయి(నేను అప్పటికి పారాయణ ఒక్కసారి కూడా పూర్తి చేయలేదు). అంతలోనే బాబా నా జీవితంలో నేను మర్చిపోలేని అద్భుతమైన వరాన్ని ప్రసాదించారు. ఆయన దయతో టెస్టు చేస్తే నేను గర్భవతినని తెలిసింది. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. మా సంతోషానికి అవధులు లేవు. "మీకు అనంతకోటి ధన్యవాదాలు. ఈ బ్లాగులో పంచుకుంటానని అనుకున్న తర్వాతనే మా తమ్ముడికి ఉద్యోగం వచ్చింది. ఇంటి నిర్మాణ విషయంలో మా నాన్న మనసు మార్చుకున్నారు, ఇప్పుడు నా చిరకాల కోరిక నెరవేంది. మీకు మాట ఇచ్చిన ప్రకారం నా అనుభవాలను బ్లాగుకి పంపాను తండ్రి".


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


బాబా కృపతో తీరిన ఆరోగ్య సమస్యలు


సాయి బంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగు నిర్వాహకులపై బాబా ఆశీస్సులు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు నాగలక్ష్మి. నేను ఇంతకుముందు ఈ బ్లాగులో కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలు పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా ఆలస్యంగా పంచుకుంటున్నందుకు బాబాకి  క్షమాపణలు చెప్పుకుంటున్నాను. 2022, దసరాకి మేము శిరిడీ వెళ్ళాము. అక్కడినుండి తిరిగి వచ్చిన తర్వాత నుండి దగ్గు, కఫంతో నేను చాలా బాధపడ్డాను. మందులు వాడుతున్నప్పటికీ తగ్గలేదు. అసలే ఆస్తమా పేషేంట్‍ని అవ్వడం వల్ల నాకు చాలా భయమేసి వెంటనే గుంటూరు వెళ్లి అన్ని టెస్టులు చేయించుకున్నాను. "టెస్టులన్నీ నార్మల్‍గా వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. ఆ తండ్రి దయవల్ల టెస్టు రిపోర్టులన్నీ నార్మల్‍గా వచ్చాయి. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా".


మా పెద్దపాప హాస్టల్లో ఉంటుంది. ఒకసారి హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయి తను చాలా బాధపడింది. మందులు వాడినప్పటికీ తగ్గలేదు. పాప నెలరోజులు ఎంతో బాధని అనుభవించింది. అప్పుడు నేను, "బాబా! పాప బాధను తగ్గించండి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. దయతో బాబా పాపకు ఆ సమస్య నుండి విముక్తిని ప్రసాదించారు. "ధన్యవాదాలు బాబా. ఇలాగే పాపకి మంచి అబ్బాయితో పెళ్లి జరిగేటట్టు అనుగ్రహించండి. మీ కృపను బ్లాగులో పంచుకుంటాను".


4 comments:

  1. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Sai please change my thoughts.please give peace to me.Sairam.om Sai ram

    ReplyDelete
  4. 🙏🕉️✡️🙏 శ్రీ షిరిడీ సాయిదేవా మీకు ఇవే మా సాష్టాంగ దండ ప్రణామములు.. రక్షించు కాపాడు వరమివ్వు సాయిదేవా..

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo