సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1446వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సొంతింటి కోరికను నెరవేర్చిన బాబా
2. నమ్మినవారి వెంట బాబా ఉంటారు
3. అడిగినంతనే అనుగ్రహించిన బాబా

సొంతింటి కోరికను నెరవేర్చిన బాబా


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయిభక్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పేరు రమ్య. మాది చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం. నేను సాయిభక్తురాలిని. నేను ఇప్పటివరకు ఈ బ్లాగులో ఇతరుల అనుభవాలు ఎన్నో చదివాను. ఈరోజు నా అనుభవాన్ని సాటి సాయిబంధువులతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారి పేరు కె.రంగయ్య. ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంటులో పనిచేస్తున్నారు. మా అమ్మ లక్ష్మమ్మ. ఆమె గృహిణి. మేము 20 సంవత్సరాలుగా ఒక అద్దెఇంటిలో నివసిస్తున్నాము. ఆ ఇల్లు చాలా చిన్నదిగానూ, ఇరుకుగానూ ఉండటం వల్ల చదువుకోవడానికి, నిద్రపోవడానికి, వంట చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. అన్నయ్య పెళ్లి తరువాత కుటుంబం పెద్దదవడంతో ఇంకా ఇబ్బందైంది. అది చాలదన్నట్లు ఇరుగుపొరుగు వల్ల కూడా ఇబ్బందులు వస్తుండేవి. మేము చాలా బాధలు పడ్డాము. ఎన్నోసార్లు ఇల్లు మారాలని ప్రయత్నించినప్పటికీ ఏ ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో సొంతిల్లు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. కానీ అది కూడా ముందుకు పోలేదు. అలా ఉండగా నేను 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులోని భక్తుల అనుభవాలు ప్రతిరోజూ చదువుతుండేదాన్ని. నెమ్మదిగా సాయి సద్గురునిపై నా నమ్మకం, విశ్వాసం బలపడింది. నా మనసులో, "ఓ సాయి సద్గురూ! ఈ ఊరిలో మా బడ్జెట్‌లో మేము ఒక ఇల్లు కొనుక్కునేలా అనుగ్రహించండి. ఈ కోరిక నెరవేరితే నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయ చూపారు. మాకు ఒక మంచి ఇల్లు దొరికింది. బాబా దయతో త్వరలో మేము ఆ ఇంటి గృహప్రవేశం చేయబోతున్నాము. మా కల నెరవేర్చిన బాబాకి చాలా చాలా కృతజ్ఞతలు. బాబా దయ ఆయన్ను నమ్ముకున్న అందరిపైనా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.


మా అన్నయ్య పేరు లక్ష్మీనారాయణ. తను గవర్నమెంట్ టీచర్. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి తనకి ఒంట్లో నలతగా ఉంటుండేది. అందుబాటులో ఉన్న చిన్న డాక్టర్ల దగ్గరకి వెళితే జ్వరం తగ్గడం, మళ్ళీ రావడం జరుగుతుండేది, కానీ పూర్తిగా తగ్గేది కాదు. ఆ కారణంగా అన్నయ్య క్రమంగా బలహీనపడిపోయాడు. దాంతో ఇంట్లో మేమంతా ఎంతో బాధపడి పెద్ద డాక్టరు దగ్గరకి తీసుకెళ్లి టెస్టులు చేయిస్తే, టైఫాయిడ్ తొలిదశలో ఉందని తెలిసింది. మేము చాలా కంగారుపడ్డాం. నేను, "సాయీ! అన్నయ్యకి తొందరగా జ్వరం తగ్గిపోయి తను తిరిగి స్కూలుకి వెళ్తూ హాయిగా ఉండాలి" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల వారంరోజులలో అన్నయ్యకి జ్వరం తగ్గిపోయింది. ఇప్పుడు మా అన్నయ్య నార్మల్‌గా ఉన్నాడు. "ధన్యవాదాలు బాబా. అన్నయ్య, వదిన, పిల్లల్ని సదా రక్షించు సాయీ.  నా తప్పేదైనా ఉంటే నన్ను క్షమించి మంచి మార్గంలో నడిపించండి. అందర్నీ కాపాడు సాయీ".


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నమ్మినవారి వెంట బాబా ఉంటారు

'సాయి మహరాజ్ సన్నిధి'కి చాలా ధన్యవాదాలు. నేను సాయిభక్తురాలిని. నా పేరు భాను. నేను ప్రతి క్షణమూ 'బాబా, బాబా' అని బాబాను తలచుకుంటూ ఉంటాను. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, "బాబా! నీవే నాకు దిక్కు" అని అనుకుంటాను. బాబా ఏదో విధంగా ఆ సమస్యను పరిష్కరిస్తారు. ఆయన నన్ను ఎన్నడూ టెన్షన్ పడేలా చేయలేదు. ఆయన నా జీవితంలో చాలా చేశారు, చేస్తున్నారు. బాబా దయ అలాంటిది. బాబా ఇటీవల నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నేను గ్రూప్-1 పరీక్షలు వ్రాశాను. "అందులో నేను క్వాలిఫై అయితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. తరువాత రిజల్ట్స్ రావడానికి ముందు ఒకసారి నేను, "బాబా! ఒకవేళ నేను పరీక్షలో క్వాలిఫై అవుతానంటే నువ్వు ఏదో ఒక రూపంలో కనిపించు" అని అడిగాను. తరువాత మా ఇంట్లో అద్దెకు ఉంటున్నవాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్తూ ఒక పెద్ద బాబా ఫోటోని వదిలేసి వెళ్ళారు. అలా బాబా నాకు ఒక శుభ సంకేతం ఇవ్వడమే కాకుండా నా కోసమే ఉండిపోయారని నాకు అనిపించింది. అలాగే బాబా దయవల్ల నేను గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయి మెయిన్స్‌కి అర్హత పొందాను. బాబా నమ్మినవారి వెంట ఉంటారు. "ధన్యవాదాలు బాబా. నా కుటుంబానికి మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి తండ్రీ".

అడిగినంతనే అనుగ్రహించిన బాబా

ముందుగా సాయిబంధువులందరికీ నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకుంటాను. మా ఇంటిలో పనిచేసేది మావారు ఒక్కరే. ఒకరోజు ఆయన పనిమీద బయటకు వెళ్లి పని ఎక్కువగా ఉండటం వలన చాలాసేపటివరకు రాలేదు. ఒక్క నిమిషం మావారు కనబడకపోతేనే ఉండలేని నేను ఎంత రాత్రి అయినా ఆయన ఇంటికి రాకపోయేసరికి భయమేసి, "బాబా! మావారు త్వరగా ఇంటికి రావాలి. ఆయన వస్తే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. అంతలోనే మావారు వచ్చారు. "ధన్యవాదాలు బాబా. మావారు పనిలో లీనమై అన్నం కూడా తినడం లేదు. ఆయనకు ప్రశాంతతను ఇవ్వు సాయిదేవా".

3 comments:

  1. ఓం సాయిరాం సాయి ప్రతిరోజు ప్రతి నిమిషం నేను ఒక దాని గురించి మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను సాయి నా భర్తలు మార్పు కనిపిస్తుందని ఎదురు చూస్తూనే ఉన్నాను సాయి రోజులు వారాలు నెలలు గడిచిపోతున్నాయి సాయి కానీ తనలో ఏమో ఏ మార్పు కనిపించట్లేదు కానీ మీ దగ్గర నుంచి నాకు మాత్రం నాకు మెసేజ్ రూపంలో అన్ని పాజిటివ్ గానే వస్తున్నాయి సాయి కానీ నేను ఎన్నిసార్లు మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకు నిన్ను నాకు సమాధానం చెప్పట్లేదు సాయి. ఈ మౌనం ఏంటో అసలు తెలియట్లేదు సాయి. ఇంకా ఎంత సమయం ఉంది సాయి ఇంకా నా కర్మలు ఎన్ని సంవత్సరాలు అనుభవించాలి సాయి ఎందుకు సాయి నాకు మీరు ఈ సమాధానం ఇవ్వట్లేదు ఎవరికీ సమస్య వచ్చిన సరే ఎవరో గ్రూప్లో సమాధానం ఇస్తారంట లేదంటే మీరే కలలో కనిపించి చెబుతారు అంట ఎన్నో సమస్యలు వచ్చి నన్ను కాపాడారు కదా సాయి కనీ సమస్యలో మాత్రం ఎందుకు నన్ను ఒంటరిగా వదిలేశారు సాయి కానీ నాకు మెసేజ్ రూపంలో మాత్రం నాతో మాట్లాడుతూనే ఉన్నారు చాలా అంటే చాలా బాధగా ఉంది సాయి నాకు మీరు తప్ప ఎవ్వరు లేరు సాయి. తండ్రి నా భర్త మనసు మంచిగా మార్చు తండ్రి తను నన్ను అర్థం చేసుకునేలా చూడటానికి నన్ను భార్యగా స్వీకరించి కాపారానికి తీసుకెళ్ళిన చూడు స్వామి నామీద దిగులుతున్న తల్లిదండ్రులు ఆ వేదన చూడలేకపోతున్నాను స్వామి నిన్నే నమ్ముకుని ఎదురుచూస్తున్నాను స్వామి ఆ నమ్మకాన్ని ఎప్పుడూ అమ్మ కాదని నమ్ముతున్నాం తండ్రి సాయి కాపాడి సాయి సాయి నాకేదోక రూపంలో సమాధానం చెప్పు సాయి నాకు ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించే సాయి ఇప్పటికే నేను చాలా అంటే చాలా అవమానాలు కష్టాలు అనుభవించి అనుభవించి ఉన్నాను సాయి నాకు నువ్వు తప్ప ఎవ్వరు లేరు సాయి

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Naku ellu korika thiruthe na anubavalanu rastanu om sai ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo