సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1438వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. పిలిస్తే పలికే దేవుడు శ్రీసాయినాథుడు ఉండగా మనకి భయమేల?
2. ఎలాంటి ఇబ్బందినైనా దూరం చేస్తున్న బాబా
3. చివరి క్షణంలో బాబా చేసిన అధ్భుతం

పిలిస్తే పలికే దేవుడు శ్రీసాయినాథుడు ఉండగా మనకి భయమేల?


అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా తల్లి, తండ్రి, సద్గురువు, దైవం అయిన శ్రీసాయినాథునికి సాష్టాంగ ప్రణామాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సాయి కుటుంబసభ్యులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తుడిని. నా పేరు బదరీనాథ్. నాది తూర్పుగోదావరి జిల్లా. నేను ఇంతకుముందు సాయి పరమాత్మ ప్రసాదించిన కొన్ని అనుభవాలను మన బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను. నా భార్య, కుమారుడు చనిపోయారు. ఉన్న ఒక్క కుమార్తె అత్తవారింటిలో ఉంటుంది. అందువలన నేను ఒక్కడినే మా ఇంట్లో ఉంటాను. అలాంటి నాకు ఈమధ్య సీజన్‍లో మార్పు వల్ల జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు, జ్వరం వచ్చి మంచం మీద నుంచి లేవటానికి కూడా ఓపిక లేకుండా పోయింది. ఎన్ని మందులు వాడినా, ముగ్గురు వైద్యులను మార్చినా డబ్బులు ఖర్చవడం తప్ప దగ్గు తగ్గలేదు. దగ్గలేక కడుపంతా విపరీతంగా నొప్పి వచ్చేది. బహుశా ప్రారబ్దం అనుభవించాల్సి ఉన్నట్లుంది. అందుకే ఇంట్లో ధవళేశ్వరంలోని సాయి దేవాలయం నుండి తెచ్చుకున్న ఊదీ ఉన్నా, సచ్చరిత్రలోని ఊదీ మహిమను వర్ణించే 33, 34, 35 అధ్యాయాలు ఎన్నోసార్లు చదివి ఉన్నా, మన ఈ బ్లాగులో ఊదీ గురించి చదువుతున్నా ఊదీ వాడాలన్న తలంపు సుమారు 40 రోజుల వరకు నాకు రాలేదు. చివరికి ఒకరోజు నిత్యపూజ చేస్తుండగా ఊదీ వాడాలన్న ప్రేరణ కలిగి శ్రీసాయి దేవునితో, "దగ్గు తగ్గి పూర్తి ఆరోగ్యం చిక్కితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను సాయిదేవా" అని వేడుకుని రోజుకి మూడుసార్లు గోరువెచ్చటి నీటిలో చిటికెడు ఊదీ కలుపుకుని త్రాగి, మరికొంత ఊదీ గొంతుకు రాసుకోసాగాను. అలా మూడంటే మూడే రోజులు చేశాను. అంతే! ఊదీ మహిమ వల్ల దగ్గు తగ్గింది. అప్పటివరకు అంతటి బాధను అనుభవించింది నేనేనా అనిపించింది. అంతలా నమ్మశక్యం కానంతగా తగ్గిపోయింది. మా ఆఫీసులో సాటి ఉద్యోగస్తులకు చెబితే ఆశ్చర్యపోయారు. అంతా శ్రీసాయిదేవుని లీల. "ధన్యవాదాలు బాబా. నా తప్పులు ఏవైనా ఉంటే క్షమించు సాయిదేవా".


నేను ఒక ప్రైవేటు గ్యాస్ ఏజెన్సీలో క్యాషియర్‍గా పనిచేస్తున్నాను. మా ఏజెన్సీలో సుమారు ఒక 20 మంది డెలివరీ బాయ్స్ పని చేస్తున్నారు. వాళ్లలో ఒక్కొక్కరు ఉదయం నుండి సాయంత్రం వరకు 70 నుండి 90 గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసి వాటి తాలూకా డబ్బులు లక్ష రూపాయల వరకు జమ చేస్తారు. ప్రతిరోజూ సుమారు 10 లక్షల వరకు సొమ్ము వస్తుంటుంది. ఇటీవల ఒకరోజు ఒక డెలివరీ బాయ్ వద్ద నుండి డబ్బు తీసుకునే క్రమంలో నేను పొరపాటున 50 రూపాయల నోట్లను వంద రూపాయలుగా లెక్కించి డినామినేషన్ వేసి తీసుకున్నాను. ఆ రాత్రి మా మేనేజర్ గారికి అకౌంట్ అప్పజెప్పేటప్పుడు డబ్బు తక్కువ వచ్చింది. నా సొంత డబ్బులు ఇచ్చి లెక్క సరిపెట్టేసాను. కానీ తర్వాత సాయిదేవునికి మనస్పూర్తిగా నమస్కరించి, "ఎలా అయినా తక్కువ వచ్చిన డబ్బులు తిరిగి వచ్చేలా చేయమ"ని ప్రార్థించాను. పిలిస్తే పలికే దేవుడు  మన సాయినాథుడు ఉండగా మనకి భయమేల? మరునాడు ఆ డెలివరీ బాయ్ తనకు తానుగా వచ్చి, "నిన్ను మీరు తక్కువ డబ్బులు తీసుకున్నారు" అని చెప్పి ఆ డబ్బులు ఇచ్చేసాడు. ఇది ఖచ్చితంగా సాయి మహిమే.


2023, జనవరి 18వ తేదీ రాత్రి 7:30, 8 గంటల ప్రాంతంలో నేను క్యాష్ అంతా వందేసి నోట్ల చొప్పున కట్టలు కట్టి మా మేనేజర్ గారికి అకౌంట్ అప్పగించే సమయంలో 50,000 రూపాయలు తక్కువ వచ్చాయి. అంటే 500 రూపాయల కట్ట ఒకటి మిస్ అయింది. 50,000 అంటే చిన్న మొత్తం కాదు కదా! మొత్తం క్యాష్ చేతితో, కౌంటింగ్ మెషిన్‍లో వేసి మళ్ళీ కౌంట్ చేశాను కానీ ప్రయోజనం లేకపోయింది. నేను, నా కొలీగ్ నా క్యాబిన్, క్యాష్ బాక్స్ కౌంటర్ కింద మొత్తం అంతటా వెతికాము. కానీ ఎంత వెతికినా ఆ డబ్బులు దొరకలేదు. అలా రాత్రి 11:00 గంటల వరకు ఆఫీసులోనే ఉండిపోయాం గాని ప్రయోజనమేమీ లేదు. ఇంక అప్పుడు ఓనర్ గారికి ఇచ్చే స్టేట్మెంట్ మీద 50,000 తక్కువ ఉందని వ్రాసి, ఆ డబ్బు నేను ఇస్తానని సంతకం చేసి అప్పటికి అప్పగించాను. ఇంటికి వచ్చి, "ఆ సొమ్ము ఏమైంది? ఎవరికైనా పేమెంట్ ఇచ్చి వ్రాయడం మర్చిపోయానా లేక తక్కువ పుచ్చుకున్నానా తెలియజేయండి బాబా. తెలియజేస్తే మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా మన సాయి కుటుంబసభ్యులందరితో పంచుకుంటాను" అని మనస్ఫూర్తిగా సాయిదేవుని ప్రార్థించాను. ఒకవైపు సాయినాథుడు ఎలా అయినా కాపాడుతారన్న ధైర్యం, ఇంకొక వైపు ఇన్ని కోట్ల మంది భక్తులలో ఆయన నా మొర వింటారా అన్న అధైర్యంతో ఆ రాత్రి నాకు సరిగా నిద్రపట్టలేదు. మరుసటిరోజు ఉదయం అమనస్కంగానే ఆఫీసుకి వెళితే, 'ఏమైనా గుర్తుకు వచ్చిందా?' అని మా మేనేజర్ పలకరించారు. ఈలోగా స్వీపర్ వచ్చి ఆఫీసు ఊడ్చడం మొదలుపెట్టింది. నేను ఆవిడకు విషయం చెప్పి, "కౌంటర్ల కింద సరిగ్గా ఊడ్చు. ఆఫీసులో సీసీ కెమెరాలున్నాయి కాబట్టి ఎవరూ తీసే సాహసం చేయరు" అని అన్నాను. అప్పుడు చిత్రం జరిగింది. నా క్యాబిన్కి అవతల ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ సీటుకి పక్కన ఉండే టేబుల్ కింద ఆ కట్ట దొరికింది. ఆ క్షణం నాకే కాదు, మా స్టాఫ్ ఆనందానికి హద్దులేదు. ఆ శుభ సమయంలో సాయి పేరుతో టీ పార్టీ చేసుకున్నాము. సుమారు 150 గ్రాముల బరువుండే కట్ట అంత దూరం ఫ్యాన్ గాలికి ఎలా వెళుతుంది? బాబా లీల కాకపోతే మరేంటి? శ్రీసాయిదేవునికి కృతజ్ఞతపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. "దేవా! మీకు మాటిచ్చిన ప్రకారం బ్లాగు ద్వారా సాయి కుటుంబంతో నా అనుభవాన్ని పంచుకున్నాను.  తప్పులుంటే క్షమించండి సాయి సమర్థ"


సర్వం శ్రీసాయిదేవార్పణమస్తు!!!


ఎలాంటి ఇబ్బందినైనా దూరం చేస్తున్న బాబా


సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న అన్నయ్యకి నా కృతజ్ఞతలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాపేరు స్రవంతి. ఈమధ్య మా అమ్మగారికి పళ్ళ ఆపరేషన్ జరిగింది. తరువాత ఒకరోజు నేను అమ్మని డాక్టరుకి చూపించడానికని హాస్పిటల్‍కి తీసుకెళ్ళాను. అక్కడ పని పూర్తయ్యాక మేము ఒక గ్రైండర్ తీసుకుని బస్సులో ఇంటికి బయలుదేరాము. దిగవలసిన స్టాప్ వచ్చాక గ్రైండర్ బస్సులోనే మర్చిపోయి మేము దిగేశాం. తీరా ఇంటికి వచ్చాక చూసుకుంటే గ్రైండర్ కనిపించలేదు. నేను బాబా ముందు కూర్చుని 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అని తొమ్మిదిసార్లు జపించి, "దయచేసి మా గ్రైండర్ మాకు ఇప్పించండి బాబా" అని వేడుకున్నాను. అంతలో మేము ఏ బస్సులో గ్రైండర్ మార్చిపోయామో అదే బస్సు మా ఊరు మీదుగా వెళ్తూ కనిపించింది. మా అమ్మ బస్సు అపి కండక్టరుని అగిగితే, మా గ్రైండర్ మాకు ఇచ్చారు. "ధన్యవాదాలు బాబా".


ఒకసారి మా అమ్మ తన బంగారపు ముక్కుపుడక ఎక్కడో పెట్టి మర్చిపోయింది. తను ఎంత వెతికినా దొరకలేదు. అప్పుడు నేను కూడా చాలాసేపు వెతికాను. కానీ అది దొరకలేదు. చివరికి నేను సాయికి దణ్ణం పెట్టుకుని, 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అని జపిస్తూ మళ్లీ వెతికాను. అంతే, బాబా దయవల్ల హ్యాండ్ బ్యాగులో ముక్కుపుడక దొరికింది. "థాంక్యూ సో మచ్ బాబా".


చివరి క్షణంలో బాబా చేసిన అధ్భుతం


సాయి భక్తులకు నమస్కారములు. నేను ఒక సాయి భక్తురాలిని. మా బాబు నీట్ ఎగ్జామ్‍కి ప్రిపేర్ అయ్యాడు. పరీక్ష జరగబోయే సమయంలో ఎడతెరిపిలేకుండా ఒకటే వానలు కురవడంతో పరీక్ష జరుగుతుందో, లేదో అని టెన్షన్ పడ్డాము. అప్పుడు నేను, "బాబా! మీరే పరిస్థితిని చక్కబరచాలి తండ్రి" అని బాబాను వేడుకున్నాను. ఆయన దయవల్ల సరైన సమయంలో పరీక్ష జరిగింది. నేను ఆరోజు మధ్యాహ్నం బాబా గుడికి వెళ్లి, "బాబా! నా కొడుకు పరీక్ష బాగా వ్రాసేలా చూడండి. అలాగే తనకి తప్పకుండా సీటు రావాలి బాబా" అని ప్రార్థించాను. బాబు టెన్షన్‍లో హాల్ టికెట్ నెంబరు తప్పుగా ఫిల్ చేసాడుకానీ బాబా దయతో ఇన్విజిలేటర్ దాన్ని సరిచేసారు. ఫలితాలు వెలువడ్డాక బాబుకి వచ్చిన మార్కులకి సీటు వస్తుందో, రాదో అన్న సందిగ్ధంలో పడ్డాము. అసలు తనకొచ్చిన మార్కులకి సీటు వచ్చే అవకాశం లేదని అందరూ ఆశలు వదిలేసుకున్నారు. నేను, "మీ దయ బాబా! బాబుకి సీటు వస్తే మాత్రం మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను"' అని బాబాకి మ్రొక్కుకుని భారం ఆయన మీద వేసాను. బాబా నా మొర ఆలకించి చివరి క్షణంలో కాలేజీలో సీట్లు పెంచేలా అధ్భుతం చేసారు. అలా సీటు రాదు అనుకున్న మా అబ్బాయికి గవర్నమెంట్ కాలేజీలో సీటు వచ్చేలా చేసి మా నమ్మకాన్ని మరింత పెంచారు బాబా. సాయిబాబా ఈజ్ గ్రేట్. ఆయన అంతటా ఉన్నారు. "థాంక్యూ బాబా. మీరు భక్తుల కోరికలు తీర్చే భగవద్ స్వరూపులు. మీరు మా పాలిట దైవం".


5 comments:

  1. Baba naku job vachela chudu thandri nakunna oke okka hope job baba na pillalani na job dwarane chadhivinchali deva please baba naku job ippinchu sai

    ReplyDelete
  2. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam she is suffering with disk bulges and bless her to get better Jaisairam guide me to get good phisio doctor

    ReplyDelete
  3. మీ బ్లాగ్ లో సాయి లీలలు గురించి చాలా బాగ రాస్తూ వున్నారు.ఓం సాయి రామ్ నేను నెగెటివ్ ఆలోచనలతో బాధ పడుతున్నాను.పాజిట్విగ మారేలాగ దీవించు తండ్రి.ఈ నరకం పడలేను.ఈ బాధ తగ్గిపోతుందని భరోసా ఇవ్వ వలెను ం

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo