సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1445వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా లీలలు అనంతం
2. ప్రమాదకర పరిస్థితిలో ధైర్యాన్నిచ్చి తల్లిబిడ్డను కాపాడిన బాబా   

బాబా లీలలు అనంతం


ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు కృతజ్ఞతలు. బాబాకు నమస్కారాలు. నా పేరు బి.నిర్మల. మాది సూర్యాపేట. నేను గ్లోబల్ మహాపారాయణ గ్రూపులో సభ్యురాలిని. అందులో భాగంగా నేను ప్రతి గురువారం బాబాచరిత్ర చదువుతాను. ఆ గ్రూపులో తోటి భక్తుల అనుభవాలు చాలా వస్తుంటాయి. కానీ అవి ఇంగ్లీషులో ఉంటాయి. అందులోని కొన్ని కొన్ని పదాలు అర్థం కావు. అందువల్ల తెలుగులో చదివినంతగా బాబా భక్తుల అనుభవాలు ఇంగ్లీషులో అర్థం అయ్యేవి కావు. నేను ఎప్పుడూ ఈ అనుభవాలు తెలుగులో వస్తే బాగుండు అనుకుంటుండేదాన్ని. అలా ఎక్కువగా అనుకోవడంతో బాబా నాకు దారి చూపించారు. ఒకరోజు మా చెల్లి తన వాట్సాప్ స్టేటస్‍లో ఈ బ్లాగులోని భక్తుల అనుభవాల లింకు పెట్టింది. అది ఓపెన్ చేసి చదివిన నేను తెలుగులో భక్తుల అనుభవాల కోసం ఇలా ఒక బ్లాగు ఉందని చాలా సంతోషించాను. దీన్ని బాబానే చూపించారని ఆయనకు ధన్యవాదాలు చెప్పుకున్నాను. కానీ బ్లాగులోని అనుభవాలు చదివినప్పుడు మన సమస్యలు తీరితే ఆ అనుభవాలను బ్లాగులో పంచుకుంటామంటే సమస్యలు సమసిపోతాయంటే నేను ముందు నమ్మలేదు. కానీ అలా కూడా జరుగుతుందని బాబా నాకు తెలియజేసారు. 


కరోనా రెండో వేవ్‍లో నాకు కరోనా వచ్చింది. అది తగ్గిపోయాక ఏది తిన్నా నాకు గ్యాస్ సమస్య వచ్చేది. దానివలన చెస్ట్ లో నొప్పిగా ఉండేది. దాంతో నేను చాలా బాధపడ్డాను. బాబాను ప్రశ్న అడిగితే, "ధ్యానం చేసుకోమ"ని ఆన్సర్ వచ్చింది. రెండు రోజుల్లో మా అక్క ద్వారా మెడిటేషన్ క్లాసు గురించి నాకు తెలిసింది. ధాన్యం ఎలా చేయాలో, ఎక్కడికి వెళ్లాలో నాకు తెలియదని ఆ తండ్రి చేసిన ఏర్పాటు అది. ఆయన దయతో జూమ్ యాప్ ద్వారా మెడిటేషన్ క్లాసులో చేరాను. దానితో నా ఆరోగ్యం 70 నుండి 80 శాతం వరకు సెట్ అయింది. కానీ మధ్యమధ్యలో నొప్పి వస్తుండేది. డాక్టర్ దగ్గరకి వెళ్తే డైజిన్ సిరప్, ఇంకా ఏవో టాబ్లెట్లు ఇచ్చి, "ఏమీ కాద"ని చెప్పేవారు. కానీ సమస్య తీరలేదు. ఏ కాస్త ఆహారం తిన్నా సమస్య అవుతుండేది. అప్పుడు నేను, "బాబా! నాకున్న ఈ సమస్య తగ్గితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. అంతే! రెండు, మూడు రోజులకి ఆ సమస్య చాలావరకు తగ్గింది. ఇప్పుడు ఏ ఆహారం తీసుకుంటున్నా నాకు బాగానే ఉంటుంది. ఈ అనుభవాలను కొత్తగా చదివే వాళ్ళు ఎవరైనా ఇలా బ్లాగులో పంచుకుంటామని మ్రొక్కుకుంటే సమస్య తీరుతుందా అని అనుమానించకండి. ఎందుకంటే, అది నిజం. అందుకు నా అనుభవమే నిదర్శనం. ఆ బాబా లీలలు అనంతం. నా జీవితంలో ఆయన చాలా లీలలు చూపారు. వాటిని కూడా బాబా దీవెనలతో మీ అందరితో పంచుకుంటాను.


ఒకరోజు మా మేడమ్ పౌర్ణమి ధ్యానం చేయించారు. ఆరోజు పత్రిజీ సామూహిక ధ్యానం ఏర్పాటు చేసి, 'మీరందరూ తప్పకుండా ధ్యానంలో పాల్గొనాలి. ఈరోజు చాలా ఎక్కువ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయ'ని చెప్పారు. ఆరోజు ధ్యానంలో నాపైకి చాలా పెద్ద వెలుగు వచ్చింది. అదే సమయంలో నాకు, ఆ వెలుగుకి మధ్య ఒక పాదం అడ్డంగా వచ్చింది. కొద్దిపాటి వెలుగు మాత్రమే నా మీద పడినప్పటికీ ఆ శక్తిని తట్టుకోవడం నాకు చాలా కష్టమైంది. తల భాగంలో చాలాసేపు నొప్పి వచ్చింది. ఆ కొంచెం శక్తినే నేను తట్టుకోలేకపోయాను. ఆ సాయితండ్రి సర్వాంతర్యామి కదా! ఆయనకు అన్నీ తెలుసు గనక ఆ తెల్లటి కాంతికి, నాకు మధ్య తమ పాదాన్ని అడ్డంగా ఉంచారు. ఆ దృశ్యం ఇప్పటికీ నా కంటి ముందు జరిగినట్లు ఉంటుంది. ఆ తండ్రి పాదం సదా నా కన్నుల ముందు కనిపిస్తూ ఉంటుంది. "ధన్యవాదాలు బాబా. ఆలస్యంగా నా అనుభవాలను పంచుకున్నందుకు నన్ను క్షమించండి బాబా. నీ లీలలు/నా అనుభవాలు ఈ బ్లాగులో పంచుకునేందుకు చాలా ఉన్నాయి. ఆ అవకాశాన్ని నాకు ప్రసాదించు సాయి".


ప్రమాదకర పరిస్థితిలో ధైర్యాన్నిచ్చి తల్లిబిడ్డను కాపాడిన బాబా   


'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగుకి, సాయి భక్తులకు నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలు పంచుకున్నాను. వాటిలో ఒక అనుభవంలో నేను మా చెల్లి మా ఇంటికి వచ్చినప్పుడు ఒకరోజు తను కడుపునొప్పితో బాధపడితే బాబా ఊదీ నీళ్లు త్రాగించానని, దాంతో తనకి నొప్పి తగ్గిందని చెప్పాను. తర్వాత చెల్లి గర్భవతి అని నిర్ధారణ అయింది. అయితే తర్వాత రోజే తనకి రక్తస్రావం అయింది. మేము గర్భం పోయిందనుకున్నాము. ఒక 20 రోజులు తర్వాత మళ్లీ నొప్పి మొదలవడంతో చెల్లి, 'ఏంటి ఇది, మళ్ళీ నొప్పి ఎందుకు వస్తుంది?' అని డాక్టర్ దగ్గరకి వెళ్ళింది. డాక్టర్ స్కానింగ్ చేసి, "మీ గర్భం పోలేదు, ఉంది. కానీ మీకొచ్చే కడుపునొప్పి మామూలు నొప్పి కాదు. మీ కడుపులో ఒక గడ్డ ఉంది. అది తొలిదశలో ఉంది. అందువల్లే మీకు నొప్పి వస్తుంది. ప్రెగ్నెన్సీ వల్ల ఆ గడ్డను ప్రస్తుతం తీయడానికి రాదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ తీసేస్తే మళ్లీ నీకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవచ్చు. కాబట్టి కడుపులో బిడ్డకి ఏమైనా సమస్య అయితే అప్పుడు తీసేద్దాం. సమస్యేమీ లేకపోతే డెలివరీ అయ్యాక గడ్డ తీసేయొచ్చు. అప్పటిదాకా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి" అని చెప్పారు. మా చెల్లి హాస్పిటల్ నుండి ఇంటికొచ్చి విషయం మాకు చెప్పి, "నేను ఇంక బతుకుతానో, లేదో అని ఏడుస్తుంటే నాకు, మా అక్కకి, మా అమ్మకి చాలా టెన్షన్‍గా అనిపించింది. మా చెల్లి మాకు దూరం అవుతుందేమో అని ఒకటే దిగులు. ఏ పని చేసినా మాకు ఆ టెన్షన్ పోయేది కాదు. అలా ఉండగా ఒకరోజు రాత్రంతా నేను చెల్లి గురించే ఆలోచిస్తూ సరిగా నిద్రపోలేదు. ఉదయం లేవగానే 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో "భయపడకు అంతా సవ్యంగా జరుగుతుంది" అన్న సాయి వచనం కనిపించింది. అదివరకు నాకు ఒక పెద్ద సమస్య ఎదురైనప్పుడు కూడా బాబా అదే మెసేజ్ ఇచ్చారు. అప్పుడు బాబా చెప్పినట్లే నేను ఆ సమస్య నుండి బయటపడ్డాను. అదే మెసేజ్ ఇప్పుడు మళ్ళీ నా కంటపడటంతో 'చెల్లికి ఏమీ కాద'ని బాబా అభయమిస్తున్నారని నాకు నమ్మకం కలిగింది. దాంతో నేను మా చెల్లికి ఫోన్ చేసి, "బాబా ఇలా చెప్పారు. నీకేం భయం లేదు. సంతోషంగా ఉండు" అని చెప్పాను. అందుకు తను, "నన్ను ఈ సమస్య నుండి బయటపడేస్తే, నేను బాబాని ఎప్పటికీ మరువను" అని చెప్పింది. తర్వాత కొన్నిరోజులకి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో మా చెల్లి చనిపోయింది. మా అమ్మ బాగా ఏడుస్తుంది. మా చెల్లి దేహం కనిపించట్లేదు కానీ, నేను కూడా బాధతో కనీళ్ళు పెట్టుకుంటున్నాను. నాకు మెలుకువ వచ్చి మళ్ళీ పడుకున్నా ఆ కల కొనసాగింది. అలా నేను ఎన్నిసార్లు లేచి పడుకున్నా ఆ కల ఆగలేదు, కొనసాగుతూనే ఉంది. కలలోనే నేను 'బాబా బాబా' అని బాబాను పిలుస్తూ, "ఏంటి బాబా, ఏమీ కాదన్నావు. ఇలా అయిందేంటి? మేము తట్టుకోలేకపోతున్నాము, మా వల్ల కావట్లేదు" అని ఏడుస్తున్నాను. అంతలో మా చెల్లి చనిపోయిందని నిర్థారించుకోవడానికి వచ్చిన నర్సు తాలూకు మొబైల్ స్క్రీన్ పైన శేజ్ ఆరతి అప్పుడు వేసుకునే ప్లెయిన్ పర్పుల్ కలర్ వస్త్రాల్లో బాబా నవ్వుతూ కనిపించి వెళ్లిపోయారు. నేను బాబా వచ్చారని పక్కనున్న వాళ్లకు చెప్తే, "ఎక్కడ బాబా?" అని వాళ్ళు చూసారు కానీ, బాబా కనపడలేదు. ఉదయం లేచాక కలలో కనిపించినట్లు జరగవలసి ఉన్నా, 'బాబా దానిని జరగనివ్వరు, చెల్లిని కాపాడుతార'ని నాకు నమ్మకంగా అనిపించింది. ఆ కల గురించి నేను ఎవరికీ చెప్పలేదుగాని బాబా మీద భారమేసి "చెల్లి మంచిగా ఉంటే, తనకి బిడ్డ పుడితే శిరిడీలో మీ దర్శనం చేయిస్తాను బాబా" అని మ్రొక్కుక్కున్నాను. బాబా దయవల్ల 2022, డిసెంబర్ 7వ తేదీన మా చెల్లికి కాన్పు అయి బాబు పుట్టాడు. బాబు బరువు తక్కువగా ఉన్నప్పటికీ తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. బాబా వాళ్ళను కాపాడారు. నాకు చాలా సంతోషమేసింది. నిజంగా బాబా నాకు ధైర్యం చెప్పకపోయుంటే మేము ఎంత బాధపడేవాళ్ళమో ఊహించుకుంటేనే భయమేస్తుంది. ఎందుకంటే చెల్లి సమస్య అంత ప్రమాదకరమైనది. "బాబా! మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తండ్రి. నా కొడుకుకి మాటలు రావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అది కూడా జరిపించి శిరిడీ వచ్చి మిమ్మల్ని దర్శించుకునే భాగ్యం మాకు ప్రసాదించు తండ్రి".


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!


3 comments:

  1. సాయి ఇప్పటివరకు నా జీవితంలో ఏం జరిగిందో అంతా మీ ఆదిశంతోనే జరిగిందని నేను అనుకుంటున్నాను సాయి ఇకమీదటైనా సరే నా భర్త అని అర్థం చేసుకోవాలి ఈ గొడవలు ఉండకూడదు ఇద్దరం ఒకరు తప్పులు ఒక రకం చేసుకొని ఇద్దరిని మార్చుకొని సంతోష్ అన్న ఉండాలి అది మీ ఆశీర్వాదం వల్ల లభిస్తుంది సాయి. ప్రతి ఒక్కరి జీవితాల్లో చెడు రోజులు ఉంటాయని చెప్తున్నారు కదా సాయి. నా జీవితంలో కూడా ఇది రోజులని నేను అనుకుంటున్నాను సాయి మీరే నన్ను నా భర్తని కలపాలి కలుపుతారు సాయి నాకు నమ్మకం ఉంది కలపాలి కాదు మీరు కచ్చితంగా కలుపుతారు సాయి. నా పాప మీద నాకు నమ్మకం ఉంది ఓం సాయిరాం

    ReplyDelete
  2. Please bless my son daughter and husband with long life and full aayush.om sai ram.reduse depression.

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo