సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1419వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయినాథుడే రక్ష
2. ప్రాణనష్టం జరగకుండా చూసి ఎంతో మేలు చేసిన బాబా
3. బాబా దయ

శ్రీసాయినాథుడే రక్ష


సాయిభక్తులకు నమస్కారాలు. నా పేరు మణిమాల. నేను మరోసారి బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు మీతో పంచుకుంటున్నాను. ఒకరోజు నా గుండె దగ్గర నొప్పిగా అనిపించి చాలా ఇబ్బందిపడ్డాను. డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి భయపడి వెళ్లలేదు. కానీ నొప్పి రోజురోజుకు ఎక్కువ అవుతుండేసరికి బాబా ఊదీ పెట్టుకుని డాక్టరు దగ్గరకి వెళ్ళాను. బాబా దయవల్ల టెస్టు రిపోర్టులన్నీ నార్మల్ అని వచ్చాయి. డాక్టరు గ్యాస్ట్రిక్ సమస్య అని కేవలం పరగడుపున వేసుకునేందుకు మందు ఇచ్చారు. ఇది కేవలం సాయి కృపతో జరిగింది.


ఒకసారి హైదరాబాదులో ఉన్న పది నెలల మా మనవరాలికి తీవ్రంగా జ్వరం వచ్చింది. మూడు రోజులైనా జ్వరం తగ్గలేదు సరికదా మరింత పెరిగింది. దాంతో నేను వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్ళాను. పాపకి బాబా ఊదీ పెట్టి, కొద్దిగా ఆహారం తినిపించి సిరప్ వేశాను. మరుసటిరోజుకి పాప ఒంటి మీద చిన్నగా దద్దుర్లులా లేచాయి. "సాయీ! పాపకి అమ్మవారు పోసిందేమోనని భయంగా ఉంది. దయ చూపించు తండ్రి" అని అనుకోని పాపను హాస్పిటల్‍కి తీసుకెళ్ళాము. డాక్టర్ చూసి, "ఇది చికెన్‌పాక్స్ కాదు. ఆందోళన పడకండి" అని చెప్పారు. బాబా దయవల్ల మరుసటిరోజుకి పాప మామూలుగా అయిపోయింది. "ధన్యవాదాలు సాయి. మీరు మా రక్ష తండ్రి".

.

నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. నేను ప్రతిరోజు స్కూలుకి కారులో వెళ్లి, వస్తాను. నా కారు డ్రైవర్ పేరు 'సాయిరాం'. ఒకరోజు ఆ అబ్బాయి మా స్కూలులోని ఒక అమ్మాయితో కొంచెం చనువుగా ఉండటం చూసిన ఆ అమ్మాయి తల్లిదండ్రులు తనకి వార్నింగ్ ఇచ్చారు. అది నాలో అపరాధభావం కలిగించింది. ఎందుకంటే, ఒక టీచర్ దగ్గర పని చేస్తున్న వ్యక్తి స్కూలు పిల్లలతో ప్రేమలో పడటం అనేది నాకే అవమానం. అందరూ అతన్ని తీసేయమన్నారు. నేను అతనికి ఒక అవకాశం ఇద్దామని అన్నాను. అలాగే ఇచ్చాను. కానీ అతనిలో మార్పు కనిపించకపోయేసరికి నాకు ఎవరిని డ్రైవర్‍గా పెట్టుకోవాలో అర్థం కాలేదు, అలాగే అతనికి ఇకపై డ్రైవింగ్‍కి రావద్దని కూడా చెప్పలేకపోయాను. నాలో నేనే బాధపడి చివరికి సాయిపై భారం వేసాను. విచిత్రంగా ఆ అబ్బాయి తనంతట తానే రానని చెప్పాడు. అలాగే 'సాయికుమార్' అనే పాత విద్యార్థి డ్రైవర్‍గా చేస్తానన్నాడు. సాయి పేరుతోనే వచ్చేసరికి నాకు చాలా సంతోషంగా అనిపించింది. పైగా మంచి అబ్బాయి. వాళ్ళమ్మ మా స్కూల్లోనే మధ్యాహ్నం భోజనం వండుతుంది. ఇదంతా సాయి కృప వల్లే జరిగింది.


2022, డిసెంబర్ మొదటివారంలో జరిగిన ఇంకో సంఘటన గురించి ఇప్పుడు చెప్తాను. మా స్కూల్లో చదివిన ఒక అమ్మాయికి మెడిసిన్ సీటు వచ్చింది. తను చాలా పేదింటి అమ్మాయి. ఎలాగో ఫీజు కట్టడానికి కొంత డబ్బు సర్దుబాటు చేసుకున్నారు. కానీ ఇంకా ఒక 85 వేల రూపాయలు తక్కువ పడ్డాయి. దాంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు పడిన టెన్షన్ అంతాఇంతా కాదు. ఒక శనివారం సాయంత్రం ఆ అమ్మాయి నా దగ్గరకి వచ్చి విషయం చెప్పి, 'సోమవారం ఫీజు మొత్తం కట్టకపోతే నాకొచ్చిన సీటు క్యాన్సిల్ అవుతుందని కాలేజీ యాజమాన్యం చెప్పారు' అని చెప్పింది. నేను 10,000 రూపాయలు ఇస్తానని నా తోటి ఉపాధ్యాయులతో చెప్పాను. వెంటనే వాళ్ళందరూ తల కొంత డబ్బు ఇస్తామన్నారు. ఇంకా ఆ గ్రామ సర్పంచి, మరికొంతమంది తెలియనివాళ్లు కూడా కొద్దికొద్దిగా డబ్బులు ఇస్తామని అందరూ నా అకౌంట్‍కి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేశారు. మొత్తం 85,000 రూపాయల ఫీజు కట్టి, ఆ అమ్మాయికి ఒక మొబైల్ ఫోన్ కూడా కొని ఇచ్చాము. ఇంకా ఏదైనా డబ్బులు అవసరమైతే నేను సర్దుబాటు చేస్తానని కూడా చెప్పాను. అంత డబ్బు ఒకే రోజులో సర్దుబాటు అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. కానీ సాయి ఆశీస్సులతో జరిగింది. ఎందుకిలా అంటున్నానంటే, నాకు ఏదైనా విషయంలో ఆ పని చేయాలా, వద్దా అన్న సందిగ్ధ స్థితి వచ్చినప్పుడు ఈ బ్లాగు ద్వారా, సచ్చరిత్ర ద్వారా, సద్గురు సాయి సీరియల్ ద్వారా ఒకేలా బాబా సమాధానం నాకు వస్తుంటుంది. ఇక నేను అనుమానపడకుండా ఆ పని చేస్తుంటాను. ఈ అమ్మాయి సమస్య వచ్చినప్పుడు సద్గురు సాయి సీరియల్‍లో ఆర్ధిక సమస్యలతో బాధపడుతున్న కాకాజీ కుటుంబానికి సాయి వేరే రూపంలో ధన సహాయం చేయడం వచ్చింది. తద్వారా నన్ను ఆ అమ్మాయికి సహాయం చేయమని బాబా సూచిస్తున్నారని నాకనిపించింది. దాంతో నేను ఆ అమ్మాయికి సహాయం చేయడానికి ముందుకు వెళ్ళడం, తరువాత ఒక్కొక్కరు సహాయం చేయడం జరిగిపోయాయి. వాళ్లందరికీ ప్రేరణనిచ్చింది సర్వ హృదయ నివాసుడైన ఆ సాయినాథుడే. "సాయీ! సదా మాకు సద్బుద్ధిని ప్రసాదించండి".


ప్రాణనష్టం జరగకుండా చూసి ఎంతో మేలు చేసిన బాబా


'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వహించే సోదర, సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీసాయి భక్తులందరినీ ప్రాపంచిక బాధల నుండి, సమస్యల నుండి విముక్తులను చేసే చక్కటి సాధనమే ఈ  బ్లాగు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇంతకుముందు శ్రీసాయిబాబా నా సమస్యలకు సూచించిన పరిష్కారం గురించి మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటున్నాను. నేను స్వతహా ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేసే మనిషిని. ఈమధ్య మేము మా దగ్గర బంధువుల అబ్బాయిని మా ఇంట్లో ఉంచుకుని కంప్యూటర్ కోర్సులో జాయిన్ చేసాము. ఆ అబ్బాయి మామూలుగా మంచివాడే. కానీ సులభంగా డబ్బులు సంపాదిద్దామన్న ఉద్దేశ్యంతో మాకు తెలియకుండా మా ఇంట్లోని పెద్ద మొత్తం డబ్బులు తీసుకెళ్లి ఆన్లైన్ బెట్టింగ్‍లో పెట్టి పోగొట్టేసాడు. తరువాత మేము ఆ డబ్బులు కనపడక ఆ అబ్బాయిని అడిగితే, తను అసలు విషయం చెప్పాడు. అది విని మేము నిర్ఘాంతపోయాము. ఇంతకుముందు చాలామంది దగ్గర బంధువుల పిల్లలు మా ఇంట్లో ఉండి చదువుకుని చక్కగా జీవితంలో స్థిరపడ్డారు. కానీ ఈ అబ్బాయి ఇలా తయారయ్యాడని నాకు చాలా బాధేసింది. నా బాధ డబ్బులు పోయినందుకు కాదు గాని ఆ అబ్బాయి తల్లిదండ్రులు మా మీద నమ్మకంతో తనని మావద్దకి పంపిస్తే తను ఇలాంటి పనిచేసి తన కెరియర్‍ని పాడు చేసుకుని తను ఇబ్బందిపడుతూ, మా అందర్ని కూడా ఇబ్బంది పెడుతున్నాడని. అలా నేను బాధపడని రోజు లేదు. విషయం ఆ అబ్బాయి కుటుంబీకులకు చెపుదామంటే ఆ అబ్బాయి తల్లిదండ్రుల ఆరోగ్యం దృష్ట్యా చెప్పడానికి భయమేసి, 'డబ్బులు ఎప్పుడైనా వస్తాయి కానీ, మనుషుల ప్రాణాలు చాలా విలువైనవి' అని వాళ్లకు ఏమీ చెప్పకుండా విషయం ఆ అబ్బాయి అన్నయ్యతో, మా పెద్దనాన్నగారితో చర్చించాము. అందరూ ఆ అబ్బాయికి అందుబాటులో డబ్బులు ఎందుకు ఉంచారని మమ్మల్నే విమర్శించారు. వీటికి తోడు ఈ మధ్య మా పాప అరికాళ్ళు, అరిచేతులకు స్కిన్ అలర్జీ వచ్చి చాలా ఇబ్బందిపడింది. అలా ఒక నెల రోజులు మా ఇంటి వాతావరణం అంతా చాలా నెగిటివ్‍గా ఉంటుండేది. అదంతా అలా ఉంచితే, అంత డబ్బు పోగొట్టినందుకు ఆ అబ్బాయి నిద్రమాత్రలు మింగి చచ్చిపోవాలనుకున్నాడని తను వ్రాసిన లెటర్ చూసాక నాకు అర్థమయ్యింది. ఒకవేళ ఆ అబ్బాయి అంతా పని చేసి ఉంటే మా ప్రమేయమేమీ లేకపోయినా మేము ఎంతో మానసిక క్షోభను అనుభవించి ఉండేవాళ్ళము. కానీ బాబా మమ్మల్ని కాపాడారు. మా ఇంట్లో ఎటు చూసినా బాబా ఉంటారు. ఆయన దయతో ఆ అబ్బాయి అటువంటి అఘాయిత్యం చెయ్యకుండా చూసి మా అందరికీ ఎంతో మేలు చేసారు. సమస్య వల్ల మాకు ఆర్ధిక నష్టం జరిగినా, ప్రాణ నష్టం జరగకుండా కాపాడినందుకు మనసారా ఆ సాయినాథునికి నేను కోటి వందనాలు తెలియజేశాను. ఇన్ని సమస్యల నుండి మమ్మల్ని బయటపడేసేది మన బాబా ఒక్కరే. నేను భారమంతా ఆయన మీద వేసి ఏ ప్రాణనష్టం జరగకుండా చూసి సమస్యలన్నిటి నుండి మమ్మల్ని ఒక ఒడ్డున పడేయమని మనసా, వాచా ఎల్లవేళలా ప్రార్థిస్తున్నాను.


బాబా దయ


శ్రీసాయి బంధువులకు నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. నేను ఒక సాయి భక్తురాలిని. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈమధ్య మా నాన్నగారు మొదటిసారి శ్రీఅయ్యప్పస్వామి మాల ధారణ చేసారు. మేము నిర్వహించిన అన్నదాన కార్యక్రమం బాబా దయవల్ల చాలా బాగా జరిగింది. తరువాత నాన్న భక్తుల రద్దీ కారణంగా శబరిమల వెళ్లేందుకు భయపడ్డారు. నేను, మా అమ్మ కూడా నాన్న ఎలా వెళ్ళొస్తారో అని కంగారుపడ్డాము. అప్పుడు నేను, "బాబా! నాన్న క్షేమంగా వెళ్లి, తిరిగి వస్తే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల అంతా సవ్యంగా జరిగింది. నాన్న క్షేమంగా శబరిమల వెళ్లి, తిరిగి వచ్చారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఎల్లవేళలా మాతో ఉండి మమ్మల్ని సరైన మార్గంలో ముందుకు నడిపించు సాయి".


5 comments:

  1. బాబా నన్ను నా భర్తని కలుపు బాబా నా వంశీ నన్ను అర్థం చేసుకునేలా చూడు సాయి తను మంచిగా మారి నన్ను భార్యగా స్వీకరించేలా చూడు సాయి కరుణించు బాబా ఇంకా ఈ పరీక్ష చాలా బాగా ప్లీజ్ పిలిస్తే పలుకుతావు కదా పలుకు సాయి బాబా ప్లీజ్ బాబా సాయి

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sai Ram
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo