నా పేరు సదాశివ. నేను ఒరిస్సాలోని సంబల్పూర్ AIR(ఆల్ ఇండియా రేడియో)లో ఒక చిన్న ఉద్యోగిని. శ్రీమతి మాధవిగారు మా మేడంగారు. ఆమె ద్వారానే నాకు ఈ బ్లాగ్ గురించి తెలిసింది. ఈ బ్లాగ్ ద్వారా నా అనుభవాలు సాయి భక్తులందరికీ తెలియజేయాలని నాకు అనిపించింది. నాకు సాయిబాబా అంటే ఎంతో భక్తి, విశ్వాసం ఉన్నాయి. నా జీవితకాలంలో ఎన్నో బాబా లీలలను చవిచూసాను. వాటిలో ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలని రాస్తున్నాను.
ముందుగా బాబా చరణ కమలాలకు నా వందనాలు. "బాబా! ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. కోటానుకోట్ల భక్తులలో నేను ఒకడిని బాబా. నీ కృపాకటాక్షాలు సదా, సర్వదా మాపై ఉండాలని వేడుకుంటున్నాను."
నేను చిన్నవయసులోనే మా నాన్నగారిని పోగొట్టుకున్నాను. నాన్న ఉద్యోగం(చిన్నది) అమ్మకు ఇచ్చారు. నాకు ఒక తమ్ముడు, చెల్లి వున్నారు. ఎంతో కష్టపడి చెల్లి పెళ్లి చేసాను. మా బావగారి చెల్లిని నాకిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు పెద్దలు. నేను కూడా సరేనన్నాను. ఏదో ఒక చిన్న తప్పు వలన ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలని విషం తాగేసింది. ఆ అమ్మాయిని ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్స్ పరిస్థితి చేతులు దాటిపోయిందన్నారు. నాకు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేసారు. నేను వెంటనే మా ఊరికి వెళ్లి ఆమెను పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాను. వాళ్ళు కూడా "మేము ఏమీ చేయలేము, అమ్మాయి బ్రతకదు" అనేసారు. ఇంక నాకు 'సాయిబాబాయే దిక్కు' అనిపించింది. నేను వెంటనే మిట్టమధ్యాహ్నం వేళ బాబా గుడికి వెళ్లి ఎంత ఏడ్చానో నాకే తెలీదు. బాబాకు సర్వస్య శరణాగతి చేసాను. "బాబా! ఆ అమ్మాయిని రక్షించు" అని వేడుకున్నాను. "నా సమాధి నుంచి సమాధానం ఇస్తాను" అన్న బాబా వచనం ఎప్పుడూ ఊరికే పోదు. అది అక్షర సత్యం.
ఆ సాయినాథుడే కదలి వచ్చాడు ఒక క్రొత్త డాక్టర్ రూపంలో. ఆ అమ్మాయికి ఒక్క ఇంజక్షన్ ఇచ్చాడు. అంతే! నిదానంగా ఆమె శరీరంలో ఉన్న విషం మొత్తం నీరులా బయటికి వచ్చేసింది. తరువాత ఆ డాక్టర్ గారికి ధన్యవాదాలు చెప్పాలని ఎంత వెతికినా ఎక్కడా ఆయన కనపడలేదు. నేను నర్స్ దగ్గరికి వెళ్లి, "ఆ ఇంజక్షన్ ఇచ్చిన డాక్టర్ ఎక్కడ?" అని అడిగాను. ఆవిడ "ఏ డాక్టర్? ఎవరూ రాలేదే, నేను క్రొత్తగా ఎవరినీ చూడలేదు" అని చెప్పింది. అప్పుడు నా బుద్ధి పని చేసింది. ఆ వచ్చింది బాబానే అని అప్పుడు అర్ధం అయ్యింది. చూశారా, నన్ను ఎంత పెద్ద కష్టం నుంచి బాబా బయటపడేసారో!! తరువాత ఇక్కడ బుర్లా అనే ఆస్పత్రి చాలా ఫేమస్. ఆ అమ్మాయిని అక్కడికి మార్చాము. ఇంతకూ అసలు విషయం ఏమిటంటే, ఆ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుందట. ఆ విషయం పెద్దవాళ్లకు చెప్పలేక అలా చేసింది. తరువాత ఆ అమ్మాయి పెళ్లి అతనితోనే చేసాము. చూడండి, బాబా నాకు సహాయకుడిగా రాకపోతే, ఎంత అపవాదు నాకు వచ్చేదో! ఇలా ఎన్నో రకాలుగా బాబా నన్ను రక్షిస్తున్నారు. అందుకే నేను సదా ఆయననే నమ్ముకుని జీవిస్తున్నాను. ఇలాంటి బాబా లీలలు చాలా వున్నాయి నాకు. మళ్ళీ ఇంకో లీలతో కలుస్తాను. నమస్కారం.

🕉 sai Ram
ReplyDelete