1. ప్రేమతో చిన్న దూదిముక్క పెడితే, తిరిగి అపారమైన ప్రేమతో వెలకట్టలేని ప్రేమని బట్టగా చుట్టిన బాబా
2. పెద్ద ప్రమాదం జరిగినా ప్రాణనష్టం జరగకుండా కాపాడిన బాబా
3. భయభక్తులు కలిగి ఉండాలని తెలియజేసిన బాబా
ప్రేమతో చిన్న దూదిముక్క పెడితే, తిరిగి అపారమైన ప్రేమతో వెలకట్టలేని ప్రేమని బట్టగా చుట్టిన బాబా
నా పేరు భాస్కరాచార్యులు. 2023, జనవరి 15, సంక్రాంతి పండగరోజున ఆనందంతో నా మనసును తడిపేసిన సాయి ప్రేమను నేను పొందాను. అది చిన్నదే అయినా మీతో పంచుకోవాలనిపించడం బాబా ప్రేరణే కావొచ్చు. ఇక అసలు విషయానికి వస్తాను. సంవత్సరం క్రితం మేము ఒక ఇంటిలో దిగినప్పుడు, 'ఇక మాకు పెద్ద దిక్కు, ఈ ఇంటికి యజమాని బాబానే' అని త్రికరణశుద్ధిగా భావించి మా కుటుంబ బాధ్యతలు బాబాకు అప్పగించాము. కొద్దిరోజులకి సంక్రాంతి పండగ వచ్చింది. ఆరోజు నేను, 'మన ఇంటి పెద్ద బాబా కదా! పండుగకు పెద్దలకు పెట్టినట్టు బాబాకు కొత్త బట్టలు పెట్టాలి' అని ప్రేమతో నా శక్తికొలదీ తక్కువ ఖర్చులో పంచె, కండువా బాబాకి పెట్టి ఆనందపడ్డాను. అయితే ఈ సంవత్సరం సంక్రాంతి పండగకి ముందు కొన్ని అదనపు ఖర్చులు వచ్చి పడ్డాయి. దాంతో నా దగ్గర డబ్బులున్నా 'ఈ పండగకి బాబా కోసం బట్టలు కొనడం సరైనద'ని నా మనసుకి అనిపించలేదు. మనస్పూర్తిగా ఇవ్వని కానుకలను బాబా కూడా స్వీకరించరు. అందుకని నేను బాబా కోసం కొత్త బట్టలు కొనలేదు. వాస్తవానికి బాబాకి పెట్టిన బట్టలు నేనే వాడుకుంటాను. అయినా అన్నిటికీ డబ్బు కేటాయించి బాబా దగ్గరకు వచ్చేసరికి జమాఖర్చులు చూసి ఆయనకి బట్టలు కొనలేకపోయాను. అందుకు అపరాధభావంతో నా పిసినారితనానికి మనసు పొరల్లో బాధ ఉండింది. అలా ఉండగా పండగరోజున నేను మా ఇంటిలోని పూజామందిరంలో ఉన్న చిన్న ద్వారకామాయి బాబా విగ్రహానికి పంచోపచార పూజ చేశాను. తరువాత యథాలాపంగా ప్రత్తితో ఒత్తులు చేస్తుంటే, ఆ ప్రత్తితో బాబాకు బట్టలు చేద్దామనిపించి ఒక పెద్ద మోతుబరి రైతు ధరించే విధంగా మెలికలు వున్న తలపాగా, కండువా, అంచు ఉన్న పంచె తయారుచేశాను. ఆ వస్త్రాలకు గంథం, అంచులకు కుంకుమ పూశాను. అవి చూడడానికి నిజంగా పంచె, కండువా, తలపాగాల లాగానే వచ్చాయి. వాటిని బాబాకి అలంకరించి అవే నిజం బట్టలుగా తృప్తిపడి మురిసిపోయాను. అంతటితో ఆ విషయం మరచిపోయాను. తరువాత మా నాన్నగారి ఇంటికి వెళ్ళినప్పుడు, నా ముప్పైఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని విషయం ఒకటి జరిగింది. అదేమిటంటే, మా నాన్న నాకు కొత్త పంచె, కండువా, స్వచ్ఛమైన పాలకోవా ప్యాకెట్ ఇచ్చారు. ఆయన నా పుట్టినరోజుకు తప్ప సంక్రాంతికి ఎన్నడూ కొత్త బట్టలు కొనలేదు. అలాంటి ఆయన వింతగా నాకు సంక్రాంతికి బట్టలు పెట్టడమేంటో నాకస్సలు అర్థం కాలేదు. కారణమేంటని మా అమ్మను అడిగితే, "ఏమో!" అందామె. అప్పుడు నాకు అర్థమైంది సాయి మహారాజు పెద్ద మనసు.. ఎంతైనా మహారాజు మహారాజే. నేను ఆయనకి బట్టలు పెట్టడం, పెట్టకపోవడం ఏమిటి? ఆయనే కదా అందరికీ పెట్టేది. ఆయన తమకి బట్టలు పెట్టలేదని అల్లాడిపోతున్న నా మనసు తెలుసుకొని ఒక తండ్రిలా పుత్రవాత్సల్యాన్ని చూపారు. తమ స్థానంలో తాముంటూ మా నాన్నగారి మాధ్యమంగా నాకు బట్టలు పెట్టి అటు వారి ప్రేమను, ఇటు తండ్రి ప్రేమను ఒకేసారి నాపై కురిపించారు. ఈ భావోద్వేగాన్ని ఎలా వివరించాలో నాకు తెలియదుగానీ, దాన్ని అనుభవిస్తుంటే నా కళ్లు చెమరిస్తూ, గుండె బరువెక్కిపోతుంది. నేను ఇదివరకు 'సాయినాథ్ మహారాజ్' అని ఎందుకు అంటారా అని అనుకునేవాడిని. అలాంటి నాకు ఇప్పుడు అర్ధమైంది, 'బిడ్డల నుండి పుచ్చుకునే మాములు తండ్రి కాదు ఆయన. ప్రేమతో చిన్న దూదిముక్క పెడితే, తిరిగి అపారమైన ప్రేమతో వెలకట్టలేని ప్రేమని బట్టగా చుట్టి జీవితాంతం మర్చిపోలేని అనుభూతినిచ్చే రాజాధిరాజు ఆ మహారాజు' అని. ఇప్పుడు నేను 'సాయినాథ్ మహారాజ్ కీ జై' అని అర్థవంతంగా చెప్తాను. ఇలాంటి అనుభవాల ద్వారా మనకే తెలియని మన మనసు పొరల్లోని సున్నిత భావాల వెలితిని సమూలంగా తృప్తిపరిచేది జన్మజన్మలకు మన తండ్రి అయిన బాబానే అని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటున్నారు ఆయన.
బాబా శరణం!!!
పెద్ద ప్రమాదం జరిగినా ప్రాణనష్టం జరగకుండా కాపాడిన బాబా
నా పేరు చంద్రశేఖర్. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. నేను శిరిడీ నుండి 'coa to snsi' ట్రైన్‌లో 2023, జనవరి 11వ తేదీ ఉదయం హైదరాబాద్ చేరుకున్నాను. అక్కడ లోకకళ్యాణo కోసం జరిగే ఓ సమావేశంలో పాల్గొనే అవకాశాన్ని బాబా నాకు కల్పించారు. నేను ఆ సమావేశంలో పాల్గొని ఆరోజు రాత్రి మియాపూర్ నుండి BSR ట్రావెల్స్ బస్సులో మా ఊరు మర్లపాడుకి ప్రయాణమయ్యాను. నార్కేట్‌పల్లి దాటిన తరువాత వున్న బ్రిడ్జి మూలమలుపు వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా ట్రాఫిక్ జామ్ అయింది. మా బస్సు ఆగివుండగా వెనుక నుండి వేగంగా సాయికృష్ణ ట్రావెల్స్ బస్సు వచ్చి మా బస్సు వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ ఘటనలో బస్సు వెనుక అద్దాలు పగిలిపోయి వెనుక సీటులో కూర్చున్న ఓ యువకునికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ఇంజన్ కూడా దెబ్బతింది. జరిగిన పెద్ద ప్రమాదంలో ఎంతో ప్రాణనష్టం జరగాల్సి ఉండగా బాబా మా అందరినీ కాపాడారు. అనుక్షణం తమను తలచుకుంటూ నమ్మి ఆరాధించే తమ బిడ్డల యందు బాబా ఎల్లప్పుడూ ఉంటారనడానికి నిదర్శనమే అంత పెద్ద ప్రమాదం నుండి మేము బయటపడటం. ఇలా ఎన్నో సందర్భాలలో నన్ను కాపాడి, తప్పొప్పులను తెలియజేస్తూ నా ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్న సాయికి సాష్టాంగ పాదాభివందనములు.
భయభక్తులు కలిగి ఉండాలని తెలియజేసిన బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
శ్రీసాయినాథాయ నమః!!!
సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వాహకులకు ధన్యవాదాలు. నా పేరు నరసింహం. మాది బెంగళూరు. నేను ఇంతకుముందు రెండు అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటున్నాను. నేను ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఒక నాణేన్ని తీసుకొని పూజామందిరంలో బొమ్మ-బొరుసు వేస్తాను. బొమ్మ వస్తే శుభసూచకంగా భావిస్తాను. ఒకసారి నేను కోపంలో ఒకరికి రోగం రావాలని, అన్యాయం జరగాలని, కష్టం కలగాలని దుర్భుద్ధితో కోరుకొని నాణేన్ని ఎగరేశాను. 'అది తప్పని, మంచిది కాద'ని బాబా మూడుసార్లు బొరుసు పడేటట్లు అనుగ్రహించారు. కానీ నేను కోపంతో ఆ నాణేన్ని దేవుని పటం ముందు విసిరేసి వచ్చేశాను. ఇక బాబా నాకు చేసిన హితబోధ చూడండి. రెండు రోజుల తరువాత ఉదయం 6 గంటలప్పుడు నేను ఇంట్లోని చెత్తకవర్లు తీసుకొని బయట ఓ ఖాళీ స్థలంలో పడేయడానికి వెళ్ళాను. నన్ను గమనించిన బీబీఎంపీ(బృహత్ బెంగళూరు మహానగర పాలికె) సిబ్బంది నా వద్ద నుండి నాలుగు వందల రూపాయలు జరిమానా వసూలు చేశారు. ఈ అనుభవం ద్వారా నేను భయభక్తులు కలిగి ఉండాలని తెలుసుకున్నాను. "ధన్యవాదాలు బాబా".
Please sai give inner peace sai. Give courage to me. Be with me and bless my children and hubby with long life and full aaush to them. Be with them also. Om om sai ram
ReplyDeleteసాయి ఈరోజు సాయి నా భర్త నన్ను తీసుకెళ్తానని నా కలలో చెప్పింది సాయి కనీసం ఈ రోజు నాతో మాట్లాడిన మాట్లాడుతాను సాయి ఎంత నమ్మకంతో ఉన్నా కొంచెం కూడా పోసిటివ్ గానే కనిపించట్లేదు ఎందుకు అర్థం కావట్లేదు సాయి
ReplyDeleteBhaskaracharyulu Garu, me experience rasthu meerela bhavodvegaalaku guri ayyaro mee experience chaduvtunnapudu naku alane anpinchindi, kallalo neru vachindi, gunde baruvekkindi. Thank you for sharing
ReplyDeleteసాయి శరణం సాయి
DeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha