శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
ఒక సాయిబంధువు బ్లాగు ద్వారా తన అనుభవాలను సాయిబంధువులందరితో పంచుకోవాలని వాట్సాప్ ద్వారా పంపించారు. తన పేరు వెల్లడించవద్దని చెప్పిన కారణంగా తన పేరు ప్రస్తావించడంలేదు. ఆమె అనుభవాలను ఆమె మాటల్లోనే చదివి ఆనందించండి.
ఇలా దుఃఖంలో ఉన్నప్పటికీ, ఆ ప్రతికూలమైన ఆలోచనల నుండి మనస్సు మళ్ళించడానికి 'నవ గురువార వ్రతం' మొదలుపెట్టాను. ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాగానీ వాటిలో విజయం సాధించలేకపోయాను. అదేసమయంలో మరోవైపు విదేశాలకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ, అందుకు సంబంధించిన పరీక్షలు కూడా వ్రాసాను. కానీ అందులో కూడా విఫలమయ్యాను. ఒక ఆన్‌సైట్ జాబ్ కోసం ఇంటర్వ్యూలో ఎంపికైనా కూడా H1 లాటరీలో తిరస్కరించబడ్డాను. ఇలా ఏదీ కలిసిరాలేదు. అయినా కూడా నమ్మకాన్ని కోల్పోకుండా బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాను.
ఒకరోజు ఉదయం హఠాత్తుగా ఒక యం.యన్.సి కంపెనీనుంచి గురువారంనాడు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసినట్లు కాల్ వచ్చింది. తీరా రేపు ఇంటర్వ్యూ ఉందనగా బుధవారంనాడు నాకు జ్వరం వచ్చి, తీవ్రమైన ఒళ్ళునొప్పులతో బాధపడ్డాను. దానితో ఇంటర్వ్యూకి తయారయ్యే పరిస్థితి లేదు. అసలు ఇంటర్వ్యూకి హాజరుకాగలనా అన్నట్లుంది నా పరిస్థితి. ఇక నేను మరుసటిరోజు 'వ్రతం చేయాలా, వద్దా?' అని, దానితోపాటు 'ఇంటర్వ్యూకు వెళ్లాలా, వద్దా?' అని బాబా ముందు చీట్లువేసి బాబాను అడిగాను. బాబా నుండి 'ఎస్' అని సమాధానం వచ్చింది. మరో ఆలోచన లేకుండా జ్వరం ఉన్నా బాబా చెప్పినట్లు చేయడానికి నిశ్చయించుకున్నాను. మరుసటిరోజు తెల్లవారి లేచి తలస్నానం చేసి, వ్రతం పూర్తిచేసి, ఉపవాసం కూడా ఉన్నాను. నాకు చాలా అలసటగా ఉండటంతో ఇంటర్వ్యూకు ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. ఎందుకంటే, ఆఫీసు చాలా దూరంలో ఉంది. నా బాబా ఆ సందర్భంలో నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆయనే అన్నీ అమర్చారు. కంపెనీ హెచ్.ఆర్ ఫోన్ చేసి, "ఇంటర్వ్యూకు హాజరు కావడానికి మీకోసం క్యాబ్ ఎక్కడికి పంపాలి?" అని అడిగారు. నేను ఆశ్చర్యపోయాను. ఏ కంపెనీ కూడా ఇంటర్వ్యూకు రావాల్సిన వారి కోసం కారు ఏర్పాటు చెయ్యదు. నేను అడ్రస్ ఇవ్వగా కాసేపట్లో వాళ్ళు క్యాబ్ పంపించారు. అందులో ఆఫీసుకు చేరుకున్నాను. హెచ్.ఆర్ నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదని గమనించి వెంటనే వ్రాతపరీక్షకు ఏర్పాటు చేశారు. వ్రాతపరీక్ష తరువాత ఇంటర్వ్యూ కూడా చేసారు. బాబా దయవలన నేను ఆ రౌండ్లు పూర్తి చేసాను. అప్పటికి సమయం ఒంటిగంట(1pm) అయ్యింది. అప్పుడు ఆమె, మేనేజర్ లేనందున రెండుగంటలు వేచివుండమని చెప్పి, నన్ను భోజనానికి రమ్మని ఆహ్వానించింది. నేను ఉపవాసంలో ఉన్నానని చెప్పాను. వెంటనే ఆమె మేనేజర్‌ని ఒప్పించి గంటలో ఇంటర్వ్యూ ఏర్పాటు చేసింది. ఆ రౌండ్ కూడా నేను విజయవంతంగా పూర్తిచేయడంతో మేనేజర్ స్థాయికి నన్ను ఎంపిక చేసారు. నా తిరుగుప్రయాణానికి కూడా కారు ఏర్పాటు చేసారు. ఇంటర్వ్యూ ప్రక్రియ జరుగుతున్నంతసేపు ఒంటినొప్పులు తట్టుకునే శక్తిని బాబా ఇవ్వడమే కాకుండా ఇంటర్వ్యూలో బాగా సమాధానం చెప్పేలా సహాయం చేసారు.
అయితే నాకంత మంచి అవకాశం వచ్చినా కూడా అది మేనేజర్ స్థాయి కావడంతో నాకు ఆసక్తిగా లేదు. కానీ నేనున్న అప్పటి పరిస్థితిలో ఆ అవకాశాన్ని స్వీకరించడం తప్ప వేరే మార్గం కూడా లేదు. సాయంత్రం నా ఉపవాసవ్రతం పూర్తి చేయడానికి బాబా మందిరానికి వెళ్లి బాబా దర్శనం చేసుకొని బయటకి రాగానే ఇంటర్వ్యూకి రమ్మని మరో కంపెనీనుంచి కాల్ వచ్చింది. ఆ జాబ్ ప్రొఫైల్(ఉద్యోగ వివరణము) చాలా ఆసక్తికరంగా ఉంది. అది మేనేజర్ స్థాయి కాకుండా వ్యక్తిగతమైన ఉద్యోగం. వీటికి తోడు ఆ కంపెనీ మా ఇంటికి దగ్గరగా ఉంది. మంగళవారం ఆ ఇంటర్వ్యూకి హాజరై, అన్ని రౌండ్లు పూర్తి చేసాను. తరువాత క్లయింట్ రౌండు కూడా చక్కగా పూర్తి చేసాను. మళ్ళీ మంగళవారానికల్లా మంచి ప్యాకేజీతో నాకు ఉద్యోగం వచ్చింది. ఆ నెల చివరికల్లా కంపెనీలో చేరాను. ఉద్యగమే రావడం కష్టమనుకున్న సమయంలో బాబా దయతో మంచి ప్యాకేజీతో నాకు ఒకటి కాదు రెండు ఉద్యోగాలు వచ్చాయి. అలా ఉంటుంది బాబా మన తోడు ఉంటే. ఆవిధంగా బాబా నన్ను ఆ క్లిష్టపరిస్థితినుంచి బయటకి తీసుకొచ్చారు. దానితో బాబాపై నాకున్న విశ్వాసం ఇంకా బలపడింది.
రేపు మరో అనుభవాన్ని పంచుకుంటాను....
1. కష్టదశలో బాబా నాకు అండగా ఉండి, ఉద్యోగమిచ్చి నన్ను ఆశీర్వదించిన అనుభవం.
నేను, కొత్తగా పెట్టిన ఒక మల్టీ నేషనల్ కంపెనీ శాఖలో సాఫ్ట్‌వేర్ విభాగంలో పనిచేస్తుండేదాన్ని. కొన్ని కారణాలవల్ల నేను పనిచేస్తున్న శాఖను మూసివేయాలని కంపెనీ నిర్ణయించి, ఉద్యోగస్తులందరినీ వేరే ఉద్యోగాలు చూసుకోమని, కానిపక్షంలో ఢిల్లీ ఆఫీసులోని సాఫ్ట్‌వేర్ శాఖలో కాకుండా ఇతర శాఖలకి తరలిస్తామని చెప్పారు. అప్పటికే నేను వ్యక్తిగతమైన సమస్యలవల్ల చాలా బాధల్లో ఉన్నాను. అటువంటి పరిస్థితుల్లో హఠాత్తుగా కంపెనీనుండి ఈ వార్త విని పూర్తిగా కృంగిపోయాను. అప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ రంగంలో నాకున్న 11 సంవత్సరాల అనుభవంతో నాకు తగిన ఉద్యోగం సంపాదించడం కాస్త కష్టమైన పని. నాకు ఢిల్లీ వెళ్ళాలని కూడా లేదు, ఎందుకంటే నేను నా సాఫ్ట్‌వేర్ ప్రొఫైల్‌ని మార్చదలచుకోలేదు. కానీ నాకు ఉద్యోగం తప్పితే ఆదాయానికి మరో మార్గం కూడా లేదు. ఈ సమస్యలన్నీ భరించలేక చాలా ఆందోళనపడ్డాను. చేసుకున్న కర్మ అనుభవించక తప్పదని తెలిసినా కూడా కొన్నిసార్లు కృంగిపోక తప్పేది కాదు. ఉద్యోగం లేకపోతే ఎలా బతకాలనేది అర్థం కాలేదు. నా తల‌్లిదండ్రులు సహాయం చేస్తారని తెలిసినా, వాళ్లకున్న సమస్యలకి తోడు ఈ సమస్యతో వాళ్ళని నేను ఇబ్బంది పెట్టదలచుకోలేదు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులలో నాకున్న ఒకే ఒక ఆశ(నమ్మకం) - బాబా. "వీటిని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వండి బాబా!" అని ప్రార్థించాను.ఇలా దుఃఖంలో ఉన్నప్పటికీ, ఆ ప్రతికూలమైన ఆలోచనల నుండి మనస్సు మళ్ళించడానికి 'నవ గురువార వ్రతం' మొదలుపెట్టాను. ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాగానీ వాటిలో విజయం సాధించలేకపోయాను. అదేసమయంలో మరోవైపు విదేశాలకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ, అందుకు సంబంధించిన పరీక్షలు కూడా వ్రాసాను. కానీ అందులో కూడా విఫలమయ్యాను. ఒక ఆన్‌సైట్ జాబ్ కోసం ఇంటర్వ్యూలో ఎంపికైనా కూడా H1 లాటరీలో తిరస్కరించబడ్డాను. ఇలా ఏదీ కలిసిరాలేదు. అయినా కూడా నమ్మకాన్ని కోల్పోకుండా బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాను.
ఒకరోజు ఉదయం హఠాత్తుగా ఒక యం.యన్.సి కంపెనీనుంచి గురువారంనాడు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసినట్లు కాల్ వచ్చింది. తీరా రేపు ఇంటర్వ్యూ ఉందనగా బుధవారంనాడు నాకు జ్వరం వచ్చి, తీవ్రమైన ఒళ్ళునొప్పులతో బాధపడ్డాను. దానితో ఇంటర్వ్యూకి తయారయ్యే పరిస్థితి లేదు. అసలు ఇంటర్వ్యూకి హాజరుకాగలనా అన్నట్లుంది నా పరిస్థితి. ఇక నేను మరుసటిరోజు 'వ్రతం చేయాలా, వద్దా?' అని, దానితోపాటు 'ఇంటర్వ్యూకు వెళ్లాలా, వద్దా?' అని బాబా ముందు చీట్లువేసి బాబాను అడిగాను. బాబా నుండి 'ఎస్' అని సమాధానం వచ్చింది. మరో ఆలోచన లేకుండా జ్వరం ఉన్నా బాబా చెప్పినట్లు చేయడానికి నిశ్చయించుకున్నాను. మరుసటిరోజు తెల్లవారి లేచి తలస్నానం చేసి, వ్రతం పూర్తిచేసి, ఉపవాసం కూడా ఉన్నాను. నాకు చాలా అలసటగా ఉండటంతో ఇంటర్వ్యూకు ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. ఎందుకంటే, ఆఫీసు చాలా దూరంలో ఉంది. నా బాబా ఆ సందర్భంలో నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆయనే అన్నీ అమర్చారు. కంపెనీ హెచ్.ఆర్ ఫోన్ చేసి, "ఇంటర్వ్యూకు హాజరు కావడానికి మీకోసం క్యాబ్ ఎక్కడికి పంపాలి?" అని అడిగారు. నేను ఆశ్చర్యపోయాను. ఏ కంపెనీ కూడా ఇంటర్వ్యూకు రావాల్సిన వారి కోసం కారు ఏర్పాటు చెయ్యదు. నేను అడ్రస్ ఇవ్వగా కాసేపట్లో వాళ్ళు క్యాబ్ పంపించారు. అందులో ఆఫీసుకు చేరుకున్నాను. హెచ్.ఆర్ నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదని గమనించి వెంటనే వ్రాతపరీక్షకు ఏర్పాటు చేశారు. వ్రాతపరీక్ష తరువాత ఇంటర్వ్యూ కూడా చేసారు. బాబా దయవలన నేను ఆ రౌండ్లు పూర్తి చేసాను. అప్పటికి సమయం ఒంటిగంట(1pm) అయ్యింది. అప్పుడు ఆమె, మేనేజర్ లేనందున రెండుగంటలు వేచివుండమని చెప్పి, నన్ను భోజనానికి రమ్మని ఆహ్వానించింది. నేను ఉపవాసంలో ఉన్నానని చెప్పాను. వెంటనే ఆమె మేనేజర్‌ని ఒప్పించి గంటలో ఇంటర్వ్యూ ఏర్పాటు చేసింది. ఆ రౌండ్ కూడా నేను విజయవంతంగా పూర్తిచేయడంతో మేనేజర్ స్థాయికి నన్ను ఎంపిక చేసారు. నా తిరుగుప్రయాణానికి కూడా కారు ఏర్పాటు చేసారు. ఇంటర్వ్యూ ప్రక్రియ జరుగుతున్నంతసేపు ఒంటినొప్పులు తట్టుకునే శక్తిని బాబా ఇవ్వడమే కాకుండా ఇంటర్వ్యూలో బాగా సమాధానం చెప్పేలా సహాయం చేసారు.
అయితే నాకంత మంచి అవకాశం వచ్చినా కూడా అది మేనేజర్ స్థాయి కావడంతో నాకు ఆసక్తిగా లేదు. కానీ నేనున్న అప్పటి పరిస్థితిలో ఆ అవకాశాన్ని స్వీకరించడం తప్ప వేరే మార్గం కూడా లేదు. సాయంత్రం నా ఉపవాసవ్రతం పూర్తి చేయడానికి బాబా మందిరానికి వెళ్లి బాబా దర్శనం చేసుకొని బయటకి రాగానే ఇంటర్వ్యూకి రమ్మని మరో కంపెనీనుంచి కాల్ వచ్చింది. ఆ జాబ్ ప్రొఫైల్(ఉద్యోగ వివరణము) చాలా ఆసక్తికరంగా ఉంది. అది మేనేజర్ స్థాయి కాకుండా వ్యక్తిగతమైన ఉద్యోగం. వీటికి తోడు ఆ కంపెనీ మా ఇంటికి దగ్గరగా ఉంది. మంగళవారం ఆ ఇంటర్వ్యూకి హాజరై, అన్ని రౌండ్లు పూర్తి చేసాను. తరువాత క్లయింట్ రౌండు కూడా చక్కగా పూర్తి చేసాను. మళ్ళీ మంగళవారానికల్లా మంచి ప్యాకేజీతో నాకు ఉద్యోగం వచ్చింది. ఆ నెల చివరికల్లా కంపెనీలో చేరాను. ఉద్యగమే రావడం కష్టమనుకున్న సమయంలో బాబా దయతో మంచి ప్యాకేజీతో నాకు ఒకటి కాదు రెండు ఉద్యోగాలు వచ్చాయి. అలా ఉంటుంది బాబా మన తోడు ఉంటే. ఆవిధంగా బాబా నన్ను ఆ క్లిష్టపరిస్థితినుంచి బయటకి తీసుకొచ్చారు. దానితో బాబాపై నాకున్న విశ్వాసం ఇంకా బలపడింది.
రేపు మరో అనుభవాన్ని పంచుకుంటాను....
🕉 sai Ram
ReplyDelete