సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1421వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయతో ఆరోగ్యం - ఉద్యోగం
2. శ్రీసాయి ఆశీస్సులు
3. ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా దయ చూపిన బాబా

బాబా దయతో ఆరోగ్యం - ఉద్యోగం


సాయి బంధువులకు నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి కృతజ్ఞతలు. నేను ఒక సాయిభక్తురాలిని. నాపేరు హరిత. నేను ఇప్పుడు బాబా ఇటీవల నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను పంచుకుంటున్నాను. 2022, నవంబర్ నెలలో ఒక శనివారంనాడు హఠాత్తుగా నాకు జ్వరం వచ్చింది. టెంపరేచర్ చూస్తే 102 డిగ్రీలు ఉంది. నాకు భయమేసి మరుసటిరోజు బ్లడ్ టెస్టు చేయిద్దామనుకున్నాను. కానీ ల్యాబ్‍కి కాల్ చేస్తే, "ఆదివారం టెస్టు చేయడం కుదరదు. సోమవారం రండి, చేస్తాము" అని చెప్పారు. సరేనని సోమవారం టెస్టు చేయిస్తే, వైరల్ ఫీవర్ టైఫాయిడ్ అని వచ్చింది. కానీ డాక్టర్ నాకున్న లక్షణాలను చూసి, "ఒకసారి డెంగ్యూ టెస్టు చేయించండి" అని అన్నారు. నేను ప్లేట్లెట్స్ గురించి భయపడి, "బాబా! డెంగ్యూ పాజిటివ్ వచ్చినా పర్లేదుగాని హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితి రాకూడదు. ప్లేట్లెట్ల సమస్య రాకుండా మామూలు జ్వరంలా ఇంట్లోనే టాబ్లెట్లతో తగ్గిపోతే, మీ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని సాయికి మొక్కుకున్నాను. డెంగ్యూ పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది కాని, ప్లేట్లెట్లు నార్మల్‍గానే ఉన్నాయి. సాయి దయవల్ల నేను ఇంట్లోనే ఉండి టాబ్లెట్లు వేసుకున్నాను. డాక్టర్ ఇంటికే వచ్చి ఇంజక్షన్స్ చేసి వెళ్లారు. నాలుగు రోజుల్లోనే జ్వరం తగ్గింది. కొంచెం నీరసంగా ఉండటం తప్ప మరే సమస్య లేకుండా నా ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. బాబానే నాకు తోడుగా ఉండి నాకు ఎటువంటి నొప్పి తెలియకుండా నా ఆరోగ్యం బాగు చేసారు. "ధన్యవాదాలు బాబా".


ఇటీవల మా అన్నయ్య మాకు చెప్పకుండా ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. తరువాత 15 రోజులకి తను నాతో, "నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్లి అందులో సెలెక్ట్ అయ్యానుకాని, వాళ్లు ఇంకా కంఫర్మ్ చేయలేదు. నాకు టెన్షన్‍గా ఉంది చెల్లి. బాబాకి దణ్ణం పెట్టుకో" అని చెప్పాడు. నేను తనతో, "ఏం టెన్షన్ పడకు అన్నయ్య. నీకు ఆ ఉద్యోగం వస్తుంది" అని అన్నాను. తరువాత తనకి ఒక మెయిల్ వచ్చింది. అది చదివి, "సోమవారం కాల్ చేస్తారు" అని చెప్పాడు. కాని సోమవారం కాల్ రాలేదు. అప్పుడు నేను, "బాబా! అన్నయ్యకి కాల్ వచ్చేలా చేయండి. మీ దయతో అన్నయ్యకి ఆ ఉద్యోగం కంఫర్మ్ అయితే, మీ బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కునున్నాను. సరిగ్గా గురువారంనాడు(2022, డిసెంబర్ 1) కంపెనీ వాళ్ళు కాల్ చేసి, "రెండు రోజుల్లో ఆఫర్ లెటర్ పంపిస్తాం" అని చెప్పారు. కాని రాలేదు. అన్నయ్య నాతో ఫోన్లో, "ఆఫర్ లెటర్ వచ్చేస్తే నాకు టెన్షన్ ఉండదు" అని అన్నాడు. "ఏం కాదు. ఖచ్చితంగా ఆఫర్ లెటర్ వచ్చేస్తుంది. నువ్వేం కంగారుపడకు అన్నయ్య" అని చెప్పాను. ఆ సమయంలో అన్నయ్య ట్రైన్‍లో ఉన్నాడు. తను హైదరాబాద్ నుండి ఇంటికి వస్తున్నాడు. మరుసటిరోజు ఉదయం ఇంటికి చేరుకుంటాడు. నేను మా అమ్మతో, "అన్నయ్య ఫోన్ చేసాడు. తను ట్రైన్లో ఉన్నాడు. ఆఫర్ లెటర్ రాలేదని చాలా టెన్షన్ పడుతున్నాడు. రేపు గురువారం కదా! రేపు వస్తుంది అమ్మ. పోయిన వారంలో కూడా గురువారమే వచ్చింది కదా! ఈసారి కూడా అలాగే వస్తుంది" అని చెప్పాను. తరువాత ఇద్దరమూ పడుకున్నాము. మరుసటిరోజు ఉదయం అన్నయ్య ఇంటికి వచ్చాడు. ఆరోజు గురువారం (2022, డిసెంబర్ 8) కావడం వల్ల అన్నయ్య వచ్చేటప్పటికి నేను బాబా పూజ చేసుకుంటున్నాను. పూజయ్యాక వెళ్ళి, "అన్నయ్యా! ఈరోజు ఆఫర్ లెటర్ వచ్చేస్తుందిలే, బాబా చెప్పమన్నాడు. నువ్వు టెన్షన్ పడకు" అని అన్నాను. తరువాత అన్నయ్య వర్క్ చేసుకుంటుండగా నేను గురువారం సచ్చరిత్ర గ్రూపులో ఉన్న అధ్యాయం చదవటానికి పిడిఎఫ్ ఓపెన్ చేసి, "బాబా! ఈరోజు కాల్ వస్తుందని నువ్వు చెప్పినట్లు అన్నయ్యకి ధైర్యం చెప్పాను. నేను చెప్పినందుకైనా ఈరోజు కాల్ వచ్చేటట్లు చేయండి బాబా" అని మనసులో అనుకున్నాను. అంతలోనే  అన్నయ్య, "చెల్లి, ఆఫర్ లెటర్ వచ్చింది" అని అన్నాడు. నిజంగా నాకు ఒక అద్భుతంలా అనిపించింది. ప్రక్కనే ఉన్న బాబాతో మాట్లాడితే ఆయన వెంటనే నాకు సమాధానం చెప్పినట్లనిపించి చాలా చాలా ఆనందానుభూతి కలిగింది. బాబా దయవల్ల అన్నయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇలా బాబా నాతో ఉన్నాననే ధైర్యాన్ని ఎప్పటికప్పుడూ ఇస్తూనే ఉన్నారు. పిలవగానే నీకు నేనున్నాను అని సహాయం చేస్తున్నారు. నాతోనే ఉండి నన్ను రక్షిస్తున్న శ్రీసాయికి ధన్యవాదాలు తెలుపుకుని, ఆయనకి మాటిచ్చినట్లు అదేరోజు రాత్రి నా అనుభవాలు వ్రాసి బ్లాగుకి పంపాను. "సాయీ! ఎల్లప్పుడూ ఇలానే నాకు తోడుగా ఉంటూ భార్యాభర్తలను కలిపి నా బాధను, సమస్యను తొలగించు తండ్రి. త్వరలోనే ఆ అనుభవాన్ని కూడా పంచుకునేలా అనుగ్రహించు సాయి".


శ్రీసాయి ఆశీస్సులు


నా పేరు నళిని. నేను ఒక సాయి భక్తురాలిని. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన చిన్నిచిన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను. నేను నా నిశ్చితార్థానికి బాబాను రమ్మని పిలిచాను. తరువాత నేను ఆయన రాకకోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తుండగా ఒక ఆవిడ బాబా ఫోటోని గిఫ్ట్ గా నాకు ఇచ్చింది.  బాబాను చూసి నాకు చాలా చాలా సంతోషమేసింది. ఒకసారి నా ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్‍కి వెళ్లాలనుకున్నాను. కానీ స్కాన్ తీస్తారేమోనని భయపడ్డాను. అప్పుడు 'రేపు 11 గంటలకి నీకు ఒక శుభవార్త తెలుస్తుంది' అని బాబా సందేశం వచ్చింది. బాబా చెప్పినట్లే మరుసటిరోజు 11 గంటలలోపు నా హెల్త్ చెకప్ జరిగింది. స్కాన్ చేయకుండానే అంతా బాగుంది అని చెప్పారు డాక్టర్.  ఇలా ఎన్నోసార్లు నేను సమస్యలో ఉన్నప్పుడు బాబా ఏదో ఒక రూపంలో నాకు సమాధానమిచ్చారు.


ప్రస్తుతం నేను గర్భవతిని. ఒకసారి నా ఆరోగ్యం బాగాలేకపోతే, "బాబా! నాకు, నా కడుపులోని బిడ్డకు అంతా మంచిగా ఉండాలి" అని బాబాను వేడుకున్నాను. తరువాత హాస్పిటల్‍కి వెళ్లి, డాక్టరుని కలిసి నా సమస్య చెప్పి స్కాన్ తీస్తారేమో అనుకున్నాను కానీ, బాబా అనుగ్రహం వల్ల స్కాన్ ఏం లేకుండానే డాక్టర్, "సమస్యేమీ లేదు. అంతా మంచిగానే ఉంది" అని అన్నారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా”


నాకు ఏ కష్టం వచ్చినా బాబా నాకు తోడుగా ఉంటారు. ఆయన నన్నే కాకుండా నా కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇటీవల నా తల్లిదండ్రులు తమిళనాడులోని దేవాలయాలు సందర్శించడానికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ అడుగడుగునా ఏదో ఒక ఆటంకం వచ్చి వాళ్ళ ట్రిప్ ఆగిపోయేది. అప్పుడు నేను, "బాబా! అమ్మవాళ్ళు మంచిగా వెళ్ళొస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల వాళ్ళ ట్రిప్ అంతా మంచిగా జరిగింది. "ధన్యవాదాలు బాబా". 


మేము ఏడవ నెలలో నా సీమంతం పెట్టుకున్నాము. అయితే ఫంక్షన్‍కి రెండు రోజులు ముందు నాకు విపరీతమైన ఒళ్ళునొప్పులు వచ్చి అస్సలు ఓపిక లేకపోయింది. 'అందరినీ ఆహ్వానించాము, ఫంక్షన్ ఎలా జరుగుతుందో' అని టెన్షన్ పడ్డాను. కానీ బాబాని తలుచుకుని కొద్దిగా ఊదీ నొప్పి ఉన్న చోట రాసి, మరికొంత ఊదీ నీళ్లలో కలుపుకుని తాగాను. అలా ఊదీ తీసుకున్నానో, లేదో నొప్పులు తగ్గిపోయాయి. ఫంక్షన్ కూడా చాలా ఘనంగా జరిగింది. "ధన్యవాదాలు బాబా. ఎప్పుడూ మీరు నాతో ఉంటారని ఆశిస్తూ.. ఎప్పటికీ మీ భక్తురాలు నళినీ".


ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా దయ చూపిన బాబా


సాయి భక్తులకి నమస్కారం. నేను ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. అందులో ఒక ప్రాజెక్ట్ కి వర్క్ చేయాలని అనుకున్నాను. కానీ ఆ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేసేవాళ్ళ జాబితా విడుదల చేసినప్పుడు అందులో నా పేరు రాలేదు. దాంతో నాకు చాలా ఆలోచనలు వచ్చాయి. కంపెనీవాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థంకాక నా ఉద్యోగానికి ఏమైనా ఇబ్బంది వస్తుందేమోనని భయపడి, "బాబా! నా ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆశీర్వదించండి. ఏ ఇబ్బంది లేకుంటే మీ కృపను తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఏ ఇబ్బంది రాలేదు. "ధన్యవాదాలు బాబా. మీ దయవల్ల నా ఉద్యోగానికి ఏ ఇబ్బంది లేదు కానీ నన్ను ఆ ప్రాజెక్ట్ లో వేసేలా అనుగ్రహించండి బాబా. నేను ఎప్పుడూ మిమ్మల్ని ఒక్కటే కోరుకుంటున్నాను, 'నా తండ్రి స్థానంలో మీరు సదా నా వెంట ఉండండి' ".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీసాయినాథ్ మహారాజ్ కీ జై!!!


4 comments:

  1. ఓం సాయి రామ్ ం బాబా నన్ను నా వంశీని కలుపు బాబా నా కాపురాన్ని నిలబెటు బాబా తను నన్ను అర్థం చేసుకునేలా చూడు సాయి ప్లీజ్ బాబా తనంటే నాకు చాలా అంటే చాలా చాలా ఇష్టం బాబా తనకు దూరంగా ఉండి నరకం అనుభవిస్తున్నాను బాబా నేను చాలా అవమానాలు ఎదుర్కొంటున్నాను సాయి దయ ఉంచి కాపాడు తండ్రి నా భర్త నా కోసం వచ్చేలా ఆశీర్వదించు స్వామి నేను కూడా నా అనుభవాన్ని బ్లాక్లో పంచుకుంటాను సాయి

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. 🙏🕉️✡️🙏 ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి.. సాయినాథ మీరే దిక్కు మీరే రక్ష మీరు తప్ప నాకు ఎవరూ లేరు ఈ లోకంలో.. మా భారం అంతా మీ దివ్యమైన పాదాల పైన వేసి నిశ్చింత గా ఉన్నాము తండ్రి.. మమ్మల్ని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుతున్న శిరిడి సాయినాథ మీకు ఇవే మా సాష్టాంగ దండ ప్రణామములు..

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo