సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఊదీ మహిమలు 1


ఒక సాయిభక్తురాలు తన అత్తగారి ఆరోగ్యానికి సంబంధించి బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఒకసారి మా అత్తగారికి విపరీతంగా వాంతులవడం మొదలయ్యాయి. నీళ్ళు త్రాగినా కూడా ఆమెకి వాంతి అయిపోతూ ఉండేది. ఆమెకి BP చాలా ఎక్కువగా ఉంది. BP కంట్రోల్‌లోకి వస్తేగానీ వాంతులు ఆగడానికి మాత్రలు ఇవ్వలేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఏమి చేయాలో తోచక, బాబాను తలచుకొని మేము ఆమెకు బాబా ఊదీని ఇచ్చాము. ఆమెకు BP క్రమంగా తగ్గుతూ వచ్చింది. అయితే ఆ తరువాత ఆమెకు విపరీతమైన తలనొప్పి వచ్చి స్పృహ కోల్పోయింది. వెంటనే మేము ఆమెను ఆసుపత్రికి  తీసుకుని వెళ్ళాం. వైద్యులు MRI స్కాన్ చేసి, 'ఆమె శరీరంలో సోడియం లోపం కారణంగా మెదడులో రక్తం గడ్డలు ఉన్నాయ'న్నారు. ఆమె కోమాలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు. ట్రీట్‌మెంట్‌లో భాగంగా ముందుగా సోడియంను ఆమె శరీరంలోకి ఎక్కించడం ప్రారంభించారు. నెమ్మదిగా సోడియం లెవెల్స్ పెరిగాయి. ఆమెను 2 రోజులు ఐ.సి.యు.లో ఉంచిన తరువాత మూడవరోజున డిశ్చార్జ్ చేశారు. ఆమె ఆసుపత్రిలో ఉన్నప్పుడు నేను Q&A వెబ్‌సైట్ ద్వారా బాబాని ప్రశ్న అడిగితే, "కష్టకాలం 3 రోజుల్లో ముగుస్తుంది" అని సమాధానం వచ్చింది. నిజంగా వెబ్‌సైట్ ద్వారా బాబా చెప్పినట్లుగానే ఆవిడ ఆసుపత్రి నుండి మూడవరోజున డిశ్ఛార్జ్ అయ్యారు. బాబా దయవలన ఆమె కోమాలోకి వెళ్ళకుండా, చికిత్సకు త్వరగా ఆమె శరీరం స్పందించింది. కిడ్నీ పరీక్షలు చేస్తే బాబా దయవలన ఎటువంటి సమస్యా కన్పించలేదు. చివరకు ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి క్షేమంగా ఇంటికి వచ్చారు. ఒక చిన్న సమస్యను సృష్టించి రానున్న పెద్ద ప్రమాదం నుండి బయటపడేశారు బాబా. "బాబా! మీకు ధన్యవాదాలు."


మరో భక్తుని అనుభవం:

సాయిభక్తుడు హరీష్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు...

నేను బాబాకు సాధారణ భక్తుడిని. బాబా అంటే నిజమైన, స్వచ్ఛమైన ఆనందం. ఒకరోజు రాత్రి విపరీతమైన చలిలో బండి డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక పంటినొప్పి (సెన్సిటివ్ పెయిన్) మొదలైంది. అప్పుడప్పుడు చివరగా ఉన్న ఒక పన్ను నన్ను చాలా బాధపెడుతూ ఉంటుంది. నేను వెంటనే కొంచెం బాబా ఊదీని నోటిలో వేసుకొని, మరికొంత ఊదీని నీటిలో కలుపుకొని త్రాగాను. ఆ తరువాత బాబాకు నమస్కరించుకుని, "దంతవైద్యుడిని సంప్రదించకుండా సహజాతి సహజంగా ఈ బాధ నివారణ అయ్యేలా అనుగ్రహించండి బాబా!" అని హృదయపూర్వకంగా ప్రార్థించాను. బాబా ఎంతటి దయామూర్తి అంటే, రాత్రికి రాత్రే నా బాధ నివారింపబడింది. ఉదయాన లేచేసరికి ఎటువంటి నొప్పీ లేదు. శ్యామా అన్నట్లు, "ఏమిటి మీ క్రీడ దేవా? మేము నీ పవిత్ర పాదాలలో ఆశ్రయం పొందాము బాబా. ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి, మా చేతిని పట్టుకుని తీరానికి చేర్చండి దేవా!" 


2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo