సాయి బంధువులందరికి గురు పౌర్ణమి శుభాకంక్షాలు
ఓం సాయిరాం
నా పేరు దీప్తి, నేను బాబా భక్తురాలిని. సచ్చరిత్రలో "పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు నా భక్తులను నేనే నా దగ్గరికి లాక్కుంటాను" అని బాబా చెప్పినట్లుగా నన్ను కూడా తన దగ్గరకి లాక్కున్నారు బాబా. నేను 1995వ సంవత్సరం అక్టోబర్ నెలలో మొట్టమొదటిసారిగా షిర్డీ వెళ్ళాను. అప్పటినుంచి పూజలు, ఉపవాసాలు చేస్తూ ఆయనను ఆరాధించుకుంటున్నాను. కొన్ని కారణాల వలన మధ్యలో బాబాని దూరం చేసుకున్నాను. కానీ బిడ్డ చేసిన తప్పులను పట్టించుకోని తల్లిలా బాబా నన్ను సదా రక్షిస్తూనే ఉన్నారు. నేను రోజూ ఈ బ్లాగులో వచ్చే అందరి అనుభవాలు చదువుతూ, "నాకు చాలా అనుభవాలు ఉన్నాయి, వాటిలో దేనిని సాయి బంధువులతో పంచుకోవాలి?" అని అనుకుంటూ ఉండేదాన్ని. అయితే బాబా నాకు ఈరోజు(తేదీ 24.07.2018) మధ్యాహ్నమే ఒక అనుభవాన్ని ఇచ్చారు. బహుశా ఈ అనుభవాన్నే మొట్టమొదటిసారి బ్లాగ్ ద్వారా మీతో పంచుకోవాలని బాబా నిర్ణయమేమో. దానినే ఇప్పుడు మీతో పంచుకుంటాను.
ఈరోజు మధ్యాహ్నం బాబా మమ్మల్ని ఎలా కాపాడారో చెప్తాను. నేను, మా మామయ్య బైక్ పై వెళ్తున్నాము. ఇక్కడ మా ఏరియాలో చెయిన్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అందువలన నేను ఎప్పుడు బయటకు వెళ్లినా నా మెడ చుట్టూ చున్నీ వేసుకుంటూ ఉంటాను. కానీ ఈరోజు ఏదో మాట్లాడుకుంటూ పరధ్యానంగా చున్నీ మెడ చుట్టూ వేసుకోకుండా వెళ్ళిపోయాను. నేను మనసులో బాబా నామం అనుకుంటూ ఉన్నాను. కొంచెం దూరం వెళ్ళగానే ఎందుకో తెలియదుగాని వెనక్కి తిరిగి చూడాలని అనిపించింది. వెనక్కి తిరిగి చూసేసరికి బైక్ పై ఇద్దరు వ్యక్తులు మెల్లగా మమ్మల్ని అనుసరిస్తూ వస్తున్నారు. నేను వెంటనే చున్నీ మెడ చుట్టూ వేసుకున్నాను. అంతే, అంతవరకూ మా వెనకే వస్తూ ఉన్న వాళ్ళు మమ్మల్ని క్రాస్ చేసి వెళ్లిపోయారు. వాళ్ళు నా చైన్ లాగి ఉంటే నేను, మా మామయ్య ఇద్దరం బైక్ పైనుంచి పడిపోయేవాళ్ళం. కానీ సరైన సమయానికి వెనక్కి చూసేలా నాకు ప్రేరణనిచ్చి ఆ ప్రమాదం జరగకుండా బాబాయే కాపాడారు. ఈవిధంగా నన్ను చాలాసార్లు బాబా కాపాడారు.
గత నెల మేము షిర్డీ వెళ్ళినపుడు నేను ఎలా దర్శించుకోవాలని అనుకున్నానో, అన్నీ అలాగే అనుగ్రహించారు బాబా.
ఓం సాయిరాం.
దీప్తి,
హైదరాబాద్.
🕉 sai Ram
ReplyDelete