బద్వేల్ నుండి సాయి కార్తీక్ గారు తమ అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు.
సాయిరామ్ సార్,
ఈవిధంగా మీరు సాయిభక్తుల అనుభవాలను షేర్ చేయడం చాలా బాగుంది. ఒక రకంగా మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి, ఎందుకంటే నిత్యం శ్రీ సాయిబాబా వారి లీలావిలాసంలో మునుగుతున్నారు. మీరు ఆ లీలావిలాసంలో మమ్మల్ని కూడా ముంచుతున్నారు. ఆవిధంగా మేము కూడా అదృష్టవంతులము సార్.
అందుకు...
సాయి వచనం:-
|
|
బాబానే నమ్ముకున్నాను
నా పేరు బుజ్జి. నాకు మొదటినుండి దేవుడంటే పెద్దగా నమ్మకమే ఉండేది కాదు. అలాంటి నేను బాబాకి ఎలా దగ్గర అయ్యానో చెప్పలేను గాని, గత 7 సంవత్సరాలుగా బాబానే అంటిపెట్టుకొని ఆయన పట్ల దృఢమైన నమ్మకంతో ఉన్నాను. రీసెంట్ గా జరిగిన ఒక అనుభవాన్ని ఇప్పుడు నేను మీతో పంచుకుంటాను.
సాఫ్ట్ వేర్ జాబు అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం వలన 2015, డిసెంబర్ లో నేను ఒక చిన్న...
బాబా మూడు తలలతో మూడు కిరీటాలతో స్పష్టంగా కనిపిస్తున్నారు
నా పేరు పీసపాటి
వెంకట రమణి, మా అమ్మ గారి పేరు పీసపాటి వెంకట సత్యవతి. మాది కోడూరు. మాకు బాబా
ప్రసాదించిన ఒక అనుభవాన్ని సాయి బంధువులతో పంచుకొనే అవకాశం ఇచ్చిన బాబా వారికీ నా
నమస్కారములు తెలియజేసుకుంటున్నాను.
2009వ సంవత్సరంలో నేను, మా అమ్మ, నాన్న, మా ఫ్రెండ్ పూర్ణ గారు కలిసి ముందు గాణ్గాపురంలో నృసింహ సరస్వతి స్వామిని దర్శంచి షిరిడి పోవాలని...
బాబాయే నాకు అన్నీ
సాయిబంధువు కల్పన గారు తన అనుభవాలని మనతో ఇలా పంచుకుంటున్నారు.
నేను బాబా భక్తురాలిని. ఇంతకంటే గొప్పగా నా గురించి పరిచయం చేసుకోలేనేమో. నాకు సాయితో చాలా అనుభవాలు ఉన్నాయి. వాటిలో రెండు సాయి లీలలను ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.
నా మొదటి అనుభవం :
2013వ సంవత్సరంలో నాకు వరుసగా...
వివాహాలలో సాయిబాబా సహాయం
వివాహాలలో సాయిబాబా సహాయం గురించి శ్రీ బి.వి.నరసింహస్వామి గారు చెప్పిన కొన్ని లీలలు
వివాహ విషయమై ఒక అబ్బాయికి సరైన అమ్మాయిని లేదా ఒక అమ్మాయికి సరైన అబ్బాయిని వెతకడం ఒక పెద్ద సమస్య. ఈ విషయంలో బాబా చేసిన సహాయానికి సంబంధించిన కొన్ని లీలలు.
1. కోలాబా (ముంబై)కి చెందిన జి.డి. పండిట్ తన కుమార్తెకు తగిన వరుడి కోసం ఎంతగానో వెతికాడు గాని, ఒక మంచి పెళ్ళికొడుకుని...
నిజ దర్శన ప్రాప్తి … కోవా అడిగిన బాబా
సిద్దిపేట సాయిబాబా గుడి పూజారి వెంకట రామ శర్మ గారు తన అనుభవం ఇలా తెలియజేస్తున్నారు.
సాయి బంధువులందరికి సాయి రామ్.
నా పేరు వెంకట రామ శర్మ. నేను సిద్దిపేటలో సాయిబాబా గుడి
పూజారిగా పని చేస్తున్నాను. ఒకరోజు గుడిలో జరిగిన లీలను మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆరోజు
నేను "శేజ్ హారతి" ఇవ్వడానికి
పదిహేను నిమిషాల ముందు...
సాయి కృప - 2వ భాగం....
హైదరాబాదు నుండి శ్రీమతి అర్చన తన అనుభవాలను ఇంకా ఇలా తెలియజేస్తున్నారు...
ప్రతి చిన్న కోరికను నెరవేర్చే కరుణామూర్తి శ్రీసాయి:-
ఆ రెండు రోజులలో బాబా సమాధి, ద్వారకామాయి, చావడిల దర్శనాలు బాగా జరిగాయి. కానీ శరత్‌బాబూజీగారి సాయిపథం, లక్ష్మీబాయిషిండే ఇల్లు, మహల్సాపతి ఇల్లు, శ్యామా ఇల్లు చూడటం కుదరలేదు. ముఖ్యంగా, సాయిపథం దర్శించలేదని...
సాయి కృప - 1వ భాగం....
హైదరాబాదు నుండి శ్రీమతి అర్చన తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు...
చిన్నతనంలోనే బాబా అనుగ్రహం:-
నా పేరు అర్చన. చిన్నతనంలోనే నాకు బాబాతో పరిచయం అయింది. నాకు ఆరేళ్ల వయస్సున్నప్పుడు నా స్నేహితురాలు వేరే మతం గురించి చెప్తూ, నన్ను ఆ మతంలోకి మారమని చెప్పేది. ఒకరోజు నా స్నేహితురాలి అమ్మమ్మ నన్ను పిలిచి, "నీకు ఒక గొప్ప దేవుడి ఫోటో...
శిరిడీయాత్రకు బాబా ధనసహాయం
నా పేరు రాజేష్ బాబు. మా ఊరు ముప్పాళ్ళ. బాబా నాకు ప్రసాదించిన ఒక లీలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సాయిబాబా భక్తుడనైన నేను ఎప్పుడూ బాబాని తలచుకుంటూ, వారి రూపాన్ని
ధ్యానించుకుంటూ ఉంటాను. కానీ నేను ఎన్నడూ శిరిడీ వెళ్ళలేదు. నాకు శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను శిరిడీ వెళ్ళలేకపోయాను.
2017...
ఆటోడ్రైవర్ రూపంలో ఆదుకున్న సాయి
విజయవాడ నుండి సాయిభక్తురాలు సుజాత తన అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు.
సాయిభక్తులందరికీ నా వందనాలు. ఎంతోమంది బాబా కృప వలన వారికి జరిగిన అనుభవాలను సాయిభక్తులందరితో పంచుకుని ఆనందం పొందుతున్నారు. నాకు కూడా బాబా వారి దయవలన ఎన్నో అనిర్వచనీయమైన అనుభవాలు జరిగాయి. అందులో ముచ్చటగా ఒకటి మీతో పంచుకోవాలనే ఉద్దేశ్యంతో...