సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 217వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. తల్లిలా చూసుకోవటానికి బాబా ఉన్నారు
  2. సాయి అనుగ్రహం

తల్లిలా చూసుకోవటానికి బాబా ఉన్నారు

ఓం సాయిరామ్! నేను హైదరాబాద్ నుండి గౌరి. గత 5 సంవత్సరాల నుండి నేను బాబా భక్తురాలిని. నా జీవితంలో బాబా చాలా అద్భుతాలను చూపించారు. ప్రతిరోజూ నేను సచ్చరిత్ర నుండి ఒక అధ్యాయం చదువుతాను. బాబా ఆశీర్వాదంతో నేను మహాపారాయణ గ్రూపులో సభ్యురాలిని. ఇక నా అనుభవంలోకి వస్తే...

నా సోదరుడు 2016లో బి.టెక్ పూర్తి చేశాడు. తను బి.టెక్ పూర్తి చేసిన తర్వాత, తనకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలన్న ఆసక్తి లేదని, యానిమేషన్స్ చేయాలని ఆసక్తి ఉందని మా తల్లిదండ్రులతో చెప్పాడు. ఆ విషయం వింటూనే మా తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. ఎందుకంటే, మా కుటుంబ పరిస్థితి బాగా లేనందున కుటుంబానికి తను ఆర్థికంగా అండ అవుతాడని వాళ్ళు భావించారు. నా సోదరుడితో కొంత చర్చ జరిగాక వాళ్ళు అతని ప్రతిపాదనకు అంగీకరించారు. అయితే కోర్సు పూర్తి చేసిన తర్వాత తనకి ఉద్యోగం రాలేదు. ఉద్యోగం లేకుండా తను ఒక సంవత్సరం వృధా చేశాడు. తనకి ఉద్యోగం రావడంలేదని మేము విచారంతో నిరాశకు గురయ్యాము. ఒకరోజు నేను అనుకోకుండా సాయిబాబా భక్తుల అనుభవాల కోసం ఇంటర్‌నెట్ లో సెర్చ్ చేసాను. అప్పుడు  హేతల్ గారి ఇంగ్లీష్ బ్లాగ్ నా దృష్టిలో పడింది. ఆరోజు నుండి నేను భక్తుల అనుభవాలను చదవడం ప్రారంభించాను. దాంతో బాబా ఖచ్చితంగా సహాయం చేస్తారని నా మనస్సును దృఢపరుచుకున్నాను. సాయి దివ్యపూజ గురించి తెలిసి నా సోదరుని ఉద్యోగ విషయంగా నేను 11 వారాలు చేద్దామన్న సంకల్పంతో పూజ ప్రారంభించాను. కానీ నా సోదరుడికి ఉద్యోగం రాలేదు. నేను బాబాను, "అడిగిన ప్రతి సమస్యను పరిష్కరించే మీరు, నా సోదరునికి ఉద్యోగం వచ్చేలా ఎందుకు ఆశీర్వదించడం లేదు? మా విషయంలో ఎందుకిలా చేస్తున్నారు?" అని అడిగాను. అప్పుడు మనకు ఇష్టమైన ఆహారపదార్థాన్ని బాబాకు విడిచిపెడితే సమస్య పరిష్కారం అవుతుందని నాకు తెలిసింది. అప్పుడు నేను నా సోదరుడి ఉద్యోగం కోసం బాబాను ప్రార్థించి నాకు ఇష్టమైన ఆహారం తినడం మానేశాను. సరిగ్గా నేను 2018 డిసెంబరులో ఇష్టమైన ఆహారాన్ని విడిచిపెట్టాను. బాబా ఆశీర్వాదంతో నా సోదరుడికి 2019, అక్టోబర్‌ 4న ఉద్యోగం వచ్చింది. విజయదశమి 8వ తేదీన ఉన్నందున అక్టోబర్ 7న ఉద్యోగంలో చేరమని కంపెనీ వాళ్ళు చెప్పారు. తను ఆ సమాచారం మా తల్లిదండ్రులకు అందించాడు. దసరా రోజుల్లో తనకి ఉద్యోగం వచ్చిందని నేను చాలా సంతోషించాను. నా కోరిక నెరవేరిందని హృదయపూర్వకంగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అయితే నా సోదరుడు తాను ఆశించిన దానికంటే తక్కువ ప్యాకేజీ(జీతం) ఇస్తున్నారని, తనకి ఆ ఉద్యోగంలో చేరడానికి ఆసక్తి లేదని చెప్పాడు. మా నాన్నగారు, "ఇప్పటికే కోచింగ్ అంటూ, తరువాత ఉద్యోగం లేకుండా చాలా సమయం వృధా అయింది. కాబట్టి ఇంకా సమయాన్ని వృధా చేసుకోకుండా ఆ ఉద్యోగంలో చేరి కొన్నినెలలు చేయమ"ని చెప్పారు. మరుసటిరోజు సోమవారం తనకి ఫోన్ చేసి అడిగితే, తను ఆ కంపెనీలో చేరడానికి వెళ్ళలేదని చెప్పాడు. ఆరోజు నేను ఏడుస్తూ, "బాబా! దయచేసి ఆ కంపెనీలో చేరేలా తన మనసు మార్చండి" అని బాబాను వేడుకున్నాను. రోజులు గడిచిపోయాయి. ఒకరోజు నాన్న తనకి ఫోన్ చేసి, "వేరే ఉద్యోగ అవకాశం ఏదైనా వచ్చిందా?" అని అడిగారు. అప్పుడు తను, "పదిరోజుల క్రితమే నేను ఆ కంపెనీలో చేరాను, మొదటి జీతం అందుకున్నాక మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను" అని చెప్పాడు. ఆ విషయం నాన్న నాతో చెప్పినప్పుడు, ఉద్యోగం యొక్క ప్రాముఖ్యతను తనకు అర్థమయ్యేలా చేసి, ఉద్యోగంలో చేరేలా చేసినందుకు ఆనందంతో బాబా ముందు కన్నీళ్లు పెట్టుకున్నాను. "ధన్యవాదాలు బాబా! మీరు తన కెరియర్ ప్రకాశవంతంగా ఉండేలా చేస్తారని నాకు తెలుసు. మీరు తనని మీ చేతుల్లోకి తీసుకున్నారు. ఇక నేను తన గురించి భయపడనవసరంలేదు. ఎందుకంటే తల్లిలా అతన్ని చూసుకోవటానికి మీరు ఉన్నారు".

సాయి అనుగ్రహం

కెనడా నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిభక్తులందరికీ నమస్కారం. బాబా మీ అందరినీ ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. నేను చాలాకాలంగా నా అనుభవాన్ని పంచుకోవాలని ఎదురుచూస్తున్నాను. ఇన్నాళ్లకు ఆ అవకాశం లభించింది. నేను 2010 నుండి బాబాకు భక్తురాలిని. నాకు చాలా అనుభవాలున్నాయి. ఈమధ్య నేను, నా భర్త ఒకేసారి మా ఉద్యోగాలను కోల్పోయాము. ఆ స్థితిలో నాకున్న ఏకైక విశ్వాసం బాబా, ఆయనే కొత్త ఉద్యోగాన్నిచ్చి మా సమస్యలను పరిష్కరిస్తారని. ఆయన ఆశీర్వాదంతో కేవలం ఒక నెలలో నా భర్తకు ఉద్యోగం వచ్చింది. అయితే రిఫరెన్స్ చెక్ లో కొన్ని సమస్యలున్నాయి. మావారు తన పాత కంపెనీలోని చివరి పనిదినం గురించి ప్రస్తావించనందున రిఫరెన్స్ చెక్ పాస్ కాదని నేను భయపడ్డాను. దాంతో నేను, "బాబా! రిఫరెన్స్ చెక్ ఎంటువంటి ఇబ్బందీ లేకుండా క్లియర్ అవ్వాలి. మావారి చివరి పనిదినం గురించి ప్రశ్నించకుండా త్వరలో ఆఫర్ లెటర్ రావాలి. అలా జరిగితే కొబ్బరికాయను సమర్పించుకుంటాను" అని చాలా గాఢంగా బాబాను ప్రార్థించాను. బాబా దయ చూపారు. వారంలోగా ఏ సమస్యా లేకుండా మావారికి ఆఫర్ లెటర్ వచ్చింది. "బాబా! నా కుటుంబాన్ని ఆశీర్వదించినందుకు చాలా ధన్యవాదాలు".

మరో అనుభవం:

ఒక గురువారం నేను బాబాకోసం పరమాన్నం తయారుచేసి మందిరంలో బాబాకు నివేదించడానికి వెళ్ళాను. అయితే నేను మందిరంలోకి అడుగుపెడుతూనే పొరపాటున నేను తీసుకెళ్తున్న పరమాన్నం క్రిందపడిపోయింది. ప్రేమతో బాబాకు తెచ్చింది క్రిందపడిపోయేసరికి నేను చాలా బాధపడ్డాను. అక్కడ పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సేవకురాలు, "పక్కనే ఉన్న రెస్టారెంట్ నుండి ఏదైనా స్వీట్ తెచ్చుకోండి" అని సలహా ఇచ్చింది. వెంటనే నేను అక్కడికి వెళ్లి స్వీట్ తీసుకుని డబ్బులు ఇవ్వబోతుండగా హోటల్ యజమానురాలు, "బాబా మందిరానికి వెళ్తున్నారా?" అని అడిగారు. నేను 'అవున'ని చెప్పాను. ఆమె ఒక ప్యాకెట్ నా చేతికిచ్చి బాబాకు సమర్పించమని చెప్పింది. బాబా లీలలు మనం ఎలా ఊహించగలం!? ఆమె బాబాకోసం ఆహారాన్ని సిద్ధం చేసి మందిరానికి వెళ్లే భక్తులకిచ్చి పంపాలని ఎదురుచూస్తోంది. సమయానికి బాబా నన్ను అక్కడికి పంపి తనకోసం తన భక్తురాలు సిద్ధం చేసిన ఆహారాన్ని నాతో తెప్పించుకున్నారు. ఆయన చేసే అద్భుతాలు అంతులేనివి.

గత కొన్ని వారాలలో నేను కొన్ని ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. బాబా ఆశీస్సులతో త్వరలోనే నేను ఉద్యోగాన్ని పొందుతానని ఆశిస్తున్నాను. బాబా తన బిడ్డలందరికీ ఎప్పుడూ అండగా ఉంటూ అశీర్వదిస్తారు. 

7 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'

    ReplyDelete
  2. ఓం సాయిరాం...🌹🙏🌹

    ReplyDelete
  3. ఓం సాయిరాం...🌹🙏🌹

    ReplyDelete
  4. సర్వం సాయిమయం ��

    ReplyDelete
  5. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏❤🌼😊

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo