సాధుపుంగవులకు
విశ్రాంతి స్థానమై, సజ్జనుల స్తుతి స్తోత్రాలు అందుకుంటూ, ప్రజానీకానికి ఆనందం, భక్తులకు భద్రత ఇచ్చే సాయికి
నమస్కారం. నా పేరు నాగమణి.
మేము ఎల్.బి.నగర్
లో ఉంటాము. బాబా నాకు ఇచ్చిన
ఒక అనుభవాన్ని "సాయిమహారాజ్ సన్నిధి బ్లాగ్" ద్వారా తెలియచేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదములు.
మేము
మిర్యాలగూడలో ఒక బిజినెస్ మొదలుపెట్టాము.
కొన్ని రోజులు బాగానే నడిచింది కానీ, తర్వాత పూర్తిగా
నష్టపోయాము. నాకు తట్టుకునే శక్తి
లేకుండా పోయింది. ఇక ఏమీ చేయలేని
స్థితి, కేవలం బాబా పాదాలు
మాత్రమే ఆశ్రయం. "నువ్వే దిక్కు. నన్ను నా పిల్లలను
ఆదుకో. నువ్వే నాకు అన్నీ తండ్రీ!"
అని దీనంగా ఆ సాయిని వేడుకున్నాను.
మిర్యాలగూడలో ఉండలేక హైదరాబాద్ వెళ్లిపోదామని మేము నిర్ణయించుకున్నాం. కానీ అక్కడ
ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి? అద్దెకి
ఇల్లు తీసుకోవాలంటే అద్దె ఎంత ఉంటుందో,
ఆ అద్దె ఎలా కట్టాలో
అని మనసులో ఎన్నో ఆలోచనలు. బాబా
ముందు మనస్ఫూర్తిగా ఏడ్చి నా బాధంతా
చెప్పుకున్నాను. బాబా మీద భారమంతా
వేసి హైదరాబాద్ చేరుకున్నాము. ఎంత వెతికినా ఎక్కడా
ఇల్లు దొరకలేదు. "బాబా! ఏమి చేస్తున్నారు?
నాకు దారి చూపండి" అంటూ
వేడుకున్నాను. "నన్నే త్రికరణశుద్ధిగా స్మరించేవారి
యోగక్షేమాలు నేను కనిపెట్టుకొని ఉంటాను"
అని చెప్పిన సాయి వచనాలు నిజమైనవి.
మా చిన్న ఆడపడుచు నుండి
ఫోన్ వచ్చింది, "మీరు మా ఇంట్లో
ఉండొచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం
లేదు" అని. బాబా నా
మొర విన్నారు. నాకు దారి చూపారు.
"నా భక్తుల ఆధ్యాత్మిక, ప్రాపంచిక అవసరాలను నేను చూసుకుంటాను" అని
సాయి అన్నట్టుగానే అప్పటినుండి నా అవసరాలన్నిటినీ తీరుస్తూ
నన్ను చల్లగా చూసుకున్నారు. పది సంవత్సరాలు మా
ఆడపడుచు ఇంట్లో అద్దెకు ఉన్నాం. బాబా దయవలన ఇప్పుడు
మా వ్యాపారం చాలా బాగుంది. పిల్లలిద్దరికీ
ఇంజనీరింగులో సీట్ వచ్చింది. బాబా
దయవలన చాలా హ్యాపీగా ఉన్నాము.
మమ్మల్ని హైదరాబాదుకి తీసుకువచ్చి, నాకు ఒక దారి
చూపి, బిజినెస్ ఇచ్చి లైఫ్ సెటిల్
చేసారు నా సాయి. భక్తులకు
ఏదైతే శ్రేయస్కరమో అది సాయి ప్రసాదిస్తూనే ఉంటారు.
🕉 సాయి ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteOm Sairam
Om Sairam