1. బాబా మీద భారమేసి ముందడుగేస్తే ఒడిదుడుకులు తీసేస్తారు
2. బాబా దయవల్ల తగ్గిన జ్వరం
బాబా మీద భారమేసి ముందడుగేస్తే ఒడిదుడుకులు తీసేస్తారు
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! ముందుగా సాయిభక్తులకు నమస్కారం. నా పేరు కళ్యాణి. నేను సాయిభక్తురాలిని. శ్రీసాయినాథుని పాదపద్మములకు ప్రణామాలర్పించి, బ్లాగును నిర్వహిస్తున్న సాయికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని కోరుకుంటూ నేను నా అనుభవాలను మీ అందరితో పంచుకుంటున్నాను. హఠాత్తుగా మా పిన్నిగారు మరణించడంతో నేను, మా అబ్బాయి ఊరు వెళ్ళవలసి వచ్చింది. ఆకస్మిక ప్రయాణం వల్ల రిజర్వేషన్ లేకుండా టికెట్ కొనుక్కొని జనరల్ బోగీలో ప్రయాణం చేయవలసి వచ్చింది. అప్పుడు సాయినాథుని తలచుకుని, "బాబా! ప్రయాణం ఏ ఇబ్బందీ లేకుండా సాఫీగా సాగేలా చూడండి. మీ కృపను 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల ప్రయాణం చాలా బాగా జరిగింది. తిరుగు ప్రయాణమప్పుడు మా బావగారు జనరల్ బోగీలో జనం ఎక్కువగా ఉన్నందున రిజర్వేషన్ బోగీలో మమ్మల్ని ఎక్కించారు. నేను, మా అబ్బాయి చాలా భయపడ్డాము. అయితే సాయినాథుని చమత్కారం చూడండి. నేను బాబాను కేవలం కూర్చోడానికి సీటు అడిగితే, ఏకంగా బెర్త్ ఇప్పించారు. చాలా ఆనందంగా మా ప్రయాణం పూర్తైంది. "ధన్యవాదాలు బాబా. ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకున్నందుకు నన్ను క్షమించండి".
మావారు ఒక కంపెనీలో లాజిస్టిక్ హెడ్‌గా పనిచేస్తున్నారు. కొంతకాలంగా కంపెనీ సరిగా నడవడం లేదు. ఆ కారణంగా కంపెనీ నుండి మాకు రావాల్సిన డబ్బులు రావడం లేదు. ఇలాంటి స్థితిలో సంక్రాంతి పండుగ దగ్గర పడింది. పిల్లలకు పెట్టడానికి చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. ఆ విషయమై నేను రోజూ బాబాను వేడుకుంటూ వచ్చాను. బాబా దయతో చిత్రంగా పండగ ముందురోజు కొంత ధనం మా చేతికి అందింది. నాకు చాలా బాగా అనిపించి, 'ఇదంతా సాయినాథుని లీల, ఇలానే బాబా చూసుకుంటారు' అని గ్రహించాను.
మా పెద్దబ్బాయికి ఇంటర్లో 98% వచ్చింది. అలా వస్తే నేను తిరుపతి మ్రొక్కులు తీరుస్తానని మ్రొక్కుకున్నాను. కానీ మావారి కంపెనీ పరిస్థితి, మా ఆర్థిక స్థితి కారణంగా మేము తిరుపతి వెళ్ళలేకపోయాము. నేను బాబా యందు విశ్వాసముంచి రోజూ ఆయనను స్మరిస్తూ నా దుఃఖం చెప్పుకుంటుండేదాన్ని. బాబా దయవల్ల ఒకరోజు హఠాత్తుగా మావారికి కొంత ధనం అందింది(కంపెనీ నుండి కాదు. వేరే బిజినెస్ ద్వారా). వెంటనే మేము తిరుపతి ప్రయాణం పెట్టుకున్నాం. బాబా దయవల్ల వెళ్ళడానికి, రావడానికి, వసతి తదితర ఏ విషయంలోనూ చిన్న లోటు కూడా కలగలేదు. స్వామి దర్శనమైతే కేవలం రెండు గంటలలో అయిపోయింది. అది కూడా సర్వదర్శనం టోకెను మీద. నేను అస్సలు నమ్మలేకపోయాను. తిరుపతి నుండి వస్తూనే మావారికి వేరే ఉద్యోగం దొరికింది. అలాగే మా అబ్బాయి ఇటలీ వెళ్లడానికి ప్రోసెస్ మొదలుపెట్టాడు. బాబాపై భారమేసి ముందడుగు వేస్తే అంతా ఆయనే చూసుకుంటారు, ఒడిదుడుకులను తీసేస్తారు. "ధన్యవాదాలు బాబా. ఇలా ఒక్కొక్క సమస్య నుండి మమ్మల్ని బయటపడేస్తారని ఆశిస్తున్నాను. మీ కృప అందరి మీదా ఉండాలి తండ్రీ".
బాబా దయవల్ల తగ్గిన జ్వరం
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నా పేరు రఘు. మాది హైదరాబాద్. నేను గతంలో కొన్ని అనుభవాలను మన బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకుంటున్నందుకు నన్ను క్షమించమని బాబాను వేడుకుంటున్నాను. ఈమధ్య వాతావరణ మార్పు వలన మా అమ్మయికి జలుబు చేసింది. ఆ స్థితిలో కూడా తను తన స్విమింగ్ క్లాసుకి వెళ్లడంతో జలుబు ఎక్కువై నిద్రపోలేకపోయింది. మేము తనకి వేడినీళ్లు ఆవిరి పట్టించడం మొదలు అన్ని ప్రయత్నాలు చేశాము, కానీ జలుబు తగ్గలేదు. అలా రెండు రోజులు గడిచాక మా వూరు నుంచి నా భార్య సిస్టర్, తన పిల్లలు ఒక పెళ్ళికని హైదరాబాద్ వచ్చారు. నేను మా అమ్మాయి ఆరోగ్యం బాగాలేకపోయినా పిల్లలతో ఆడుకుంటుందని వాళ్లతో శనివారం పెళ్ళికి పంపించాను. తను పెళ్ళినుండి వచ్చాక, "నీరసంగా ఉంది. పడుకుంటాన"ని చెప్పి పడుకుంది. రెండు గంటల తరువాత చూస్తే తనకి జ్వరంగా ఉంది. చెక్ చేస్తే 102 డిగ్రీలు టెంపరేచర్ ఉంది. సరేనని పాపకి క్రోసిన్-500 టాబ్లెట్ వేశాను. కానీ జ్వరం తగ్గలేదు. అప్పుడు డాక్టరుకి ఫోన్ చేస్తే, వేరే మెడిసిన్ వాడమని సూచించి, తడిగుడ్డతో పాపకి ఒళ్ళు తుడవమన్నారు. కారణం, 102 డిగ్రీల కంటే జ్వరం ఎక్కువైతే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే తడిగుడ్డతో పాప ఒంటిని ఎంత తుడిచినా జ్వరం 102 డిగ్రీల నుండి తగ్గలేదు. ఇక అప్పుడు నేను, "బాబా! నాకు సహాయం చేయండి" అని బాబాను ప్రార్థించి కొద్దిగా ఊదీని పాపకి పెట్టి, మరికొంత ఊదీని నీళ్లలో కలిపి ఇచ్చాను. "జ్వరం తగ్గితే, నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాన"ని బాబాకి మాటిచ్చి, తడిగుడ్డతో పాప ఒళ్ళు తుడుస్తూ ఉండసాగాను. బాబా దయవల్ల రాత్రి 2 గంటల తరువాత పాపకి జరం తగ్గింది. "వందనాలు బాబా".
ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్ చేయించుకునే నేను కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలు చేయించుకోలేదు. ఈమధ్య అప్పుడప్పుడు పక్కటెముకలలో నొప్పి వస్తుంటే బాబాని ప్రార్థించి పొత్తికడుపు(అబ్డోమెన్) స్కాన్ చేయించుకున్నాను. బాబా దయవలన అన్నీ బాగానే ఉన్నాయి. కానీ, "ఫాటీ లివర్ మొదటి దశలో ఉంద"ని డాక్టర్ చెప్పారు. "బాబా! మీకు వందనాలు. మీరే నాకు తల్లి, తండ్రి మరియు గురువు. మీ ఆశీస్సులు మా మీద ఎప్పుడూ ఉండాలి. దయచేసి నా లివర్ సమస్యను నయం చేయండి. అలాగే నా భార్య మెడ మరియు నడుములో ఉన్న డిస్క్ బల్జ్‌ను తగ్గించండి. మా ఇద్దరి ఆర్యోగ్య మరియు ఉద్యోగ విషయాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా దీవించండి. ఇంకా నాకున్న సొంతింటి కోరికను కూడా తీరుస్తారని ఆశిస్తున్నాను బాబా".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!
బాబా సాయి మీ ఆశీర్వాదంతో నా పెళ్లి చితికింది బాబా సాయి ప్లీజ్ నన్ను నా భర్తని కలుపు బాబా సాయి తనని అర్థం చేసుకునేలా చూడు బాంబ సాయి భార్యక స్వీకరించిన పాపురానికి తీసుకెళ్లిన చూడు తండ్రి లా పెళ్లి జరిపించావు కాపురానికి కూడా పంపులు నీ మీద నమ్మకం పెట్టుకొని ఎదురు చూస్తున్నాను బాబాయ్ ఏంటి సా
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me