ఈ భాగంలో అనుభవం:
- పూలమాల ద్వారా బాబా చూపిన అద్భుతమైన రెండు లీలలు
మొదటి లీల:
ఒక అజ్ఞాత సాయిబంధువు తనకు తెలిసిన వారికి జరిగిన ఒక అద్భుతమైన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
మనమందరం సాయిబాబా నీటితో దీపాలు వెలిగించారని సచ్చరిత్రలో చదువుకున్నాము. ఎంత అద్భుతమైన లీల అది! ఆ లీలతో 'సాయిబాబాని ఒక పిచ్చి ఫకీరు' అని అనుకున్నవారంతా 'బాబా ఒక అవతార పురుషుడు' అని తెలుసుకున్నారు. బాబా శిరిడీలో ఎన్నో లీలలు చేశారు. వాటిని చూసేందుకు దూరప్రాంతాల నుండి చాలామంది భక్తులు వచ్చేవారు. బాబా సమాధి చెందాక కూడా ఆయన లీలలు ఆగలేదు. ఆ కారణంగానే ఈ బ్లాగు ఇంత చక్కగా వికసిస్తోంది. సరి, ప్రియమైన పాఠకులారా! ఇప్పుడు నేను ఇటీవల బాబా చూపిన ఒక చక్కని లీలని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. భక్తిలో నిరాడంబరతను సాయిబాబా ఇష్టపడతారు. అలాంటి భక్తులను ఆయన ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తారు. అలాంటి సాయిభక్తులైన గౌరవ్, అతని భార్య సీమలతో నేను మాట్లాడినప్పుడు, వాళ్ళు నాతో బాబా తమకు ఇచ్చిన గొప్ప సాయిలీలను ఈవిధంగా తెలియజేశారు.
జై సాయిరామ్!
కెనడాలో మేముంటున్న కమ్యూనిటీలో ప్రతి ఒక్కరి ఇంటిలో సాయిబాబా భజన పెట్టుకునేలా ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పటికి కొన్నిరోజులముందే మేము జైపూరు నుండి ఒక బాబా విగ్రహం కొని తెచ్చుకున్నాం. అందువలన మొదట మా ఇంటిలో 2016, నవంబరు 26, శనివారం సాయంత్రం భజన పెడదామని అందరూ నిశ్చయించారు. అప్పటినుండి అందరూ సాయిబాబా ముందు భజనలు పాడి వేడుక చేసుకునే ఆరోజు కోసం ఎంతో ఎదురుచూశారు. ఆరోజు రానే వచ్చింది. ఆరోజు నాకు రమేష్ గారు ఫోన్ చేసి, "బాబాకి పూజ చేశారు కదా?" అని అడిగారు. నేను, "మేము ఇంకా చేయలేద"ని చెప్పాను. దాంతో ఆయన భజన ప్రారంభించడానికి కాస్త ముందుగా బాబాకి పూజ చేసేందుకు మా ఇంటికి వచ్చారు. వస్తూ వస్తూ ఆయన బాబా కోసం కొంత సామాగ్రి తెచ్చారు. అందులో పూలు, పూలమాల కూడా ఉన్నాయి. ఆ పూలమాలని మేము మా ఇంటిలో ఉన్న పెద్ద సాయిబాబా ఫోటోకి వేసి అలంకరించాం. తరువాత పూజ, భజన అన్నీ సక్రమంగా జరిగాయి. అందరూ బాగా ఆనందించారు. రోజంతా భజన హడావిడిలో బాగా అలసిపోయి ఉన్నందున మేము వెంటనే నిద్రపోయాము.
మరునాడు వేకువఝామునే నేను, సీమ లేచి బాబాకి కాకడ ఆరతి ఇస్తున్నప్పుడు, పూలమాల పొడవు పెరిగిందన్న విషయాన్ని సీమ గుర్తించింది. వెంటనే మేము ముందురోజు తీసిన ఫోటోలతో పోల్చి చూశాము. నిజంగానే పూలమాల పొడవు పెరిగి ఉంది. అన్నివిధాలా మేము పూలమాల పొడవు పెరుగుతోందని నిర్ధారణ చేసుకున్నాక రమేష్ గారితో సహా భజనకు వచ్చిన ఇతర మిత్రులందరికీ బాబా లీలని తెలియపరిచాము. వెంటనే అందరూ వచ్చి మధ్యాహ్నం ఒంటిగంట నుండి రాత్రి 8 గంటల వరకు నామజపం, భజన నిర్విరామంగా చేశారు. ఆ సమయమంతా పూలమాల పొడవు పెరుగుతూనే ఉంది. అంత అద్భుతమైన అనుభవాన్నిచ్చి బాబా మమ్మల్ని ఆశీర్వదించారు. "థాంక్యూ! థాంక్యూ సో మచ్ బాబా!" మీ అందరి కోసం క్రింద ఫోటోలు జతపరుస్తున్నాను, చూసి ఆనందించండి.
ఈ లీల యొక్క వివరాలు తెలుసుకోవాలంటే నా మొబైల్ నెంబరు 416-356-9166 కు ఫోన్ చేయగలరు.
రెండవ లీల:
సాయిభక్తురాలు ఆంచల్ తన ఆంటీగారి ఇంటిలో బాబా చూపిన మధురమైన లీలని మనతో ఇలా పంచుకుంటున్నారు:
సాయిరామ్! మీరు బాబా చేసిన అద్భుతాలు ఎన్నో విని ఉంటారు. 11 సంవత్సరాల క్రిందట జరిగిన ఈ అద్భుతాన్ని కూడా చదవండి. న్యూఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో నివసిస్తున్న మా ఆంటీగారి ఇంటిలో బాబాకి సమర్పించిన పూలమాల ద్వారా బాబా చూపిన అద్భుత అనుభవమిది. సాయిభక్తురాలైన మా ఆంటీ తన అలవాటు ప్రకారం ఒక గురువారంనాడు బాబాకు పూలమాల వేసి పూజ పూర్తి చేసింది. కొద్దిసేపటికి తను ఆశ్చర్యపడేలా పూలమాల పొడవు పెరిగివుండటం కనిపించింది. సమయం గడుస్తున్నకొద్దీ పూలమాల పొడవు పెరుగుతూ ఉంది. పూలమాల పొడవు పెరిగేకొద్దీ పువ్వులు వాటంతట అవే వాడిపోసాగాయి. అతి కొద్ది సమయంలో ఈ వార్త దావానలంలా అంతటా వ్యాపించింది. దాంతో ఢిల్లీలోని పలుప్రాంతాల నుండి భక్తులు ఆమె ఇంటికి రాసాగారు. మీడియా కూడా బాబా లీలని కవరేజ్ చేయడానికి వచ్చింది. నేరుగా ఈ అద్భుతమైన బాబా లీలని చూసే అవకాశంలేని దూరప్రాంత భక్తులకు మీడియా ద్వారా దర్శనం చేసుకునే అవకాశం కలిగింది. బాబా లీలలు ఇలానే ఉంటాయి. ఆయన తన ఉనికిని ఎప్పటికప్పుడు ఎక్కడో ఒకచోట ఈవిధంగా మనకి తెలియజేస్తూనే ఉంటారు. మీ అందరికోసం నేను ఇక్కడ కొన్ని ఫోటోలు జతచేస్తున్నాను. ఆ ఫొటోలన్నీ గమనిస్తే మీకు బాబా లీల అర్థమవుతుంది. చూసి తరించండి. ఆ ఫోటోలు ఎవరు చూసినా బాబా లీలని వర్ణించడానికి వారికి మాటలు అందవు. బాబా ఆశీస్సులు సదా అందరిపై ఉండాలి.
ఇంత మంచి అనుభవాన్ని మనతో పంచుకున్న ఆంచల్‌కి మా ధన్యవాదాలు. బాబా ఆశీస్సులు సదా మీపై ఇలాగే ఉండాలి.

om sairam jai sairam
ReplyDeleteOm sai Sri sai Jaya Jaya sai om sairam
ReplyDeleteOM SAI RAM
ReplyDelete