1. శ్రీసాయి నెరవేర్చిన కోరికలు
2. పూజకు ఇబ్బంది లేకుండా దయ చూపిన బాబా
3. దగ్గు తగ్గేలా అనుగ్రహించిన బాబా
శ్రీసాయి నెరవేర్చిన కోరికలు
ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!! శ్రీసాయిబాబా పాదారవిందాలకు నా మనఃపూర్వక నమస్కారాలు. నా పేరు ఉమ. మాది కృష్ణ జిల్లాలోని ఘంటసాల గ్రామం. 2022, కార్తీకమాసంలో ఒకరోజు రాత్రి నా భర్తకి ఆక్సిడెంట్ అయినట్లు నాకు కల వచ్చింది. మెలుకువ వచ్చి చూస్తే తెల్లవారుఝామున గం. 3:20 నిమిషాలైంది. వెంటనే నేను నా మనసులో శ్రీసాయిబాబాకి నమస్కరించుకుని, "ఈ కార్తీకమాసం పూర్తయ్యేలోపు నేను శ్రీశైలం వెళ్లి, అక్కడ దీపారాధన చేసేలా అనుగ్రహించండి" అని అనుకున్నాను. ఆ తండ్రి దయవల్ల కార్తీకమాసంలో చివరిరోజున నేను మా అన్నయ్య, వదినలతో కలిసి శ్రీశైలం వెళ్లి, అక్కడ దీపారాధన చేశాను. శ్రీమల్లన్నస్వామి దర్శనం చక్కగా జరిగింది.
మా అన్నయ్య, వదినలకు పెళ్ళై 8 సంవత్సరాలైన వాళ్ళకి సంతానం కలగలేదు. నేను అదివరకు "అన్నయ్యవాళ్ళకు ఎదో విధంగా ఒక బిడ్డ దక్కాలి" అని అనుకున్నాను. అన్నయ్యవాళ్ళు ఇద్దరు డాక్టర్లకి ఎవరైనా పిల్లలుంటే, దత్తత తీసుకుంటామని చెప్పారు. మేము శ్రీశైలం నుండి వచ్చిన తరువాత 3 రోజులకి, "ఒక పాప పుట్టింది, తీసుకుంటారా?" అని మా ఆయనకి ఒక ఫోన్ వచ్చింది. అందుకు మా అన్నయ్యవాళ్ళు సరేననడంతో మరుసటిరోజు మేమందరం వెళ్లి, ఆ పాపని తీసుకున్నాము. అయితే ఆ పాప బరువు చాలా తక్కువగా ఉంది, ఇన్ఫెక్షన్ కూడా ఉంది. అందువల్ల పాపని హాస్పిటల్లోనే ఉంచాల్సి వచ్చింది. అప్పుడు నేను మనసులో, "బాబా! మీ దయవలన పాపకి ఇన్ఫెక్షన్ తగ్గి, త్వరగా కోలుకుని ఇంటికి రావాలి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవలన 10 రోజులకు పాపకి తగ్గి క్షేమంగా ఇంటికి వచ్చింది. "ధన్యవాదాలు బాబా. మీ దయతో పాప క్షేమంగా, ఆరోగ్యంగా, నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఉండాలి తండ్రి. అలాగే మా అమ్మవాళ్ల కుటుంబమంతా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండేలా అనుగ్రహిచండి బాబా".
2022, నవంబర్లో నేను ఒక స్టోన్స్ నెక్లెస్ చేయిద్దామని మాకు దగ్గరలో ఉన్న ఒక బంగారం షాపులో ఆర్డర్ ఇచ్చాను. ఆ షాపతను, "ఇక్కడ అంత బాగా చెయ్యటం కుదరదు, అది చాలా కష్టం. వేరేచోట చేయిస్తాము. అయితే అక్కడివాళ్ళు ఏమైనా తేడా వస్తే, వస్తువు మార్చరు. కాబట్టి ఎలా ఉన్న మీరు ఉంచుకోవాల్సిందే" అని చెప్పారు. అది విని నాకు కొంచెం ఆందోళనగా అనిపించి మనసులో, "బాబా! నేను అనుకున్న విధంగా అనుకున్న బడ్జెట్లో వస్తువు అందంగా వచ్చేలా చూడండి" అని అనుకున్నాను. తరువాత డిసెంబర్ రెండో వారంలో షాపతను వస్తువు తీసుకుని వచ్చారు. అది చాలా అందంగా, అనుకున్న విధంగా, అనుకున్న బడ్జెట్ కన్న తక్కువగానే ఉంది. "ధన్యవాదాలు బాబా".
పూజకు ఇబ్బంది లేకుండా దయ చూపిన బాబా
నా పేరు శివ. మాది నర్సాపురం. 2022లో నేను అయ్యప్ప మాల వేసుకున్నాను. ఆ సమయంలో తుఫాన్ రావడం, అప్పుడు కూడా నేను రోజూ చన్నీళ్ల స్నానం చేయడంతో నాకు తలనొప్పి, గొంతునొప్పి వచ్చి నన్ను చాలా బాధపెట్టాయి. రెండు రోజులు పూజ కూడా సరిగా చేయలేకపోయాను. మూడో రోజు రాత్రి పూజ జరుగుతున్నప్పుడు గొంతు బాగా ఇబ్బందిపెట్టింది. అజిత్రోమైసిన్ టాబ్లెట్ వేసుకున్నా ఉపయోగం లేకపోయింది. అప్పుడు నేను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ఓపెన్ చేస్తే, అక్కడ నా లాంటి సమస్యకు సంబంధించిన ఒక భక్తుని అనుభవం ఉంది. ఆ భక్తుడు తనకి గొంతునొప్పి వస్తే, తను ఆ నొప్పి తగ్గేలా అనుగ్రహించమని బాబాను వేడుకున్నానని, బాబా దయతో తనకి నొప్పి తగ్గిందని పంచుకున్నాడు. అది చదివి నేను షాకయ్యాను. వెంటనే నేను బాబాని మనసులో తలుచుకుని, "బాబా! నాకు కూడ గొంతునొప్పి తగ్గి, రేపు ఉదయం పూజకు ఏ ఇబ్బంది లేకుండా చూడండి" అని బాబాను ప్రార్థించి పడుకున్నాను. మరుసటిరోజు ఉదయానికి గొంతునొప్పి ఉందికానీ, పూజలో పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. బాబా దయవల్ల పూజంతా సవ్యంగా జరిగింది. "ధన్యవాదాలు బాబా".
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
దగ్గు తగ్గేలా అనుగ్రహించిన బాబా
సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు స్వాతి. మాది శ్రీకాకుళం. మా అమ్మానాన్నలిద్దరికీ గుండె ఆపరేషన్ జరిగింది. 2022, ఏప్రిల్ 6వ తేదీన నాన్న కాలం చేసారు. తర్వాత అమ్మ ఒంటరిగా ఉంటున్నా దగ్గరుండి చూసుకునే అదృష్టం నాకు లేకపోయింది. ఒకసారి అసలే ఆరోగ్యం బాగాలేని అమ్మ పొడి దగ్గుతో మరింత బాధపడసాగింది. ఒక్కోసారి ఆమె దగ్గుతుంటే, నాకు చాలా భయమేసి ఊపిరి ఆగిపోయేంత పని అవుతుండేది. ఒకరోజు రాత్రి 9 గంటల సమయంలో నేను అమ్మతో ఫోన్లో మాట్లాడుతుండగా అమ్మకి చాలా తీవ్రంగా దగ్గు వచ్చింది. ఎంతలా అంటే దగ్గటం కూడా తనకి చాలా కష్టంగా ఉంది. ఆమె అలా బాధపడుతుంటే నేను తట్టుకోలేక, "బాబా! అమ్మ ఆరోగ్యం నాకు చాలా అవసరం. ఆమె దగ్గుతో చాలా బాధపడుతోంది. ఆ దగ్గుతో తనకి నిద్రపట్టడం లేదు. దగ్గు కాస్త తగ్గుముఖం పట్టి అమ్మ చక్కగా నిద్రపోయేలా చూడు బాబా" అని బాబాను ప్రార్థించాను. మరుసటిరోజు ఉదయం అమ్మ ఫోన్లో, "దగ్గు తగ్గింది" అని చెప్పింది. అది విని నాకు చాలా ఆనందంగా అనిపించింది. "బాబా! మీ కరుణకు నేను చాలా కృతజ్ఞురాలిని. నీ మహిమ చెప్పనలవి కాదు. అందరినీ కాపాడు బాబా. మీ దరికి చేరే మార్గాన్ని మాకు చూపించు బాబా".


Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
Baba me daya valana Kalyan ki marriage ipoindi Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu house koni pettandi baba pl
ReplyDelete