మనం కష్టంలో ఉన్నప్పుడు బాబా సహాయాన్ని అర్థిస్తే, మరుక్షణమే బాబా తమ సహకారాన్ని ఎలా అందిస్తారో ఈ లీల చదివితే మనకు అర్థం అవుతుంది. కావలసినదల్లా బాబా పట్ల కాసింత శ్రద్ద, కూసింత సహనం అంతే! అవి ఉంటే బాబా అనుగ్రహంతో సర్వం సాధ్యమే.
నా పేరు మాధవి, మేము ఉండేది భువనేశ్వర్. నాకు జరిగిన ఒక బాబా లీలను సాటి సాయిబంధువులతో పంచుకొనేందుకు అవకాశం ఇచ్చిన సద్గురు సాయినాథునికి నా ప్రణామములు. నేను Air(ఆల్ ఇండియా రేడియో) అండ్ DD(దూరదర్శన్, సెంట్రల్ గవర్నమెంట్)లో సీనియర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాను. 2012వ సంవత్సరంలో నేను 'అనుగుల్' అనే ఊరిలో వర్క్ చేశాను. ఏప్రిల్ నెలలో అక్కడినుండి భువనేశ్వర్‌లోని RST(T) (Regional Staff Training Institute)కు ట్రాన్స్‌ఫర్ చేశారు. నేను భువనేశ్వర్ వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. RSTలో మేము మా స్టాఫ్‌కు ట్రైనింగ్ ఇస్తాము. అది చాలా కష్టమైన వర్క్. ఎందుకంటే, స్టాఫ్‌కి ట్రైనింగ్ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్ అయి వచ్చాను. అందువలన, "నేను ఈ ఉద్యోగం ఎలా చేయగలను బాబా?" అని రోజూ మధనపడుతూ చాలా భయపడిపోయేదాన్ని. ఒకరోజు మా డైరెక్టర్ సర్ నన్ను పిలిచి, "మీకు ఆల్ ఇండియా రేడియో సెట్‌అప్ టోటల్ ఇన్ఛార్జ్ ఇస్తున్నాను. ఆ వర్క్ మొత్తం మీరు చూసుకోవాలి" అన్నారు. నాకు భయంతో చెమటలు పట్టేశాయి. "బాబా, నీవే దిక్కు" అని ఎన్నిసార్లు మ్రొక్కానో చెప్పలేను. మనం నమ్మితే అంతా ఆయనే చూసుకుంటారు. ఇక నేను నా రూముకి వచ్చి, circute diagrams స్టడీ చేద్దామని మెటీరియల్ కోసం అలమరలన్నీ వెతికాను. కానీ ఎటువంటి మెటీరియల్ దొరకలేదు. "మెటీరియల్ లేకుండా ఎలా టీచ్ చేయడం?" అని చాలా దిగులుతో కుర్చీలో కూర్చున్నాను. ఇంతలో ఆ పరాత్పరునికి నా మీద దయ, కృప కలిగాయి. ఏమి జరిగిందంటే... నా రూములో అలమర పైనుంచి ఒక పెద్ద షీట్ లాంటిది క్రింద పడింది. చూస్తే, సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ వారి పెద్ద సైజు ఫోటో! ఎవరు వేశారో, ఎక్కడనుండి వచ్చిందో ఆ బాబాకే తెలియాలి. వెంటనే దగ్గరకు వెళ్లి చూశాను. బాబా ఫోటోతో పాటు నాకు కావలసిన మెటీరియల్ అంతా ఉంది. బాబానే తీసుకొని వచ్చారు. లేకుంటే ఇటువంటి ఆఫీసులో బాబా ఫోటో ఎలా వస్తుంది? ఆయన అంత కరుణ చూపారు నామీద. నిజానికి ఆ చోటులో కూడా నేను అంతకుముందు వెతికాను. అప్పుడు ఏమీ కనిపించలేదు. ఆ తరువాత నా ట్రైనింగ్ క్లాసులు అన్నీ చక్కగా సాగిపోయాయి. ఆ పరాత్పరుడిని నమ్మినవాళ్ళకు ఏ కష్టమూ రాదు. మీ అందరూ కూడా బాబాపై నమ్మకం ఉంచండి, సర్వం ఆయనే చూసుకుంటారు. ఇదే నా విన్నపం.
🕉 సాయి రామ్
ReplyDelete