1. ఆపదల నుండి బయటపడేసిన బాబా
2. తోడుగా ఉండి ఇబ్బందులను తొలగిస్తున్న బాబా
3. శాంతపరచిన బాబా
ఆపదల నుండి బయటపడేసిన బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయిభక్తులందరికీ వందనాలు. నా పేరు లక్ష్మి. 'సాయీ' అని పిలిస్తే, 'ఓయీ' అని పలికే దైవం ఆ శిరిడీ సాయినాథుడు. ఆయన మనల్ని ఎల్లవేళలా కాపాడుతుంటారు. బాబా మమ్మల్ని కూడా కొన్ని ఆపదల నుండి రక్షించారు. వాటిని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఆరు నెలల క్రితం(2022, సెప్టెంబర్) మేము నూటికి 3 రూపాయల వడ్డీతో ఇంటి కాగితాలపై అప్పు తీసుకున్నాము. తరువాత వడ్డీ కట్టలేని పరిస్థితిలో బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల కొద్దిరోజుల తరువాత ఒక వ్యక్తి నూటికి రూపాయి వడ్డీతో డబ్బులు ఇస్తామని, వాళ్ళ ఆఫీసుకి రమ్మన్నారు. అయితే మొదట అప్పు ఇచ్చిన వ్యక్తి మా ఇంటి కాగితాలు ఇవ్వడానికి వాయిదాల మీద వాయిదాలు వేస్తూ పోయాడు. అప్పుడు నేను, "మాకేమిటి ఈ పరీక్ష బాబా?" అని బాబాకు మొరపెట్టుకున్నాను. వెంటనే మాకు సమాధానం దొరికింది. ఆ వ్యక్తి మా కాగితాలు మాకు ఇస్తానని కోర్టుకి రమ్మన్నారు. ఆ కాగితాలు తీసుకొని రూపాయి వడ్డీకి డబ్బులిచ్చే అతని ఆఫీసుకి వెళ్లి ముందుకన్నా ఎక్కువ డబ్బులు అప్పుగా తీసుకున్నాము. అలా బాబా దయవలన మేము ఆ సమస్య నుండి గట్టెక్కాము. "శతకోటి వందనాలు బాబా".
2023, జనవరి 18 మధ్యాహ్నం నేను, మా అబ్బాయి వెంకట శివప్రసాద్ బైక్ మీద బయటకి వెళ్ళాము. దారిలో మూడు కుక్కలు దెబ్బలాడుకుని బైక్‌కి అడ్డం వచ్చాయి. పెద్ద ప్రమాదం జరగాల్సి ఉండగా నేను 'సాయినాథ్ మహరాజ్ కీ జై' అని పెద్దగా అరిచాను. 'సాయీ' అని పిలిస్తే 'ఓయీ' అని పలికే మన విరాట్ సాయి ఎంతో దయతో మమ్మల్ని ఆ ప్రమాదం నుండి బయటపడేశారు. వెంటనే మా అబ్బాయి ‘గుండె దడ దడ కొట్టుకుంటుంది’ అని అన్నాడు. నేను కాసేపు బండి మీద కూర్చొని 'ఓంసాయి శ్రీసాయి జయజయసాయి' అనే నామాన్ని చెప్పుకున్నాను. కాస్త స్థిమితపడ్డాక మేము నిదానంగా అక్కడినుండి వెళ్ళిపోయాము. "శతకోటి ధన్యవాదాలు బాబా".
2022, అక్టోబర్ 23, గురువారం మా కుటుంబసభ్యులందరం మా అమ్మ చనిపోయిన తరువాత తదుపరి కార్యక్రమాలు జరిపించడానికి రాజమండ్రి వెళ్ళాము. వెళ్లేముందు నేను బాబాకి హారతి ఇచ్చి వెళ్ళాను. అక్కడ కార్యక్రమాలు ముగించుకొని మధ్యాహ్నం 3 గంటలకి తిరిగి మా వూరు వెళ్ళడానికి బయలుదేరాము. మా అబ్బాయి, కోడలు, మా తమ్ముడు మనవరాళ్లు, మనవడు బైక్ మీద వెళ్లిపోయారు. నేను, మా అమ్మాయి రైల్లో వెళదామని స్టేషన్‌కి వెళ్లి, వైజాగ్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ ఎక్కాము. తోటి ప్రయాణికులు, “ఈ రైలు కాకినాడ వెళ్ళదు, సామర్లకోటలో దిగాల”ని చెప్పారు. అప్పటికే రైలు బయలుదేరింది. కంగారులో మా అమ్మాయి రైలులో నుండి కిందికి పడిపోయింది. తనకోసం నేనూ రైలులో నుండి దూకేశాను. స్టేషన్లో ఉన్నవాళ్ళు 'ఏమైంది?' అంటూ మా చుట్టూ చేరారు. కానీ ఆ ప్రమాదంలో నాకుగానీ, మా అమ్మాయికిగానీ చిన్న దెబ్బ కూడా తగలలేదు. కాకపోతే నా మొబైల్ రైలులో పడిపోయింది. ఏదేమైనా బాబా దయవలన మేము ఆ ప్రమాదం నుండి బయటపడ్డాము. "ప్రమాదాల నుండి బయటపడేసిన మీకు శతకోటి నమస్కారాలు బాబా. జన్మజన్మలకి మీకు ఋణపడి ఉంటాము తండ్రీ".
తోడుగా ఉండి ఇబ్బందులను తొలగిస్తున్న బాబా
సాయిపరివారమందరికీ నా నమస్కారాలు. నా పేరు స్వాతి. నేను గత 6 సంవత్సరాలుగా సాయిభక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఇప్పుడు పంచుకుంటున్నాను. ఒకరోజు నా చేతి ఉంగరాన్ని తీసి ఓ చోట పెట్టి మర్చిపోయాను. నెల రోజుల తరువాత గుర్తొచ్చి ఇల్లంతా వెతికినా ఆ ఉంగరం దొరకలేదు. నాకు చాలా భయమేసి బాబా ఫోటోని చూస్తూ, 'ఉంగరం ఎక్కడుందో చూపించమ'ని బాబాను అడిగాను. వెంటనే ఆ ఉంగరం దొరికింది. కొన్నిరోజుల తరువాత నా మెడలోని గొలుసు కనిపించలేదు. చాలా భయపడి బాబాని స్మరిస్తూ ఇల్లంతా వెతికితే దొరికింది. 2023, జనవరిలో సుమారు 20 రోజులపాటు నా ఎడమచేయి చాలా నొప్పిగా ఉండేది. నేను భయంతో బాబాని తలచుకొని ఊదీ రాస్తే కొంచెం కొంచెంగా నొప్పి తగ్గుముఖం పట్టింది. ఇంకా నేను చేసే ఉద్యోగంలో నాకు చాలా ఇబ్బందులు వచ్చాయి. బాబాని తలచుకున్న ప్రతిసారీ ఆయన నాకు తోడుగా నిలిచారు. "థాంక్యూ సో మచ్ బాబా. ఇలాగే ఎప్పుడూ నాకు తోడుగా ఉండండి బాబా. ఇంకా నాకు మూడు సమస్యలున్నాయి. అవి పరిష్కారించు తండ్రీ".
సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
శాంతపరచిన బాబా
నా పేరు ఇందిర. నేను హైదరాబాద్ నివాసిని. నేను సాయిభక్తురాలిని. నేను ఈ బ్లాగులోని అన్ని అనుభవాలు చదువుతాను. ఆయా భక్తులందరికీ బాబాపై ఉన్న విశ్వాసాన్ని నేను అభినందిస్తున్నాను. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2023, జనవరి 16 రాత్రి నా భర్త ఏ కారణం లేకుండానే నా మీద కోప్పడి అదుపులేకుండా నన్ను కొట్టారు. నేను ఆయన పరిస్థితిని అర్థం చేసుకొని, 'ఓంసాయి శ్రీసాయి జయజయసాయి' అని జపించి, "బాబా! దయచేసి మావారిని శాంతింపజేయండి" అని ప్రార్థించాను. బాబా దయవల్ల అరగంట తర్వాత మావారు శాంతించారు. అప్పుడు నేను ఈ అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకోవాలని అనుకున్నాను. అనుకున్నట్లే ఇప్పుడు మీతో పంచుకున్నాను. "ధన్యవాదాలు బాబా. ప్లీజ్ బాబా, మీరు ఏదైనా చేయగలరు. దయచేసి నా భర్త ప్రవర్తనను మార్చండి బాబా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం సాయిరాం సాయి రేపు నా భర్త పుట్టినరోజు సాయి మొట్టమొదట తనకి కనీసం విష్ చేసా అవకాసం కూడా నాకు లేదు సాయి చాలా బాధగా ఉంది తొందరగా మమ్మల్ని కలపండి తనని అర్థం చేసుకునేలా చూడు సాయి. నా మీద ఉండే కోపం అంత తగ్గిపోయేలా చూడు సాయి తను మనస్ఫూర్తిగా నన్ను భార్యగా స్వీకరించేలా చూడు సాయి. నాకు భర్తతో కలిసి ఉండి బ బిడ్డల్ని కనే అదృష్టాన్ని ప్రసాదించు బాబా సాయి
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me