సాయి వచనం:-
'జాతకాలు చూడవద్దు! సాముద్రికాన్ని నమ్మవద్దు! నాపై విశ్వాసముంచు!'

'మన ఇష్టదైవాన్ని మనం నిజంగా ప్రేమించగలిగిననాడు మరే ఇతర సాధనా మార్గాలు అవసరం లేదు' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 768వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. నేను పొందిన బాబా అనుగ్రహం 
  2. సాయి కృపతో 'నెగెటివ్' రిపోర్టు

నేను పొందిన బాబా అనుగ్రహం


ముందుగా బాబాకి నా శతకోటి పాదాభివందనాలు. నా పేరు అంజలి. 2021, ఏప్రిల్ 6వ తేదీ రాత్రి నేను పనిచేసే ఆఫీసులో ఒక సమస్య వచ్చింది. క్రొత్తగా మార్చిన పరికరానికి సమస్య ఎందుకు వచ్చిందో అర్థంకాక, "సమస్యను ఎలాగైనా పరిష్కరించమ"ని బాబాను ప్రార్థించాను. మరుసటిరోజు ఉదయం ఆఫీసుకి వెళ్లి, సర్వీస్ ఇంజనీరుతో ఫోనులో మాట్లాడి సమస్యను పరిష్కరించుకున్నాను. బాబా తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. బాబా దయవలన సమస్య చాలా తొందరగా పరిష్కారమైంది


నేను చాలాకాలంగా నా ఉద్యోగంలో బదిలీ కోసం చూస్తున్నాను. ఆ విషయమై నేను బాబాతో చెప్పుకొని, "నాకు మంచి జరుగుతుందంటే బదిలీ అయ్యేలా చూడండి" అని కోరుకొని అంతా ఆయనకే వదిలేశాను. ఎందుకంటే, నా మంచి చెడు బాబాకన్నా ఎక్కువగా ఎవరికి తెలుస్తుంది? బాబా ఆశీర్వాదంతో నాకు బదిలీ అయింది. గురువారంనాడే క్రొత్త చోట జాయిన్ అయ్యాను. బదిలీ అవడంతో నేను నల్గొండకు మారాలని అనుకున్నాను. బాబా దయవల్ల కేవలం ఒక్కరోజులోనే నాకు ఇల్లు దొరికి, ఎటువంటి ఇబ్బందీ లేకుండా నల్గొండకు మారాను. మేము ఇక్కడికి వచ్చినరోజు రాత్రి అమ్మ ఆరోగ్యం బాగోలేదు. అసలే అది కోవిడ్ కాలం. దాంతో నేను చాలా భయపడి, బాబాకు నమస్కరించుకుని, "బాబా! అమ్మకి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండకూడదు. తెల్లవారేసరికల్లా అమ్మ ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించమ"ని వేడుకున్నాను. బాబా దయవల్ల అమ్మ ఆరోగ్యంగా ఉంది. "ధన్యవాదాలు బాబా".


ఒకరోజు నేను, మావారు టూ వీలర్ మీద ఆఫీసుకి వెళ్తుండగా అకస్మాత్తుగా ఓ చోట బండి ఆగిపోయింది. ఆ మార్గంలో ఆటోలు కూడా ఉండవు. నేను ఆఫీసుకి చేరుకోవాల్సిన సమయం అవుతున్నందువల్ల మావారికి ఏమి చేయాలో అర్థం కాలేదు. కానీ బాబా సహాయం చేస్తారని నాకు తెలుసు. కాబట్టి నేను ఏమాత్రం టెన్షన్ పడలేదు. నేను బాబాను తలచుకొని, "బాబా! మీరే ఏదో ఒకటి చేసి బండి స్టార్ట్ అయ్యేలా చూడండి" అని వేడుకున్నాను. బాబా దయవల్ల వెంటనే బండి స్టార్ట్ అయింది. మేము క్షేమంగా ఆఫీసుకి చేరుకున్నాము. తరువాత నేను, "ఇలాగే మావారిని తిరిగి ఇంటికి క్షేమంగా చేర్చండి బాబా" అని వేడుకున్నాను. బాబా అనుగ్రహం వలన మావారు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు


కొన్ని రోజుల క్రితం మేము మా ఇంట్లో హోమం చేయించాలని అనుకున్నాము. "ఎలాంటి సమస్య లేకుండా హోమం నిర్విఘ్నంగా జరిగేలా చూడు బాబా" అని బాబాను వేడుకున్నాను. బాబా దయతో ఎలాంటి ఇబ్బందీ లేకుండా  హోమం జరిగింది. "థాంక్యూ సో మచ్ బాబా. మా కుటుంబంపై సదా మీ అనుగ్రహం ఉండేలా ఆశీర్వదించండి".


సాయి కృపతో 'నెగెటివ్' రిపోర్టు


సాయిభక్తులందరికీ నా ప్రణామాలు. నా పేరు లక్ష్మి. నేను అంతటా సాయినే చూస్తాను. నాకు అంతా సాయే. నా ఊపిరి ఆ సాయినాథుడే. నేను ఏ పని చేస్తున్నా నా మనసుకి వచ్చేది సాయినామమే. నా పనులన్నీ ముందుండి బాబానే నడిపిస్తారు. నా అనుభవాలన్నీ సాయి కృపకు నిదర్శనాలు. 2021, ఏప్రిల్ 14న జరిగిన ఒక చిన్న అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను 2021, ఏప్రిల్ 15న అమెరికా వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసుకున్నాను. ప్రయాణానికి ముందు కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ కావాలంటే, ముందురోజు (ఏప్రిల్ 14న) నేను కోవిడ్ పరీక్ష చేయించుకోవడానికి వెళ్ళాను. పరీక్షకు వెళ్లేముందు బాబాకు చెప్పుకొని, ఆ తరువాత పరీక్ష జరుగుతున్నంతసేపూ నేను బాబానే తలచుకుంటూ ఉన్నాను. బాబా కృపవలన 'నెగెటివ్' అని రిపోర్టు వచ్చింది. దృఢమైన విశ్వాసం ఉంటే ఆ సాయినాథుడు తప్పక అండగా ఉంటారు. సాయిబాబా పాదపద్మములకు ప్రణామములు సమర్పించుకుంటూ...


సాయినాథ్ మహరాజ్ కీ జై!


FacebookWhatsAppXFacebook SendGmailYahoo! MailLinkedInSMSBloggerEmailSumoMe

8 comments:

  1. Om sai ram sai saved from virus and gave health to my daughter.thank you Tandri.you keep your hand on us.give blessings to us.all people are suffering with fear.due to covid.you save us from this virus.many people are dying due this virus.om sai ram❤❤❤

    ReplyDelete
  2. ఓం సాయిరాం!

    ReplyDelete
  3. Kothakonda SrinivasMay 8, 2021 at 9:39 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  4. Om sai ram baba amma ki covid negative report ravali thandri kapadu thandri pleaseeee

    ReplyDelete
  5. Om Sairam
    sai always be with me

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI... OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo
 
FacebookWhatsAppXFacebook SendGmailYahoo! MailLinkedInSMSBloggerEmailSumoMe