సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

పూనాలో ఉద్యోగమిచ్చి - శిరిడీకి దగ్గరగా ఉండేలా చేసిన బాబా.


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు నికిత. మాది హైదరాబాద్. నా ఉద్యోగ విషయంలో బాబా నాపైన చూపిన ప్రత్యేకమైన ప్రేమను నేను మీతో ఈ బ్లాగ్ ద్వారా పంచుకోవాలనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బ్లాగ్ వారికి ధన్యవాదములు.

నేను చిన్నప్పటినుండి బాబాకి మంచి భక్తురాలిని. బాబా అంటే నాకు చాలా ఇష్టం. స్కూల్‌ డేస్ నుండి కాలేజీవరకు నేను టాపర్‌ని. చాలా బాగా చదివేదాన్ని. నా ప్రతి విజయం వెనుక బాబా హస్తం ఉండేది. అదెలా అంటేఏదైనా పరీక్ష ఉన్నప్పుడు తెల్లటి కాగితం తీసుకునిఅంగుళం కూడా ఖాళీ లేకుండా "ఓం శ్రీ సాయిరామ్" అని బాబా నామాన్ని రాసేదాన్ని. ప్రతిసారీ పరీక్ష ముందు అలా చేయడం నాకు అలవాటుగా మారిపోయింది. ఇంజనీరింగ్ నేను మంచి మార్కులతో పాసయ్యాను. కానీ ఇంజినీరింగ్ చివరి సంవత్సరంలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్‌లో నేను చివరిరౌండ్‌లో రిజెక్ట్ అయ్యాను. కాలేజీలో టాపర్‌గా ఉన్న నాకు ఉద్యోగం రాకపోయేసరికి చాలా బాధపడ్డాను. నా స్నేహితులందరికీ మంచి ప్లేస్‌మెంట్స్ వచ్చాయి. అందరి లైఫ్ సెటిల్ అయింది. నాకు మాత్రం ఎందుకిలా జరిగిందని చాలా బాధపడ్డాను. కానీ"ఏది జరిగినా అది నా మంచికేనాకేదైతే శ్రేయస్కరమో అది బాబా ఇస్తారు" అని నేను బాబాపై నమ్మకాన్ని కోల్పోలేదు. కానీ మనుషులం కదా! బాధపడటంపక్కవారితో పోల్చుకోవడం సహజమే.

ఏప్రిల్ 2013 నుండి జనవరి 2014 వరకు నేను ఇంట్లోనే ఖాళీగా ఉన్నాను. అంటేఎనిమిది నెలలు. ఈ సమయంలో నాకు వీలున్నప్పుడల్లా బాబా దగ్గరికి వెళ్లి"బాబా! నాకు మాత్రమే ఇలా ఎందుకు చేశావుఇంకా ఎంతకాలం నేను ఈవిధంగా ఖాళీగా ఉండాలినాకు ఉద్యోగం ఎప్పుడిస్తావు?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించేదాన్ని. సాయి సచ్చరిత్ర పారాయణ చేసేదాన్ని. అలాగేబాబా ప్రశ్నలు-సమాధానాల సైట్‌లో బాబాని అడుగుతుండేదాన్ని. నేనడిగిన ప్రతిసారీ"త్వరలోనే నీ కోరిక తీరుస్తాను" అని వచ్చేది.

2014 జనవరిలో పూనానుండి ఒక ఉన్నత కంపెనీనుండి ఉద్యోగంలో చేరమని ఆఫర్ వచ్చింది. పూనా వెళ్ళాక గాని నాకు బాబా లీల అర్థం కాలేదుపూనాకి శిరిడీ దగ్గరలోనే ఉంటుంది. ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుని రావచ్చు. అందుకే బాబా నాకు శిరిడీకి దగ్గరలో ఉద్యోగం ఏర్పాటు చేసారు. అక్కడ తెలుగువారు చాలా తక్కువగా ఉన్నారు. కానీఅదృష్టంకొద్దీ నా ట్రైనర్స్ అందరూ కూడా సాయిబాబా భక్తులే అవడంతో నేను ఎంతో సంతోషంగా ఉద్యోగం చేసుకుంటున్నాను.

నేను తెలుసుకున్నది ఒక్కటే- మనకేది ఇవ్వాలో సర్వజ్ఞుడైన బాబాకు బాగా తెలుసు. మనకేది శుభకరమోఏది మంచోఏది చెడో ఆయనకు బాగా తెలుసు. మనం తనపై నమ్మకం ఉంచుకుంటే చాలు. అంతా మంచే జరుగుతుంది. ఒకవేళ నాకు హైదరాబాదులోనే కనుక ఉద్యోగం వచ్చి ఉంటే శిరిడీ వెళ్లి రావాలంటే ఎంతో కొంత ఇబ్బంది ఉండేది. కానీఇప్పుడు పూనా నుండి శిరిడీ వెళ్లిరావడం ఎంతో సౌకర్యవంతంగా ఉంది. అందుకే బాబా తమ దర్శనానికి అనుకూలంగా ఉండేటట్లు ఈ ఏర్పాటు చేసారని నాకర్థమయింది. బాబా! ఎంతో ప్రేమతో నన్ను నీ పక్కనే ఉంచుకున్నందుకు చాలా చాలా థాంక్స్.
లవ్ యూ బాబా!

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo