సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఒక చిన్న వాట్సాప్ సత్సంగం


తేదీ 30. 06. 2018 మరియు తేదీ 01. 07. 2018న నాకు భాస్కరాచార్యులు గారికి మధ్య జరిగిన ఒక చిన్న వాట్సాప్ సత్సంగం:

భాస్కరాచార్యులు గారు: సాయి.. హాయ్.

నేను: సాయిరాం సాయి. బాగున్నారా సాయి.

భాస్కరాచార్యులు గారు: చక్కటి బాబా గ్రేస్ లో, బాబా ప్రేమ ఊయలలో సేదతీరుతున్న అనుభూతిలో వున్నాను సాయి.

నేను: వావ్... సూపర్ సాయి. చాలా సంతోషంగా ఉంది సాయి. ఆ ఆనందాన్ని మాకు కూడా వీలయితే పంచండి సాయి.

భాస్కరాచార్యులు గారు: అదే ప్రయత్నం చేస్తున్నానండి. కాస్త పని బిజీలో ఉండి కుదరట్లేదు. కానీ మనసంతా బాబా మీదనే ఉంటుంది. తృప్తిగా వుంది. మనసులో ఆధ్యాత్మికంగా ఏ చిన్న సందేహం వచ్చినా కొన్ని సెకన్లు లేదా నిమిషాలలో సమాధానం దొరికేస్తుంది.

రేపు రాబోయే గురుపూర్ణిమకు ఆయన్ని(బాబాను) ఎలా సంతోషపెట్టాలా? ఎలా సన్మానించాలా? ఏం గురుదక్షిణ ఇవ్వాలా? అని ఇప్పటినుండే ఆలోచన చేస్తున్నాను సాయి. మీ ఇంట్లో బాబాని డైలీ జూమ్ చేసి చూస్తాను సాయి.  సాయి శరణం.

ఉద్యోగంలో చేరిన క్రొత్తలో ప్రతిరోజూ యాంత్రికంగా గడిచిపోతూ ఉంటే... "ఇదేమిటి బాబా, నన్ను ఇలా సంసారంలోకి దింపేస్తున్నావు? నిజానికి నాకు కావలసింది ఇది కాదు కదా! నాకొక సత్సంగాన్ని ఇవ్వండి బాబా" అని డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఒక్క సెకండ్ అనుకున్నాను. అంతే! బాబా నా గుండెల్లో వున్నారనుకుంటా, అదే సెకండ్లో ఠక్కున నా బాధని వినేసారు. మరుసటి రోజుకి ఒక సాయిబంధువు ద్వారా ఫేస్ బుక్ మరియు వాట్సాప్ సత్సంగాలలో కూర్చోపెట్టేసారు.

పెళ్ళికి ముందు నేను రోజూ సేవ చేసుకున్న బాబా మందిరానికి పెళ్ళైన కొత్తలోమొదటిసారిగా నా భార్యతో కలిసి వెళ్ళాను. మేము లైన్ లో ఉండగా నా మనసులో, "బాబా ఆశీస్సులు నా వైవాహిక జీవితం పైన ఉన్నాయా?" అనే సందేహం వచ్చింది. నాకు సందేహం రావడమే ఆలస్యం, మరునిమిషంలో ఏమి జరిగిందో తెలుసా? కొంచెం దూరంలో మూడు నాలుగు సంవత్సరాలున్న ఒక చక్కటి అందమైన పాప ఉంది. ఆ పాప ఎవరో కూడా నాకు తెలియదు. ఆ క్యూట్ బేబీ చిన్న చిన్నగా అడుగులు వేసుకుంటూ నా వద్దకు వచ్చి‌, నన్ను వంగమని, తన చిట్టి చేతులతో తెచ్చిన ఊదీ నా నుదుటి మీద పెట్టి వెళ్ళిపోయింది. అక్కడే ఉన్న నా భార్య, మిగిలిన భక్తులు వింతగా చూసి నవ్వుకున్నారు. ఆ పసిపాప ఆ సమయంలో అలా ఎందుకు చేసిందో అని, లేదా ఏదో కాకతాళీయంగా చేసిందని అందరూ అనుకుని ఉండొచ్చు. కానీ ఆ సాయిబాబా గద్దె దిగి ఆ పసిపాప రూపంలో వచ్చి నాకు ఊదీ పెట్టారని ఆ సమయంలో నేను ఎవరికైనా ఎలా చెప్పగలను, ఆనందంతో నోట మాట రాక ఆనందభాష్పాలు రాలుస్తూ చేతులు జోడించడం తప్ప. నా సంశయానికి బదులుగా బాబా చేసిన దానికి తన్మయత్వంతో బాబాని చూస్తూ ఉండిపోయాను. సాయి సాయి సాయి శరణం.

చాలాసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, "నాలో ఆయన కూర్చుని వున్నారా? లేక నేనే ఆయన పొత్తిళ్ళలో వెచ్చగా పడుకున్నానా?" అని.

నేను: సూపర్ సాయి, మీ అనుభవాన్ని, ఫీలింగ్స్ ని చాలా చక్కగా చెప్పారు. చదువుతూ ఉంటే ఆనందంగా ఉంది. బాబా ప్రేమను నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. అయితే మీ రెండు భావనలు సరైనవే సాయి. మన హృదయవాసి ఆయనే, అదే సమయంలో మనం ఆయన ఒడిలో పసిబిడ్డలం కూడా.

మీ చిన్న చిన్న ఆనందాలు నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి సాయి. వాటి ద్వారా బాబా ప్రేమను తనివితీరా అనుభవిస్తున్నాను. రియల్లీ చాలా సంతోషంగా ఉంది. అవన్నీ ఒక దగ్గర వ్రాసి బ్లాగ్ లో అప్లోడ్ చేసి ఈ ఆనందాన్ని సాయిబంధువులందరికీ పంచాలని ఉంది సాయి. (అంత ఒక దగ్గర చేర్చి ఈ మెటర్ భాస్కరాచార్యులు గారికి పంపి బ్లాగ్ లో అప్లోడ్ చేయడానికి అనుమతి అడిగాను. అది చూసి ఆయన)

భాస్కరాచార్యులు గారు: నాకు సర్ప్రైజ్ ఇచ్చారు సాయి. మనం మాట్లాడుకున్నది ఇంత కధానీకంగా ఉందా? ఎక్స్ల్లెంట్ గా ఉంది సాయి. సంతోషంగా మన సాయి బంధువులకు షేర్ చేయండి సాయి.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo