సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1437వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. దయతో పుత్ర సంతానాన్ని అనుగ్రహించిన బాబా
2. బాబా దయుంటే అన్నీ జరుగుతాయి

దయతో పుత్ర సంతానాన్ని అనుగ్రహించిన బాబా


సాయి భక్తులందరికీ నమస్కారాలు. నేను ఒక సాధారణ సాయి భక్తుడిని. నాపేరు వెంకటేశ్వరరావు. నా అనుభవాలను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. బాబా దయవల్ల మాకు మొదట ఒక పాప పుట్టింది. తరువాత నేను బాబు కావాలని బాబాని ప్రార్థిస్తుండేవాడిని. కానీ పాపకి 8 ఏళ్ళు వచ్చినా మళ్లీ నా భార్య గర్భం దాల్చలేదు. మేము ఇంకా మాకు పిల్లలు పుట్టరని ఆశ వదిలేసుకున్నాం. అటువంటి సమయంలో మేము ఊహించని విధంగా నా భార్య గర్భం దాల్చింది. మేము సంతోషంగా బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాం. అయితే నా భార్య మానసిక సమస్యలతో చాలా బాధపడుతుండేది. అయినా నేను బాబా మాకు పుత్ర సంతానాన్నిచ్చి మమ్మల్ని సంతోషపెడతారని పూర్తి నమ్మకంతో ప్రతిరోజు, "నా భార్యకి ఆరోగ్యం ప్రసాదించండి" అని బాబాను ప్రార్థిస్తుండేవాడిని. ఇలా ఉండగా 6వ నెల నుంచి నా భార్య భయంతో చాలా ఇబ్బందులు పడుతుండేది. ఆ స్థితిలో నేను తనకి దగ్గరగా ఉండి సహాయం అందించాల్సిన అవసరం చాలా ఉంది. కానీ నేను ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్నందున, నా పని వేళలు అవసరమైన సమయంలో నా భార్యకి అండగా ఉండలేని విధంగా ఉండేవి. అట్టి స్థితిలో నా భార్య, నా తల్లిదండ్రులు నన్ను వేరే డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేయాలని బాబాను ప్రార్థించారు. తరువాత ఒక గురువారంనాడు నా ప్రమేయమేమీ లేకనే మా కాలేజీ మేనేజ్మెంట్ నన్ను ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు పనివేళలు గల మరో డిపార్ట్మెంట్కి బదిలీ చేసారు. దాంతో బాబా దయవల్ల నా కుటుంబం సంతోషంగా ఉండసాగింది.


నా భార్య హాస్పిటల్‍కి వెళ్ళడానికి చాలా భయపడుతుండేది. ఆ విషయంగా ఒకరోజు నేను సాయిని ప్రార్థించాను. తరువాత నేను నా ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే, "నువ్వు చింతించక నీతోపాటు కొద్దిగా ఊదీ తీసుకెళ్ళు" అని బాబా సందేశం వచ్చింది. అప్పుడు నేను ఊదీ నా జేబులో పెట్టుకుని, నా భార్యని హాస్పిటల్‍కి తీసుకెళదామని అనుకున్నాను. ఆశ్చర్యం! అప్పటివరకు ఎంతో భయపడుతున్న నా భార్య భయపడకుండా నాతో హాస్పిటల్కి వచ్చింది. తరువాత 2022, డిసెంబర్ 13న నా భార్యకి డెలివరీ అయింది. బాబా దయతో మాకు పండంటి బాబుని ప్రసాదించి మా కోరిక తీర్చారు. హాస్పిటల్ బిల్ 65,000 రూపాయలు అయింది. అయితే నా వద్ద 5,000 రూపాయలు తక్కువగా ఉన్నాయి. అందువలన నేను, "బాబా! బిల్లు అమౌంట్ తగ్గిస్తే మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల డాక్టరు 5,000 రూపాయలు తగ్గించారు. నిజానికి ఆ డాక్టరు బిల్లు అమౌంట్ అస్సలు తగ్గించరట. "థాంక్యూ సాయి".


ఒక పూజారి మా బాబు పుట్టిన సమయం మంచిది కాదని, శాంతి చేయించమన్నారు. అందుకు 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నారు. అప్పుడు నేను బాబాను ప్రార్థించి మా ఊరి పూజారిని సంప్రదించాను. బాబా దయవల్ల ఆ పూజారి 10,000 రూపాయలు అవుతుందన్నారు. 2022, డిసెంబర్ 29న శాంతి పూజ పెట్టుకున్నాము. నేను అదేరోజు నా భార్య, బిడ్డని హాస్పిటల్‍కి తీసుకెళ్లి జనరల్ చెకప్ చేయిద్దామనుకున్నాను. ఎందుకంటే, వాళ్ళు దూరం నుండి వస్తున్నారు. ఒకేసారి రెండు పనులు అయిపోతాయని అలా ప్లాన్ చేసాను. అయితే ముందురోజు నా భార్యాబిడ్డల హాస్పిటల్ ఫైళ్లు కనిపించలేదు. వాటిని ఎక్కడ పెట్టానో మరిచిపోయాను. ఎంత వెతికినా దొరకలేదు. అప్పుడు 'డిశ్చార్జ్ అయ్యే సమయంలో వాటిని హాస్పిటల్లోనే మరచిపోయానేమోన'ని భయమేసి, "బాబా! మీ దయవల్ల ఆ ఫైళ్లు దొరికితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను,  తరువాత మరోసారి ఇంట్లో అంతా వెతికితే నా సిస్టర్ ఫైళ్ల మధ్యలో ఆ ఫైళ్లు కనిపించాయి. "ధన్యవాదాలు సాయి"..


ఒక రోజు సాయంత్రం నాకు బాగా ఒళ్లునొప్పులు, జ్వరం, తలనొప్పి ఉంటే, "బాబా! రేపు ఉదయానికి నాకు నయమైతే మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించి డాక్టరు దగ్గరకి వెళ్లకుండా డోలో టాబ్లెట్ వేసుకున్నాను. బాబా దయవల్ల ఉదయానికి కాస్త మంచిగా వుంది. హ్యాపీగా డ్యూటీకి వెళ్ళాను. "థాంక్యూ సాయి".


2023, జనవరి 2 నుండి మా పాపకి పరీక్షలు మొదలయ్యాయి. ఆరోజు పాప మరుసటిరోజు జరగనున్న జికె పరీక్షకోసం చదువుదామని తన బ్యాగు తీస్తే, అందులో జికె పుస్తకం కనిపించలేదు, "నేను ఈ బ్యాగులోనే పెట్టాను ఇప్పుడు అది కనపడటం లేదు. ఏమైందో నాకు తెలీదు" అనింది పాప. సరేనని నేను తన స్కూలు సార్‍కి ఫోన్ చేసి, "సార్, మా పాప బుక్ మిస్ అయింది. స్కూల్లో ఎవరైనా ఉన్నారా?" అని అడిగాను, ఆ సార్, "నేను స్కూల్లోనే ఉన్నాను. రండి" అన్నారు. వెంటనే నేను, మా పాప స్కూలుకి బయలుదేరాము. కానీ, 'ఒకవేళ స్కూల్లో ఆ పుస్తకం లేకపోతే, పాప పరీక్షకు ఎలా సిద్ధమవుతుంది' అని టెన్షన్ పడి, "బాబా! పాప పుస్తకం స్కూల్లో ఉండేటట్టు చూడు స్వామి. పుస్తకం దొరికితే మీ బ్లాగులో ఈ అనుభవం పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల స్కూలు క్లాసు రూములో పాప పుస్తకం దొరికింది. "ధన్యవాదాలు సాయి". ఈ రకంగా సాయి నాకు ఎంతో సహాయం చేస్తున్నారు.


