మలేషియా నుండి సాయిసోదరి దయలిని గారి అనుభవం:
ఓం సాయిరామ్! 2014 నుండి నేను షిరిడీ సాయిబాబా భక్తురాలిని. నా జీవితంలో జరిగిన నా అనుభవాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
2014లో మా నాన్నగారు ఒక సాయి ఫోటో కొనుగోలు చేసి పూజా గదిలో పెట్టారు. అప్పటికి నాకు బాబా గురించి ఏమీ తెలియదు. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు నా స్నేహితురాలు ఎల్లప్పుడూ బాబా గురించి మాట్లాడుతుండేది. ఒకరోజు ఆమె నన్ను సాయి మందిరానికి తీసుకొని వెళ్ళడానికి నిర్ణయించుకుంది. బాబా గురించి నాకు ఏమీ తెలియని కారణంగా నేను నిరాకరించాను. కానీ ఆమె తనతో నన్ను రమ్మని బలవంత పెట్టింది. సరే అని తనతో వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. బాబా ఆలయంలో అడుగుపెట్టడం అదే మొదటిసారి. నేను బాబా ముందు ఒక నేతి దీపం పెట్టాను. నా పక్కన బెలూన్ తో ఒక చిన్న పాప ఆడుకుంటూ ఉంది. పాప రక్షణ కోసం బాబాకి అర్చన చేయడానికి ఆమె తల్లి చిన్న పాపతో గురుకుల్ నుండి వచ్చింది. హఠాత్తుగా ఏడుపు వినిపించింది. ఆ చిన్న పాప జుట్టుకి నిప్పు అంటుకుంది. అందరూ ఆ పాప సహాయానికి ముందుకు వెళ్లారు. అద్భుతం! పాపకి ఏ గాయం కాలేదు. కేవలం 1% జుట్టు కాలింది. బాబా కృప కారణంగా ఏమీ కాలేదని, ఇది బాబా మిరాకిల్ అందరూ అనుకుంటున్నారు. అయినప్పటికీ బాబాపై నాకు విశ్వాసం కుదరలేదు.
మరుసటి వారం బాబాని చూడాలని తీవ్రమైన కోరిక కలిగింది. వెంటనే ట్రైన్ ఎక్కి సాయిబాబా మందిరానికి వెళ్ళాను. మందిరానికి సమీపంలో ఉండగా నా ఫోన్ రింగ్ అయ్యింది. మా అమ్మ, "ఇంటిలో పూజ ఉంది, వెంటనే ఇంటికి రా!" అని చెప్పింది. నేను చాలా నిరాశ చెంది, విచారంగా తిరిగి ఇంటికి వెళ్ళాను. ఇంటికి తిరిగి రాగానే, అమ్మ పూజకు సహాయం చేయమని అడిగింది. ఆమె, "పొంగల్ చేసాను, పూజాగదిలోకి తీసుకొని వెళ్లి పెట్టు" అని చెప్పింది. నేను పూజాగదికి వెళ్ళాను. వెళ్లి నేను ఏమి చూశానో ఉహించగలరా!
సాయి ముఖం నిండా ఊదీ ఉంది. బాబా శక్తివంతమైన కళ్ళు మాత్రమే కనిపిస్తూ, ముఖం మొత్తం ఊదీతో కప్పబడి ఉంది. కన్నీళ్లతో నా కళ్ళు నిండిపోయాయి. వెంటనే మా అమ్మ దగ్గరకు పరుగెత్తాను. "అమ్మా, బాబా ముఖం నిండా ఊదీ పూశావా?" అని అడిగాను. ఆమె 'లేదు' అని చెప్పింది. మా అమ్మను నాతో రమ్మని పిలిచాను. కుటుంబమంతా నన్ను అనుసరించి పూజా గదికి వచ్చి బాబా యొక్క అద్భుతమైన లీలను చూశారు. నేను, "కొంతసేపటి క్రితం సాయి మందిరానికి వెళ్ళాను. మందిరానికి సమీపంలో ఉండగా, అమ్మ ఫోన్ వచ్చింది. వెంటనే నేను నిరాశతో ఇంటికి తిరిగి వచ్చాను. బాబా నన్ను అనుసరించి మన ఇంటికి వచ్చి, ఇక్కడ కూడా నేను ఉన్నానని నిరూపిస్తున్నారు" అని చెప్పాను. ఆ రోజు నుండి నేను విశ్వాసపాత్రురాలైన సాయి భక్తురాలిగా మారిపోయాను. అప్పటినుండి నా జీవితంలో చాలా అద్భుతాలను చూపుతున్నారు బాబా.
నా రెండవ అనుభవం:
ఇంటిలో సాయి మూర్తి (విగ్రహం) ఉండాలని నేను కోరుకున్నాను. నేను బాబాను, "మీరు ఇంట్లో ఉండాలి, అలా మీరు ఉంటే ప్రతి గురువారం నేను మీకు అభిషేకం చేసుకోగలను" అని ప్రార్థించాను. ఎప్పుడూ బాబా విగ్రహం కొనుగోలు చేయాలని అనుకున్నప్పటికీ కొనుగోలు చేయలేకపోయాను. ఒకరోజు నేను నా తల్లిదండ్రులతో కలిసి వెళ్ళాను. నా సోదరుడు నన్ను పిలిచి, "నీకోసం ఒక పార్సిల్ ఉన్నది" అని చెప్పాడు. నేను ఏమిటని అడిగాను. అతను, "తెలియదు, కానీ అది ఒక పెద్ద బాక్స్" అని చెప్పాడు. అతను బాక్స్ తెరిచి, అందులో సాయి మూర్తి వుంది అని నాకు చెప్పాడు. నా కజిన్ సోదరుడు నా జన్మదిన బహుమతిగా నాకు సాయి మూర్తి ఇచ్చాడు. ఆనందబాష్పాలు నా కళ్ళ నుండి జాలువారాయి. మళ్ళీ బాబా నా కోరిక నెరవేర్చారు. బాబా! నీ లీల అద్భుతం, అమోఘం. ప్రతి ఒక్కరి జీవితంలో బాబా అడుగు పెడితే వారి జీవితం అద్భుతమవుతుంది. ఓం సాయిరామ్. ఈ విశ్వంలోని ప్రతి ఒక్కరినీ బాబా ఆశీర్వదించు గాక!

🕉 sai Ram
ReplyDelete