సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

'పశ్చిమ షిర్డీ'గా పేరుగాంచిన సాయి మందిర నిర్మాణ విశేషాలు - 3వ భాగం.


నిన్నటి తరువాయి భాగం.

బాబా విగ్రహం కోసం జైపూర్ లో ఉన్న మనోహర్ లాల్ దుకాణానికి వెళ్ళాడు వాసుదేవ్. అక్కడ ఉన్న ఒక బాబా విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆనందం పట్టలేక కళ్ళలో నీళ్ళు కారుతూ ఉండగా, బాబాను అలా చూస్తూ నిలబడిపోయాడు. ఆ విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. తన జన్మ జన్మల గురువు సాక్షాత్కారమా అన్నట్లు చూస్తూ ఉండిపోయాడు. బాబా ఇప్పుడే మాట్లాడతారేమో అన్నంత ఆకర్షణీయంగా ఉంది ఆ మూర్తి. వెనువెంటనే అతను ఇదే విగ్రహం కొందామని నిర్ణయించుకున్నాడు. దాని వెల ఎంతని అడిగాడు. మనోహర్ లాల్ దాని ఖరీదు 55,000 రూపాయలని చెప్పి, కానీ ఎవరో మూడు సంవత్సరాల క్రితం అడ్వాన్స్ ఇచ్చి ఈ విగ్రహం కొనుక్కున్నారని చెప్పారు. ఆమాట విని వాసుదేవ్ మనసు దుఃఖసాగరమే అయ్యింది.

అతని నిరాశ చూసి మనోహర్ లాల్, "మీకు ఈ విగ్రహం కావాలంటే అడ్వాన్స్ ఇచ్చి ఇప్పుడే తీసుకెళ్లండి" అని చెప్పి అతన్ని శాంతపరచాడు. అయితే సరేనని 5000 రూపాయలు అడ్వాన్స్ గా చెల్లించాడు వాసుదేవ్. కానీ మనసులో, "నా దగ్గర అంత డబ్బు లేదు, మిగిలిన మొత్తాన్ని ఎలా చెల్లిస్తాను?" అని వేదన పడుతున్నాడు. అన్ని కష్టాలకు బాబానే మార్గం చూపుతారని తలచాడు. తన పల్లెటూరికి వెళ్లి ఇంటి దైవం అయిన చండి అమ్మవారి వద్ద నవ చండి పారాయణ చేయిస్తే, బాబా కృపవలన 50,000 రూపాయలు జమ అవుతాయని అనుకున్నాడు. వద్ద నవ చండి పారాయణ మొదలయ్యింది. ఎవ్వరూ రాలేదు. "మళ్ళీ బాబా పరీక్షేమో" అనుకున్నాడు. ఇంతలో అతని మిత్రుడు చంద్రకాంత్ వెంటనే థానేకు రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడు. ఇతను వెంటనే వద్ద నవ చండి పారాయణ ఉద్యాపన చేసి థానే చేరుకున్నాడు. అప్పుడు చంద్రకాంత్, "నువ్వు ఇక్కడ లేనప్పుడు ఒకావిడ వచ్చి, ఇక్కడకు వచ్చే విగ్రహం తూర్పు వైపు నుంచి కాకుండా పశ్చిమం వైపు నుంచి రావాలని చెప్పింది. అందువలన పని ఆగిపోయింది" అన్నాడు. మళ్ళీ వాసుదేవ్ సంకటంలో పడ్డాడు. అయినప్పటికీ, మేము జైపూర్ లో అడ్వాన్స్ కూడా ఇచ్చి విగ్రహం తెప్పిస్తున్నాము, దాన్ని మళ్ళీ వెనక్కు పంపలేమని ఖరాఖండిగా చెప్పేశాడు. "అసలు రావలసింది బాబా కదా! ఆయనకు ఎలా ఇష్టం అయితే అలాగే వస్తాడు" అనుకొని నిశ్చింతగా వున్నాడు.

వాసుదేవ్ తన మిత్రుడి దగ్గరకి వెళ్లి, "నేను బాబా విగ్రహం తెప్పించాలి, అందుకు నాకు 50,000 రూపాయలు కావాలి, ఇస్తావా?" అని అడిగాడు. దానికతను, "కేవలం 50,000 రూపాయలు కాదు, ఒక లక్ష రూపాయలిస్తాను. ఈ దైవకార్యంలో నన్ను భాగస్వామిని చేశావు, నీకు నా ధన్యవాదాలు" అని చెప్పాడు. చూశారా! అలా ఉంటుంది బాబా కృప. ధనం సమకూరింది. జైపూర్ నుంచి థానేకు బాబా విగ్రహం చేరిపోయింది. 1986 నవంబర్ 27న మంగళమూర్తి సాయినాథుడి ప్రాణప్రతిష్ఠ, పూజ, హోమం అంగరంగవైభవంగా జరిగాయి. వాసుదేవ్ ఈ మహాకార్యంలో తనకు సహాయం చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాడు. "నేను రోజూ బాబా దర్శనం చేసుకోవాలన్న ఆకాంక్షతో మందిరం కట్టించాను. కానీ, అది దినదినప్రవర్ధమానమై 'పశ్చిమ షిర్డీ' అనిపించుకుంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు" అని అంటాడు వాసుదేవ్. ఇప్పుడు ఆ మందిరానికి ఎందరెందరో రాజకీయవేత్తలు, క్రీడాకారులు, చిత్రసీమకు చెందిన కళాకారులు వస్తూ ఉన్నారు. వాళ్ళ వాళ్ళ కోరికలు బాబా సమక్షంలో నెరవేరుతున్నాయి. ఈ మందిరంలో సాయి సహస్రనామ జపాలు, సాయివ్రతాలు, అన్నదానాలు, ఉచిత వైద్య శిబిరాలు మొదలైనవన్నీ బాబా కృపతో జరుగుతున్నాయి. వాసుదేవ్ కలలో కూడా ఊహించలేదు, బాబా ఇన్ని కార్యాలు తనతో చేయిస్తారని. అందుకే అతనంటాడు, "నేను  ఈ మందిరం కట్టడమన్నది కేవలం బాబా లీల. నాలాంటి వానికి ఇది సాధ్యమయ్యే పని కాదు. సాయినాథుని కృపే దీనికి కారణం" అని.

సమాప్తం.

మూలం: సాయి లీల పత్రిక నవంబర్ -డిసెంబర్ 2017.
తెలుగు అనువాదం: శ్రీమతి మాధవి.

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo