సాయి వచనం:-
'ఎవరి శ్రమభారాన్నైనా ఉచితంగా లవలేశమైనా తీసుకోకూడదు. ఎవరితోనైనా పని చేయించుకోవచ్చు. కానీ, ‘ఎవరి శ్రమనూ ఉచితంగా తీసుకోరాదు’ అనే నియమాన్ని పాటించాలి.'

'శిరిడీలో అర్థవంతంగా ఒక గంట గడిపినా ఫలితం ఎన్నో రెట్లు ఉంటుంది' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1484వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కృప
2. గొంతునొప్పి, దగ్గు, జలుబు నయం చేసిన సాయి మహారాజ్

బాబా కృప

సాయి భక్తులకు నా నమస్కారాలు. నా పేరు వెంకటేశ్వరరావు. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2023, జనవరిలో మా అమ్మకి బాగా ఆయాసం, గుండె దడ ఉంటుండేవి. మేము మాకు తెలిసిన ఆర్ఎమ్‍పి డాక్టరుకి అమ్మని చూపించాము. ఆ డాక్టరు మూడు రోజులు ఇంజక్షన్ చేసారు. అయితే ఇంజక్షన్ చేసినప్పుడు అమ్మకి ఆయాసం, దడ తగ్గి మళ్ళీ వస్తుండేది. ఒక నెల తరువాత మాములుగా అమ్మని చూసే జనరల్ ఫిజీషియన్‍కి చూపించాము. ఆయన ఈసీజీ, ఎక్స్ రే తీయించి, రక్తపరీక్షలు కూడా చేయించి, "ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరింది. అవిరి పట్టించండి" అని చెప్పారు. దాంతో ఒక 15 రోజులు అమ్మకి ఆవిరి పట్టించాము. ఆయాసం తగ్గిందికానీ దేనికైనా మంచిదని టీబీ&చెస్ట్ డాక్టర్ దగ్గర చెక్ చేయిద్దామని ఒక రోజు హాస్పిటల్‍కి వెళ్ళాము. డాక్టరు ఎక్స్ రే, ఈసీజీ తీసి "హార్ట్ బీట్ 250 పైన వుంది. కార్డియాలజీ డాక్టర్‌కి చూపించమ"ని అన్నారు. సరేనని కార్డియాలజీ డాక్టరుకి చూపిస్తే, అయన ఎకో టెస్టు చేసి, "గుండె ఎన్లార్జ్ అయింది. హార్ట్ బీట్ రేటు, బీపీ ఎక్కువగా ఉన్నాయి. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వండి" అని అడ్మిట్ చేసుకొని అమ్మని రెండురోజులు ఐసియులో ఉంచారు. అప్పుడు నేను, "బాబా! మా అమ్మకి ఏమి కాకుండా తగ్గిపోయి క్షేమంగా ఇంటికి వచ్చేలా చూడండి. అలాగే దయతో హాస్పిటల్ బిల్లు తక్కువగా వచ్చేటట్లు చూడు తండ్రి. మా దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి" అని బాబాను వేడుకున్నాను. అయితే  హాస్పిటల్ బిల్లు ఎక్కువైంది. కానీ బాబా దయవల్ల మంచి చికిత్స అంది అమ్మ క్షేమముగా ఇంటికి తిరిగి వచ్చి, ఇప్పుడు బాగుంది. "ధన్యవాదాలు సాయి. అమ్మ ఆరోగ్యంగా బాగుండేలా చూడు తండ్రి".

నేను ఒక ప్రైవేట్ కాలేజీలో పని చేస్తున్నాను. ఒక రోజు మా ప్రిన్సిపల్ నాకు ఒక ముఖ్యమైన లెటర్ ఇచ్చి మా HOD(హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్)కి ఇమ్మని చేప్పారు. నేను ఆ లెటర్ వేరే డిపార్ట్మెంట్‍లో పెట్టి మర్చిపోయాను. తరువాత గుర్తొచ్చి వెళ్లి చూస్తే ఆ లెటర్ అక్కడ లేదు. బీరువాల క్రింద, టేబుల్స్ క్రింద, ఇంకా ఆ గదంతా వెతికినా లెటర్ దొరకలేదు. ఆఫీసులో మరల అడిగితే, "మీకు ఇచ్చింది ఒరిజినల్, జిరాక్స్ లేదు" అన్నారు. దాంతో సార్ ఏమైనా అంటారేమోనని భయపడి, "బాబా! ఆ లెటర్ దొరికేలా అనుగ్రహించండి" అని బాబాని ప్రార్థించాను. తరువాత మరోసారి వెతికితే వేరే సెల్ఫ్ల క్రింద ఆ లెటర్ దొరికింది. నేను చాలా సంతోషించాను. "ధన్యవాదాలు బాబా".

ఒకరోజు రాత్రి 8 గంటల సమయంలో కడుపునొప్పి, అలసట వల్ల నాకు అసౌకర్యంగా అనిపించింది. నాకు షుగర్ వ్యాధి ఉన్నందున షుగర్ డౌన్ అయిందేమోనని బోజనం చేసాను. అలాగే గ్యాస్ టాబ్లెట్ కూడా వేసుకొని పడుకున్నాను. ఉదయం నిద్ర లేచేసరికి కాళ్ల నొప్పులు, ఒళ్లునొప్పులతోపాటు నీరసంగా ఉంది. ఒక టాబ్లెట్ వేసుకొని డ్యూటీకి వెళ్ళాను. కానీ అక్కడ వుండలేక మధ్యాహ్నం ఇంటికి వచ్చేశాను. అదేరోజు పుట్టింట్లో ఉన్న నా భార్య ఫోన్ చేసి, "జ్వరం, ఒళ్లునొప్పులు ఉన్నాయి" అని చెప్పింది. తను బాలింతరాలు. బాబా దయవల్ల మాకు బాబు పుట్టి 4వ నెల నడుస్తుంది. బాబు చిన్నోడు. ఆ సమయంలో తను టాబ్లెట్ వేసుకోవచ్చో, లేదో అని భయమేసినప్పటికీ 'డోలో' టాబ్లెట్ వేసుకోమని నా భార్యతో చెప్పి, "బాబా! రేపు ఉదయానికల్లా నాకు, నా బార్యకి ఏ ఇబ్బంది లేకుండా నయమయ్యేలా దయ చూపండి" అని బాబాను ప్రార్థించాను. ఉదయాన నిద్రలేచి నా బార్యకి ఫోన్ చేస్తే, "తగ్గింది" అని చెప్పింది. నాకు కూడా తగ్గింది. "ధన్యవాదాలు సాయి".

గొంతునొప్పి, దగ్గు, జలుబు నయం చేసిన సాయి మహారాజ్

సాయినాథ్ మహారాజ్ కీ జై!!! నా పేరు లక్ష్మి. మాది చీడిగ. నాకు 2023, జనవరి 8న విపరీతంగా గొంతునొప్పి, జలుబు, దగ్గు వచ్చాయి. డాక్టర్ దగ్గరకి వెళ్లకుండా బాబా తగ్గిస్తారని అలానే ఉండిపోయాను. అయితే రెండు నెలల వరకు తగ్గలేదు. మందుల షాపు నుండి మందులు తెప్పించుకుని వేసుకుంటున్నా తగ్గక చాలా బాధపడ్డాను. విపరీతమైన గొంతునొప్పి వల్ల ఏమీ తినలేక, మాట్లాడలేకపోయేదాన్ని. చివరికి అది కరోనా ఏమో అని భయమేసి బాబా ఊదీ నోట్లో వేసుకొని, దీపపు ప్రమిదలోని నూనె గొంతుకు రాసుకుంటూ, "దగ్గు, జలుబు, గొంతునొప్పి తగ్గేలా చేయి తండ్రి" అని బాబాను వేడుకున్నాను. రెండు రోజులకు గొంతునొప్పి, జలుబు తగ్గాయి. సాయితండ్రి దయవల్ల నేను ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. నాకు నయం చేసిన సాయి మహరాజుకు శతకోటి ధన్యవాదాలు.

2 comments:

  1. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  2. బాబా నిజముగా చాలా గ్రేట్ నా జీవితము లో నాకు పిల్లలు పుడతారు అని అనుకోలేదు బాబా దయవలన ఇద్దరు కొడుకులు పుట్టారు నేను pregent aenappudu na first scan anaga 41days ke hospital ke veyldamu Ane ready authunte over బ్లీడింగ్ aende మావారు నేను చాలా బాధ పడ్డాను ఇంకా అసలు vadelevesamu కానీ హాస్పిటల్ ke veylthu baba antha నీమీద baramu వేసము nuvv kapadu అని వేడుకున్నాను హాస్పిటల్ కి వెల్లము మేడం గారు స్కాన్ చేసి నీకు ట్విన్స్ అమ్మ నో ప్రాబ్లెమ్ heartbeet బాగుంది అనే చెప్పారు అంతే నాకు కన్నీళ్లు ఆగలేదు ఇదంతా సాయి నాధుని అనుగ్రహము వలన జరిగింది a devadeuvvneke nenu jeevethanthamu runapade untanu Jay Sairam

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo