నా పేరు స్నేహ అగర్వాల్. నేను పూణే నివాసిని. మేము 2018, డిసెంబర్ నెల, సెలవుదినాల్లో సరదాగా గడపటానికి బ్యాంకాక్ వెళ్ళాము. అక్కడ స్విమ్మింగ్ పూల్‌లో నేను, నా కూతురు సెల్ఫీ తీసుకుంటూ ఉండగా నా మొబైల్ నా కూతురి చేతినుండి జారి స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయింది. నేను వెంటనే దానిని బయటకు తీసి తుడిచి శుభ్రంచేసి, ఫోన్ నుండి కాల్ చేసాను. అయితే వాల్యూమ్ బటన్, బ్యాక్ బటన్ పనిచేయడం లేదు. సరేనని మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాను. అక్కడ దానిని రిపేరు చేయించే అవకాశం లేకపోవడంతో నేను మొబైల్‌ను హెయిర్ డ్రైయర్‌తో ఆరబెట్టి మళ్లీ స్విచ్ ఆన్ చేయడానికి ప్రయత్నించాను కానీ, అది సరిగా పనిచేయలేదు. ఇక మొబైల్‌ను ఒక వస్త్రంలో చుట్టి నా బ్యాగ్‌లో ఉంచాను. తరువాత మేము ఓడలో భోజనం కోసం వెళ్తూ ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు మా బ్యాగ్ నుండి ఊదీ ప్యాకెట్ క్రింద పడింది. వెంటనే నా భర్త ఆ ప్యాకెట్ తీసి బ్యాగ్‌లో పెట్టారు. అది చూసిన వెంటనే సాయిబాబా నాకేదో సూచిస్తున్నారని అనిపించింది. మేము డిన్నర్ పూర్తి చేసుకొని సుమారు 10 గంటల సమయంలో హోటల్‌కి వెళ్తూ నేను, "బాబా! హోటల్‌కి వెళ్లిన తర్వాత నేను నా మొబైల్‌కి మీ పవిత్ర ఊదీ రాస్తాను, దానితో నా మొబైల్ పనిచేస్తే నా అనుభవాన్ని వెంటనే బ్లాగ్ ద్వారా సాయిబంధువులతో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. అలానే నేను హోటల్‌కి వచ్చిన వెంటనే మొబైల్‌కి ఊదీ వ్రాసి స్విచ్ ఆన్ చేశాను. అద్భుతం! నా ఫోన్ మునుపటిలానే పనిచేస్తూ ఉంది. ఆనందంతో నేను బిగ్గరగా అరిచి ఎగిరి గంతేసాను. నిజంగా నాకిది చాలా అద్భుతమైన అనుభవం. ఎందుకంటే, స్విమ్మింగ్ పూల్‌లో పడిన తరువాత నార్మల్‌గా పనిచేయడమన్నది సాధారణ విషయమేమి కాదు.
13వ అధ్యాయంలో బాబా, "భక్తులు వారి సంతోషకరమైన సమయాలలో తమ దేవుడిని, గురువుని మరచిపోతారు, కేవలం కష్టాలలో మాత్రమే గుర్తుచేసుకుంటార"ని చెప్తారు కదా! అలాగే నాకీ సంఘటన ద్వారా "సంతోషకరమైన సెలవుదినాలలో సైతం తనని మర్చిపోవద్ద"ని బాబా తెలియజేసారు. అంతేకాదు! 'తన బిడ్డలకి ఎప్పుడూ అండగా ఉంటాన'ని కూడా ఈ అనుభవం ద్వారా బాబా నిర్ధారించారు.
Om Sairam🙏🙏🙏
ReplyDeleteOm sai sri sai jaya jaya sai
ReplyDelete