బాబా దయుంటే అన్నీ జరుగుతాయి


నేను ఒక సాయి భక్తురాలిని. నాపేరు శ్రీలత. మాది ఖమ్మం. ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా నమస్కారాలు. మొదట నాకు ఈ బ్లాగు గురించి తెలియదు. ఈ మధ్యకాలంలో అంటే 2022, డిసెంబరు నెల చివరిలో నాకు తెలిసిన ఒక సోదరి(తను కూడా సాయి భక్తురాలు) ద్వారా ఈ బ్లాగు గురించి తెలిసి ఈ బ్లాగుకి సంబంధించిన వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యాను. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను. నేను మొదటినుండి బాబాను పూజిస్తూ ఉండేదాన్ని. కానీ ఎందుకో తెలియదు నా పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాలు బాబాని తలుచుకోలేదు. ఆ సమయంలో నేను చాలా ఇబ్బందులు పడినప్పటికీ సాయి నా వెంటే ఉండి నన్ను ముందుకు నడిపించారు. రెండు సంవత్సరాల క్రితం నా భర్తకి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. అప్పటినుండి ఆయన ఆరోగ్యం బాగుండటం లేదు. షుగర్ అస్సలు కంట్రోల్లో ఉండటం లేదు. దానివలన కన్ను ప్రాబ్లం వచ్చింది. దానికి మెడిసిన్ వాడుతూ ఉండగా చేయినొప్పి వచ్చింది. నేను, "నా భర్త బాధను తీర్చు తండ్రి" అని సాయిని వేడుకున్నాను. అదే సమయంలో ఒక సాయి సోదరి ద్వారా నాకు శిరిడీ నుండి కంకణం(తాడు) లభించింది. నేను దానిని నా భర్త చేతికి కట్టాను. ఒకరోజు తర్వాత మావారు చేయినొప్పి కొంచెం తగ్గిందని చెప్పారు. ఇప్పుడు పూర్తిగా తగ్గింది. ఇది బాబా దయవల్లనే జరిగింది. ఆ సాయి సోదరి ద్వారా శిరిడీ నుండి ఒక బాబా విగ్రహం తెప్పించుకుని మా ఇంటి పూజగదిలో 2023, జనవరి 2, ముక్కోటి ఏకాదశిరోజున పెట్టుకున్నాను. మరుసటిరోజు 2023, జనవరి 3వ తేదీన నా చెవి రింగు ఎక్కడో పడిపోయింది. చాలాసేపు వెతికాను కానీ దొరకలేదు. అప్పుడు నేను బాబా విగ్రహాన్ని చూస్తూ, "బాబా! నా చెవిరింగు దొరకాలి తండ్రి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. అలా అనుకుని బయటికి రాగానే నా చెవిరింగు కనిపించింది. నిజంగా ఇది ఆ తండ్రి లీల. అందుకే నా అనుభవాన్ని ఇలా మీతో పంచుకున్నాను.


బాబా లీలల గురించి చెప్పుకుంటూ పోతే అవి కోకొల్లలు. ఒకరోజు నేను, మావారు హైదరాబాద్ వెళ్లేందుకు రైల్వేస్టేషనుకి వెళ్లాము. నా భర్త "సీట్లు దొరకవు, బస్సుకి వెళ్దాం" అని విసుక్కుంటుంటే నేను బాబాని తలుచుకుని, "బాబా! ట్రైన్‍లో సీటు దొరకాలి" అని అనుకున్నాను. ట్రైన్ ఎక్కగానే సీటు దొరికి క్షేమంగా వెళ్లి, మళ్లీ అదే ట్రైనులో తిరిగి వచ్చాము. ఇదంతా బాబా దయవల్లే జరిగింది. "ధన్యవాదాలు బాబా. నాకు రావాల్సిన డబ్బులు రావడం లేదు. నా డబ్బులు నాకు ఇప్పించండి. ఎప్పటికైనా మీరే ఇప్పిస్తారని ఎదురు చూస్తున్నాను తండ్రి. నా భర్త ఆరోగ్యం కుదుటపడి తను మంచిగా ఉండాలి. అలాగే మా అమ్మాయి జీవితంలో మంచిగా సెటిల్ అవ్వాలి. మీ దయతోనే అవన్నీ జరుగుతాయి. మరల మీ అనుగ్రహాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను బాబా".


ఓం శ్రీసాయినాథాయ నమః!!!


3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. బాబా సాయి నిన్ని నమ్ముకొని నీ మీద భారం వేసి బ్రతుకుతున్నాను బాబా సాయి నా భర్త నన్ను అర్థం చేసుకుని ఇలా చూడు సాయి ఇప్పటివరకు తనలో ఏ మార్పు నాకు కనిపించలేదు సాయి మార్చాలి తన మళ్ళీ నన్ను అర్థం చేసుకొని వారి యొక్క స్వీకరించాలి కాపురానికి తీసుకెళ్లాలి సాయి నేను కూడా బ్లాక్లో పంచుకుంటాను సాయి అనుభవాన్ని షిరిడికొచ్చిమి దర్శనం చేసుకుంటాం సాయి ఇద్దరం మీ ఆశీర్వాదం తీసుకుంటాం సాయి కాపాడు సాయి

    ReplyDelete
  3. Om Sai Ram
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo