1. సాయి కృపతో ఉద్యోగం, ఆరోగ్యం, తప్పిన ఇబ్బంది
2. ప్రాజెక్ట్ ఇచ్చి ఉద్యోగం పోకుండా కాపాడిన బాబా
సాయి కృపతో ఉద్యోగం, ఆరోగ్యం, తప్పిన ఇబ్బంది
ఓం శ్రీసాయినాథాయ నమః!!! ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి కృతజ్ఞతలు. సాయిబంధువులందరికీ నమస్కారాలు. నేను సాయిభక్తురాలిని. నా పేరు నాగలక్ష్మి. నేను నా అనుభవాలను ఈ బ్లాగులో పంచుకోవడమిది రెండోసారి. 2022, డిసెంబరులో ముందుగా నా ఎడమచేయి బాగా లాగడం మొదలైంది. ‘రెండు రోజుల్లో తగ్గిపోతుందిలే’ అని అనుకున్నాను. ఆలోపు మా పాపకి విపరీతమైన దగ్గు మొదలై రాత్రిళ్ళు బాగా దగ్గుతుండేది. నాకు భయమేసి, "బాబా! పాపకి దగ్గు తగ్గించండి. రాత్రిళ్ళు తను దగ్గుతూనే ఉంటోంది" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. మా ఇద్దరికీ ఇలా ఉండగా, హాస్టల్లో ఉండి బి.టెక్ మొదటి సంవత్సరం చదువుకుంటున్న మా బాబుకి తన మొదటి సెమిస్టర్ పరీక్షలు మొదలవడానికి కొన్నిరోజుల ముందు నుండి నడుమునొప్పి వస్తుండేది. బాబు మాతో, "క్రికెట్ ఆడుతుంటే నడుము పట్టేసి నొప్పి వస్తోంది" అని చెప్పాడు. మేము మొదట పెద్దగా పట్టించుకోలేదు. కానీ పరీక్షలు మరో రెండు రోజుల్లో ఉన్నాయనగా మేము తనకి ఫోన్ చేస్తే, "నొప్పి బాగా ఎక్కువగా ఉంది. వంగి నడవాల్సి వస్తోంది" అని చెప్పాడు. నేను బాబాని తలచుకొని, "బాబా! ముగ్గురికీ ఒకేసారి ఇలా జరుగుతుందేమిటి? మమ్మల్ని కాపాడండి బాబా. మా ముగ్గురికీ తగ్గితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకొని బాబా నామస్మరణ చేస్తూ ఉండసాగాను. బాబు పరీక్షకు వెళ్లే రోజు, "బాబా! బాబుకి పరీక్షలు అయ్యేవరకు నొప్పి తగ్గించండి. తర్వాత తనని హాస్పిటల్‌కి తీసుకెళ్తాము" అని బాబాకి చెప్పుకొని బాబుకి ఫోన్ చేశాను. బాబు, "నొప్పి తగ్గింద"ని చెప్పాడు. అది విని నేను సంతోషంగా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నాకు మాత్రం పది రోజులైనా చేయినొప్పి తగ్గలేదు. అయినా బాబా మీద భారమేసి ఆయన కృపకోసం ఎదురుచూశాను. ఆయన దయవల్ల కొన్నిరోజులకు నా చేయినొప్పి తగ్గింది. మా పాప దగ్గు కూడా తగ్గింది. హాస్పిటల్‍కి వెళ్లకుండా మా అందరికీ నయం చేసిన బాబాకు నేను ఆనందంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. బాబా దయవల్ల మా బాబు మొదటి సెమిస్టరు 82% మార్కులతో పాస్ అయ్యాడు. "బాబా! మీ పాదాలకు శతకోటి నమస్కారాలు. మమ్మల్ని ఎల్లవేళలా ఇలాగే కాపాడండి బాబా. నన్ను ఎక్కువగా బాధపెడుతున్న ఆరోగ్య సమస్య గురించి మీకు తెలుసు. అతిత్వరలో దాన్ని తగ్గించి మీ అనుగ్రహాన్ని మీ బ్లాగులో పంచుకునే అదృష్టాన్ని కల్పిస్తారని ఎదురుచూస్తున్నాను తండ్రీ".
2023, జనవరి నెల, సంక్రాంతి సెలవుల్లో మేము షాపింగ్‍కి వెళ్ళాము. మాబాబు మా బండి మీద, నేను, మావారు మా ఆడపడుచు భర్త బండి మీద వెళ్ళాము. మేము ఒక షాపులో పని అయిపోయాక వేరొక షాపుకు వెళ్ళాము. అక్కడ పని పూర్తి చేసుకుని బయటకొచ్చి చూస్తే, మేము బండి పెట్టిన చోట మా బండి లేదు. అదే మోడల్‍ది వేరే బండి ఉంది. మా బండి ఎవరో తీసుకెళ్లారని ఆ షాపువాళ్ళకి చెబితే, "ఇక్కడ సీసీ కెమెరాలు లేవు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి" అని అన్నారు. సరే, రేపు వచ్చి కంప్లైంట్ ఇద్దామని మా దగ్గరున్న కీతో అక్కడున్న బండి స్టార్ట్ అవడంతో దానిమీద ఇంటికి బయలుదేరాము. నేను, "సాయీ! మా బండి దొరికితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. కొంచెం దూరం వెళ్ళాక మావారు, "ఒకసారి మొదట వెళ్ళిన షాపు పార్కింగ్‍లో చూద్దామ"ని అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ మా బండి ఉంది. అయితే అది మావారు పెట్టిన చోట కాకుండా వేరేచోట వుంది. అసలు జరిగిందేమిటంటే, పార్కింగ్ సిబ్బంది మా బండిని మేము పెట్టిన చోటునుండి అక్కడికి మార్చారు. మావారు మొదట బండి పెట్టిన చోట అదే మోడల్ బండి వేరొకరు పెట్టారు. అది మావారు గమనించకపోవడం, పైగా ఆ బండి మా బండి కీతో స్టార్ట్ అవడంతో అది మా బండేననుకుని ఆ బండి తీసుకొని రెండో షాపుకి వెళ్లి, అక్కడ పనయ్యాక అది మా బండి కాదని గమనించాము. ఇక అసలు విషయానికి వస్తే, మొదటి షాపు దగ్గర చూద్దామని మావారు వెళ్లేసరికి, అక్కడ మేము తీసుకొచ్చిన బండి తాలూకు యజమాని సీసీ కెమెరాలు చెక్ చేయిస్తున్నారు. మాకు ఆ విషయం తెలిసి వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేసి, మా బండి మేము తెచ్చుకున్నాం. ఇదంతా జరిగిన తర్వాత నేను మావారిని, "మీకు వెనక్కి వెళ్లాలని ఎందుకు అనిపించింది?" అని అడిగాను. అందుకాయన, "ఎందుకో తెలీదు. ఒకసారి మొదట వెళ్లిన షాపుకి వెళ్లాలనిపించింది" అని అన్నారు. నాకు మాత్రం నా సాయిబాబానే మమ్మల్ని వెనక్కి పంపించి వాళ్ళు ఇవ్వబోయే పోలీస్ కంప్లైంట్ ఇబ్బంది నుంచి మమ్మల్ని తప్పించారని అనిపించి సాయి పాదాలకు నా నమస్కారాలు అర్పించి, మీతో ఈ విషయం పంచుకున్నాను.
ఇప్పుడు, 12 సంవత్సరాల క్రిందటి సాయి అనుగ్రహాన్ని మీతో పంచుకుంటాను. ఓపికతో చదువుతారని ఆశిస్తున్నాను. 2009లో నేను డీఎస్సీ వ్రాసి పోస్టింగ్ కోసం ఎదురుచూశాను. ఏవేవో కారణాల వలన పోస్టింగ్ రావడం చాలా ఆలస్యమైంది. ఆ సమయంలో నేను ఎన్నిసార్లు బాబాను, "ఉద్యోగం ఎప్పుడు ఇస్తారు బాబా?" అని అడిగానో ఆ బాబాకే తెలుసు. అలా ఉండగా ఒకరోజు మా అమ్మకి బాబా స్వప్నదర్శనమిచ్చారు. అమ్మ నాతో, "బాబా పూజ చేయని నాకు ఫోటోలో ఎలా ఉంటారో అలానే చాలా స్పష్టంగా బాబా కలలో కనిపించారు. ఆయన తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని గుర్రంపై వచ్చి, నిన్ను ఆ గుర్రంపై ఎక్కించుకొని తీసుకెళ్లారు" అని చెప్పింది. నేను చాలా సంతోషించాను. బాబా దయవల్ల తర్వాత రెండు నెలల్లో రెండు మంచి విషయాలు నా జీవితంలో జరిగాయి. అవేమిటంటే, సాయి కృపతో 2010 అక్టోబరులో నాకు ఒక పాప పుట్టింది. బాబా నాకు అంతకుముందే ఒక బాబుని కూడా ప్రసాదించారు. తనకి మేము ‘సాయి’ అని కలిపి పేరు పెట్టుకున్నాము. ఇకపోతే పాప పుట్టిన తరువాత 2010లోనే నవంబరులో నాకు SGTగా ఉద్యోగం వచ్చింది. ఇవన్నీ సాయి దయవల్లే జరిగాయని నా నమ్మకం. నేను నా మొదటి నెల జీతం శిరిడీలో సమర్పించుకుంటానని మొక్కుకొని కొన్ని రోజుల తరువాత శిరిడీ వెళ్లి నా మొక్కు తీర్చుకున్నాను. బాబా కృపాకటాక్షాలు ఎల్లవేళలా అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ప్రాజెక్ట్ ఇచ్చి ఉద్యోగం పోకుండా కాపాడిన బాబా
నా పేరు మేఘన. నేను యుఎస్ఏలో ఉంటున్నాను. ఇక్కడ సరిగ్గా ఆర్థిక మాంద్యం సమయంలో బడ్జెట్ సమస్యల వల్ల మా ప్రాజెక్ట్ ఆగిపోయింది. అదే సమయంలో మా కంపెనీ ప్రాజెక్ట్ లేనివాళ్ళను ఉద్యోగం నుండి తీసేయడం మొదలుపెట్టింది. అప్పుడు నేను, "నాకు వేరే ప్రాజెక్ట్ దొరకాలి బాబా. అలా అయితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించి ఆయన మీద నమ్మకముంచాను. బాబా దయవల్ల నాకు వేరే ప్రాజెక్ట్ దొరికి ఉద్యోగం కోల్పోకుండా రక్షింపబడ్డాను. ఇలానే ఎల్లప్పుడూ బాబా నన్ను కాపాడుతారని నమ్ముతున్నాను. నేను బాబాకి ఎప్పుడూ ఋణపడి ఉంటాను. "ధన్యవాదాలు బాబా".
Give full aaush to my children, husband and grand children. Be with them and bless them ❤
ReplyDeleteJaisairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
Sairam
ReplyDeleteTammudiki manasanthi kaliginchu tandri
problems ki solution chupinchu
Please save my husband from his illness sai and make him normal
ReplyDeleteSri sachidananda sadguru Sainath Maharaj ki Jai.
ReplyDeleteSri samardha sadguru sai nath maharaj ki jai🙏
ReplyDelete