1. నమ్మకాన్ని నిలబెట్టిన సాయితండ్రి
2. శ్రీసాయినాథుని దయతో లభించిన వాహనం - తప్పిన పెద్ద సమస్య
3. షుగర్, గ్యాస్ సమస్యలను తగ్గించిన బాబా
నమ్మకాన్ని నిలబెట్టిన సాయితండ్రి
శ్రీసాయినాథ్ మహరాజ్‌కి జై!!! నేను ఒక సాయిభక్తురాలిని. ఈ బ్లాగులో నా అనుభవాలు పంచుకోవడం ఇది రెండోసారి. ముందుగా తమ కృపను చూపి నేను ఉన్నానని నమ్మకం కలిగించిన బాబాకి శతకోటి నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. అలాగే బ్లాగు నిర్వహిస్తున్న సాయికి, సాయి భక్తులకి (అడ్వాన్స్) హ్యాపీ న్యూ ఇయర్(ఈ అనుభవాన్ని నేను డిసెంబర్ 31న వ్రాస్తున్నాను). ఇక నా అనుభవాల విషయానికి వస్తే.. నా భర్త ప్రవర్తన అందరికీ ముఖ్యంగా నా పుట్టింటి వాళ్ళకి కొంచం ఇబ్బంది కలిగించేదిగా ఉంటుంది. ఆ కారణంగా మా అమ్మవాళ్ల కొత్తింటి గృహప్రవేశ సమయం దగ్గర పడేకొద్ది నాకు టెన్షన్ మొదలైంది. అప్పుడు నేను బాబాతో, "తండ్రీ! నా వల్ల, నా భర్త వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవాళ్ల గృహప్రవేశం జరిగేలా చూడు" అని చెప్పుకున్నాను. బాబా తమ పిల్లలు బాధపడుతుంటే చూస్తూ ఉండలేరు కదా! ఆయన నేను ఉహించనంతలా నా భర్త మనసుని మార్చి తను రాకపోయినా మా అమ్మానాన్నకి, అన్నయ్య, వదినలకి కొత్త బట్టలు కొని నన్ను, పిల్లల్ని ఆ శుభకార్యానికి పంపించారు. ఆవిధంగా ఎలాంటి సమస్య లేకుండా గృహప్రవేశ వేడుక చాలా బాగా జరిగేలా చేసారు బాబా. "చాలా ధన్యవాదాలు బాబా. నా భర్తకున్న చెడు అలవాట్లను దూరం చేసి తనని మంచి మార్గంలో నడిపించండి బాబా. మంచిచెడు మధ్య తేడా తెలుసుకుని చెడు మాటల ప్రలోభానికి గురికాకుండా ఆయనని మార్చు తండ్రి. ఆయనని మంచి మనిషిగా మార్చే విషయంలో నేను మీపైనే భారం వేసాను తండ్రి".
ఇకపోతే గృహప్రవేశం జరిగిన వారం, పది రోజుల తర్వాత నా మేనకోడలు సైకిల్ తొక్కుతుండగా ఒక కుక్క వెంటపడింది. తను కంగారులో కుడిచేయి నేలకానించి కింద పడిపోయింది. తన కుడికన్ను, ముక్కు దగ్గర చాలా తీవ్రంగా గాయలయ్యాయి. అన్నయ్య తనని హాస్పిటల్‍కి తీసుకెళ్ళి కనిపించే గాయలకి చికిత్స చేయించి తీసుకొచ్చారు. కానీ రెండు రోజులైనా పాప తన కుడిచేయి పైకి లేపలేకపోయింది. పైగా మణికట్టు దగ్గర వాపు కనిపించేసరికి మాకు భయమేసింది. అన్నయ్య ఎక్స్-రే తీయిస్తే డాక్టరు రిపోర్టు చూసి, "మణికట్టు దగ్గర మెయిన్ జాయింట్ బోన్ పక్కకి తప్పింది. ఆపరేషన్ చేయాలి" అని అన్నారు. మా మేనమామ, వాళ్ళబ్బాయి(బావ) డాక్టర్స్. వాళ్ళ సలహా మీద రాజమండ్రిలో ఆర్థోపెడిక్ హాస్పిటల్‍కి తీసుకెళితే అక్కడి డాక్టర్ కూడా రిపోర్ట్ చూసి, "ఆపరేషన్ తప్పనిసరి. 80,000 వరకు ఖర్చు అవుతుంది" అన్నారు. మళ్ళీ ఆయనే, "చిన్నవయసు కాబట్టి పాప ఆపరేషన్ తట్టుకోగలదో, లేదో, మీరు డాక్టర్ శ్రీనివాస్ గారి బంధువులు కనుక మీకు ఇంకో ఆప్షన్ కూడా చెప్తాను. ఆ ప్రాసెస్‍లో పక్కకి జరిగిన ఎముకను సరిచేసి కట్టుకడతాను. ఒక వారం తర్వాత 95% వరకు సెట్ అయితే ఆపరేషన్ అవసరం ఉండదు" అని చెప్పారు. మా అన్నయ్య కూడా పాప ఆపరేషన్ తట్టుకోగలదో, లేదోనని రెండో ఆప్షన్‍కి ఓకే చెప్పి, కట్టు వేయించి తీసుకొచ్చారు. అప్పుడు నేను, "బాబా! ఇది మీ కృప కాకపోతే ఏంటి? ఆపరేషన్ పడుతుందని తీసుకెళ్తే కట్టుతో సరిపోతుందని కృప చూపించావు. నాకు ఇప్పుడు నమ్మకం వచ్చేసింది, ఒక వారంలో పక్కకి తప్పుకున్న బోన్‍ని ఈ కట్టుతో మీరు సరిచేసేస్తారు. అలా అయితే మీ కృపను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. ఒక వారం తరువాత పాపని హాస్పిటల్‍కి తీసుకెళ్తే, "బోన్ అటాచ్ అవుతుంది. ఇక ఆపరేషన్ అవసరం లేదు. అంతా బాగుంది. ఇంకోసారి కట్టు వేస్తే సరిపోతుంది" అని చెప్పి కట్టు వేసి పంపించారు. "చాలా చాలా కృతఙ్ఞతలు సాయినాథా. నాకు దేవుడంటే మీరే తండ్రి. మీ కృప ఎల్లప్పుడూ మా అందరిపై ఉండేలా చూడు తండ్రి. నాకు ఉద్యోగం ప్రసాదించి సదా మీ నామస్మరణలో ఉండేలా చూడు బాబా. నా పిల్లలకి మంచి బుద్ధిని ప్రసాదించు తండ్రి. అందరినీ చల్లగా చూడు బాబా".
శ్రీసాయినాథుని దయతో లభించిన వాహనం - తప్పిన పెద్ద సమస్య
నా పేరు సురేష్. నేను చాలాకాలంగా నా దగ్గర సరైన వాహనం లేక ఎక్కడికి వెళ్లాలన్నా నడిచే వెళ్తున్నాను, లేదా సైకిల్ యాత్ర చేస్తున్నాను. బైక్ కొందామంటే ఎంత గింజుకున్నా అంత డబ్బు నాకు సర్దుబాటు అయ్యేది కాదు. చివరికి నాకు చిరాకు వచ్చి, "కనీసం సెకెండ్ హ్యాండ్ బండైనా ఇప్పించండి బాబా" అని బాబాకి మొరపెట్టుకున్నాను. ఆ తర్వాత రోజు ఒక వ్యక్తి తన బంధువుల దగ్గర ఎఫ్‍జెడ్ బండి ఉందని, నలబై ఐదు వేలు రూపాయలకి ఇస్తారని చెప్పాడు. నాకెందుకో అది కొనాలనిపించలేదు. కాబట్టి ఆ ఆఫర్ ఎలా వచ్చిందో, అలాగే పోయింది. కానీ బాబా నన్ను గమనిస్తున్నారని నా మనసుకి అనిపించి అన్ని ప్రయత్నాలు మానేసి నా పని నేను చేసుకుంటుండేవాడిని. అలా ఉండగా నాకు అంతగా పరిచయం లేని ఒక వ్యక్తి నా నెంబర్ సంపాదించి, మునపటి కంటే మంచి బండిని నేను పెట్టుకోగలిగేంతలో ఫైనాన్స్ ద్వారా ఆఫర్ చేసాడు. నేను బాబాకు మనసులోనే దణ్ణం పెట్టుకుని ఆ బండినే కొనుకున్నాను. బాబా మనం ఏది అడిగితే అది ఇవ్వరు, మనకు ఏది మంచిదో అదే ఇస్తారు. "ధన్యవాదాలు బాబా. నా అహంకారాన్ని, పాపాలను తొలగించి సదా నా మనసులో కొలువుండండి".
ఈమధ్య ఒకసారి నేను నా పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక ముసలాయన నా దగ్గరకొచ్చి, "బాబూ! మీ వీధిలో ఉండే (ఫలానా) అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు కదా! నాకు తెలిసిన సంబంధమొకటి రేపు తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి ఈ విషయం వాళ్ళకు చెప్పు" అని అన్నారు. నేను వాళ్ళకి సహాయం చేసినట్లు ఉంటుందని, విషయం ఆ అమ్మాయి బంధువులకి చెప్పాను. అదేరోజు సాయంత్రం నేను గుడిలో విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుందామని కూర్చున్నాను. అంతలో ఆ అమ్మాయి బంధువులు నాకు ఫోన్ చేసి, "వాళ్ళు రేపు పెళ్లిచూపులకి వస్తున్నారు. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని ఒప్పించి, పెళ్లిచూపులకి సిద్ధం చేయి" అని అన్నారు. అది విని నాకు ఆశ్చర్యమేసింది. ఏదో సాయం చేద్దామని చెప్తే, నన్ను ఇందులో కలుపుతున్నారేమిటి? అని అనుకున్నాను. ఆ తర్వాత ఆ అమ్మాయి నన్ను పిలిచి, 'తనకి నలభై సంవత్సరాల వయసని, ఆ పెళ్లికొడుకుకి ముప్పై ఏళ్ళు అని, ఈ కారణాలతో సంబంధం చెడిపోతే వీధి మొత్తం తన కుటుంబం గురించి చెత్తగా అనుకుంటారని, దీనంతటికి కారణం నువ్వే' అని బెదిరించింది. అదీకాక, 'ఆ అమ్మాయి తండ్రి ఒక దుర్మార్గుడని, తల్లి మంచిదే అయినా ఆ అమ్మాయికి విపరీతమైన గ్రహదోషాలున్నాయని, ఆర్ధికంగా కూడా బాగా వీక్' అని విన్నాను. ఇక నాకు భయంతో ఆ రాత్రి నిద్రపట్టలేదు. "బాబా! ఈ సంబంధం ఎలాగైనా ఆగిపోయేలా చేసి, నన్ను కాపాడండి. అలా అయితే మీ అనుగ్రహాన్ని వెంటనే బ్లాగు ద్వారా నీ బిడ్డలతో పంచుకుంటాను" అని బాబాను వేడుకోవడం మొదలుపెట్టాను. మరుసటిరోజు ఉదయం ఆ ముసలాయన మళ్ళీ మా ఇంటికి వచ్చి, 'ఆ సంబంధం వాళ్ళ వీధిలో ఎవరో చనిపోయారని, వాళ్ళు ఇక రావటం లేద'ని చెప్పారు. నేను బాబా కటాక్షానికి ఆశ్చర్యపోయి, 'హమ్మయ్య... బాబా నన్ను రక్షించార'ని మనస్సులోనే సాష్టాంగ ప్రణామం చేసుకున్నాను.
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!
షుగర్, గ్యాస్ సమస్యలను తగ్గించిన బాబా
సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!! నా పేరు శ్రీకాంత్. గత ఐదు సంవత్సరాలుగా నా భార్య షుగర్ వ్యాధితో బాధపడుతుంది. అదికాక గత సంవత్సరం నుంచి తను తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతుంది. చాలామంది డాక్టర్లకి చూపించాము కానీ నయం కాలేదు. నేను, నా భార్య ఆ శిరిడీ సాయినాథునిపై నమ్మకముంచి, "ఇబ్బంది పెడుతున్న గ్యాస్ మరియు షుగర్ సమస్యలు తగ్గిపోయేలా చూడండి. మీ కృపను బ్లాగులో పంచుకుంటాము" అని వేడుకుని మరోసారి డాక్టర్ దగ్గరకు వెళ్ళాము. డాక్టరు పరిశీలించి, "షుగర్ చాలావరకు కంట్రోల్లో ఉంది. ఇక మీదట రోజూ ఉదయం, రాత్రి రెండుపూటలా టాబ్లెట్లు వేసుకోనవసరం లేదు. కేవలం ఉదయం పూట మాత్రమే టాబ్లెట్ వేసుకుంటే చాలు" అని చెప్పారు. అంతేకాదు, గ్యాస్ సమస్య కూడా దాదాపు తగ్గిపోయింది. మేము చాలా ఆశ్చర్యానికి గురయ్యాము. ఆ సాయినాథుని కృపాకటాక్షాల వలనే నా భార్యకు షుగర్, గ్యాస్ సమస్యలు తగ్గిపోయాయి. ఆ సాయినాథునికి శతకోటి సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ నా భార్యకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటున్నాను.
ఓం సాయిరాం సాయి బాబా సాయి ఎంత పెద్ద పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళు కూడా బ్లాక్లో పంచుకుంటామనగానే తీరిపోతున్నాయి కానీ నేను కూడా బ్లాక్లో పంచుకుంటాను అనుకున్నా నా కోరిక ఎందుకు తీయట్లేదు సాయి నాలో ఏమైనా పొరపాటు ఉందా నా కోరికలు ఏమైనా తప్పుందా సాంగ్ ఒక ఆడపిల్లగా ఒంటరిగా ఉండలేను నా భర్తతో నన్ను కలపండి కోరుకుంటున్నాను సాయి నా భర్త మనసు మంచిగా మార్చు సాయి తెల్లని అర్థం చేసుకునేలా చూడు సాయి తను మళ్ళీ నా దగ్గరకు వచ్చాను చూడు నన్ను భార్యగా స్వీకరించి తనని మనసు మంచిగా మార్చి సాయి
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me