సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 221వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. అన్ని విషయాలలో తోడుగా ఉంటూ సహాయం చేస్తున్న బాబా
  2. ఊదీ అద్భుత వైద్యం

అన్ని విషయాలలో తోడుగా ఉంటూ సహాయం చేస్తున్న బాబా

ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారములు. నేను 15 సంవత్సరాలుగా సాయిబాబా భక్తురాలిని. మాది విజయవాడ. బాబానే నా ధైర్యం. ఆయన ఎల్లవేళలా నాకు తోడుగా ఉంటున్నారు. ఆయన తమ మహిమలను నా జీవితంలో అనేకసార్లు చూపించారు. వాటినుండి రెండు అనుభవాలను నేనిప్పుడు ఈ బ్లాగు ద్వారా మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

2015లో మా పెద్దబాబుకి 8 సంవత్సరాల వయస్సుంటుంది. హఠాత్తుగా ఒకరోజు తన కాలికి గాయమవడంతో హాస్పిటల్లో జాయిన్ చేశాము. పరిస్థితి ఎంత తీవ్రమంటే వెంటిలేషన్ వరకు వెళ్ళింది. నేను, మావారు చాలా భయపడిపోయాము. ఆ సమయంలో మేము పడిన వేదన ఆ సాయినాథునికే తెలుసు. నేను ఆయనపై ఉన్న నమ్మకంతో ఆ కష్టంనుండి బయటపడేయమని బాబాను ప్రార్థించి, సాయిసచ్చరిత్ర చదవడం మొదలుపెట్టాను. కానీ ఏదో ఒక కారణంగా చదవలేకపోయేదాన్ని. దాంతో మా ఆడపడుచు "బాబుకోసం నేను సచ్చరిత్ర చదువుతాను" అని అన్నారు. తను సచ్చరిత్ర చదవడం మొదలుపెట్టిన మూడవరోజుకే బాబా ఆశీస్సులు మాకు లభించాయి. బాబు పరిస్థితిలో మార్పు కనిపించింది. సచ్చరిత్ర చదవడం సరిగ్గా విజయదశమితో ముగిసింది. తరువాత వెంటిలేషన్‌పై ఉన్న బాబు దాన్ని తొలగించుకొని, వాడంతట వాడే బయటికి నడుచుకుంటూ వచ్చాడు. అది చూసిన మా ఆనందానికి హద్దుల్లేవు. కానీ పూర్తిగా నయం కాలేదు. అప్పుడు బాబా మరొక దారి చూపించడంతో మేము హోమియో వైద్యం మొదలుపెట్టాం. బాబా అనుగ్రహంతో వాడికి పూర్తిగా నయమయ్యింది. బాబా చేసిన మేలుకు మేమెప్పుడూ ఆయనకు కృతజ్ఞులమై ఉంటాము.

2019, అక్టోబరు 30న మా నాన్నకు డాక్టర్ స్కానింగ్ చేసి, "లివర్‌లో కణుతులు ఉన్నాయి. అవి క్యాన్సర్ కణాలేమో అని అనుమానంగా ఉంది. MRI స్కాన్ చేయించండి" అని చెప్పారు. అప్పుడు నేను, "బాబా! మాకు అండగా ఉండండి. నాన్నకు ఏమీ కాకూడదు" అని ప్రార్థించాను. బాబా దయవలన స్కాన్ రిపోర్టు ద్వారా అవి క్యాన్సర్ కణాలు కావని, కేవలం స్టోన్స్ అని తేలింది. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా!" ఇలా బాబా నాకు అన్ని విషయాలలో తోడుగా ఉంటున్నారు.

మావారికి గత మూడునెలలుగా ఉద్యోగం లేదు. పైఅధికారుల వలన ఒత్తిడి పెరిగి ఆయన ఉద్యోగం మానేశారు. నేను బాబా ఉన్నారనే ధైర్యంతో ఎటువంటి చింత లేకుండా, అధైర్యపడకుండా ఉన్నాను. "సాయీ! మీ ఈ బిడ్డ మీద దయ చూపించి మావారి ఉద్యోగ విషయంలో కూడా మీరు ఆదుకోవాలి. నాకు మీ చరణములే దిక్కు మావారికి ఉద్యోగాన్నిచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి".

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!

ఊదీ అద్భుత వైద్యం

నా పేరు కవిత. నేను యుఎస్ఏలో నివాసముంటున్నాను. 2018లో నేను బాబా భక్తురాలినయ్యాను. అప్పటినుండి ఇప్పటివరకు నేను చాలా చాలా అనుభవాలను అనుభూతి చెందాను. ఇప్పుడు ఆలోచిస్తే, ఈ జీవితమంతా బాబా నాతోనే ఉన్నారని తెలుస్తోంది. ఈ విశ్వాన్నంతా నడిపించేది ఆయనేనని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆయన ఆజ్ఞ లేకుండా ఒక ఆకు కూడా కదలదు(సాయి సచ్చరిత్రలో చెప్పినట్లు). నేనిప్పుడు ఊదీకి సంబంధించిన అద్భుతాలను పంచుకోవాలనుకుంటున్నాను. చాలామంది భక్తులు తమ అనుభవాలను, బాబా లీలలను ఈ బ్లాగులో పంచుకోవడం నిజంగా ఒక ఆశీర్వాదం.

నా పెద్దకూతురికి తరచూ తలనొప్పి వస్తుంటుంది. వెంటనే తనకి చికిత్స అందకపోతే అది మూర్ఛకు దారితీస్తుంది. 2013 నుండి ఆ మూర్ఛకోసం తను మందులు వాడుతూ ఉంది. అయినప్పటికీ ఎటువంటి మార్పూ లేదు. బాబా దయవల్ల 2018, సెప్టెంబరులో శిరిడీ నుండి మాకు ఊదీ అందింది. అప్పటినుండి ప్రతిరోజూ నేను ఊదీని మా అమ్మాయి నుదుటిపై పెట్టడం ప్రారంభించాను. తరువాత నేను తన ఆరోగ్యంలో గణనీయమైన మార్పును చూశాను. 2019, ఫిబ్రవరి నుండి ఊదీని నీళ్లలో కూడా కలిపి తనచేత త్రాగిస్తున్నాను. అప్పటినుండి తనకి ఎటువంటి సమస్యలూ లేవు. మార్చిలో ఒకసారి తను తలనొప్పి అని ఫిర్యాదు చేసింది. వెంటనే నేను తనకి బాబా ఊదీని నీళ్లలో కలిపి ఇచ్చాను. కొన్నినిమిషాల్లో తన తలనొప్పి పోయింది. నాకు తలనొప్పి వచ్చినప్పుడు, నా చిన్న కూతురి శరీరంపై దద్దుర్లు వచ్చినప్పుడు కూడా నేను ఊదీ అద్భుత మహిమను చూశాను. ఒకసారి నా చిన్న కూతురి శరీరంపై ఏవో పురుగులు కుట్టినందువలన బాగా దద్దుర్లు వచ్చాయి. వాటిపై ఊదీ రాసిన కొద్దిసేపట్లోనే అవి అదృశ్యమయ్యాయి. నిజంగా బాబా ఊదీ అమోఘమైనది, అద్భుత మహిమగలది. మరో అద్భుతమైన విషయమేమిటంటే, నా వద్ద ఊదీ అయిపోబోతుందన్న ప్రతిసారీ బాబా దయతో ఊదీ ప్యాకెట్లు నా స్నేహితుల ద్వారా నాకు అందుతున్నాయి. "బాబా! చాలా చాలా కృతజ్ఞతలు". 

7 comments:

  1. Sri sachchidananda sadguru sainathmaharajuki jai please bless me sai

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'

    ReplyDelete
  3. ఓం సాయిరాం...🌹🙏🌹

    ReplyDelete
  4. ఓం సాయిరాం ��

    ReplyDelete
  5. 🌹🌹శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!🌹🌹

    ReplyDelete
  6. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo