సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాలాభావు


సాయిమహాభక్త బాలాభావు అలియాస్ బాలాభట్ అలియాస్ రామచంద్ర సీతారామ్ దేవ్. ఇతను బ్రాహ్మణుడు. గొప్ప భూస్వామి. మహారాష్ట్ర ముంబైలోని అంధేరి, వర్సోవా రోడ్డులో అతని నివాసం.

1936, సెప్టెంబరు 18న శ్రీసాయిబాబాతో తనకుగల అనుభవాల గురించి శ్రీ బి.వి.నరసింహస్వామీజీకి ఆయన వివరించారు. అవి క్రింద పొందుపరచబడినవి.

నేను సాయిబాబాను మొదటిసారిగా 1908లో దర్శించాను. నేను అప్పటికే కళ్యాణ్ లో దాసగణు మహారాజ్ గారి కీర్తనల ద్వారా బాబా గురించి విన్నాను. నాకు బాంద్రాలో కసాయి పనిచేసిన అమీర్ శక్కర్ ఖాతిక్ తెలుసు. అతనెక్కువగా బాబా గురించి మాట్లాడుతూ, శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోమని నాతో చెప్తుండేవాడు. అందువల్ల నేను నా స్నేహితుడు శ్రీకృష్ణపాటిల్ తో కలిసి శిరిడీ వెళ్ళాను. ఆ రోజులలో భక్తులు బసచేయడానికి శిరిడీలో సాఠేవాడా మాత్రమే ఉండేది. కానీ మేము గణపతి ఆలయంలో బస చేశాము. ఆరోజు ముంబైనుండి వచ్చిన సందర్శకులు ఎవరూ లేరు. స్థానిక మరియు సమీప గ్రామాల నుండి వచ్చిన సందర్శకులు మాత్రమే ఉన్నారు. నేను శిరిడీ రావడానికి ముందు అక్కల్‌కోట వెళ్లాలని అనుకుంటూ ఉండగా అమీర్ శక్కర్ నాతో, "అక్కల్‌కోట వెళ్ళే మార్గంలోనే శిరిడీ ఉంది. కాబట్టి ముందుగా మీరు శిరిడీ సందర్శించి, తరువాత అక్కడినుండి అక్కల్‌కోట వెళ్లండి" అని సలహా ఇచ్చాడు. దాంతో నేను ఒకసారి బాబా దర్శనం చేసుకుని, వెంటనే అక్కల్‌కోట వెళ్ళిపోదామని అనుకున్నాను. మేము మొదటిసారి సాయిబాబాను దర్శించినప్పుడు ఆయన, "నేను అక్కల్‌కోట వెళ్ళాలి" అని అన్నారు. బాబా నా మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంతో నేను ఆశ్చర్యపోయాను. ఎదుటివ్యక్తి మనసును చదవగలిగే ఆయన శక్తికి నేను మంత్రముగ్ధుడనయ్యాను. అందువల్ల నేను ఆరోజంతా శిరిడీలో ఉండి బాబాతో గడపాలని అనుకున్నాను. నేను ఒక గొప్ప సత్పురుషుని సాన్నిధ్యంలో లభించే ఆనందాన్ని ఆస్వాదించడం తప్ప వేరేమీ ఆశించలేదు. మరుసటిరోజు ఉదయం నేను సాయిబాబా వద్ద అనుమతి తీసుకుని అక్కల్‌కోట వెళ్ళిపోయాను.

నా మొట్టమొదటి శిరిడీ పర్యటనతో నేను బాబాపట్ల ఆకర్షితుడినయ్యాను. అందువల్ల నేను దీపావళి పండుగ సమయంలో మళ్ళీ శిరిడీ వెళ్ళాను. ఈసారి పర్యటనలో నాతోపాటు ఐదారుగురు భక్తులు వచ్చారు. ఆ సమయంలో బాబావద్ద ముంబైనుండి వచ్చిన సందర్శకులు చాలామంది ఉన్నారు. నేను బాబాతో రాత్రి 8 గంటల నుండి అర్థరాత్రి వరకు గడిపాను. ఆ సమయంలో నేను మాటల సందర్భంలో, "నాకు ఉపదేశమిచ్చి నా గురువుగా ఉండమ"ని బాబాను కోరాను. అందుకాయన, "గురువు ఉండవలసిన అవసరం లేదు. అంతా మన లోపలే ఉంది. నీవు ఏ విత్తనం వేస్తావో, ఆ ఫలాన్నే పొందుతావు. నీవు ఏది ఇస్తావో, అదే పొందుతావు. గురువు ఆవశ్యకత లేదు, అది నీలోనే ఉంది. అంతర్వాణిని వినడానికి ప్రయత్నం చేయి. అది ఆదేశించినట్లు నడుచుకో. మనం మన ఆత్మను తెలుసుకోవాలి. అదే మన గురువు" అని చెప్పారు. అప్పటికే నాకు మహారాష్ట్రలోని రత్నగిరిలో ఒక సంప్రదాయ గురువు ఉన్నారు.

రానురానూ నాకు సాయిబాబా యందు భక్తివిశ్వాసాలు దృఢమయ్యాయి. దానితో నేను క్రమంగా అక్కల్‌కోట, పండరీపురం వెళ్లడం మానుకున్నాను. అప్పట్లో నేను రెండు ఉద్యోగాలు చేస్తుండేవాడిని. మొదటిది - స్థానిక పాఠశాలలో అసిస్టెంట్ మాస్టర్, రెండవది - స్టాంపు వెండర్ (కమిషన్ మీద స్టాంపులు అమ్మడం) పని. తరచూ శిరిడీ ప్రయాణాలు నా ఉద్యోగాన్ని అస్థిరపరిచాయి. పాఠశాల అధికారుల వద్ద నేను తీసుకున్న సెలవులు పూర్తయినా కూడా బాబా నన్ను శిరిడీలో నిర్బంధించేవారు. పదేపదే అలాగే జరుగుతుండటంతో విసిగిపోయిన పాఠశాల అధికారులు నేను నా సమయాన్ని ఎక్కడ గడుపుతున్నానో విచారించి 'శిరిడీయా?' లేదా 'ఉద్యోగమా?' ఏదో ఒకటి తేల్చుకోమని నన్ను ఒత్తిడి చేశారు. దాంతో నేను ఉద్యోగాన్ని విడిచిపెట్టాను. అప్పటికి నా వయస్సు 32 సంవత్సరాలే. సాయిబాబాయందే విశ్వాసముంచాను. ఆయన కృపవలన నా ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగానే ఉండేది. ఉద్యోగాన్ని వదిలిపెట్టినా స్టాంపువెండర్ పనిని మాత్రం కొనసాగించాను. దానివలన నాకు రోజుకు 20 నుండి 25 రూపాయల ఆదాయం వచ్చేది. ఆ పనిని 1931 వరకు చేసిన తరువాత దానిని నా కొడుకుకి అప్పజెప్పాను.

బాబా భౌతికదేహంతో ఉన్నంతవరకు శిరిడీలో జరిగే ప్రతి శ్రీరామనవమి పండుగకు హాజరవుతూ ఉండేవాడిని. బాబా నాకు వ్యక్తిగత విషయాలలో మార్గదర్శకత్వం చేస్తూ ఉండేవారు. ఆయన మహాసమాధి చెందాక కూడా నేను ఆయననుండి మార్గదర్శకత్వం పొందుతూనే ఉన్నాను. ఏదైనా అవసరం ఏర్పడినపుడు బాబా పటం ముందు చీటీలు వేసి, ఆయనను ప్రార్థించి, ఒక చీటీ తీయడం ద్వారా ఆయన సూచనలను పొందగలుగుతున్నాను.

బాబా దేహధారిగా ఉన్నప్పుడు ఒకసారి ముంబైలోని అంధేరిలో ఒక ఇంట్లో భయంకరమైన దోపిడీ జరిగింది. నేను దొంగల చేతిలో తీవ్రంగా గాయపడిన ఆ ఇంటివారిని ఆస్పత్రిలో చూసి చలించిపోయాను. "మా కుటుంబాన్ని అట్టి ఆపదనుండి రక్షించమ"ని బాబాను ప్రార్థించాను. నాటిరాత్రి కలలో బాబా కనపడి, “నేను పదిమంది పఠానులను తీసుకుని వచ్చాను. నీవు భయపడనవసరంలేద”ని చెప్పారు. అదే సమయంలో కొందరు చాకలివాళ్ళు 'తాము మాములుగా బట్టలు ఉతుక్కునే చోటుకు  రైల్వేశాఖ అధికారులు రానివ్వడం లేదని, మా స్థలంలో గుడిసెలు వేసుకోవడానికి అనుమతినిమ్మ'ని నన్ను అభ్యర్థించారు. నేను వెంటనే అంగీకరించాను. నాకు నెలకు రూ.200/- అద్దె లభించడమేకాక, వాళ్ళు తోడుండటంవలన దొంగల బారినుండి నాకు రక్షణ కూడా లభించింది. మా బావిలోని నీరు వాళ్ళ అవసరాలకు సరిపోకపోయేసరికి నేను బాబాను సంప్రదించి, ఆయన సూచించిన చోట వేరొక బావి త్రవ్వించాను. అందులో పుష్కలంగా నీళ్ళు పడ్డాయి.

తర్వాత నేను ఇప్పుడుంటున్న ఇంటిని నిర్మించడానికి ముందుగా ఒక బావి త్రవ్వించవలసిన అవసరం ఏర్పడింది. అప్పుడు నేను స్వయంగా శిరిడీ వెళ్లి బాబాను సంప్రదించాను. ఆయన సూచనల మేరకు త్రవ్విన బావిలో పుష్కలంగా మంచినీళ్లు పడ్డాయి. తరువాత భవన నిర్మాణానికి బాబా అనుమతి తీసుకోవడానికి నేను శిరిడీ వెళ్ళినప్పుడు నా వద్ద కేవలం 5 గదులు నిర్మాణానికి సరిపడా డబ్బు మాత్రమే ఉంది. కానీ బాబా నేలమీద 25 గీతలు గీసి, “గదికి ఒక రూపాయి చొప్పున 25 రూపాయలు దక్షిణ ఇవ్వు” అన్నారు. నిజానికి నేను 5 గదుల భవనమే నిర్మించదలచినప్పటికీ నేను రూ.25/- బాబాకు సమర్పించాను. తరువాత నేను భవననిర్మాణం మొదలుపెట్టాను. క్రమంగా ఒక్కొక్క గది పెరుగుతూ 1920 నాటికి 25 గదుల నిర్మాణం పూర్తయింది. అలా బాబా మాట వాస్తవమయ్యింది. ఇప్పటికీ అది 25 గదుల భవనంగానే ఉన్నది.

బాబా ఎప్పటికీ సజీవంగా ఉంటారన్నది నా బలమైన నమ్మకం. ఆయన నాకు, నా కుటుంబసభ్యులకు ఇప్పటికీ మార్గదర్శకత్వం చేస్తుండటమే అందుకు నిదర్శనం. నా బిడ్డలు కూడా సాయిబాబాపట్ల ప్రగాఢమైన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకున్నారు. సాయితో నాకున్న అనుభవాలన్నీ కీ.శే. శ్రీ ధబోల్కర్ గారికి పంపించాను.


Source: Devotees' Experiences of Sri Sai Baba Part II by Sri.B.V.Narasimha Swamiji
http://www.saiamrithadhara.com/mahabhakthas/baala_bhaavu.html

9 comments:

  1. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  3. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  4. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🙏🕉😊❤😀

    ReplyDelete
  5. Om Sairam Om Sairam Om Sairam Om Sairam Om Sairam Om Sairam Om Sairam Om Sairam Om Sairam Om Sairam Om Sairam Om Sairam 🙏❤🕉😊😀

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM

    ReplyDelete
  7. Om Sri Sai nadhaya namaha

    ReplyDelete
  8. Om Sri Sai nadhaya namaha

    ReplyDelete
  9. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo