సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిబాబా దీవెనలు


నేను ఒక సాయిభక్తురాలిని. నేను సంవత్సరంలో ఒకసారి 'నవ గురువార వ్రతం' చేస్తాను. ఇది నవ గురువార వ్రతానికి సంబంధించిన నా మొదటి అనుభవం. పిల్లలు కావాలన్న నా పెద్ద కోరికను బాబా నెరవేర్చారు. 2017వ సంవత్సరం జూలై 27న బాబా దీవెనలతో నాకు పాప పుట్టింది. తను గురువారంనాడు పుట్టడం, తను పుట్టినతేది 27లోని అంకెల మొత్తం 9(2 + 7) కావడం.. ఇలా తనకు సంబంధించినవన్నీ బాబా అనుగ్రహచిహ్నంగా ఉండటం నాకెంతో సంతోషాన్నిచ్చింది. నా ప్రార్థనలు మన్నించి అంతా సజావుగా జరిగేలా చేసినందుకు నేను సదా బాబాకి కృతజ్ఞత కలిగి ఉంటాను. అయితే కేవలం నా భర్త జీతంతో ఇంటి ఖర్చులన్నీ తీరడం కష్టతరం. పైగా మా ఇంటిపై లోన్ ఉన్నందున పాప రెండోనెలలో ఉండగానే నేను ఉద్యోగంలో చేరవలసి వచ్చింది. అంత చిన్న వయస్సులో పాపకి దూరంగా ఉండడం మనసుకెంతో కష్టంగా ఉన్నప్పటికీ నాకు వేరే దారి లేకుండా పోయింది. రోజూ మావారు నన్ను ఆఫీసు దగ్గర విడిచిపెట్టేటప్పుడు దుఃఖం తన్నుకొచ్చి కన్నీళ్లతో, "బాబా! నేను నా పాపతో ఎక్కువ సమయం గడపాలి, కానీ ఈ ఉద్యోగాన్ని వదులుకోలేను. ఈ పరిస్థితులలో పనిని కూడా ఎలా చేయగలను?" అని అడిగేదాన్ని. ఇదే విషయాన్ని 'క్వశ్చన్ & ఆన్సర్' సైట్‌‌‌‌లో కూడా బాబాని అడిగాను. అందులో, "అంతా మంచే జరుగుతుంది" అని వచ్చింది. దానితో ఆ విషయం గురించి దిగులుపడకుండా సమస్యను బాబాకు విడిచిపెట్టి నేను నా పనిలో నిమగ్నమయ్యాను. ఇలా కొన్నిరోజులు గడిచాక నేను 2018, ఫిబ్రవరి నెల చివరివారంలో నవ గురువార వ్రతం మొదలుపెట్టాను. సరిగ్గా ఒక వారంరోజులకి మా ఆఫీసు యాజమాన్యం నాతో సమావేశం ఏర్పాటు చేసి, వారానికి రెండురోజులు ఇంటినుండి పనిచేసుకొనే అవకాశం కల్పించారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే, మా ఆఫీసులో ఎవ్వరికీ ఇంటినుండి పనిచేసుకునే అవకాశం లేదు. అలాంటిది నేను ఏమీ అడగకుండానే వాళ్లకై వాళ్ళు నాకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించారు. ఖచ్చితంగా ఇది బాబా నాపై చూపిన కరుణ. బాబాకి మీ కష్టం చెప్పుకొని, ఆయనపై విశ్వాసంతో నిశ్చింతగా ఉండండి. సమయానికి ఆయన అనుగ్రహం ఖచ్చితంగా మనకు లభిస్తుంది.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo