సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1444వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి అనుగ్రహాశీస్సులు
2. పాపకి నయమయ్యేలా దయచూపిన బాబా

శ్రీసాయి అనుగ్రహాశీస్సులు


ముందుగా బ్లాగు నిర్వాహకులకు, ప్రతిరోజూ బ్లాగు చదువుతున్న వారికి నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నేను రెండోసారి గర్భిణిగా ఉన్నప్పుడు మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. అప్పుడు నేను బాబాతో, "బాబా! నాకు డెలివరీ ఏ ఇబ్బంది లేకుండా మంచిగా జరిగితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. మధ్యలో ఒకసారి నాకు బ్లడ్ తక్కువగా ఉందని డాక్టరు చెప్పారు. కానీ బాబా దయవల్ల డెలివరీ సమయానికి బ్లడ్ కరెక్ట్ గా ఉందని, సి సెక్షన్ ద్వారా డెలివరీ చేసారు. అంతా మంచిగా అయి బాబు పుట్టాడు. అయితే బాబు కాలి పాదం కొంచెం వంకరగా ఉండింది. అది వాడు కడుపులో ఉన్నప్పుడు చేసిన స్కాన్‍లో అస్సలు తెలియలేదు. దాన్ని నయం చేయడానికి డాక్టరుని సంప్రదించాము. ప్రస్తుతం దానికి చికిత్స జరుగుతుంది. బాబా దయవల్ల బాబు పాదం వంకర కొంతవరకు నయమైంది. ఇంకో విషయం, బాబు డేటాఫ్ బర్త్ సర్టిఫికెట్ విషయంలో 'పని తొందరగా అయితే బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. బాబా దయవల్ల పని తొందరగా అయింది. "బాబా! మీరు నాకు ఎంతో సహాయం చేస్తున్నారు. మీరే అంతా సెట్ చేస్తారని నమ్మకంతో ఉన్నాను. మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా".


మేము వేరే దేశంలో(యూరప్) ఉంటాము. మా మరది పెళ్ళికని ఇండియా వచ్చిన మేము ఇక్కడే ఉండాల్సి వచ్చింది. దాంతో రెండో బాబు డెలివరీ ఇక్కడే అయింది. బాబుకి రెండో నెలలో పాసుపోర్టుకి అప్లై చేసే నిమిత్తం బాబుకి పాసుపోర్టు సైజు ఫోటో తీయాల్సి వచ్చింది. అయితే బాబు చాలా చిన్నవాడు కావడం వల్ల ఫోటో తీయడం చాలా కష్టమైంది. ఫోటోగ్రాఫర్ రెండుసార్లు వచ్చి ఫోటోలు తీసినా ఫోటోలు సరిగా రాలేదు. పాసుపోర్టుకి అప్లై చేయడానికి ఫోటో కరెక్ట్ గా ఉండాలి. అందువల్ల నా భర్త, "ఫోటో తీయించటం కూడా రాదా?" అని బాగా తిట్టారు. అప్పుడు నేను, "బాబా! మీ దయవల్ల బాబు ఫోటోలు సరిగా వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగు పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయ చూపారు. ఈసారి ఫోటోలు బాగా వచ్చాయి. కానీ పాసుపోర్టు ఆఫీసుకి రెండుసార్లు వెళ్లినా పని అవ్వలేదు. అప్పుడు కూడా నేను బాబాను వేడుకున్నాను. ఆయన దయతో మూడోసారి పనైంది. ఇకపోతే రెండో నెలలోనే బాబుకి జలుబు, దగ్గు, జ్వరం అన్నీ ఒకేసారి వచ్చాయి. హాస్పిటల్‍కి తీసుకుని వెళితే టెంపరేచర్ ఉండేది కాదు. ఇంటికి వచ్చేసరికి మళ్ళీ టెంపరేచర్ వచ్చేది. దాంతో భయమేసి, "బాబా! మీ దయవల్ల బాబుకున్న సమస్యలు తగ్గితే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల అన్నీ తగ్గాయి. అలాగే రెండో నెలలో వేయాల్సిన వ్యాక్సిన్ బాబుకి వేయించినప్పుడు కూడా 'నేను ఎలాంటి సమస్య లేకుంటే బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. బాబా దయవల్ల సాధారణంగా అందరికీ వచ్చే జ్వరం రావడం తప్ప మరే సమస్య రాలేదు. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".


మేము యూరప్ ఖండంలోని బెల్జియం దేశంలో ఉంటాము. ఇండియాలో ఉండగా అక్కడ నా రెసిడెన్స్ పర్మిట్ ఎక్స్ఫైర్ అయింది. దానికోసం అప్లై చేసినా కొంచం ఆలస్యంగా రిప్లై వస్తుంది. కానీ నాకు అది చాలా అర్జెంటుగా కావాలి. అలా తొందరగా రావాలంటే ఎక్కువ డబ్బులు చెల్లిస్తే వస్తుందని అన్నారు. సరేనని, డబ్బులు కట్టాను కానీ, దానికి కూడా సంబంధిత అధికారుల నుండి ఆమోదం రావాలని ఆలస్యం కాసాగింది. ఇక అప్పుడు నేను, "బాబా! మీ దయవల్ల త్వరగా పని పూర్తయితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఆమోదం వచ్చి, రెసిడెన్స్ పర్మిట్ కార్డు కూడా త్వరగా వచ్చింది.


పైన చెప్పిన రెసిడెన్స్ పర్మిట్ కార్డు విషయంగా నేను హఠాత్తుగా రెండు నెలల బాబుని మా అమ్మ దగ్గర వదిలేసి తప్పనిసరిగా బెల్జియం వెళ్ళవలసి వచ్చింది. అయితే బాబుకి తల్లి పాలు ఇస్తుండటం వల్ల డబ్బా పాలు అలవాటు చేయలేదు. అలాంటి నేను బాబుని వదిలేసి వెళితే బాబుతోపాటు నాకు కూడా ఇబ్బంది అవుతుందన్నారు. అప్పుడు నేను, "బాబా! డబ్బా పాలు త్రాగడం వల్ల బాబుకి, అలాగే నాకు ఎలాంటి సమస్య లేకుండా ఉంటే మీ దయను బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల మా ఇద్దరికీ ఎలాంటి సమస్యా రాలేదు. కాకపోతే నేను అక్కడున్న సమయంలో బాబు కన్ను ఒకటి వాచింది. అది తెలిసి చాలా దూర ప్రదేశంలో ఉన్న నాకు చాలా భయమేసి, "బాబా! మీ దయవల్ల సమస్యేమీ లేకుండా ఉంటే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల కన్ను వాపు తగ్గింది. ఇకపోతే ఈమధ్య మేము బాబుకి గేదె పాలు అలవాటు చేసే ప్రయత్నం చేస్తుంటే కొంతమంది గేదెపాలు కొందరు పిల్లలకి పడవు అన్నారు. అప్పుడు నేను బాబాతో, "మీ దయవల్ల బాబుకి గేదెపాలు పడితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల పిల్లాడికి గేదెపాలు పడ్డాయి.  "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".


నాకు ఇద్దరు పిల్లలు. 2022, అక్టోబరులో నాకు రెండో కాన్పు అయి బాబు పుట్టిన తరువాత నేను మా అమ్మవాళ్ల దగ్గర ఉండగా మా నాలుగు సంవత్సరాల పెద్దబాబు 'సాయి' మా అత్తగారి ఇంటిలో వుంటుండేవాడు. కారణం తను ఎప్పుడు మా అమ్మవాళ్ళ ఇంటికి వచ్చినా తనకి ఏదో ఒకటి జరుగుతుంది. అందుకే మావారు తనని మా అమ్మవాళ్ళ ఇంటికి పంపరు. అలాంటిది సంక్రాంతి పండగని బాబుని మా ఇంటికి పంపారు. తను వచ్చిన రెండో రోజు సాయంత్రం వరకు బాగానే ఉన్నాడు. కానీ ఆ సాయంత్రం నుండి తనకి జ్వరం మొదలైంది. తన ఒంటిపై కురుపులు కూడా లేచాయి. ఇంకా నాకు భయమేసి, "బాబా! బాబుకి జ్వరం తగ్గితే మీ దయను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. కానీ మూడు రోజుల వరకు తగ్గలేదు. సిరప్ వేస్తే తగ్గుతూ, తరువాత మరల వస్తుండేది. అప్పుడు డాక్టరుని సంప్రదించాక బాబా దయవల్ల నాల్గవ రోజుకి జ్వరం తగ్గింది. ఇంకోసారి వాడి కాలుకి దెబ్బ తగిలి చాలా బాధపడుతుంటే, 'తన కాలునొప్పి తగ్గితే బ్లాగులో పంచుకుంటాను' అని అనుకున్నాను. బాబా దయవల్ల నొప్పి తగ్గింది. ఇటీవల తను ఇయర్ బడ్స్ తాలూకు ప్లాస్టిక్ పుల్ల కొంచెం మింగేశాడు. నాకు చాలా భయమేసి, "బాబా! మీ దయవల్ల బాబుకి ఎలాంటి సమస్య లేకుండా ఉంటే బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయ వల్ల ఎలాంటి సమస్య రాలేదు. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్ సాయి. మీకు మేము ఎప్పుడూ ఋణపడి ఉంటాము".


ఇటీవల మా పొలంలో ఒడ్లు తిరగేస్తున్న సమయంలో ఒకరోజు చిన్నగా వర్షం మొదలైంది. పెద్ద వర్షం పడితే పంటంతా పాడైపోతుంది. అందువల్ల నేను, "బాబా! మీ దయవల్ల వర్షం తగ్గితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయ చూపారు. తొందరగానే వర్షం ఆగిపోయింది. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".


నేను కొత్తగా స్కూటీ నేర్చుకుంటున్న సమయంలో తెలియక గతుకుల మార్గంలోకి వెళ్ళాను. అప్పుడే స్కూటీ నేర్చుకుంటున్నందున ఎక్కడ పడిపోతానో, స్కూటీ బరస్ట్ అవుతుందో అని నాకు భయమేసి, 'బాబా దయవల్ల ఏం కాకుండా ఇంటికి వెళ్లగలిగితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను' అని అనుకున్నాను. బాబా దయవల్ల ఏ సమస్యా కాలేదు. క్షేమముగా ఇంటికి వచ్చాను. "థాంక్యూ బాబా"


ఇటీవల నేను ఒంటరిగా ఫ్లైట్ జర్నీ చేయవలసి వచ్చింది. ఒంటరిగా వెళ్లాలంటే నాకు చాలా భయం. అందువల్ల నేను, "బాబా! ఫ్లైట్‍లో వెళ్లి, వచ్చేటప్పుడు ఎలాంటి సమస్యా లేకుండా ప్రయాణం జరిగితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఎలాంటి సమస్య లేకుండా బ్రస్సెల్స్ చేరుకున్నాను. అయితే అక్కడ పాస్పోర్ట్ విషయంలో రెండోసారి చెక్ చేయాలని కొంచెంసేపు వెయిట్ చేయించారు. అదెవరకెప్పుడూ నాకు అలా జరగలేదు. నేను ఒక్కదానినే ఉండటం వల్ల వాళ్ళతో ఏమైనా మాట్లాడాలంటే నాకు భయమేసి, 'ఎలాంటి సమస్య లేకుండా వుంటే, నా ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. బాబా దయవల్ల ఎలాంటి  సమస్య రాలేదు. ప్రయాణంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".


పాపకి నయమయ్యేలా దయచూపిన బాబా


అందరికీ నమస్తే! నేను సాయిభక్తురాలిని. నా పేరు గౌరి. బాబా నాకు ఇటీవల ప్రసాదించిన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈమధ్య మేము మా అమ్మావాళ్ళింటికి వెళ్ళాము. ఆ సమయంలో అక్కడ బాగా చలిగా ఉంది. అంతేకాదు, పిల్లలపై ఏదో వైరస్ ప్రభావం కూడా ఉందట. ఆ వైరస్ సోకిన పిల్లల చేతుల మీద, నోటిలో రషెస్ వస్తాయట. మాకు ఐదు నెలల పాప ఉన్నందువలన నేను చాలా భయపడి, 'సాయిబాబా దయవల్ల నా బిడ్డకి ఎలాంటి బాధ లేకుండా ఉంటే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను' అని అనుకున్నాను. కానీ మా పాపకి జ్వరం వచ్చింది. నేను, "బాబా! పాపకి జ్వరం తగ్గేలా చూడండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయతో పాపకి జ్వరం తగ్గి, మేము అమ్మావాళ్ళ ఊరు నుండి మా ఊరికి క్షేమంగా తిరిగి వచ్చేశాము. ఇక్కడికి వచ్చాక పాపకి మళ్ళీ 101.5 డిగ్రీల జ్వరం వచ్చింది. చాలా భయమేసి రాత్రి 12 గంటల సమయంలో పాపని హాస్పిటల్‌కి తీసుకెళితే, డాక్టరు పాపని హాస్పిటల్లో అడ్మిట్ చేయమన్నారు. దాంతో మేము రెండు రోజులు హాస్పిటల్లో ఉండి, బాబా దయవల్ల పాపకి జ్వరం తగ్గాక ఇంటికి వచ్చాము. తరువాత పాపకి నీళ్ళవిరేచనాలు అవుతుంటే, "బాబా! నిన్ను తలవని రోజంటూ లేదు. నువ్వే మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నావు. దయచేసి పాపకి విరేచనాలు తగ్గించి, తన ఆరోగ్యం బాగుండేలా నువ్వే చూడాలి బాబా" అని అనుకొని పాపని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. బాబా దయవల్ల పాపకి విరోచనాలు తగ్గాయి. నాకు ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


2 comments:

  1. బాబా సాయి నవంశీ నన్ను అర్థం చేసుకునేలా చూడు సాయి మల్లి తను నేను కలిసి పోయేలా చూడు సాయి నన్ను భార్యగా స్వీకరించి కాపురానికి తీసుకెళ్లి ఇలా చూడు సాయి నిన్నే నమ్ముకొని ఎదురుచూస్తున్నాను బాబా అందరికీ కళ్ళు కనిపించే వాళ్ళు చేస్తే ఏదైనా తప్పు ఉంటే చెప్తా అంట కదా బాబు నాతో మాత్రం ఎందుకు ఏం మాట్లాడట్లేదు సాయి నాలో ఏమైనా తప్పు ఉంటే నాకు చెప్పు సాయి మార్చుకుంటా

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo