సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

'పశ్చిమ షిర్డీ'గా పేరుగాంచిన సాయి మందిర నిర్మాణ విశేషాలు - 2వ భాగం.


నిన్నటి తరువాయి భాగం.

వాసుదేవ్ మందిర నిర్మాణానికి సంకల్పం అయితే చేసుకున్నాడు కానీ, అంత డబ్బు ఎలా వస్తుందని మాత్రం ఆలోచించలేదు. "నా భక్తుల సత్సంకల్పాలు నేను నెరవేరుస్తాన"ని బాబా అన్నారు కదా! అందుకే మన మంచి ఆలోచనలకు, సంకల్పాలకు బాబా ఎప్పుడూ తోడుగా వుంటారు. సమాధికి ముందు, సమాధి తరువాత కూడా బాబా నుండి సహాయ, సహకారాలు ఆయన భక్తులకు ఎప్పుడూ సమయానికి అందుతూనే ఉన్నాయి. మన సంకల్పాన్ని  సిద్ధింప చేస్తారు కావున "ఓం సిద్ధసంకల్పాయ నమః" అని  బాబాను కీర్తిస్తూ ఉంటాము. వాసుదేవ్ తన పొలాలను, భార్య నగలను అమ్మి, ఆ ధనంతో ఆ స్థలాన్ని కొని, మందిర నిర్మాణ కార్యక్రమం మొదలుపెట్టాడు. అతని మిత్రులు కూడా 100 బస్తాల సిమెంట్ ఇచ్చారు. నిర్మాణ కార్యక్రమం మొదలయ్యింది. కానీ ఒకరోజు హఠాత్తుగా ఆగిపోయింది(ఎందుకు అలా జరుగుతుందో బాబాకే ఎరుక. ఆయన వేసే నాటకరంగంలో మనం పాత్రధారులం మాత్రమే). మళ్ళీ ఎంత ప్రయత్నం చేసినా పని ప్రారంభం కాలేదు("ఈ మాయ నన్ను కూడా విడిచి పెట్టడం లేద"న్న బాబా మాటలు గుర్తొస్తున్నాయి). అతని మానసిక పరిస్థితి చాలా దిగజారిపోయింది. ఏమి చేయాలో తోచక నిరాశతో ఆ స్థలం వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోదామని అనుకున్నాడు. బాబా అతనికి కఠిన పరీక్షే పెట్టారు. ఇంతలో అతని భార్య, "ఎందుకంత నిరాశ? బాబాను నమ్ముకున్నాము కదా, ఆయన మందిరం ఆయనే కట్టిస్తారు. విగ్రహ ప్రతిష్ఠ తరువాతనే వెళదాం" అని అతనిని ఆపేసింది. ఇంతలో బాబానే పంపినట్లు ఎవరో సమాజసేవ చేసే వాళ్లు వచ్చి ఇతనిని ఏదో సహాయం అడిగారు. ఇతను చేసిపెట్టారు. వాళ్ళు దానికి బదులుగా మందిర నిర్మాణానికి చాలా ధనసహాయం చేసారు. ఎప్పటినుంచో ఆగిపోయిన మందిర నిర్మాణం పని మళ్ళీ మొదలుపెట్టారు. చాలా చురుకుగా పని సాగుతూ ఉంది. మళ్ళీ అంతలో బాబా రెండవ పరీక్ష మొదలు అయ్యింది.

హఠాత్తుగా వాసుదేవ్ కూతురు మనీషా ఆరోగ్యం దినదినానికి క్షీణించసాగింది. ఎంతోమంది డాక్టర్లకు చూపించాడు. ఎవ్వరికీ అసలు అనారోగ్యం ఏమిటో అంతుపట్టలేదు. ఇతనికి ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. ఇంతలో బాబా పంపినట్లు బదలాపూర్ నుంచి ఒక పండితుడు వచ్చాడు. ఆయన, "మీరు కట్టే బాబా మందిరం క్రింద ఒక స్థానిక నాగదేవత, ఆమె మహాపురుషుడు(జంట నాగులు) ఎన్నో ఏండ్లుగా నివసిస్తున్నారు. అందువలనే ఈ బాబా మందిర నిర్మాణం మాటిమాటికీ ఏదో ఒక కారణం చేత ఆగిపోతూవుంది. మీరు ముందు అక్కడ నాగప్రతిష్ఠ చెయ్యండి" అని చెప్పి వెంటనే మాయం అయినట్లు వెళ్లిపోయాడు. "ఆ వచ్చినది బాబానే అని నా నమ్మకం. లేకుంటే ఆయనకు ఎలా తెలుసు మా కష్టాలు?" అని అంటాడు వాసుదేవ్. వెంటనే అక్కడ నాగ ప్రతిష్ట చేయించాడు. చేసిన వెంటనే  అతని కూతురు మనీషా ఆరోగ్యం కుదుటపడింది. మళ్ళీ మందిర నిర్మాణ కార్యక్రమం ఎంతో వేగంగా మొదలయ్యింది. ఇంక విగ్రహం కొనడం ఒక్కటి మిగిలింది.

రేపు తరువాయి భాగం.

మూలం: సాయి లీల పత్రిక నవంబర్ -డిసెంబర్ 2017.
తెలుగు అనువాదం: శ్రీమతి మాధవి.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo