1. శ్రీసాయి నెరవేర్చిన కోరికలు
2. పూజకు ఇబ్బంది లేకుండా దయ చూపిన బాబా
3. దగ్గు తగ్గేలా అనుగ్రహించిన బాబా
శ్రీసాయి నెరవేర్చిన కోరికలు
ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!! శ్రీసాయిబాబా పాదారవిందాలకు నా మనఃపూర్వక నమస్కారాలు. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు కృతఙ్ఞతలు. నా పేరు ఉమ. మాది కృష్ణ జిల్లాలోని ఘంటసాల గ్రామం. నేను ఇదివరకు నా అనుభవాలు కొన్ని ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. కార్తీకమాసంలో ఒకరోజు రాత్రి నా భర్తకి ఆక్సిడెంట్ అయినట్లు నాకు కల వచ్చింది. మెలుకువ వచ్చి చూస్తే తెల్లవారుఝామున గం. 3:20 నిమిషాలైంది. వెంటనే నేను నా మనసులో శ్రీసాయిబాబాకి నమస్కరించుకుని, "ఈ కార్తీకమాసం పూర్తయ్యేలోపు నేను శ్రీశైలం వెళ్లి, అక్కడ దీపారాధన చేసేలా అనుగ్రహించండి. అలా జరిగితే, నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. ఆ తండ్రి దయవల్ల కార్తీకమాసంలో చివరిరోజున నేను మా అన్నయ్య, వదినలతో కలిసి శ్రీశైలం వెళ్లి, అక్కడ దీపారాధన చేశాను. శ్రీమల్లన్నస్వామి దర్శనం చక్కగా జరిగింది. ఇంకా నేను ముందుగా అనుకున్న విధంగా నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుందామని అనుకునేలోపు మరో అనుభవం జరిగింది. అదేమిటంటే, మా అన్నయ్య, వదినలకు పెళ్ళై 8 సంవత్సరాలైంది. కానీ వాళ్ళకి సంతానం లేదు. నేను ఇదివరకు ఆ విషయం ఈ బ్లాగులో చెప్పుకుని, అన్నయ్య వాళ్ళకు ఎదో విధంగా ఒక బిడ్డ దక్కాలి అని అనుకున్నాను. అన్నయ్యవాళ్ళు ఇద్దరు డాక్టర్లకి ఎవరైనా పిల్లలుంటే, దత్తత తీసుకుంటామని చెప్పారు. మేము శ్రీశైలం నుండి వచ్చిన తరువాత 3 రోజులకి మా ఆయనకి, "ఒక పాప పుట్టింది, తీసుకుంటారా?" అని ఒక ఫోన్ వచ్చింది. అందుకు మా అన్నయ్యవాళ్ళు సరేననడంతో మరుసటిరోజు మేమందరం వెళ్లి, ఆ పాపని తీసుకున్నాము. అయితే ఆ పాప బరువు చాలా తక్కువగా ఉంది, ఇన్ఫెక్షన్ కూడా ఉంది. అందువల్ల పాపని హాస్పిటల్లోనే ఉంచాల్సి వచ్చింది. అప్పుడు నేను మనసులో, "బాబా! మీ దయవలన పాపకి ఇన్ఫెక్షన్ తగ్గి, త్వరగా కోలుకుని ఇంటికి రావాలి. అలా జరిగితే నేను మీ దయను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవలన 10 రోజులకు పాపకి తగ్గి క్షేమంగా ఇంటికి వచ్చింది. "ధన్యవాదాలు బాబా. మీ దయతో పాప క్షేమంగా, ఆరోగ్యంగా, నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఉండాలి తండ్రి. అలాగే మా అమ్మవాళ్ల కుటుంబమంతా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండేలా అనుగ్రహిచండి బాబా".
2022, నవంబర్లో నేను ఒక స్టోన్స్ నెక్లెస్ చేయిద్దామని మాకు దగ్గరలో ఉన్న ఒక బంగారం షాపులో ఆర్డర్ ఇచ్చాను. ఆ షాపతను, "ఇక్కడ అంత బాగా చెయ్యటం కుదరదు, అది చాలా కష్టం. వేరేచోట చేయిస్తాము. అయితే అక్కడివాళ్ళు ఏమైనా తేడా వస్తే, వస్తువు మార్చరు. కాబట్టి ఎలా ఉన్న మీరు ఉంచుకోవాల్సిందే" అని చెప్పారు. అది విని నాకు కొంచెం ఆందోళనగా అనిపించి మనసులో, "బాబా! నేను అనుకున్న విధంగా అనుకున్న బడ్జెట్‍లో వస్తువు అందంగా వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. తరువాత డిసెంబర్ రెండో వారంలో షాపతను వస్తువు తీసుకుని వచ్చారు. అది చాలా అందంగా, అనుకున్న విధంగా, అనుకున్న బడ్జెట్ కన్న తక్కువగానే ఉంది. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవాలను ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించండి తండ్రి. మా కుటుంబ ఆరాధ్య దేవత శ్రీకోట ముత్యాలమ్మ తల్లిని, మా గ్రామంలోని శ్రీఅభయ ఆంజనేయస్వామిని, శ్రీకనకదుర్గమ్మని(విజయవాడ), అలాగే మిమ్మల్ని ఎలాంటి విఘ్నాలు లేకుండా తొందరలో దర్శించి నా మొక్కులు తీర్చుకునేలా అనుగ్రహించమని ఈ బ్లాగు ద్వారా వేడుకుంటున్నాను తండ్రి".
పూజకు ఇబ్బంది లేకుండా దయ చూపిన బాబా
నా పేరు శివ. మాది నర్సాపురం. నేను ఇప్పుడు ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవం పంచుకుంటున్నాను. నేను ఈమధ్య అయ్యప్ప మాల వేసుకున్నాను. ఆ సమయంలో తుఫాన్ రావడం, అప్పుడు కూడా నేను రోజూ చన్నీళ్ల స్నానం చేయడంతో నాకు తలనొప్పి మరియు గొంతునొప్పి వచ్చి నన్ను చాలా బాధపెట్టాయి. రెండు రోజులు పూజ కూడా సరిగా చేయలేకపోయాను. మూడో రోజు రాత్రి పూజ జరుగుతున్నప్పుడు గొంతు బాగా ఇబ్బందిపెట్టింది. అజిత్రోమైసిన్ టాబ్లెట్ వేసుకున్నా ఉపయోగం లేకపోయింది. అప్పుడు నేను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ఓపెన్ చేస్తే, అక్కడ నా లాంటి సమస్యకు సంబంధించిన ఒక భక్తుని అనుభవం ఉంది. ఆ భక్తుడు తనకి గొంతునొప్పి వస్తే, తను ఆ నొప్పి తగ్గితే తన అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాకి మ్రొక్కుకున్నానని, బాబా దయతో తనకి నొప్పి తగ్గిందని పంచుకున్నాడు. అది చదివి నేను షాకయ్యాను. వెంటనే నేను బాబాని మనసులో తలుచుకుని, "బాబా! నాకు కూడ గొంతునొప్పి తగ్గి, రేపు ఉదయం పూజకు ఏ ఇబ్బంది లేకపోతే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించి పడుకున్నాను. మరుసటిరోజు ఉదయానికి గొంతునొప్పి ఉందికానీ, పూజలో పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. బాబా దయవల్ల పూజంతా సవ్యంగా జరిగింది. "ధన్యవాదాలు బాబా. తొందరగా నా గొంతునొప్పిని పోగొట్టి, అయ్యప్ప దీక్ష సక్రమంగా జరిగి, స్వామిని దర్శించి క్షేమంగా ఇంటికి తిరిగి చేరుకునేలా అశీర్వదించు తండ్రి. ఈ అనుభవం పంచుకోవటం ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి బాబా".
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
దగ్గు తగ్గేలా అనుగ్రహించిన బాబా
సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు స్వాతి. మాది శ్రీకాకుళం. మా అమ్మానాన్నలిద్దరికీ గుండె ఆపరేషన్ జరిగింది. 2022, ఏప్రిల్ 6వ తేదీన నాన్న కాలం చేసారు. ప్రస్తుతం అమ్మ మాత్రమే ఉంది. ఆమె ఒంటరిగా ఉంటున్నా దగ్గరుండి చూసుకునే అదృష్టం నాకు లేదు. నాకు పెళ్ళై మూడు సంవత్సరాలవుతుంది. ఇంకా పిల్లలు లేరు. ప్రెగ్నన్సీ వస్తేనైనా అమ్మని జాగ్రత్తగా చూసుకునే భాగ్యం నాకు లభిస్తుందని నా ఆశ. ఇక అసలు విషయానికి వస్తే.. అసలే ఆరోగ్యం బాగాలేని మా అమ్మ ఒకసారి పొడి దగ్గుతో మరింత బాధపడసాగింది. ఒక్కోసారి ఆమె దగ్గుతుంటే, నాకు చాలా భయమేసి ఊపిరి ఆగిపోయేంత పని అవుతుండేది. ఒకరోజు రాత్రి 9 గంటల సమయంలో నేను అమ్మతో ఫోన్‍లో మాట్లాడుతుండగా అమ్మకి చాలా తీవ్రంగా దగ్గు వచ్చింది. ఎంతలా అంటే దగ్గటం కూడా తనకి చాలా కష్టంగా ఉంది. ఆమె అలా బాధపడుతుంటే నేను తట్టుకోలేక, "బాబా! అమ్మ ఆరోగ్యం నాకు చాలా అవసరం. ఆమె దగ్గుతో చాలా బాధపడుతోంది. ఆ దగ్గుతో తనకి నిద్రపట్టడం లేదు. దగ్గు కాస్త తగ్గుముఖం పట్టి అమ్మ చక్కగా నిద్రపోయేలా చూడు బాబా" అని బాబాను ప్రార్థించాను. మరుసటిరోజు ఉదయం అమ్మ ఫోన్‍లో, "దగ్గు తగ్గింది" అని చెప్పింది. అది విని నాకు చాలా ఆనందంగా అనిపించింది. "బాబా! మీ కరుణకు నేను చాలా కృతజ్ఞురాలిని. నీ మహిమ చెప్పనలవి కాదు. అందరినీ కాపాడు బాబా. మీ దరికి చేరే మార్గాన్ని మాకు చూపించు బాబా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me