సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1423వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు
:

1. బాబా అనుగ్రహం
2. సమస్య వచ్చిన ప్రతిసారీ ఆ సమస్యలను దాటిస్తున్న బాబా 
3. క్షమాపణ చెప్పించి బాధను తొలగించిన బాబా

బాబా అనుగ్రహం


శ్రీసాయి భక్తులకు నమస్కారం. నా పేరు అంజలి. బాబా నాపై చూపిన అనుగ్రహాన్ని మీతో పంచుకుంటున్నాను. 2022, కార్తీకమాసంలో చివరి ఆదివారం మా కుటుంబం, బాబా ఇచ్చిన తమ్ముడు ప్రసాద్ కుటుంబం కలిసి శ్రీశైలం వెళ్ళాము. ఆరోజు ఆలయం చాలా రద్దీగా ఉంది. అయినా దయతో బాబా వేరేవాళ్ళ ద్వారా మాకు చాలా తొందరగా దర్శనం అయ్యేలా అనుగ్రహించారు. దర్శనానంతరం మేము తిరుగు ప్రయాణమయ్యాం. రాత్రివేళ, ఘాట్ రోడ్డులో హఠాత్తుగా మా కారు లైట్లు ఆగిపోయాయి. మాకు చాలా భయమేసింది. రెండు నిమిషాలు అలాగే లైట్లు లేకుండా చీకట్లో ప్రయాణించాక నేను బాబాను శరణువేడాను. ఆయన దయవల్ల కారు లైట్లు వెంటనే వెలిగాయి. తరువాత ఏ ఇబ్బందీ లేకుండా అర్థరాత్రికి మేము నల్గొండ చేరుకున్నాము. నిజంగా కారు లైట్లు వెలగకపోయుంటే పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటే భయమేస్తుంది. అంతా బాబా దయ. ఆయన తమ భక్తులను అడుగడుగునా కాపాడుతుంటారు. ఆయన ఉండగా భయమెందుకు? శ్రీశైలం నుండి వచ్చాక ప్రసాద్ వాళ్ళ పిల్లలు అనారోగ్యం పాలుకాకుండా చూడమని బాబాను వేడుకున్నాను. ఎందుకంటే, అతని పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు. బాబా దయవల్ల వాళ్ళందరూ బాగున్నారు, ఏ సమస్యా లేదు. కానీ మా బాబుకి జ్వరం వచ్చింది. అయితే బాబా దయవల్ల ఒక్కరోజులోనే తగ్గిపోయింది. వెంటనే నా అనుభవాలు బ్లాగులో పంచుకుంటాననుకున్నాను, కానీ కొంచెం ఆలస్యమైంది. "క్షమించు తండ్రీ".


గత సంవత్సరంలో ఒక ఆరు నెలలపాటు మా జీతాలు ఆలస్యంగా పడుతుంటే నేను, "ప్రతినెలా ఒకటో తారీఖున జీతం మా అకౌంటులో పడితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. అంతే, బాబా దయవల్ల ఒకటో తారీఖున మా జీతాలు మా అకౌంటులో పడుతున్నాయి. ప్రతినెలా మా మావయ్య కొంత డబ్బు మా అకౌంటులో వేస్తారు. అయితే కొన్ని కారణాల వల్ల డిసెంబర్ నెలలో మావయ్య డబ్బులు వేయలేదు. అసలే ఆ నెల డబ్బులకు కాస్త ఇబ్బంది ఉండటం వల్ల నేను, 'ఆ డబ్బులు వస్తే, బాగుండు' అనుకున్నాను. అలా అనుకున్న తర్వాత బాబా దయవల్ల మాకు డబ్బులు అందాయి. "ధన్యవాదాలు బాబా".


చాలా రోజుల క్రితం నాకు వేడి గడ్డలు వచ్చాయి. అప్పుడు నేను, "బాబా! ఈ గడ్డలు తగ్గితే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. ఆయన దయతో ఆ గడ్డలు వెంటనే తగ్గిపోయాయి. కానీ నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకోవడం మర్చిపోయాను. కొద్దిరోజులకు గడ్డలు మళ్లీ వచ్చాయి. "బాబా! ఈ గడ్డలను ఎలాగైనా తగ్గించండి. ఈసారి తప్పకుండా నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల కొన్ని రోజులకు గడ్డలు తగ్గిపోయాయి. ఈ బ్లాగులో పంచుకుంటామనుకుంటే చాలా పనులు నెరవేరుతున్నాయి. ఈ బ్లాగు నిజంగా ఆధునిక శ్రీసాయిసచ్చరిత్ర. దీన్ని బాబానే దగ్గరుండి నడిపిస్తున్నారు, మా అందరితో ఇలా అనుభవాలు వ్రాయిస్తున్నారు. ఇంకా ఎన్నో అనుభవాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ సెలవు తీసుకుంటున్నాను. "అన్ని విధాలా మీరు మాపై చూపుతున్న అనుగ్రహానికి చాలా చాలా ధన్యవాదాలు బాబా".


సమస్య వచ్చిన ప్రతిసారీ ఆ సమస్యలను దాటిస్తున్న బాబా


నేను ఒక బాబా భక్తురాలిని. మీరు నన్ను వదిలినా నేను మిమ్మల్ని ఎన్నటికీ వదలనని ప్రతిక్షణం భక్తులకి తోడుగా ఉంటూ ఎన్నో కష్టాలు, సమస్యల నుండి తప్పిస్తున్న బాబాకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ.. ప్రతిక్షణం ఇలాగే తోడుగా ఉండమని కోరుకుంటున్నాను. నేను ఇంతకుముందు ఎన్నో అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. మా కంపెనీలో వారానికి మూడు రోజులు ఆఫీసుకి వెళ్లి పనిచేయాలి. నేను లాక్ డౌన్ తర్వాత హైదరాబాద్‍కి మారకుండా మా ఊళ్ళోనే ఉంటూ వారంవారం ఆఫీసుకి వెళ్లొస్తున్నాను. ఎప్పుడైనా ఒకరోజు మానేస్తే మా మేనేజర్ ఈమధ్య పదేపదే ఎత్తి చూపడం మొదలుపెట్టింది. ఇలాంటి పరిస్థితిలో నేను ఒకరోజు ఇంటి నుండి పనిచేసి తరువాత రెండు రోజులు ఆఫీసుకి వెళదామనుకున్నాను. కానీ ఆ విషయం తెలియజేస్తూ మెయిల్ పెట్టాలంటే మేనేజర్ ఏమంటుందో అని భయమేసింది. అందుచేత అంతకు ముందు వారంలో నా ఆరోగ్యం బాగాలేనప్పప్పటి మెడికల్ సర్టిఫికెట్ అటాచ్ చేసి ఈ వారంలో రెండు రోజులే వస్తానని మా మేనేజర్‍కి మెయిల్ పెట్టి,  "బాబా! ఆవిడ ఏమి అనకుండా ఉండేలా చూడండి. అంతా మంచిగా ఉంటే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఆ మెయిల్ చూసి ఆవిడ ఏమీ అనుకుండా నా అభ్యర్థనను ఆమోదించింది. "చాలా చాలా కృతఙ్ఞతలు బాబా. ఎల్లప్పుడూ ఇలాగే తోడుండి నన్ను ముందుకు నడిపించండి.


ఇకపోతే నేను ఆ కంపెనీలో చేరిన 6 నెలల తర్వాత రివ్యూ చేసి నా జాబ్ కన్ఫర్మ్ చేయాల్సి ఉండగా రివ్యూలో నా పనితీరు మెరుగుపరుచుకోవాలని, అందుకోసం ఇంకో నెల గడువు పెంచి, నెల తర్వాత మళ్ళీ రివ్యూ చేసి ఫీడ్‌బ్యాక్ ఇస్తామన్నారు. తరువాత ఒక నెల గడిచాక ఒక రోజు రివ్యూ మీటింగ్ షెడ్యూల్ చేసారు. నా జాబ్ కన్ఫర్మ్ చేస్తారో, లేదో అని నాకు చాలా భయమేసి బాబాని చాలా ప్రార్థించి మీటింగ్ మొదలయ్యే సమయం వరకు బాబా సందేశాలు చూస్తూ గడిపాను. బాబా ఆ సందేశాల ద్వారా 'అంతా మంచి జరుగుతుంద'ని నాకు ధైర్యాన్ని ఇచ్చారు. కానీ ఎక్కడో ఏదో తెలియని భయం. అందువల్ల, "బాబా! నా ఉద్యోగం కన్ఫర్మ్ చేస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. ఇంతలో మీటింగ్ సమయమైంది. బాబా దయవల్ల నా పెర్ఫార్మెన్స్ బాగానే ఉందని నా జాబ్ కన్ఫర్మ్ చేసారు. ''చాలా చాలా కృతఙ్ఞతలు బాబా. సమస్య వచ్చిన ప్రతిసారీ నా చేయి పట్టుకుని దాన్ని దాటిస్తూనే ఉన్నావు తండ్రి. వ్యక్తిగత సమస్యల వల్ల నా ఆలోచన అంతా అటు పోయి ఏ పని చేయలేకపోతున్నాను. అందుకే మీకు మాటిచ్చి కూడా 2 రోజులు ఆలస్యంగా నా అనుభవం పంచుకున్నాను. అందుకు నన్ను క్షమించండి బాబా. ఇకపోతే నాతోపాటు జాబ్‍లో జాయిన్ అయిన నా ఫ్రెండ్ జాబ్ కూడా కన్ఫర్మ్ అయ్యేలా చూడు తండ్రి. ఆ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకుంటాను, నా పెళ్లి విషయంలో నేను ఒక సమస్యని ఎదుర్కొంటున్నాను. ఎవరికీ చెప్పుకోలేని బాధనిచ్చావు. అందరికీ సమాధానం చెప్పలేకపోతున్నాను. విషయం మీకు తెలుసు బాబా. ఆ విషయంలో నా మనసుకి నచ్చింది జరిగేలా చూసి మీరే ఈ గండాన్ని దాటించాలి తండ్రి. మీమీదే భారం వేసాను. అంతా మంచిగా జరిపి బ్లాగులో పంచుకునేలా అనుగ్రహించండి బాబా. మీరు తప్ప నా బాధని అర్ధం చేసుకునేవారెవరూ లేరని మీకు చెప్పుకుంటున్నాను బాబా. ఏవైనా తప్పులు చేస్తే పెద్ద మనసుతో క్షమించి ఇంకోసారి ఆ తప్పులు చేయని విధంగా మా మనసులను మలచండి బాబా".


క్షమాపణ చెప్పించి బాధను తొలగించిన బాబా


సాయి భక్తులకు నమస్కారం. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తురాలిని.  నేను అడగకనే బాబా నన్ను తమ భక్తురాలిగా చేసుకున్నారు. ఏ ఆపద వచ్చినా 'బాబా' అని తలచినంతనే 'నేనున్నాను' అని ఆ ఆపదల నుండి, సమస్యల నుండి కాపాడుతున్నారు. ఆయన నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు. ఏమి చేసినా నేను ఆయన ఋణం తీర్చుకోలేను. ఈమధ్య ఒక వ్యక్తి నన్ను టార్గెట్ చేసి, బంధువులలో నా పరువు తీసి మానసికంగా నాకు చాలా బాధ కలిగించాడు. అక్రమంగా సంపాదిస్తున్నానని తప్పుడు ప్రచారం చేసి బంధువుల దగ్గర తలదించుకునేలా చేశాడు. నేను, "బాబా! మీరే అతనికి బుద్ది చెప్పాలి" అని బాబాకి చెప్పుకుని వదిలేసాను. ఆయన ఏం చేశారో గానీ సరిగ్గా ఒక నెల తర్వాత ఆ వ్యక్తి, "నా వల్ల బాధపడిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి క్షమాపణ చెబుతున్నాను" అని అన్నాడు. బాబా దయవలన అతని వలన నాకొచ్చిన సమస్య తొలగిపోయింది. "ధన్యవాదాలు బాబా".


6 comments:

  1. ఓం సాయిరాం సాయి నా భర్త నన్ను అర్థం చేసుకునేలా చూడు సాయి తన మనసు మార్చు సాయి తన నన్ను భార్యగా స్వీకరించేలా చూడు సాయి నన్ను తనతో కాపురానికి తీసుకొని వెళ్లేలా చూడు బాబా వాళ్ల చెల్లికి వాళ్ళ అన్నకి బుద్ధి చెప్పు బాబా, తన ఎవ్వరి మాట నమ్మకుండా నన్ను నమ్మేలా చూడు బాబా నేను తనకు దూరంగా ఉండలేను బాబా అందరి వాళ్ళ సమస్య చెప్పుకొని బ్లాక్లో పంచుకుంటాను అనగానే తీరిపోతుంది బాబా నేను కూడా నా అనుభవాన్ని బ్లాక్ లో పంచుకుంటాను సాయి కాపాడు సాయి ఆడపిల్లని తల్లిదండ్రుల నామీద దిగులు పెట్టుకుని ఉన్నాడు సాయి ఎన్నో విషయాల నుంచి నన్ను కాపాడి ధైర్యాన్ని ఇచ్చావు నన్ను ఈ బాధ నుంచి కాపాడు సాయి నన్ను నా భర్తని కలుపు సాయి జీవితాంతం నిన్ను పూజించుకుంటాను సాయి నా బిడ్డలకి నీ పేరు పెట్టుకుంటాను సాయి నా భర్త నేను కలిసిపోతే ఇద్దరం కలిసి షిర్డీ వచ్చి మీ ఆశీర్వాదం తీసుకుంటాం సాయి దయచేసి కాపాడు సాయి మాంగల్యాన్ని నిలబట్టి సాయి కాపురాన్ని నిలబెట్టు సాయి ఈ బాధ నుంచి నన్ను కాపాడు సాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా నన్ను అర్థం చేసుకునేలా చూడు సాయి నా భర్తకి ధైర్యాన్ని సాయి తన మనసులో ఉంటే భయాలని తలగిపోయారా చూడు సాయి ఒకవేళ మంచిగా మార్చేసాయి ఒక సహాయం చేశాయి చాలా కష్టంగా ఉన్నాను కాపాడు సాయి

    ReplyDelete
    Replies
    1. Bhakti tho navaguruvar vratam cheyyandi akka.. baba antha chuskuntaaru.

      Delete
  2. Sairam , Dhuni lo coconut, nava dhanyalu , agarubathi samarpinchandi.every thurs day , dhuni chuttu pradakshinalu cheyandi. Thondaraga problem solve avuthundi. Sai satcharitra parayanam, stavana manjari parayana cheyandi

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Connect to Sai baba
    1. MEDITATE WITH HIS MANTRA
    OM SAI SRI SAI JAI JAI SAI
    2. LOOK AT HIS SHIRDI SAI’S PICTURE
    3. READ SHIRDI SAI BABA STORIES
    4. VISIT A SHIRDI SAI BABA TEMPLE
    5. RECITE THE 108 NAMES OF SHIRDI BABA

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo