సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1405వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయిని నమ్ముకుంటే మనకు భయముండదు
2. ఎప్పుడూ తోడుగా ఉండి కాపాడే బాబా

సాయిని నమ్ముకుంటే మనకు భయముండదు


సాయి భక్తులకి నా నమస్కారాలు. మీకు ఎల్లవేళలా శ్రీసాయి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తురాలిని. నా అనుభవాల గురించి ఏమని చెప్పను? ఒకటా, రెండా నా జీవితమంతా సాయి అనుభవాల జల్లు కురిపిస్తూనే ఉన్నారు. నా జీవితమే సాయి భిక్ష. నేను బ్రతికి ఉన్నానంటే ఆయన వల్లే. నా జీవితంలో అతిపెద్ద సంఘటన జరిగింది. అది ప్రస్తుతం కూడా జరుగుతుంది. దాన్ని భక్తులతో పంచుకోలేను కానీ, బాబా దయతో దాని నుండి బయటకు వస్తానని నమ్ముతున్నాను. ఆయన నన్ను కాపాడుతానని మాట ఇచ్చారు. ఇక అసలు విషయానికి వస్తే... ఇటీవల మా అమ్మమ్మకి విపరీతంగా విరోచనాలు, వాంతులు అయ్యాయి. ఆమె వయసు దృష్ట్యా తను అసలు కోలుకోలుకుంటుందా అన్న సందేహం మాకు కలిగింది. కానీ బాబాని నమ్ముకుంటే జరగనిది ఏముంటుంది? నేను ఆయనకు, "అమ్మమ్మ ఆరోగ్యం  మంచిగా ఉంటే 'సాయి భక్తుల అనుభవమాలిక'లో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. అంతే, అప్పటినుంచి అమ్మమ్మ కోలుకోవడం మొదలుపెట్టింది. "థాంక్యు బాబా".


మా అక్క కూతురుకి ఎంసెట్లో చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది. మామూలుగా అయితే ఆ ర్యాంకుకి ఇంజనీరింగ్ సీటు రాదు. కానీ బాబాను వేడుకుంటే అవ్వనిది ఏముంటుంది? ఆయన దయతో తనకి సి.ఎస్.ఈ(Computer Science Engineering) సీటు వచ్చింది. అది కూడా మొదటి కౌన్సిలింగ్‍‍లోనే. అసలు తను ఎంసెట్ పాసవ్వడమే బాబా కృప. అలాంటిది సీటు కూడా వచ్చింది. ఇది నిజంగా అతిపెద్ద బాబా మిరకిల్. ఆయన చిన్న జ్వరం మొదలుకుని ఎంత కష్టమైన మనకి ఎప్పుడూ అండగా ఉంటారు. "థాంక్యూ బాబా. నా మనసులో ఒక బలమైన కోరిక ఉంది. అది తీరుస్తారని నమ్ముతున్నాను బాబా. నా బిడ్డని కాపాడి సుఖంగా ఉండేటట్టు చూడు బాబా. మీ పాదాలకి నా వందనాలు. మీ దర్శనానికి శిరిడీ వస్తున్నాను బాబా. ఆ అదృష్టాన్ని ప్రసాదించినందుకు మీకు ధన్యవాదాలు బాబా".


మా బాబు మాటిమాటికి అనారోగ్యం పాలవుతుంటాడు. కానీ బాబా దయవలన తొందరగానే కోలుకుంటాడు. ఆయన మనతో ఉంటే మనకు ఏదీ అసాధ్యం కాదు కదా! అయితే ఈ మధ్య ఒక నెల రోజులపాటు మా బాబు జలుబు, దగ్గుతో బాధపడ్డాడు. హాస్పిటల్‍కి వెళ్తే మందులిచ్చారు. తర్వాత ఒకరోజు బాబుకి విపరీతంగా దగ్గు వచ్చింది. దాంతో మాకు చాలా భయమేసింది. అప్పటికి రెండు రోజుల ముందే బాబుని హాస్పిటల్‍కి తీసుకెళ్తే డాక్టర్ నెమ్మదిగా తగ్గుతుందని చెప్పారు. అందువలన ఇప్పుడు తీసుకెళ్లినా అలానే చెప్తారని నేను, "ప్లీజ్ బాబా, రేపటికల్లా బాబుకి దగ్గు తగ్గితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకుని ఆయన మీద భారం వేసాను. అంతే, బాబా అద్భుతం చేసారు. బాబుకి దగ్గు తగ్గింది. "థాంక్యూ బాబా".


మూడు నెలలకొకసారి మా మామయ్య హార్ట్ స్పెషలిస్ట్ దగ్గర చెకప్ చేయించుకుంటారు. అలా ఈమధ్య వెళ్ళినప్పుడు డాక్టరు, "హార్ట్ నెమ్మదిగా పని చేస్తుంది" అని చెప్పారు. అది విని మావయ్య చాలా కంగారు పడిపోయారు. డాక్టర్ ఒక టాబ్లెట్ గురించి చెప్పి, ఆ టాబ్లెట్ వేసుకోవడం మానేయమని చెప్పారు. కానీ మావయ్యవాళ్ళు చాలా భయపడుతూ మూడురోజుల తర్వాత మళ్ళీ చెక్ చేయించుకోవడానికి వెళ్లారు. అప్పుడు నేను, "బాబా! ఏ సమస్యా లేకుండా చూస్తే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల ఈసీజీలో గుండె నార్మల్‍గా పని చేస్తుందని వచ్చింది. "థాంక్యూ బాబా. నాకు అన్నీ మీరే తండ్రి. నా మనసులో ఉన్న కోరిక మీకు తెలుసు. దయచేసి ఈ సంవత్సరం ఆ కోరికను తీర్చండి బాబా".


ఎప్పుడూ తోడుగా ఉండి కాపాడే బాబా


"ఓ సాయినాథా మీకు వందనమయ్య, మీ చరణాలే నాకు శరణమయ్య". సాయి భక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. ఆ సాయినాథుడు నన్ను కష్టాలు, బాధలు నుండి ఎలా గట్టెక్కించారో మీ అందరితో ఈ బ్లాగు ద్వారా పంచుకుంటున్నందుకు నాకు ఆనందంగా ఉంది. మేము కష్టపడి కూడబెట్టుకున్న పెద్ద మొత్తాన్ని మాకు బాగా తెలిసిన వాళ్ళు, అవసరం కోసం తొందరగా తిరిగి ఇస్తామని మావద్ద తీసుకున్నారు. కానీ మూడేళ్లు నడుస్తున్నా మా డబ్బు మాకు తిరిగి ఇవ్వలేదు. నేను బాబా ముందర సమస్యను చెప్పుకుని, "మా డబ్బు మాకు తిరిగి వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల కొద్దిరోజులకి వాళ్లకు ఇవ్వవలసిన వాళ్లు డబ్బులిస్తే, ఆ డబ్బులు మాకు తెచ్చి ఇచ్చారు. "ధన్యవాదాలు బాబా".


ఒక సమస్య తీరింది అనుకున్నంతలోనే నాకు ఒక ఆరోగ్య సమస్య వచ్చి, "బయాప్సీ చేయాల"ని డాక్టర్ చెప్పారు. కానీ నాకు గుండె సమస్య ఉన్నందున అనస్తీషియ ఇచ్చేందుకు ఆలోచనలో పడ్డారు. నేను నా సమస్యను బాబా పాదాల వద్ద చెప్పుకుని, "రిపోర్టులో ఏమీ లేదని చెప్తే, మీకు వస్త్రం సమర్పించుకుంటాన"ని అనుకుని హాస్పిటల్‌కి వెళ్లాను. అనస్తీషియ ఇచ్చేటప్పుడు నేను 'బాబా బాబా' అని అనుకున్నాను(మత్తులో కూడా నేను బాబాను తలుస్తూనే ఉన్ననట). "ఆ మత్తులో బాబా నాకు కాషాయ వస్త్రాలు ధరించి కూర్చున్నట్లు కనిపించారు. మళ్లీ అంతలోనే తెల్లని వస్త్రాలలో కనిపించి చిన్న బంతి పరిమాణంలో ఉన్న ఒక దానిని (స్పష్టంగా కనిపించలేదు) పట్టుకుని, దీన్ని తీసేసాను. ఇక భయం లేదు" అని అన్నారు. కొద్దిరోజులకు వచ్చిన రిపోర్టులో అంతా నార్మల్ అని వచ్చింది. "ధన్యవాదాలు బాబా".


మాకు మా పెద్దలు కట్టించిన గుడి ఒకటి ఉంది. ఆ గుడిలో స్వామివారికి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఉత్సవాలలో భాగంగా ఒకరోజు వ్రతం చేసి, భోజనాలు పెట్టాలని సంకల్పించాము. అయితే ఉత్సవానికి నాలుగు రోజులు ముందు నుండి బాగా వర్షాలు పడ్డాయి. ఆ పరిస్థితుల్లో ఉత్సవం ఎలా చేయాలో మాకు అర్థం కాలేదు. నేను బాబాను, "ఉత్సవం నిర్విఘ్నంగా జరిగితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని వేడుకుని ముందురోజు సాయంత్రం షామియానాలు, డెకరేషన్లు అన్నీ చేయించాము. ఆ రాత్రంతా భారీ వర్షం పడి షామియానాలు పడిపోయాయి. మావారు ఆ రాత్రంతా కాస్త ఆందోళనగానే గడిపారు. నేను, "బాబాపై భారం వేసి కార్యక్రమాలు మొదలుపెట్టమ"ని చెప్పాను. వంటలు వండి, భక్తులందరూ తిన్న తర్వాత వర్షం మొదలై రాత్రి వరకు పడింది కానీ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం కలగలేదు. ఇదంతా నా తండ్రి ఆ సమర్థ సద్గురు శ్రీసాయినాథుని దయనే. ఇలా బాబా నాకు ఎప్పుడూ తోడుగా ఉండి కాపాడుతున్నారు. "బాబా! ఎల్లప్పుడూ నీ చల్లని చూపు మా మీద ఉండేటట్లు అనుగ్రహించు తండ్రి. అలాగే మాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి ఎప్పుడూ మీ పాదాలనే తలుస్తూ ఉండేలా అనుగ్రహించు తండ్రి".



4 comments:

  1. Sai nannu vamsi ni kalupu sai na kapuranni nulabettandi sai plssss

    ReplyDelete
  2. lakshith ni nadipinchu sainadha.

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo