సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1433వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ వచ్చేలా దయ చూపిన బాబా
2. మనసు పెట్టి అడగాలేగానీ సాయితండ్రి చెయ్యనిది ఏదీ ఉండదు
3. ప్రతి అడుగున తోడుండి కాపాడతారు బాబా

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ వచ్చేలా దయ చూపిన బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! నేను ఒక సాయి భక్తుడిని. నేను రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాను. నాకు రావాల్సిన ప్రమోషన్ చాలారోజుల నుండి పెండింగ్‍లో ఉంది. సీనియారిటీ లిస్టులో నా పేరు అయిదవ స్థానంలో ఉన్నప్పటికీ ఉన్న పోస్టులు మూడే. అందువల్ల నేను బాబాని, "బాబా! ఇంటి లోన్ మరియు ఖర్చులకు పోగా నా జీతం అస్సలు మిగలడం లేదు. నా భార్య సంపాదన మీదే ఇల్లు గడుస్తుంది. మీ దయతో నాకు ప్రమోషన్ వస్తే, ఆర్థికంగా కొంత నిలదొక్కుకుంటాను" అని ఎంతగానో అర్థించాను. బాబా వివిధ మాధ్యమాల ద్వారా సబూరీతో ఉండమని తెలియజేసారు. దాంతో నేను ఈ సంవత్సరం కూడా నాకు ప్రమోషన్ రాదేమో అని బాధపడ్డాను. కానీ బాబా చేసిన అద్భుతం చూడండి. సీనియారిటీలో నాకంటే ముందున్న ఇద్దరి ట్రాన్స్ఫర్ అప్రూవల్ అయింది. డిసెంబర్ చివర్లో ప్రమోషన్స్ వస్తాయనగా డిసెంబర్ నెల రెండు, మూడు వారాల్లో వాళ్లిద్దరూ రిలీవ్ అయి, వాళ్ళవాళ్ళ ఇంటి దగ్గర స్థలాల్లో పోస్టింగ్ అయ్యారు. దాంతో నా పేరు ప్రమోషన్ లిస్టులోకి వచ్చింది. అప్పుడు నేను, "ప్రస్తతం నా భార్య ఉంటున్న లొకేషన్‍లోనే నాకు పోస్టింగ్ రావాలి. అలాగే వచ్చే గురువారం నేను ప్రమోషన్ తీసుకుని కొత్త పోస్టులో చేరి మీ మందిరానికి వచ్చేటట్లు అనుగ్రహించండి" అని బాబాను ప్రార్థించాను. డిసెంబర్ 31 లోపు ప్రమోషన్స్ వస్తే, మాకు ఇంక్రిమెంట్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. కానీ మా ప్రమోషన్ ఫైల్ డిసెంబర్ 23 నుండి మా అదనపు మండల రైల్వే మేనేజర్ దగ్గర పెండింగ్‍లో ఉండిపోయింది. మేము డిసెంబర్ 31 లోపల క్లియర్ అవుతుందో, లేదో అని టెన్షన్ పడ్డాము. నిజానికి బాబా ముందు నుండే 'సబూరీతో ఉంటే అనుకున్నది తప్పక జరుగుతుంది' అని చాలాసార్లు చెప్తున్నప్పటికీ నేనే టెన్షన్ పడ్డాను. కానీ ఏదేమైనా బాబా దయవల్ల డిసెంబర్ 28, బుధవారం సాయంత్రం కల్లా ఫైల్ క్లియర్ అయ్యి మాకు ప్రమోషన్ ఆర్డర్స్ వచ్చాయి. నేను ముందుగా అనుకున్నట్లు గురువారం ఛార్జ్ తీసుకుని బాబా గుడికి వెళ్లి, 1,111 రూపాయల దక్షిణ సమర్పించి, ఆపై కొత్త బాధ్యతలు స్వీకరించాను. ఇంకో అద్భుతం ఏమిటంటే, ఇద్దరు సీనియర్స్ వాళ్ళ ఇళ్ళకి దగ్గర్లో పోస్టింగ్ అయ్యారని చెప్పాను కదా, వాళ్ళ స్థానంలో మరో ఇద్దరికి కూడా ప్రమోషన్ వచ్చింది. అంటే ఎవరికీ నష్టం జరగకుండా అందరికీ మేలు జరిగేలా బాబా చూశారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. సబూరీతో ఉండక టెన్షన్ పడినందుకు నన్ను క్షమించు బాబా. మీకు మాటిచ్చినట్లు నా అనుభవాన్ని బ్లాగు ద్వారా మీ భక్తులతో పంచుకున్నాను తండ్రి. కొత్త పోస్టులో నాకు ఎటువంటి ఇబ్బందీ రాకుండా చూడండి తండ్రి. మీ రక్షణలో మేము ఎల్లప్పుడూ ఉండేలా అనుగ్రహించు తండ్రి. అలాగే మీ అనుగ్రహం నా కుటుంబంపై, మీ భక్తులందరిపై ఎల్లప్పుడూ వర్షిస్తూ సదా కాపాడు తండ్రి".


2021, జనవరి 21న మేము బాబుకి నాలుగున్నర నెలల వయసులో వేసే వ్యాక్సిన్ వేయించాము. తరువాత బాబుకి జ్వరం వచ్చింది గానీ మందులు వేస్తే బాబా దయవల్ల జ్వరం తగ్గిపోయింది. కానీ మరుసటిరోజు, ఆ మరుసటిరోజు రాత్రుళ్ళు బాబు అస్సలు నిద్రపోలేదు. రాత్రంతా ఏడుస్తూనే ఉండేవాడు. సముదాయిస్తే ఏదో కొద్దిసేపు నిద్రపోవడం మళ్ళీ హఠాత్తుగా లేచి ఏడవడం చేస్తుండేవాడు. ఎందుకు ఏడుస్తున్నాడో మాకు అర్దం కాలేదు. దాంతో నేను, "బాబా! బాబు ఎందుకు ఏడుస్తున్నాడో మాకు తెలీదు కానీ, వాడికి ఏదైనా సమస్య ఉంటే దాన్ని సమసిపోయేలా చేసి, ఆరోగ్యాన్ని చేకూర్చి చక్కగా నిద్రపోయేలా చూడు తండ్రి" అని బాబాను ప్రార్థించాను. ఆయన దయతో బాబు తరువాత చక్కగా నిద్రపోయాడు. "ధన్యవాదాలు తండ్రి. ఇలానే మీ అనుగ్రహం మా కుటుంబంపై, నీ భక్తులపై ఎల్లపుడూ చూపిస్తూ కాపాడు తండ్రి. ఇంట్లో ఉన్న సమస్యలన్ని త్వరగా సమసిపోయేలా చూడు తండ్రి".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!


మనసు పెట్టి అడగాలేగానీ సాయితండ్రి చెయ్యనిది ఏదీ ఉండదు


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!

ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః!!!

ఓం శ్రీసాయి సకల వ్యాధి నిర్మూలనాయ నమః!!!


శ్రీసాయి బంధువులకు నా నమస్కారాలు. నేనొక శ్రీసాయి భక్తురాలిని. నా పేరు వెంకటలక్ష్మీ. ఈమధ్యకాలంలో నేను కొన్ని ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నాను. విపరీతమైన టెన్షన్, ఒత్తిడి వల్ల బిపి పెరిగిపోవడం జరుగుతుండేది. హాస్పటల్‍కి వెళ్లాలంటే భయంతో మరింత బిపి పెరిగిపోతుండేది. బిపికి టాబ్లెట్ వేసుకోవడం మొదలుపెడితే అది జీవితాంతం కంటిన్యూ చేయాలని డాక్టర్ చెప్తారని ఒకటే ఆందోళన. మనసులో దాని గురించే ఆందోళన చెందుతూ, "బాబా! మీరే నాకు ఏదో ఒక మార్గం చూపించి ఈ టెన్షన్ నుండి నాకు విముక్తి కలిగించండి" అని అనుకుంటూ ఉండేదాన్ని. టెస్టులు చేయిస్తే రిపోర్టులో తెల్ల రక్తకణాల సంఖ్య పెరిగినట్లు, బిపి 175/100 ఉన్నట్లు వచ్చింది. నేను చాలా భయపడిపోయాను. ఆ భయం వల్ల రాత్రిళ్ళు నాకు నిద్రపట్టేది కాదు. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి నిద్రలో, శ్రీసాయి సచ్చరిత్రలోని శ్యామాకి పాము కాటు వేసినప్పుడు బాబా పాము విషాన్ని 'పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము' అని ఆజ్ఞాపించిన విషయం గుర్తుకు వచ్చింది. నేను ఆ వాక్యాన్ని మనసులో తలుచుకోసాగాను. మరుసటిరోజు హాస్పటల్‍కి వెళితే, బిపి 153/83 ఉంది. అంటే నిద్రలో బాబా నాకు ఆ సంఘటనను గుర్తు చేసి తద్వారా నా బ్లడ్ ప్రెజర్ కొంచెం తగ్గించారు. అంతేకాదు, డాక్టరు మందులివ్వడానికి ఒప్పుకోలేదు. అది బాబా నాకిచ్చిన అభయం. ఆ హాస్పిటల్ బాబా మందిరం పై అంతస్తులో ఉంది. అక్కడ బాబా సత్సంగాలు జరుగుతుంటాయి. బాబా ఆ డాక్టర్ ద్వారా నాకు మంచి సలహా ఇప్పించి బిపి టాబ్లెట్లకి అలవాటుపడకుండా చేశారు. అదేరోజు 'సాయి మహారాజ్ సన్నిధి' బ్గాగులో కనిపించిన 'బాబాను ప్రార్థించు, నీకేం కావాలో ఇస్తారు. ఎలాంటి బాధనైనా తొలగిస్తారు' అనే వాక్యం చాలా సంతోపాన్ని కలిగించింది. బాబా నాకోసమే ఆ వాక్యం పంపించారనిపించింది. తరువాత యూట్యూబ్‍లో బిపి నివారణ గురించి ఒక ఆయుర్వేద డాక్టర్ చెప్పిన సలహాను నేను పాటించాను. ఇప్పుడు బిపి 130/80 ఉంది. ఇదంతా నా సాయితండ్రి కృపాకటాక్షాల వల్లే. నిజంగా ఆ సాయితండ్రిని మనసు పెట్టి అడగాలేగానీ ఆయన చెయ్యనిది ఏదీ ఉండదు. "ధన్యవాదాలు బాబా. మీరు మా వెన్నంటుండి నడిపిస్తున్నారని, ప్రతిక్షణం అన్ని విధాలా కాపాడుతున్నారని తెలిసినా భయంవల్ల మేము గ్రహించలేకపోతున్నాము తండ్రి. దయతో బ్లడ్ ప్రెజర్ పూర్తిగా తగ్గిపోయేలా దీవించండి సాయితండ్రి. నాకున్న దడ, ఆందోళన, తలలో మంటల నుండి కూడా ఉపశమనం కలిగించండి సాయితండ్రి. నా ఆరోగ్యం బాగుపడిన తర్వాత మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను". నా అనుభవాన్ని చదివిన సాయి బంధువులకు కృతజ్ఞతలు.


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!


ప్రతి అడుగున తోడుండి కాపాడతారు బాబా


నా పేరు స్వాతి. నేను బాబా భక్తురాలిని. బాబా ప్రతి అడుగున తోడుండి మనల్ని కాపాడతారు. ఈమధ్య బాబా నా రెండు సమస్యలను తీర్చారు. వాటినే నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నేను మా కాంప్లెక్స్ ఓపెనింగ్ పూజయ్యాక మావారి బ్రేస్లెట్, గొలుసు, ఉంగరాలు తీసి ఓ చోట పెట్టాను. ఒక వారం తరువాత ఇంకో ఫంక్షన్‍కి వెళ్తూ వాటికోసం వెతికితే అవి కనిపించలేదు. ఆరోజు పూజ హడావిడిలో అవి మిస్ అయ్యాయేమోనని చాలా టెన్షన్ పడి బాబాకి దణ్ణం పెట్టుకుని, "అవి దొరికితే, 1000 సార్లు మీ నామజపం చేస్తాను" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల 5 నిమిషాల్లో అవి దొరికాయి.


నా భర్తకి, మా అన్నయ్యకి మధ్య మనస్పర్థలు వచ్చి, అన్న కూతురి ఫంక్షన్‍కి రానని మావారు పట్టుబట్టారు. నేను అప్పుడు బాబాకి దణ్ణం పెట్టుకుని, "మావారు ఫంక్షన్‍కి వచ్చేలా చేయండి" అని చెప్పుకున్నాను. తరువాత మా అన్నయ్య ఫోన్ చేసి మావారితో మంచిగా మాట్లాడారు. దాంతో నా భర్త ఫంక్షన్‍కి వచ్చారు. అంతా హ్యాపీగా జరిగిపోయింది. "అన్నిటికీ ధన్యవాదాలు సాయి".


6 comments:

  1. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam she is suffering with disk bulges and bless her to get better Jaisairam she is suffering with disk bulges and bless her Jaisairam

    ReplyDelete
  2. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam she is suffering with disk bulges and bless her to get better Jaisairam she is suffering with disk bulges and bless her to get better Jaisairam

    ReplyDelete
  3. Baba please cure my depression.om Sai ram

    ReplyDelete
  4. ఓం సాయిరాం బాబా సాయి నా వంశీ నన్ను అర్థం చేసుకునేలా చూడు సాయి నా భర్త నన్ను కాపురానికి తీసుకెళ్లేలా చూడు సాయి నన్ను భార్యగా స్వీకరించేలా బాబా చూడు బాబా నిన్నే నమ్ముకుని బతుకుతున్నాను బాబా

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  6. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo