1. బాబాకు చెప్పుకుంటే వెంటనే పరిష్కారం చూపుతారు
2. అంతా బాబా మహిమ
3. ఒక్క అధ్యాయం పారాయణతో సమస్యను తీర్చిన బాబా
బాబాకు చెప్పుకుంటే వెంటనే పరిష్కారం చూపుతారు
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. ముందుగా నా తండ్రి సాయి పాదపద్మములకు నా నమస్కారాలు. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు శుభాభినందనలు. నా పేరు అమరనాథ్. నా పుత్రుని పేరు 'సాయి కార్తికేయ'. తనని ఉన్నతవిద్య కోసం అమెరికా పంపించాలని అనుకున్నాము. అయితే ఆ సమయంలో నా చేతిలో కావలసినంత డబ్బులేక బంధువుల సలహా మీద బ్యాంకు లోన్‍కి అప్లై చేశాను. బ్యాంక్ మేనేజర్, "తప్పకుండా లోన్ శాంక్షన్ చేస్తాన"ని చెప్పారు. నేను చాలా సంతోషించి బాబు అమెరికా వెళ్ళడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాను. తీరా బాబు అమెరికా వెళ్లే సమయానికి బ్యాంకు లోన్ రిజెక్ట్ అయింది. వాళ్ళు హఠాత్తుగా 'రూరల్ ప్రాపర్టీ చెల్లదు. అర్బన్ ప్రాపర్టీ కావాల'ని అన్నారు. నాకు అర్బన్‍లో సరైన ప్రాపర్టీ లేదు. ఉన్నా వాటికి డాక్యుమెంట్స్ లేవు. అందువల్ల నేను చాలా టెన్షన్ పడ్డాను. నాకు ఏ కష్టం వచ్చినా మొదటిగా బాబాకు చెప్పుకుంటాను. ఆయన వెంటనే నా సమస్యకు పరిష్కారం చూపిస్తారు. అందుచేత, "ఈ సమస్యకు కూడా మీరు పరిష్కరం చూపాలి" అని బాబాను వేడుకున్నాను. ఆయన దయ చూపారు. కొన్ని గంటల్లోనే ఒక మిత్రుడు ఫోన్ చేసి, ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వివరాలు ఇచ్చారు. వాళ్ళకి ఫోన్ చేస్తే, వాళ్లు ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అన్నీ చకచకా జరిగిపోయి అనుకున్న సమయానికి లోన్ శాంక్షన్ అయ్యింది. బాబు ఆనందంగా 2022, ఆగస్టు 1న అమెరికా వెళ్ళాడు. "బాబుకి అక్కడ మంచి పార్ట్ టైం ఉద్యోగం చూపించండి బాబా" అని బాబాను వేడుకున్నాను. బాబా దయతో అందరికంటే ముందే ఏ ఇబ్బందీ లేకుండా మా బాబుకి మంచి ఉద్యోగం చూపించి నాకు ఆర్థిక భారం లేకుండా చేశారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
అదే నెలలో కొన్ని కారణాల వలన నేను పనిచేస్తున్న కంపెనీ మారాల్సి వచ్చింది. దాంతో ఖర్చులు ఉన్న నాకు చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నేను, "బాబా! నన్ను మంచి కంపెనీలో చేరిస్తే, మీ అనుగ్రహాన్ని మీ బ్లాగ్ ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. కొన్ని రోజుల్లోనే నేను ఎప్పటినుండో అనుకుంటున్న మేఘ ఇంజనీరింగ్ కంపెనీలో నాకు ఉద్యోగం ఇప్పించారు బాబా. బాబాకు శతకోటి వందనాలు తెలుపుకున్నాను.
నా పాత కంపెనీవాళ్ళు అంత త్వరగా సెటిల్మెంట్ చేయరు. వాళ్ళు నాకు రావాల్సిన రెండు నెలల జీతం ఆపేశారు. నేను చాలా టెన్షన్ పడి బాబాతో నా సమస్య చెప్పుకున్నాను. బాబా నన్ను అనుగ్రహించి నవంబర్ రెండో వారంలో ఒక నెల జీతం ఇప్పించారు. "అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా! మీకు శతకోటి ప్రణామాలు. ఆ రెండో నెల జీతం కూడా త్వరగా ఇప్పించండి సాయితండ్రీ. మా పాపకు, అలాగే మా అందరికీ పరిపూర్ణ ఆరోగ్యాన్నిచ్చి మేము అనుకున్న లక్ష్యాన్ని అందుకునేలా ఆశీర్వదించండి స్వామీ".
నా తమ్ముడు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాడు. తన పేరులో ఆనందం ఉంది కానీ, వాడు జీవితంలో ఆనందం ఎరుగని కష్టజీవి. వైవాహిక జీవితం, వ్యాపార జీవితం, ఉద్యోగ జీవితం అంతా ఆటుపోట్లమయం. వాడికి ఆనందకరమైన, ప్రశాంతకరమైన జీవితం ప్రసాదించమని ఎన్నో సంవత్సరాలుగా దేవుళ్ళకు మొక్కుకున్నాము. కానీ ఇప్పటివరకు ఉపశమనం లభించలేదు ఇటీవల కరోనా కారణంగా వాడు పనిచేసే ఫ్యాక్టరీ క్లోజ్ అయి ప్రభుత్వ వేలానికి వెళ్ళింది. దాంతో తనకి మరలా ఉద్యోగాల వేట తప్పలేదు. అప్పుడు నేను శ్రీసాయినాథుని, "అమ్మానాన్నలకి దగ్గరగా స్థిరమైన చోట తమ్ముడికి ఉద్యోగం కల్పించమ"ని ప్రార్థించాను. కరుణామయుడైన ఆ సాయినాథుడు నా విన్నపాన్ని ఆలకించి కొద్దిరోజుల్లోనే నా తమ్ముడికి ఒక మంచి ఉద్యోగం చూపించారు. ఒక దగ్గర బంధువు ద్వారా ఒక మంచి మల్టీ కాంప్లెక్స్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలో తమ్ముడికి ఆఫర్ వచ్చింది. "ధన్యవాదాలు సాయితండ్రీ. ఇలానే ఇకముందు కూడా మీ చల్లని చూపులు మా అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. మా కుటుంబసభ్యులందరికీ సుఖశాంతులు, సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించండి. నేను కొన్ని కోరికలు తీర్చమని మిమ్మల్ని ప్రార్థించాను తండ్రీ. వాటిని కూడా అనతికాలంలోనే ప్రసాదించు స్వామీ. నా సంతానం చదువుల్లో ఉన్నత శిఖరాలు అందుకోవాలి".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
అంతా బాబా మహిమ
సాయిభక్తులందరికీ నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. మన తండ్రి బాబాను నమ్ముకుంటే అడుగడుగునా మిరాకిల్స్ చూపిస్తారని అందరికీ తెలిసిందే. నాకు కూడా ఎన్నో మిరాకిల్స్ చూపించారు బాబా. 2022, నవంబర్ 25న నాకు జరిగిన అనుభవం చాలా అద్బుతమనిపించింది. ముందుగా దానిని మీతో పంచుకుంటున్నాను. నేను ఒక కాలేజీలో ఉద్యోగం చేస్తున్నాను. ప్రతిరోజు కాలేజీ నుండి ఇంటికి వచ్చేప్పుడు మా అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో లైట్ ఆన్ చేయగానే నా చేతికున్న ఉంగరం చూసుకుంటాను. అది బంగారుది, పైగా శ్రీసాయిబాబా ఉంగరం. అందుచేత నేను ఆ ఉంగరాన్ని నా ప్రాణసమానంగా భావిస్తాను. లైట్లు వేయగానే ఆ ఉంగరం మీద ఉన్న బాబాను మొదట చూడడం నేను అలవాటుగా చేసుకున్నాను. నవంబర్ 25 సాయంత్రం కూడా లిఫ్టులో లైట్ వేయగానే బాబాను చూశాను. ఆ తరువాత నేను ఇంటికి వచ్చి యథావిధిగా నా పనులు చేసుకున్నాను. తరువాత ఒక ఫంక్షన్‍కి వెళ్ళాలని ముందుగా మా బాబుకి స్నానం చేయించి, తరువాత నేను చేశాను. బయటికి వచ్చేసరికి నా వేలుకి ఉండాల్సిన ఉంగరం కనిపించక ఒక్కసారిగా షాకయ్యాను. లిఫ్టులో బాబాను చూశాను కాబట్టి అది ఇంట్లోనే ఎక్కడో పడిపోయిందనిపించి అంతా వెతికాము. కానీ ఆ ఉంగరం ఎక్కడా కనిపించలేదు. బాత్రూంలో పడిపోయిందేమోనని కాస్త భయమేసింది. అయినా నేను ఆశ వదులుకోలేదు. కానీ ఒకవైపు ఫంక్షన్‍కి టైమ్ అయిపోతోంది. క్యాబ్ కూడా రావడంతో ఫంక్షన్ నుండి వచ్చాక వెతుకుదామని ఫంక్షన్‍కి బయలుదేరాము. కానీ ఆ ఉంగరం ఎక్కడ పడిపోయిందో అని నా బుర్ర అస్సలు పనిచేయలేదు. ఆ సమయంలో 'శ్రద్ధ-సబూరీ' అన్న బాబా మాటలు గుర్తొచ్చి, వాటిని పాటిద్దామనుకుని, "ఆ ఉంగరం దొరికితే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాను బాబా" అని బాబాను ప్రార్థించి ప్రశాంతంగా ఉన్నాను. ఫంక్షన్ నుండి రాత్రి 9.30కి ఇంటికి వచ్చాక 10 గంటల వరకు ఉంగరం కోసం వెతికాము. కానీ కనిపించలేదు. ఇక ఆఖరికి నా బట్టల్లో చూశాను. ఆశ్చర్యం! మడత పెట్టి ఉన్న డ్రెస్సుల మధ్యలో ఆ ఉంగరం కనిపించింది. ఎప్పుడూ నా వేలికి ఉండే ఆ ఉంగరం కొంచం టైట్‍గానే ఉంటుంది. అలాంటి ఉంగరం ఆ బట్టల్లో పడే అవకాశమే లేదు. అందువలన నేను అత్యంత ఆశ్చర్యానికి లోనై అంతా బాబా మహిమ అనుకున్నాను. శ్రీసాయినాథునికి ఎన్ని పాదనమస్కారాలు చేసినా తక్కువే.
ఒకసారి మా బాబుకి జులుబు వల్ల రాత్రి గురక ఎక్కువగా వస్తుండేది. నేను ఆందోళన చెంది, "బాబా! బాబు గురక సమస్య తగ్గితే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని ప్రార్థించాను. అంతే, బాబుకి గురక తగ్గిపోయింది. అంతా బాబా దయ.
ఇంకోసారి మా బాబు మెడ మీద తెల్లమచ్చలు కనిపించాయి. ఎందుకలా వచ్చాయోనని నేను చాలా భయపడ్డాను. హాస్పిటల్‍కి వెళ్ళాలంటే కూడా భయమేసి బాబాతో, "ఆ మచ్చలు తగ్గితే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకుని ప్రతిరోజు ఊదీని ఆ మచ్చలపై రాస్తుండేదాన్ని. అలా చేస్తున్నప్పటి నుండి నాకు భయం తగ్గి ధైర్యంగా ఉండేది. బాబా దయవల్ల ఆ మచ్చలు తగ్గిపోయాయి. నిజంగా బాబా అంటే బాబానే. తండ్రి అంటే బాబానే. 'బాబా!' అని మనసారా అనుకుంటే చాలు, ఏదైనా అయిపోతుంది. నాకు తల్లి, తండ్రి, గురువు, సర్వస్వము ఆ సాయినాథుడే. మా బ్రతుకులు ఆయన కృపాభిక్ష. కాబట్టి బాబా పాదాల దగ్గర మేము క్షేమంగా ఉన్నామని నా నమ్మకం. బాబా లేని నిమిషం మాకు బ్రతుకు లేనట్లే.
ఒక్క అధ్యాయం పారాయణతో సమస్యను తీర్చిన బాబా
సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!! నా పేరు సాయి. నేను బాబా భక్తుడిని. బాబా ఎన్నోసార్లు నన్ను కాపాడారు. రెండు సంవత్సరాల క్రిందట నేను ఒక వెబ్‌సైట్‍లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. కొంతకాలం తరువాత నేను ఆ అకౌంట్ వాడటం మానేశాను. 2022, డిసెంబర్ 1వ తేదీ ఉదయం నాకు ఆ వెబ్‌సైట్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. అందులో ఎవరో ఒక హ్యాకర్ నా ఈ-మెయిల్ హ్యాక్ చేసి నా అకౌంట్‍లోకి లాగిన్ అయి నా ఈ-మెయిల్ మరియు ఇతర వివరాలు మార్చేశారనీ, మీ అకౌంట్ చాలా ముఖ్యమైనదనీ ఉంది. ఆ అకౌంట్లో నా వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఉన్నాయి. ఆ హ్యాకర్ నా అకౌంట్‍తో నేరాలు చేయవచ్చు. వాళ్ళు ఏ చెడుపని చేసినా అది నా నేరంగా పరిగణింపబడుతుంది. ఈ ఆలోచనలతో రెండు గంటలపాటు ఒకటే భయం. ఆ వేదన తట్టుకోలేకపోయాను. చివరికి బాబా దగ్గర కూర్చొని పెద్దగా ఏడ్చి, "బాబా! నా సమస్య తీరితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. తరువాత బాబాపై భారమేసి జరిగింది సదరు వెబ్‌సైట్‌వాళ్ళకి తెలియపరిచాను. కానీ నాలుగు గంటల సమయం గడిచినా వాళ్ళు నా సమస్యను పరిష్కరించలేదు. ఇక అప్పుడు ఆరోజు పొద్దున్నే నేను బాబా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీసాయిబాబా జీవిత చరిత్ర పుస్తకమొకటి కొన్నానని గుర్తొచ్చి వెంటనే దాన్ని చదవడం మొదలుపెట్టాను. బాబా దయవల్ల మొదటి అధ్యాయం పూర్తవుతున్న సమయానికి నా సమస్య పరిష్కారమైందని నాకు మెయిల్ వచ్చింది. నాకు జరిగిన ఈ అనుభవం చాలా చిన్నదిగా అనిపించవచ్చు కానీ, ఇది చాలా పెద్ద సమస్య. అది సమసిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. కానీ శ్రీసాయిబాబా నా చేత తమ చరిత్రలోని మొదటి అధ్యాయం చదివించి నా సమస్యను తీర్చారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
ఓం సాయిరాం సాయి నేను నిన్ను నమ్ముకొని బతుకుతున్నాను సాయి నాకు సహాయం చేయి సాయి నన్ను కాపాడు సాయి ఈ సమస్య చాలా కష్టంగా ఉంది సహాయం చేయి సాయి ప్లీజ్ బాబా
ReplyDeleteబాబా నన్ను వంశీని కలుపు బాబా నా భర్త మనసు మంచిగా మార్చు సాయి నా కాపురం నిలబడ్డ సాయి అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సాయి కనీసం ఎవరైనా చూపు సాయి
ReplyDeletePlease cure my husband constipation.bless him with health and longevity of life.om Sai Ram
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me